అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శైలి గురించి అందరికీ తెలిసిందే... ఒక 15 రోజుల క్రితం దివాకర్‌రెడ్డి అమరావతి వచ్చి చంద్రబాబుని కలిసారు... దాదాపు ఒక అరగంట సేపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థుతులు, చంద్రబాబు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి కుండబద్దలు కొట్టేసారు... మీరు ఏమైనా అనుకోండి, ఈ పనులు గురించి మీరు ఆలోచించాలి, నా సలహా పాటించాలి అంటూ, మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారు..

43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని దివాకర్ రెడ్డి అన్నారు.. ఇది మీరు వెంటనే కరెక్ట్ చేసుకోపోతే, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, దీని పై అలోచించి, అందరితో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకోండి అంటూ, జేసే దివాకర్ రెడ్డి చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు.. ఈ విషయం పై, చంద్రబాబు ఆరా తీసారు.. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బయోమెట్రిక్ ఎందుకు వద్దు అనేవి అరా తీసి, దీనిపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. బయోమెట్రిక్‌ హాజరుకు, జీతాలకూ మధ్య లింకు పెట్టనే పెట్టవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమయపాలనలో కాస్త అటూ ఇటూ అయినా సరే... చిత్తశుద్ధితో పని చేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఉద్యోగస్తుల హాజరుకు బయోమెట్రిక్‌తో అనుసంధానం లేకపోయినా ఇబ్బంది లేదని సీఎం స్పష్టం చేశారు. దీని ఆధారంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు కింది స్థాయి వరకు స్పష్టం చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను, సాధారణ పరిపాలన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సమయం అటూ ఇటూ అయినా... ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చేయాలన్నది నా ఉద్దేశం. కానీ, దీనిని తప్పుగా అర్థం చేసుకుని బయోమెట్రిక్‌కు - జీతాలకు లింకు పెట్టారనే భావన కల్పించారు. ఇది పూర్తిగా తప్పు. ఈ విషయంపై ఉద్యోగులందరికీ స్పష్టత ఇవ్వండి అని అధికారులని ఆదేశించారు... నేను మీకు ఇన్ని అవకశాలు ఇస్తున్నాను అంటే, మీరు ఇంకా బాగా ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చెయ్యాలని, ఇదొక్కట్టే మిమ్మల్ని కోరుకునేదని, ఉద్యోగులతో చంద్రబాబు అన్నారు...

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో అతి పెద్ద బహిరంగ సభ వేదిక పై నుంచి, ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసం గురించి, ఎండగట్టనున్నారు.. ఈ నేపధ్యంలో, రేపటి సభ కంటే ముందుగానే, బీజేపీ నేతలకు షాక్ తగిలింది... గత సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కారుమంచి జయరామ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు... రాజీనామా లేఖను నిన్న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫ్యాక్స్‌లో పంపారు... రేపు తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు...

ఆయన గత వారం రోజులుగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అనుచరులు, స్నేహితుల అభిప్రాయాలను సేకరించారు. 2014లో పోలీస్‌ ఆఫీసర్‌ పదవికి రాజీనామా చేసి తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన అన్నారు..

బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయన్నారు. ‘నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో ఏడుకొండలుపైన, తిరునామం వైపు వేలెత్తిచూపుతూ ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని’’ అన్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధిపట్ల నిరంతరం తపనపడే వ్యక్తి సారథ్యంలోని టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు జయరామ్‌ చెప్పారు.

ఈ రోజు అమెరికాలోని డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను, ఘనంగా నిర్వచించేందుకు ప్లాన్ చేసింది... ఆ ఉత్సవాలకు రావటానికి, టికెట్ పెట్టటమే కాక, నిధుల సమీకరణకు కూడా మా ముందుకు వచ్చింది... 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని డాలస్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న డల్లాస్ ప్రవాసాంధ్రులు మాత్రం, ఈ ఉత్సవాలకు సహకరించేది లేదని ముందు నుంచి చెప్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చేసారు... విభజన హామీ విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పై డల్లాస్ లోని ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు... నిరసన చేస్తున్న ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ, ఆంధ్రా నుంచి ‘మా’ అసోసియేషన్ తరఫున భవనం నిర్మించడానికి ఫండ్స్ కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది వచ్చారని, మేము దానికి వ్యతిరేకం కాదని, ఇలాంటి వాటికి చాలా విరాళాలు ఇచ్చామని, ఇదే శ్రద్ధ, మన రాష్ట్రము మీద సినీ పెద్దలకు ఎందుకు లేదని అడిగారు. ప్రధానంగా లోటుబడ్జెట్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు హోదా, విభజన హామీల విషయంలో సినీ పరిశ్రమ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

కావేరి, జల్లికట్టు విషయంలో తమిళనాడు రాష్ట్రం మొత్తం ఏకమైందని, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని వారన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయనా? ఏపీలో ఏమీ లేవనా? అని ప్రశ్నించారు. ఇక్కడ మీకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఇస్తుంటే, ప్రజలగురించి ఒక్క మాటకూడా మాట్లాడరా అంటూ ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. ప్రధానంగా తమ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారని వారు నిలదీశారు. పార్లమెంట్‌లో, పక్క రాష్ట్రాలు ఏపీకి మద్దతుగా మాట్లాడుతుంటే... చిరంజీవి ఆడియో ఫంక్షన్లకు, కుటుంబ సమస్యల కోసం మా అషోసియేషన్‌కు గుంపును పోగేసుకునివెళ్లినంత శ్రద్ధ.. ఏపీపై ఎందుకు చూపడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు సినీ పరిశ్రమను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని, అలాంటిది కష్ట సమయంలో, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడంలేదని వారు ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థుతుల్లో ఏపిలో బీజేపీకి ఉన్న పరిస్థితి, మరీ ముఖ్యంగా కొందరు నాయకుల తీరుపై భగ్గుమంటూ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు ఘాటు లేఖ రసారు.. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడుగా హరిబాబు రాజీనామా చేసిన తరువాత, కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో, తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, కొత్త అధ్యక్షుడికి ఎన్నికకు ముందు తమతో మాట్లాడాలని సూచించారు... రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నేతల తీరు పై కూడా, ఆ లేఖలో విరుచుకుపడ్డారు.. సొంత ప్రాంతంలో కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని కొందరు నాయకులు ప్రజల ముందు, మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు నేతలు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా, సోము వీర్రాజు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా అర్ధమవుతుంది.

అంతే కాదు, ఇంకా కొంత మంది బీజేపీ నాయకులు అవినీతికి మారుపేరుగా మారారన్నారు. 2014 ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన, సీనియర్‌ నాయకులను తీవ్రంగా అవమానిస్తున్నారు... దీనివల్ల వారు బీజేపీని వీడి మరో పార్టీలో చేరక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు... ఒక అసమర్థ నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో తప్పటడుగులు వేస్తే సీనియర్‌ నేతలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు... ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు కూడా పార్టీని వీడిపోయే ప్రమాదం ఉంది'' అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

మరో పక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని, పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షా ను కోరడం ఆసక్తికరంగా మారింది... రాష్ట్రంలో పరిస్థితులను అధిష్ఠానానికి వివరించేందుకు కొన్ని రోజులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా వీలు పడటం లేదు.. రాష్ట్ర పార్టీ నాయకులతో, ప్రజా ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా... వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడమేమిటన్నది వీరి ప్రధాన అభ్యంతరం. కానీ... తమకు అన్నీ తెలుసు అనే వైఖరివల్లో, కర్ణాటక ఎన్నికల వల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమయం ఇవ్వడంలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Advertisements

Latest Articles

Most Read