కాస్త ఈదురుగాలులు వీచినా లేక ఇతరత్రా ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా జనావాసాల్లో మొదట ప్రభావితమయ్యేది విద్యుత్తు వ్యవస్థేనన్న విషయం మనందరికీ అనుభవమే. కరెంట్‌ తీగలు తెగిపడడం, స్తంభాలు విరిగిపోవడం, వాటి కారణంగా విద్యుదాఘాతాలు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు చోటు చేసుకోవడమే కాకుండా వాటిని సరి చేసి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చాలా సమయం పట్టడమూ తెలిసిందే. అయితే... ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమవు తున్న అమరావతి నగరంలో మాత్రం పైన పేర్కొన్న ఇబ్బందులు, ప్రమాదాలకు ఏమాత్రం ఆస్కారం ఉండబోదు. విద్యుత్తు కేబుళ్లన్నీ భూగర్భంలో, టన్నెలింగ్‌ సిస్టంలో ఉంటాయి! రాజధాని రహదారుల వెంబడి తవ్వుతున్న భారీ గోతుల్లో ఏర్పాటు చేయబోయే డక్ట్‌లలో ఈ కేబుళ్లను ఉంచుతారు.

amaravati udnerground 04052018 2

అభివృద్ధి చెందిన దేశాలు, నగరాల్లో మాత్రమే కనిపించే ఇంతటి అత్యధునాతన అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌, హెచ్‌.డి.పి.ఇ. డక్ట్‌లలో కేవలం విద్యుత్తు తీగలు మాత్రమే కాకుండా ఇతర వ్యవస్థలైన నీరు, గ్యాస్‌, సీవరేజ్‌, స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ సిస్టంలకు సంబంధించిన కేబుళ్లు, పైపులను అమర్చుతారు. ఇవి ఎంత భారీగా ఉంటాయంటే పూర్తయిన తర్వాత వీటిల్లోకి సంబంధిత సిబ్బంది సులభంగా ప్రవేశించడమే కాకుండా నడవగలుగుతారు. తద్వారా భూగర్భంలోని ఏ వ్యవస్థలో నైనా, ఎక్క డైనా, ఏమైనా అంతరాయాలు సంభవిస్తే తక్షణమే ఆ ప్రదేశాన్ని గుర్తించడంతోపాటు వెంటనే అక్కడికి చేరుకుని, దానిని సరి చేయగలుగుతారు.

amaravati udnerground 04052018 3

అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో రాజధానిలో నిర్మితమవుతున్న వివిధ కీలక రహదారుల వెంబడి ప్రస్తుతం ఈ డక్ట్‌లకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అంటే.. అమరావతిలో ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగా రోడ్ల వెంబడి, పైకి కనిపించేటటువంటి ఎలక్ట్రిక్‌ స్తంభాలుగానీ, పైపులైన్లుగానీ, మురుగుకాల్వలు ఇత్యాదివి గానీ కనిపించవన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే వివిధ కేబుళ్లు, పైపులైన్ల పేరిట పదేపదే రోడ్లను తవ్వాల్సిన అగత్యంగానీ, ఆ రూపంలో ప్రజలకు ఎదురయ్యే అవస్థలుగానీ ఉండవు. భవిష్యత్తులో ఎల్పీఎస్‌ జోన్లతో సహా రాజధాని మొత్తాన్నీ కవర్‌ చేసేలా ఈ భూగర్భ సొరంగాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి మాత్రం ట్రంక్‌ రోడ్ల వెంబడి 80 కిలోమీటర్ల పొడవున ఆర్‌.సి.సి. భూగర్భ సొరంగాలను, 230 కి.మీ. పొడవైన హెచ్‌.డి.పి.ఇ. డక్ట్‌లను నిర్మిస్తున్నారు. తర్వాత్తర్వాత ఎల్పీఎస్‌ జోన్లలోనూ సుమారు 1,000 కిలోమీటర్ల పొడవైన డక్ట్‌లను ఆయా జోన్లలోని రోడ్ల పక్కన నిర్మిస్తారు.

ఆస్తులు కన్నా, చదువే ముఖ్యం... పిల్లలకు ఆస్తుల కంటే, చదువునందిస్తే వారే అన్నీ సంపాదించుకుంటారు.... ర్యాంకులు మీరు తెచ్చుకోండి.. చదువు మేం చెప్పిస్తాం... ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అయినా ఇలా చెప్పటం విన్నారా ? ఏ స్టేజి మీద అయినా, సందర్భం ఏదైనా, పిల్లల్ని బాగా చదివించండి అనే నాయకులు ఎంత మంది ? విద్యార్థుల్లో విషబీజాలు నాటి, వారిని రాజకీయంగా వాడుకుంటున్న నాయకులకి, వారి బంగారు భవితకు భరోసా కల్పించే చంద్రబాబుకి ఇది తేడా... ఎందుకు ఈయనకు చదువు అంటే అంత పిచ్చి ?

