మాజీ మంత్రి పేర్ని నాని మాటకారే కాదు, అద్భుతమైన నటుడు. దరఖాస్తు చేసుకుని వుండడు కానీ, ఆంధ్రా నుంచి ఆస్కార్ ఎగరేసుకుపోయేంత టాలెంట్. పది పైసల పని, వంద రూపాయల ప్రచారంలా ఉంటుంది నాని తీరు. బందరులో మండుటెండలో రోడ్డున వెళుతున్న ఓ వృద్ధురాలికి చెప్పుల్లేవు. ఆమెకి చెప్పులు కొనివ్వడం చాలా మంచి విషయం. కానీ ఆ వృద్ధురాలిని చేయి పట్టుకుని నడిపించి షాపులోకి తీసుకెళ్లే తతంగమంతా షూట్ చేసిన తీరు చూస్తే ఇదంతా ప్రీప్లాన్డ్ షూట్ అని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎండలో కాలు కాలిపోతున్న వృద్ధురాలికి చెప్పులు కొన్నానంటూ మీడియా, సోషల్మీడియా అంతటా హోరెత్తిస్తున్న పేర్నినాని..ఆ చెప్పుల ఖరీదు రూ.200. ఆ వృద్ధురాలు తనకి కళ్లు కనపడవంటూ చెబుతూనే ఉంది, కానీ ఐప్యాక్ క్యాంపెయిన్ బృందం ఆ విషయం పట్టించుకోవడంలేదు. ఎండ, వృద్ధురాలు, కాళ్లకి చెప్పులు లేవు...ఈ మూడు అంశాలతో సానుభూతి కొట్టేయొచ్చనే ఆరాటంతో చేసిన ఫోటో షూట్‌లో చివరిలో ఆ ముసలావిడ తనకి కళ్లు కనిపించవంటూ సాయం అడుగుతుంటే పట్టించుకోకుండా, ఆమె చేతిలో డబ్బులు తీసుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఎంత ఆస్కార్ నటుడైనా ఏదో ఒక షాట్‌లో దొరికేస్తాడు. ముసలావిడ వెళుతూ చెప్పిన మాటలు ఎడిట్ చేయాల్సింది. ఇప్పుడు ఎంతగా అభాసుపాలయ్యారో చూడండి. పేర్ని నాని అంత దయార్ద్ర హృదయుడే అయితే, నిరుపేదల కోసం టిడిపి కట్టించిన 4 వేల ఇళ్లు ఇప్పటికీ అప్పగించకుండా వారు ఎండలో ఎండుతూ, వానలో నానుతూ..అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఒక వృద్ధురాలు ఎండలో చెప్పుల్లేకుండా నడవడం చూడలేకపోయిన పేర్ని నాని, ఇలా వేలాదిమంది వృద్ధులు..చంటిపిల్లలతో ఉన్న కుటుంబాలను నడివీధిలో వదిలేయడం పాపం అంటున్నారు బందరు జనాలు.
news
పవన్ పెళ్లిళ్ల గోల జగన్ కేల..పొత్తులొద్దంటూ కొత్త ఎత్తు
రాక రాక జనంలోకి ఓ సభకి వస్తారు ముఖ్యమంత్రి. వచ్చిన ఆ సభలోనూ తానేం చేశారో చెప్పరు. పవన్ పెళ్లిళ్లపై ఏడుస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ బాగున్నాడు. ఆయనని పెళ్లి చేసుకుని విడిపోయిన భార్యలు వారి కుటుంబాలు బాగానే ఉన్నాయి. పవన్ పెళ్లిళ్ల వల్ల ఎవరికీ లేని సమస్య జగన్ రెడ్డికి ఎందుకో ఎవ్వరికీ అంతుబట్టని విషయం. ఇంకో అరిగిపోయిన రికార్డు మళ్లీ వేశాడు. దత్తపుత్రుడు, దత్త తండ్రి. నువ్వు సింగిల్ సింహానికి అని జూలు విదిల్చుతున్నప్పుడు ఆ దత్తులు కలిస్తే జగన్ రెడ్డికి ఏంటో సమస్య తెలియదు. మీ ఇద్దరు (టిడిపి+జనసేన) కలిసి పోటీ చేయొద్దని ఏడుస్తాడు. వైకాపా ఎలా పోటీ చేయాలనేది నీ ఇష్టమైనప్పుడు, వాళ్ల పార్టీల అధినేతలుగా కలిసి పోటీచేస్తారో, విడివిడిగా పోటీ చేస్తారో వాళ్లిష్టం. ఎదుట పార్టీలు ఎలా పోటీ చేయాలో కూడా వైకాపా అధినేత డిసైడ్ చేస్తుండడం ఆయన అభద్రతాభావానికి, ఓటమికి సంకేతం అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజాంపట్నం మత్స్యకార భరోసా సభ నుంచి టీడీపీ, జనసేన కలయికపై జగన్ రెడ్డి విమర్శలు సాగించడం ఎంతగా ఈ పొత్తు భయపెడుతోంది అర్థమైపోయింది.
