ఆంధ్రప్రదేశ్ లో అప్పులు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఇక దివాళా అంచున ఉందని, ఇప్పటికే అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే, అప్పులు తీర్చటానికి, మళ్ళీ అప్పులు చేస్తున్న పరిస్థితి చూసి, ఆశ్చర్య పోతున్నారు. నిన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ వేలం వేసి, రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చారు. అయితే అవి ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లోకి రాక ముందు, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, అక్కడే మినాయించుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ 2500 కోట్లు ఉందని, అందుకే ఇప్పుడు తీసుకున్న రెండు వేల అప్పుని, దానికి జమ వేసుకున్నాం అని చెప్పారు. ఇంత చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లి గవ్వ కూడా రాకపోగా, ఇంకా 500 కోట్లు కట్టాల్సి ఉంది. ఈ విధంగా అప్పు తీర్చటానికి, మళ్ళీ అప్పు చేస్తున్నారు. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ వద్ద, సెక్యూరిటీ వేలంలో, 40 వేల కోట్ల అప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. పైగా, జనవరి నుంచి మార్చ్ వరకు, తమకు మరో 27 వేల కోట్లు అప్పు కావాలని జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్లి మరీ మోడీని కోరినట్టు తెలుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

rbi 09022022 2

ముఖ్యంగా గత నెలలో, ఢిల్లీ వెళ్ళిన సమయంలో, ప్రధాని మోడీతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఈ నేపధ్యంలో, చివరి క్వార్టర్ లో తమకు 27 వేల కోట్ల అప్పు కావాలని కోరారు. ప్రత్యేక అనుమతి ఇవ్వాలని, నిబంధనలు ఉంటే సడలించాలని కోరారు. ఈ నేపధ్యంలోనే ఉన్నతాధికారుల సమావేశం జరిగినప్పటికీ , ఆర్ధిక శాఖ మాత్రం కొర్రీ వేసింది. ఇప్పటికీ FRBM పరిమితి దాటి, ఆంధ్రప్రదేశ్ అప్పులు తెచ్చుకుందని, ఇప్పుడు మళ్ళీ తిరిగి కొత్త అప్పులు ఇవ్వటం నిబంధనలకు వ్యతిరేకం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ కు ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇస్తే, మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఎక్కువ అప్పు అడిగితే, ఏమి చేస్తారని ఆర్ధిక శాఖ ప్రశ్నించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులు 4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పొరేషన్ పెట్టి, మద్యం అప్పు చూపించి, ఇలా రకరకాలుగా అప్పులు తెచ్చి, ఇప్పుడు మళ్ళీ వివిధ మార్గాల్లో అప్పుల కోసం చూస్తుంది.

గత నాలుగు రోజులుగా, హైదరాబాద్ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఏకంగా దేశ ప్రధాని ఇక్కడ వచ్చి, అతి పెద్ద రామానుజుల వారి విగ్రహం ఆవిష్కారించారు. ఇది మొత్తం చినజీయార్ స్వామి సారధ్యంలో జరిగిన కార్యక్రమం. అయితే ఒక పక్క దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే, ఈ రోజు బయటకు వచ్చిన రెండు వీడియోలు చినజీయార్ స్వామి ప్రతిష్టను పాతాళానికి పడేశాయి. ఈ వీడియోలు చూసిన వారు, చినజీయార్ ని తప్పు బడుతున్నారు. గుడివాడలో క్యాసినో వ్యవహారం ఎంత రచ్చ రచ్చ అయ్యిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో లేని నీచ సంస్కృతిని ఇక్కడకు తీసుకుని వచ్చి, రాష్ట్ర పరువు గంగలో కలిపారు. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, ఇది కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో జరిగిన తంతు కావటం, కొడాలి నాని పాటలు, వైసీపీ రంగులతో రచ్చ రచ్చ చేసారు. అయితే ఈ క్యాసినో ఆర్గనైజర్ చీకోటి ప్రవీణ్, కొడాలి నానికి, వంశీకి దగ్గర వాడు. అయితే ఇక్కడ క్యాసినో నడిపిన చీకోటి ప్రవీణ్, చినజీయార్ స్వామితో కలిసి ఉన్న రెండు వీడియోలు బయటకు వచ్చాయి. ప్రవీణ్ చీకోటి చేస్తున్న ఒక ఫంక్షన్ కు చినజీయార్ స్వామి రావటం ఒక వీడియో అయితే, రెండో వీడియో ఏకంగా ప్రవీణ్ చీకోటి, చినజీయార్ స్వామిని కారులో ఎక్కించుకుని స్వయంగా తిరగటం.