cbn students 04052018 2

1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు, ఇంజనీరింగ్ కోర్స్ చెయ్యాలి అంటే, అది ఒక కల... అలాంటిది ప్రణాలికాబద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి, పల్లెటూరుల్లో ఉన్నవారికి కూడా, ఇంజనీరింగ్ కోర్స్ దగ్గర చేశారు. దాని ఫలితమే, పల్లెటూరులు నుంచి కూడా వెళ్లి ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు... దాని ఫలతమే, వ్యవసాయం చెయ్యటం మాత్రమే తెలిసిన చేతులు, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేలా చేసాయి... ఇప్పుడు చంద్రబాబు నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా, చదువుకి అధిక ప్రాధ్యానత ఇస్తున్నారు.. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్ధులు వివిధ పథకాల పరిధిలో ప్రభుత్వ సహకారంతో చదువుకుంటున్నారు. అంతే కాదు, విదేశాల్లో చదువుకోవాలని కలలుకంటూ, పేదరికం అడ్డు వచ్చి చదువుకోని వారికి కూడా, స్కాలర్షిప్ ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నారు. అలాగే, ఐఏఎస్ శిక్షణ కోసం దేశంలోని ఉత్తమ 40 కోచింగ్ సెంటర్లను గుర్తించి, శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటిలో శిక్షణ కోసం ఒక్కొక్కరికీ రూ.2 50 లక్షలు ఖర్చవుతుంది, దానిని ప్రభుత్వమే భరిస్తూ పేద విద్యార్ధులకు అండగా నిలబడుతుంది.

cbn students 04052018 3

గత కొన్ని రోజులుగా, మనం చూస్తున్నాం.. ఆయనకు ఎన్ని పనులు ఉన్నా, రోజు కొంత మంది పిల్లలను సచివాలయానికి పిలిచి, వారి ప్రతిభను గుర్తించి, వారిని అభినదిస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివి, ఐఐటీ-జేఈఈ, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్ధులను పిలిచి అభినందిచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాఠశాలలో 10 వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్ధులని, పిలిచి అభినందించారు.. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన, మన విద్యార్ధులని అభినందించారు. ఇలా రోజుకు కొంత మంది విధ్యార్ధులను పిలిచి, వారికి భరోసా ఇచ్చి, కాన్ఫిడెన్సు నింపుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల పై, సామాన్య ప్రజల్లో భరోసా నింపుతున్నారు..

అందరి తిల్లిదంద్రులకి ఒకే ఆశ, ఒకే కల ఉంటుంది... తమ పిల్లల బాగా చదువుకుని ప్రయోజికులు కావాలాని... దాని కోసం ఆస్తులు అమ్ముతారు, కష్టపడతారు... కాని ఎంత చేసినా, చాలా మంది ఆ కల నేరవేర్చుకోలేరు... ఇలాంటి వారి కలలు జయప్రదం చేయడం ద్వారా వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే చంద్రబాబు లక్ష్యం. పేద పిల్లలు బాగా చదువుకుని వాళ్ల కాళ్లమీద వాళ్లు జీవితంలో స్థిరపడి, తిరిగి సమాజానికి ఉపయోగపడాలి, ఇది చంద్రబాబు విజిన్... ప్రపంచమంతా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ మంచి విద్యాలయాలున్నాయో, ఆన్నింటిలోనూ రాష్ట్ర విద్యార్ధులు చదువుకునేలా ఏర్పాట్ల చేస్తున్నారు... చదువుకు ఆటంకం కాకుండా, పేదరికం అడ్డు కాకుండా ఎన్నో పథకాలను రూపొందించారు...

చంద్రబాబు అందరి రాజకీయ నాయకులులాగా కాదు... అయన ఏ పని చేసినా ఒక విజన్ ఉంటుంది... ఈ పిల్లల మీద పెట్టే ఖర్చు, ప్రజలను మభ్య పెట్టటానికి ఏవో పిచ్చి పధకాలు పెట్టి, వాళ్ళని ఆకట్టుకోవచ్చు... కాని చంద్రబాబు, పిల్లలకు బంగారు భవిషత్తు, చదువుతోనే వస్తుంది అని నమ్ముతారు. వీళ్ళకు మంచి జీవితాలిస్తే చాలు , వాళ్ళు సమాజం మొత్తాన్ని మార్చేస్తారు అని నమ్ముతారు. వాళ్ళ చిరునవ్వులతో మనం ఖచ్చితంగా రేపు ఆనందకరమైన సమాజాన్ని చూస్తాం అని నమ్మి, వారికి అండగా నిలబడతారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి... ఎవరో ఒకరు గెలుస్తుంటారు, కానీ సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తీసుకోగలిగేదే నిజమైన ప్రభుత్వం.. వారే నిజమైన నాయకలు.... ఆ నాయకుడే మన చంద్రబాబు...

