గత నాలుగేళ్లలో, గవర్నర్ ఎంత ఇబ్బంది పెట్టినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు ఒక్క మాట కూడా బహిరంగంగా మాట్లాడలేదు... మొన్నటి దాకా తెలంగాణాకు అనుకూలంగా ఉన్నా, కొన్ని రోజుల క్రితం నుంచి కేంద్రంలో బీజేపీతో కలిసి, రాష్ట్రంలో పవన్, జగన్ తో ఆడిస్తున్నారని వార్తలు వస్తున్నా, చంద్రబాబు ఏ నాడు బ్యాలన్సు తప్ప లేదు... గవర్నర్ పై, తెలుగుదేశం పార్టీ నేతలు ఏమన్నా వ్యాఖ్యలు చేసినా, వారిని వారించే వారు... అయితే, ఈ రోజు మాత్రం, చంద్రబాబు ఓపెన్ అప్ అయిపోయారు... రెండు రోజుల క్రితం గవర్నర్, కేంద్రం నుంచి ఎదో రాయబారం తెచ్చారు అనే వార్తలు వచ్చాయి... కర్ణాటక ఎన్నికలు అయ్యే వరకు, మోడీ పై విమర్శల వేడి తగ్గించమని కోరినట్టు తెలిసింది... అయితే చంద్రబాబు కూడా అదే రీతిలో స్పందించినట్టు సమాచారం...

cbn governer 24042018 2


అయితే ఈ రోజు, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతిప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని. పేపర్‌లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు... చంద్రబాబు గవర్నర్ పై ఇలా డైరెక్ట్ గా వ్యాఖ్యలు చెయ్యటం ఇదే మొదటి సారి...

 

cbn governer 24042018 3

ఈ రోజు గవర్నర్, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే.. చంద్రబాబుతో జరిగిన చర్చల వివరాలు, ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి వెళ్ళారని తెలుస్తుంది... మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ మూడు రోజుల పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు పెద్దలను ఆయన కలవనున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నారు... అలాగే ఇక్కడ పవన్, జగన్ పోషిస్తున్న పాత్ర గురించి కూడా చర్చించనున్నారు... గవర్నర్ నివేదిక చుసిన తరువాత, కేంద్రం మరో ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ పై పట్టుకు ముందుకు రానుంది.. ఇప్పటికే పవన్, జగన్, తమ తమ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్నారు... కులాల వారీగా, కుట్రలకు బేస్ సెట్ చేసుకున్నారు... చంద్రబాబు ఎలాగు లొంగడు అని తెలుసుకున్న ఢిల్లీ పెద్దల, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి...

ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది. ఏప్రిల్ 24- 26 మధ్య సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని వెల్లడించింది. అలల ఎత్తు దాదాపుగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని పేర్కొంది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

climate 24042018 2

ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అలల ఉధృతికి అవకాశం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఉంటాయని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికరలు జారీ చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది.. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు... తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.. తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌కాయిస్ తెలిపింది.

climate 24042018 3

అంతేకాదు ఈ రెండు రోజులూ సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకుండా నిరోధించాలని స్పష్టం చేసింది. సముద్ర ఉపరితలం నుంచి గాలులు 45- 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్‌‌పై ఈ అలల ఉధృతి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆఫ్రికా తీరంలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో భారీ అలలు ఏర్పడి, ఇప్పటికే పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది.

దేశంలోనే తొలిసారిగా సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ (ఎపిఎ్‌సఒసి)ను అమరావతిలో ప్రారంభించటం, దానికి టెక్‌ మహీంద్రా భాగస్వామ్యం అవ్వటం పై, టెక్‌ మహీంద్రా సిఇఒ అభినందిస్తూ ట్వీట్ చేసారు. సకల సదుపాయాలు, సరికొత్త టెక్నాలజీలతో కూడిన సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాంప్రదాయిక ఎస్‌ఔస్‌, ప్రెడిక్టివ్‌ థ్రెట్‌ అనలిటిక్స్‌ సామర్థ్యాలు, సెక్యూరిటీ కవరేజీ సదుపాయాలతో అన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు ఈ సెంటర్‌ సేవలందిస్తుందని టెక్‌ మహీంద్రా పేర్కొంది. డిజిటలైజేషన్‌కు మారుతున్న ప్రస్తుత తరుణంలో సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలు అధికమవుతున్నాయని, ఇది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే శాఖల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సైబర్‌ ముప్పు నుంచి రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఎపిసిఎ్‌సఒసిను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

