పోలవరం నిర్వాసితులు ఎదుర్కుంటున్న సమస్యల పై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలవరం ప్రాజెక్ట్ ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలోని కూనవరం, వీఆర్‍పురం మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఉన్న షడ్యుల్ తెగల వారిని, అక్కడ ఉండే నిర్వాసితులు అందరినీ కూడా, బలవంతంగా, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించిందని, వారికీ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవటంతో పాటుగా, పునరావాసం కూడా కల్పించకుండా, ఉన్న పలాన, వారు నివాసం ఉంటున్న ప్రదేశాల నుంచి ప్రభుత్వం ఖాళీ చేయించిందని, ఈ విషయంలో షడ్యుల్ తెగల వారికి పూర్తి అన్యాయం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ఫిర్యాదుకు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి, అలాగే తూర్పు గోదావారి జిల్లా కలెక్టర్ కు, అలాగే కేంద్ర జలశక్తి కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు పై 15 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది. 15 రోజుల్లోకు తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని, 15 రోజుల్లో తమకు నివేదిక ఇవ్వక పొతే మాత్రం, వ్యకిగతంగా అందరూ నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని, హెచ్చరించింది. ఆ నోటీసులో ఈ విషయం స్పష్టంగా తెలిపారు.

polavaram 20072021 2

ఇక కూనవరం, వీఆర్‍పురం మండలాల్లో కూడా అనేక గ్రామాల్లో, పోలవరం ముంపు ప్రాంతాల్లో అనేక మంది ఎస్సీలు ఉన్నారని, వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు, పరిహారంతో, పాటుగా పూర్తి సౌకర్యాలు ఉన్న పునరావాస కేంద్రాలు నిర్మించి, అక్కడకు తరలిస్తాం అని చెప్పి పేర్కొందని, కానీ అప్పుడు ఇచ్చిన హమీకు విరుద్ధంగా, ఇప్పటి ప్రభుత్వం అక్కడ ఉన్న నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించి, ఉన్న ప్రదేశం నుంచి వెళ్లి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలని వారిని ఆదేశించటం, అక్కడకు కనీసం ఆహరం నీరు కూడా ఇవ్వకుండా, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీని వల్ల ఎస్సీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్సీ కమిషన్ కు రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించిన ఎస్సీ కమిషన్, నిన్న సాయంత్రం, అధికారులు ముగ్గురికీ కూడా నోటీసులు జారీ చేయటమే కాకుండా, పూర్తి స్థాయి వివరణను ఎస్సీ కమిషన్ కు ఇవ్వాలని కోరింది. అయితే నిన్న జగన్ మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళిన తరువాతే, ఈ నోటీసులు రావటం కొసమెరుపు.

ఆంధ్రప్రదేశ్ లో మరో అంశం గత రెండు రోజులుగా హైలైట్ అవుతుంది. సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ లో పెట్టిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాటిల్లో ఏమి లాజిక్ లేకపోయినా అందులో పెట్టిన అంశాలు చర్చానీయంసం అయితే అయ్యాయి. రఘురామకృష్ణం రాజు అరెస్ట్ కేసులో, సిఐడి అధికారులు, ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ పైన కూడా రాజద్రోహం కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు బడుతూ ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. ఒక ఎంపీగా ప్రెస్ మీట్లు పెడితే అవి ప్రసారం చేయటం తప్పు ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు. తమ పై పెట్టిన కేసు కొట్టేయాలని సుప్రీం కోర్టు వరకు వెళ్ళాయి. దీని పై వాదనలు విన్న సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇందులో కొన్ని వివరాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానవు. రఘురామకృష్ణం రాజుకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని టీవీ5 చైర్మెన్, రూ.8.8 కోట్లు ఇచ్చారు అంటూ ఆ అఫిడవిట్ లో తెలిపారు. అసలు రఘురామకృష్ణం రాజుకి, టీవీ5 డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెప్పటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఏ ఆధారం ప్రకారం, ఈ ఆరోపణలు చేసారో తెలియదు.

sc 20072021 2

ఇక దీంతో పాటు, చంద్రబాబు, లోకేష్, తరుచూ రఘురామరాజుతో వాట్స్ అప్ లో మాట్లాడుకుంటారని కూడా అఫిడవిట్ లో తెలిపారు. జగన్ బెయిల్ పిటీషన్ రద్దు అంశం పై కూడా చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. ఇందులో కూడా ఏమి తప్పు ఉందో అర్ధం కావటం లేదు. అయితే ఈ ఆరోపణల పై, టీవీ యాజమాన్యం స్పందించింది. తాము రఘురామకృష్ణం రాజుకి డబ్బులు ఇచ్చాం అని చెప్పటం అబద్ధం అని చెప్పింది. ఏపి సిఐడి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. తమ సంస్థకు రఘురామరాజుకి మధ్య ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదని చెప్పింది. తాము ప్రజల కోసం పని చేస్తున్నామని, తెలిపింది. ఇదే సందర్భంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేసి, తమ పై తప్పుడు అఫిడవిట్ వేసిన అధికారులు పై, పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలిపింది. సుప్రీం కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ అఫిడవిట్ పై, న్యాయ పరంగానే తేల్చుకుంటాం అని, సుప్రీం కోర్టులోనే ఈ విషయం పై న్యాయ పరంగా ఎదుర్కుంటాం అని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర చాల వరకు పరిమితం. ఏపిలో బీజేపీ నేతలు చాలా వరకు వైసిపీతో కలిసిపోయారు అనే అభిప్రాయం అందరిలో ఉంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ పై మొదటి నుంచి ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ వీరు టిడిపిని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు బీజేపీ నేతలు, వైసీపీ పై చేసిన ఆరోపణలు చర్చనీయాంసం అయ్యాయి. తమ సహజ శైలికి భిన్నంగా వీరు వైసీపీని టార్గెట్ చేయటమే కాకుండా, వారిపై సంచలన ఆరోపణలు కూడా చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలో ఒకటి రైతులకు ధాన్యం బకాయలు చెల్లించక పోవటం. గతంలో చంద్రబాబు హాయాంలో 21 రోజుల్లో ధాన్యం బకాయలు ఇచ్చే వారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హాయాంలో, నాలుగు నెలలు అవుతున్నా ఇంకా రైతులకు ధాన్యం డబ్బులు రాలేదు. ఇప్పటికే టిడిపి దీని పై పోరాటం చేస్తుంది. ఈ అంశం పై బీజేపీ కూడా స్పందించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళలో పెద్ద కుంభకోణం జరిగింది అంటూ సోము వీర్రాజు ఆరోపణలు చేసారు. మిల్లర్లతో కలిసి వైసీపీ ప్రజా ప్రతినిధులు, అధికారులు దోచుకుని, రైతులను నిలువునా ముంచారని అన్నారు. పంట కొనుగోళ్ళ బకాయలు ఇప్పటికీ ఇవ్వకపోవటం పై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రాహం వ్యక్తం చేసారు.