chinajeeyar 08022022 2

ఒక పెద్ద కారులో క్యాసినో నడిపే ప్రవీణ్ చికోటి, చినజీయార్ స్వామితో కలిసి వెళ్ళటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒక పక్క గుడివాడ క్యాసినో వివాదాస్పదం అవ్వటం, ఇప్పుడు ఈ వీడియోలు బయటకు రావటంతో, చినజీయార్ స్వామి పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న స్వామి, ఇలా ఒక జూదగాడితో కలిసి తిరగటం, ఆశీర్వాదం అందించటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక పక్క చినజీయార్ పై నిన్నటి వరకు ప్రశంసలు వస్తే, ఇప్పుడు ఇలా జుదగాళ్ళతో ఉండటంతో వివాదాస్పదం అయ్యింది. ఎక్కడో ఉంటే ఆశీర్వాదం ఇచ్చారు అంటే, ఎవరో తెలియక ఇచ్చారు అనుకోవచ్చు. అలా కాకుండా, అలాంటి వాడితో కలిసి, ఈయన కారులో వెళ్తున్నారు అంటే, ఎంత చనువు లేకపోతే వెళ్తారు, ఇలాంటివి స్వామి వారికి తగునా అనే విమర్శలు వస్తున్నాయి. మరి దీని పైన ఎలాంటి వివరణ అటు వైపు నుంచి వస్తుందో చూడాలి.

ఆయన పేరు సూర్యనారయణ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. పీఆర్సి సాధన కమిటీలో, ఆ నలుగురులో ఒక కీలక నేత. ఈయనది జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, పెట్టిన కొత్త సంఘం. ఇందులో ఎవరు ఉంటారో ఎవరికీ తెలియదు కానీ, ఈయన మాత్రం నాయకుడిగా చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. మొన్న అశోక్ బాబు మీద తప్పుడు కేసు పెట్టటంలో కూడా ఈయన పత్ర ఉందని చెప్తారు. అందరూ వెంకట్రామి రెడ్డిని జగన్ కోవర్ట్ అంటారు కానీ, విషయం తెలిసిన వారు మాత్రం, సూర్యనారాయణ వైపు వేళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు సూర్యనారయణ అడ్డంగా దొరికారు. ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అయ్యింది. అది చూసిన ఉద్యోగులు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2015లో చంద్రబాబు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 43 శాతం పీఆర్సి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఒకేసారి 43% జీతాలు పెంచారు. పక్కన ఉన్న తెలంగాణా 42 శాతం ఇవ్వటంతో, ఇక్కడ ఉద్యోగులు తమ మనోభావాలు అర్ధం చేసుకోవాలని, వారితో నిన్నటి వరకు సమైఖ్యాంధ్ర విషయంలో పోరాడాం అని, చంద్రబాబుని అడగటంతో, చంద్రబాబు అర్ధం చేసుకుని, ఆత్మగౌరవం ముఖ్యం అని తలిచి, విభజన జరిగిన మొదటి ఏడాది అయినా, ఎన్నో కష్టాలు ఉన్నా, 43 శాతం ప్రకటించారు.