gurnani 24042018 1

సైబర్‌ సెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో టెక్‌ మహీంద్రాకు ఉన్న అనుభవం, నైపుణ్యంతో భారత్‌లో తొలిసారిగా విజయవాడలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా కంప్యూటర్స్ హ్యాకింగ్‌ను, వైరస్‌లను నియంత్రించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు గూఢచార భాగస్వామ్య ముప్పును విశే్లషణ ద్వారా అందిస్తుందన్నారు. ఇలాంటి సెంటర్‌ను దేశంలో ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం-సామాజిక పరివర్తనాల్ని ప్రారంభించడంలో సహాయపడిన పలు సైబర్ ప్రోగ్రామ్‌లకు ఆంధ్రప్రదేశ్ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. దేశంలో సైబర్ భద్రతా గమ్యస్థానంగా అమరావతిని రూపొందించడానికి ఇదొక ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు.

gurnani 24042018 1

ప్రభుత్వ సెక్యూరిటీకి దన్నుగా ఎపిసిఎ్‌సఒసి నిలబడనుందని టెక్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ సిపి గుర్నానీ తెలిపారు. టెక్‌ఎంనెక్ట్స్‌ చార్టర్‌లో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో అత్యుత్తమమైన సేవలను అందించేందుకు ఈ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ దోహదపడనుందని గుర్నానీ తెలిపారు. అలాగే ఈ రోజు గుర్ననీ ఈ విషయం పై ట్వీట్ చేసారు కూడా "Another step in @tech_mahindra's journey to creating #TechMNxt : Partnering with the ecosystem to create robust securityframeworks.. Congratulations @AndhraPradeshCM @ncbn @naralokesh for being the trailblazers in security"

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా అంశం కర్నాటకలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అక్కడి ముఖ్యమంత్రి, ఏపీ అంశాలను కూడా విజయానికి అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహ రచన చేశారు. పదే పదే అంధ్రప్రదేశ్ కు గత సాధారణ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయని ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కర్నాటకలోనే తిష్టవేసి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఏపీకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలుగు ప్రజలను వంచనకు గురిచేసిన మోడీ, షాలు కర్నాటకకు ఏమి న్యాయం చేస్తారని ఓటర్ల దృష్టికి తేవడం ద్వారా గెలుపునకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

cbn karnataka 2404208

రోజూ ఏ.పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శ్లాఘిస్తూ బీజేపీపైకి పదునైన అస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వుండి నేరుగా తెలుగుదేశం మద్దతును ప్రత్యక్షంగా కోరకపోయినప్పటికీ, తెలుగుదేశం అభిప్రాయాలకు పెద్ద ఎత్తున విలువనిస్తూ ప్రచార బరిలో ముందున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశాన్ని కూడా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపిన నరేంద్ర మోడీ, అమిత్ షాలు కర్నాటక ఓటర్లను మోసం చేయడానికి మళ్ళీ వచ్చారని ఆరోపిస్తున్నారు. నేరుగా ఇరువురు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవకుండానే వారిని ముగ్గులోకి దింపడం ద్వారా గెలుపు దిశగా సిద్దరామయ్య దూసుకుపోతున్నారని చెబుతున్నారు.

cbn karnataka 2404208

ఫలితంగానే ఏ.పి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజల ఓట్ల ద్వారా లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా కర్నాటక ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఆ ప్రభావం ఏ.పి పై వుండబోతోందని కూడా చెప్పారు. ఫలితంగానే కర్నాటక లో బీజేపీ గెలవకూడదనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వున్నారని తెలిసింది. తిరుపతి బహిరంగ సభ అనంతరం పూర్తి స్థాయిలో కర్నాటక ఎన్నికలపై దృష్టి సారించాలనే యోచనలో ముఖ్యమంత్రి వున్నారు. అయితే వ్యహం ప్రత్యక్షమా లేదా పరోక్షమే అనే సందిగ్ధత నెలకొందని, త్వరలోనే ఈ విషయమై ఒక స్పష్టతకు వస్తారని తెలిసింది.

Advertisements

Latest Articles

Most Read