kodali 19072021 2

అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణ సంచలనం అయ్యింది. ఒక జిల్లా స్థాయి, డీఎం స్థాయి అధికారి, రూ.3కోట్లతో ఒక వైసీపీ మంత్రికి ఇల్లు కట్టించి ఇచ్చారు అని, దీంట్లో ఎంత తినేసారో చెప్పటానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. అయితే ఆ మంత్రి పేరు చెప్పలేదు. సహజంగా ఆ శాఖ పౌరసరఫరాల శాఖ కాబట్టి, కొడాలి నానిని టార్గెట్ చేసారనే చెప్పాలి. దీనికి తగ్గట్టుగానే, కొడాలి నాని ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి, ఈ అంశం పై స్పందిస్తూ, సోము వీర్రాజు పై ఫైర్ అయ్యారు. ఆ మంత్రి ఎవరో, ఆ అధికారి ఎవరో చెప్పాలని, సోము వీర్రాజున డిమాండ్ చేసారు. పౌరసరఫరాల శాఖ, కేంద్రంతో కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి, కేంద్రంలో అధికారం మీదే కాబట్టి, సిబిఐ ఎంక్వయిరీ వేసుకోండి అంటూ కొడాలి నాని డిమాండ్ చేసారు. నోటాతో పోటీ పడే పార్టీ అంటూ, కొడాలి నాని ఫైర్ అయ్యారు. అయితే సిబిఐ ఎంక్వయిరీ వేయాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి, మరి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి, కొడాలి నాని సిబిఐ ఎంక్వయిరీ వేయమని అడుగుతారో లేదో చూడాలి.

గిరిజనుల విలువైన సంపదను రెడ్డి బ్రదర్స్ కొల్లగొడుతున్నారని, ఆ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, గిరిజనుల భూములను ఆక్రమించు కుంటున్నారని, గిరిపుత్రుల సమస్యలు, బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన తమను అకారణంగా అడ్డుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం ఆమె తనని వాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "బాక్సైట్ ఖనిజ సంపద అక్రమ మైనింగ్ గురించి, గిరిజనుల సమస్యల గురించి తెలుసుకునే హక్కు ఒక గిరిజన బిడ్డగా నాకులేదా? రక్షణపేరుతో పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడ మేంటి? కో-వి-డ్ నిబంధనలు ఉల్లంఘించామనే కుంటి సాకు చూపి తమను అరెస్ట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిఇన్నేళ్లైనా ఈ ప్రభుత్వం ఇంకా అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతోంది. గిరిజనుల సమస్యలను, అటవీ భూమిలో యథేచ్ఛగా సాగుతున్న మైనింగ్ వ్యవహారాన్ని లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లాలని తాము భావించాము. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లకుండా గిరిజనులను ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి. తమను అకారణంగా అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా అరెస్ట్ చేయడంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. "

reddy 19072021 2

"గిరిజనుల సంపదను కొల్లగొట్టే క్రమంలో రెడ్డి బ్రదర్స్ చేయాల్సిన దారుణాలన్నీ చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో రూ.90లక్షలతో భారీ రోడ్డు వేశారు. ఆ రోడ్డు ద్వారానే విలువైన ఖనిజ సంపదను రెడ్డిబ్రదర్స్ దోచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి, గిరిజనుల గోడు వినడానికి వెళ్లిన తనతో పాటు,ఇతర బీసీ నేతలను ఎలా అడ్డుకుంటారు? స్వాతంత్ర్య భారత దేశంలో మాట్లాడేహక్కు, జీవించే హక్కుని హరిస్తూ, పోలీసుల సాయంతో ఎన్నాళ్లు అడ్డుకుంటారు? గిరిజన మహిళగా గిరిజనుల వద్దకెళ్లే అధికారం, హక్కు తనకున్నాయి. తన హక్కులను నిర్వీర్యం చేస్తూ, తనను పోలీసులు అడ్డుకున్నతీరుపై లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తాను. న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడతాను." అని ఆమె అన్నారు. 15 వేల కోట్ల బాక్సైట్ మైనింగ్ జరుగుతుందని టిడిపి ఆరోపిస్తూ, కొన్ని ఆధారాలు బయట పెట్టింది. అలాగే బాక్సైట్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని టిడిపి సందర్శించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read