కర్ణాటక దెబ్బతో తెలంగాణలో తెలుగుదేశం వైపు బీజేపీ చూపు
కర్ణాటకలో దారుణ పరాజయంతో దక్షిణాదిలో బీజేపీ చాప్టర్ ముగిసింది. కర్ణాటకలో మళ్లీ గెలిచి దక్షిణాదిలో మరిన్ని రాష్ట్రాలలో పాగా వేయాలని సర్వశక్తులూ వొడ్డిన బీజేపీ కలలు కల్లలయ్యాయి. కేరళలో కమలానికి సీన్ లేదు. తమిళ తంబీలు రానివ్వరు. తెలంగాణలో కాస్తా కూస్తో ఆశలున్నా, కర్ణాటక ఫలితాలతో డైలమా నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ రహస్య మిత్రులు చాలా బలంగా ఉన్నారు. అక్కడ కేసీఆర్‌ని కొట్టాలంటే బీజేపీకి ఎవరో ఒకరి మద్దతు తప్పనిసరి. ఎంఐఎం, కమ్యూనిస్టులు అంతా కారు సారుతోనే ఉన్నారు. కాంగ్రెస్‌తో కలవలేరు. తమ ఆర్థిక, రాజకీయ అవసరాలకు వాడుతున్న జగన్ రెడ్డికి తెలంగాణలో ఓటుబ్యాంకులేదు. తెలంగాణలో తెలుగుదేశానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెజారిటీకి సరిపడా గెలిచి అధికారం దక్కించుకోలేరు. కానీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారం దక్కేలా చేయగలరు. ఇంకొక బలమైన పార్టీకి అధికారం దక్కకుండా చేసే సత్తా తెలుగుదేశానికి ఉంది. బీజేపీ తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఢిల్లీ పెద్దలు వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీజేపీకి ఆప్షన్‌గా కనిపిస్తోంది. కర్ణాటకలో దారుణ పరాజయం తరువాత తెలంగాణలో బీజేపీ తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాలనుకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆశలు మొలకెత్తాయి. కాంగ్రెస్ కూడా టిడిపి ఓటు బ్యాంకుతో చాలా సీట్లు గెలవొచ్చని, టిడిపితో టై అప్ కోసం యత్నించవచ్చిన రాజకీయ పరిశీలకుల అంచనా.
ఇంట్లో గొడ్డలి పోటుండగా..పక్కింట్లో వెన్నుపోటు గురించి ఎందుకో?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే, తన వీపు తనకి కనపడదే సామెత అతికినట్టు సరిపోతుంది. ప్రతీసభలోనూ విపక్షాలపైనా, మీడియాపైనా ఏడుస్తూనే కాలం గడిపేస్తుంటారు. ఈటీవీ, ఏబీఎన్, టివి5తో ఏ మీడియా సంస్థలేని మీ బిడ్డ యుద్ధం చేస్తున్నానంటాడు. సాక్షి ఎవరిది? ఎన్టీవీ ఎవరి పక్షం? టీవీ9 ఎవరి చుట్టమో మాత్రం చెప్పడు. సొంత బాబాయ్ ని ఇంట్లోనే గొడ్డలితో తమ్ముడు నరికేశారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ గుండె-గొడ్డలిపోటు కథలన్నీ ముందుగా తెలిసిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఏబీఎన్ ఆర్కే ఉతికి ఆరేస్తున్నాడు. సీబీఐ గొడ్డలి వేటు విచారణలన్నీ తన ఇంటి చుట్టూ తిరుగుతుంటే, ఒక కన్నుని మరో కన్ను ఎందుకు పొడుషుకుంటుంది అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. జనసమీకరణ చేసి సభావేదికలపై నుంచి తన గొడ్డలిపోటు సంగతి మాట్లాడదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనంటూ సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు జనంలోనూ మార్పు వచ్చేసింది. సొంత బాబాయ్ ని చంపేసి..చంద్రబాబుపైకి నెట్టేసి సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాసిన సంగతి జనాలు పట్టేశారు. ఇప్పుడు గొడ్డలిపోటు కూడా తన ఇంటిదేనని తెలిసిన జగన్ రెడ్డి, చంద్రబాబుని వెన్నుపోటు అనే అర్హత కూడా లేదని ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.