surya 08022022 1

అయితే అప్పట్లో ఇదే విషయం పైన, ఇదే సూర్యనారాయణ స్పందిస్తూ, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. 43% ఫిట్ మెంట్ ఇస్తే, చంద్రబాబుకి ఎందుకు థాంక్స్ చెప్పాలి, ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి అంటూ, ఎదురు ప్రశ్నించారు. మనం చెప్తే థాంక్స్ కేసీఆర్ కి చెప్పుకోవాలి అంటూ వెటకారం చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి 27 శాతం నుంచి 23 శాతం కు తగ్గించినా, జగన్ మోహన్ రెడ్డి భజన చేస్తూ, ఇది అద్భుతం అమోఘం, బెస్ట్ డీల్ అంటూ ఆయన చేస్తున్న హడావిడి చూసి, కింద స్థాయి ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాడు 43 శాతం ఆయన ఇస్తే, మాలో విషం ఎక్కించి, చంద్రబాబుకి వ్యతిరేకంగా పని చేసేలా చేసి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, వచ్చే జీతం కూడా తగ్గిస్తుంటే, ఇలా భజన చేయటం ఏమిటి అంటూ, సుర్యనారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా పిచ్చ వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఇదే వీడియో తిరుగుతూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సాక్ష్యాత్తు అధికార పార్టీ ఎంపీలే డబ్బులు లేవు, జీతాలకు కూడా ఇవ్వలేక పోతున్నాం అంటూ, పార్లమెంట్ లోనే వాపోతున్నారు అంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ నిమిషాన దివాళా అనే బ్రాండ్ అధికారికంగా ప్రకటిస్తారో అని ఆందోళన చెందుతున్న పరిస్థితిలో, రోజుకి ఒక అంశం తెర మీదకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించటం లేదని, వారం రోజుల క్రితం విద్యుత్ ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే అంశం పై ఎన్.టి.పి.సీ మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్.టి.పి.సీకి, రూ.860 కోట్లు బాకీ ఉంది. అయితే ఎన్.టి.పి.సీ గత రెండు, మూడు నెలల నుంచి ఈ డబ్బులు చెల్లించాలని రాష్ట్రం వెంట పడుతూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించకుండా లైట్ తీసుకున్నారు. దీంతో ఎన్.టి.పి.సీ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకుని వెళ్ళింది. కేంద్ర ఇంధన శాఖ అధికారులు కూడా రాష్ట్ర అధికారుల పై ఒత్తిడి తెచ్చారు. అయినా సరే, ఎక్కడా రాష్ట్రం నుంచి స్పందన లేకుండా పోయింది. దీంతో కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. ఆర్బిఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ఎకౌంటులను ఫ్రీజింగ్ చేయాలనియా, అంటే నిలిపివేయాలని, ఆర్బిఐకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

rbi 08022022 2

దీంతో ఆర్బిఐ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పాటించే క్రమంలోనే, విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అధికారులకు తెలియటంతో, రంగంలోకి దిగారు. అలా చేస్తే విద్యుత్ కొనుగోళ్ళు ఆగిపోతాయని, మరింత ఇబ్బంది పడతామని, డబ్బులు ఎలాగోలా సర్దుబాటు చేస్తామని, ఎన్.టి.పి.సీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో వాళ్ళు మెత్తబడటంతో, సమస్య కొంత వరకు ప్రస్తుతానికి సర్దుబాటు అయ్యింది. అయితే రూ.860 కోట్ల సర్దుబాటు విషయంలో, రూ..360 కోట్లు బిల్ డిస్కౌంట్ కింద అడ్జెస్ట్ చేసుకోవాలని, మిగతా 500 కోట్లు ఈ నెల 20 లోపు ఎలాగోలా ఇచ్చేస్తామని ఎన్.టి.పి.సీ అధికారులకు, రాష్ట్ర అధికారులు నచ్చ చెప్పారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, నేరుగా రంగంలోకి దిగి, అటు కేంద్రంతో, ఇటు ఎన్.టి.పి.సీ అధికారులతో, ఇటు ఆర్బిఐతో, ఇలా అందరిని బ్రతిమిలాడి, ఈ సారికి సర్దుబాటు చేసారు. అయితే ఈ పరిణామం చూస్తుంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాను రాను రాష్ట్రంలో, ఎలాంటి ఇబ్బందిక పరిస్థితి ఉంటుందో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read