"జనాల్లో ఉన్నప్పుడు రామాచారిలా, సెయింట్‌లా కనిపిస్తాడు... పార్టీనేతల వద్ద జుట్టు విదిల్చిన అపరిచితుడిలా మారిపోతుంటాడు.." "నా పరిస్థితి ఎలా అయిందంటే పౌరాణిక సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్లి షకీలా సినిమా చూసినట్లయింది"... ఈ మాటలు వింటుంటే, ఎవరి గురించి మాట్లాదుతున్నామో, ఇట్టే అర్ధమైపోతుంది... ఈయన 2014లోని జగన్ మొదటి బాధితుడు... ఈ వ్యాఖ్యలు చేసింది, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణరాజు... ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, చెప్పిన మాటలు... ఒకప్పుడు వైసిపీ పార్టీలో ఉన్న రఘురామ కృష్ణరాజు, తన స్వీయ అనుభవంతో, జగన్ గురించి చెప్పిన మాటలు అవి... 2014 ముందు, జగన్ ని వదిలి, తరువాత బీజేపీ పార్టీలో చేరారు రఘురామ కృష్ణరాజు..

raghu 04052018 2

బీజేపీలో చేరినా, ఎప్పుడూ క్రియాశీలకంగా అక్కడ పని చేసింది లేదు.. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో, బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న మోసం, ప్రజల ఆగ్రహం చూసి, ఆయన బీజేపీ నుంచి బయటకు రావటానికి నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు, అమరావతి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.. అమరావతి వచ్చి, చంద్రబాబుని కలిసిన తరువాత, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన బీజేపీ లో అసంతృప్తిగా ఉన్నారని తెలిసన దగ్గర నుంచి, జగన్ పార్టీ, జనసేన పార్టీ కూడా, ఆయన కోసం ఎంతో ట్రై చేసాయి..

raghu 04052018 3

రఘురామ కృష్ణరాజు స్వయానా, కేవీపీ వియ్యంకుడు కావటంతో, జగన్ మోహన్ రెడ్డి, కేవీపీ ద్వారా కూడా వర్తమానం నడిపారు... ఆయన్ను పార్టీలోకి తీసుకోవటానికి, అన్ని విధాల ప్రయత్నం చేసారు... కాని, ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరటానికి నిర్ణయించుకున్నారు.. తెలుగుదేశం పార్టీ మరో పక్క, ఆయనకు ఎంపీ సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది..

రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన అనంతరం పోలీసులు 17 బృందాలతో నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో అణువణువూ పరిశీలించారు. అయితే, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలేసులు గుర్తించారు. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించారు.

sakshi 04052018 2

అయితే, ఈ ఆత్మహత్య ఫోటోలు చూపించి జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ, తెగ బాధ పడుతుంది. నిందితుడు ఆత్మహత్య చేసుకోలేదని, పోలీసులే చంపేసి, ఆత్మహత్య డ్రామా ఆడుతున్నారని, సాక్షి బ్రేకింగ్ న్యూస్ లు వేస్తుంది. మరో పక్క, అత్యంత అమానవీయంగా, అనాగరికంగా దుశ్చర్యకు ఒడిగట్టిన అలాంటి నిందితులను చంపితే తప్పు ఏంటి అని, అక్కడ గ్రామస్తులు అంటున్నారు. వాడిని పోలీసులు చంపినా అసలు తప్పే లేదు అని, ఇది కనుక నిజం అయితే, చంద్రబాబుకి లక్ష దండాలు అని చెప్తున్నారు.

sakshi 04052018 3

మెజార్టీ ప్రజలు పోలీసులు మంచి పని చేశారు...అలాంటి వాడికి అదే తగిన శిక్ష అని అంటూండగా కొందరు హక్కుల కార్యకర్తలు మాత్రం పోలీసులు అలాంటి నిందితులను చట్టపరంగా శిక్షించాలి తప్ప అలా తమకు తోచిన న్యాయం చేయటం కరెక్టు కాదని దాచేపల్లి మానవ హక్కుల వేదిక నాయకుడు కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి మృగాలకు చట్టపరమైన శిక్షలు చాలవని, ప్రభుత్వంకి, పోలీసులకు ఈ విషయంలో మేం అండగా ఉంటామని ఖాసీం సాబ్‌ అన్నారు. మొత్తానికి, ఒక రేపిస్ట్ చచ్చిపోతే, అది ఎలాంటి చావైనా కాని, దానికి సాక్షి టీవీ బాధపడటం చూస్తుంటే, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు...

Advertisements

Latest Articles

Most Read