జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తుత్తుత్తి జాబ్ క్యాలండర్ పై నిరసిస్తూ, ఈ రోజు తెలుగుదేశం, వామపక్షాలకు చెందిన విద్యార్ధి సంఘాలు అన్నీ, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ముట్టడి పిలుపు ఇచ్చాయి. అయితే దీన్ని భగ్నం చేయటానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. దాదాపుగా వెయ్యి మందికి పైగా పోలీసులను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళే మార్గాలు అన్నిటిలో మొహరించారు. ఇక వివిధ జిల్లాల నుంచే వచ్చే యువతని నిన్నటి నుంచే అరెస్ట్ లు చేస్తున్నారు. అలాగే జేసి పవన్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా భగ్నం చేయాలని, యువత ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం పన్నిన ప్లాన్ ఫలించలేదు. వివిధ మార్గాల ద్వారా యువత ఒక్కసారిగా మెరుపు వేగంతో క్యాంప్ ఆఫీస్ వైపు వచ్చారు. ఎటు నుంచి వచ్చారో, ఎలా వచ్చారో పోలీసులకు అర్ధం కాలేదు. ఒక్కసారిగా పోలీసులు వారిని చుట్టు ముట్టి వారిని అరెస్ట్ చేసారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తాడేపల్లి మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్ లు ఏర్పాటు చేసి, వారిని అడ్డుకుంటున్నారు. ఎవరినీ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్ళనివ్వం అని పోలీసులు చెప్పినా, వివిధ మార్గాల్లో అక్కడకి చేరుకున్నారు.

jagan 19072021 2

పోలీసుల వలయాన్ని చేదించుకుని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు, శ్రీరాం చిన్న బాబు, అలాగే మిగాతా నాయకులు అంతా కూడా, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర వరకు చేరుకోవటం జరిగింది. అయితే వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, బస్సుల్లో ఎక్కించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి అరెస్ట్ ని నారా లోకేష్ సహా, ఇతర తెలుగుదేశం నేతలు ఖండించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, నల్లపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని, కేసు పెడితే ఎందుకు కేసు పెట్టారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, ఏడాదికి 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చారని, ప్రతి ఏట 6500 పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేవలం 400 పోస్టులు ఇచ్చారని, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కేవలం 36 పోస్టులు ఇచ్చారని, అందుకే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎంతగా మొత్తుకున్నా, జగన్ రెడ్డి వినటం లేదు కాబట్టే, క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇచ్చామని నిరుద్యోగులు చెప్తున్నారు.

రాజకీయ నాయకులు పొరపాటున మాట్లాడటం చాలా సహజం. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అవి ట్రోల్ అవ్వటం, వైరల్ అవ్వటం నిరంతర ప్రక్రియ అయిపొయింది. దీనికి ప్రధాన కారణం, తమ ప్రత్యర్ధులను హేళన చేస్తూ వీడియోలు చేయటం, దానికి వీళ్ళే తప్పు మాట్లాడుతూ దొరికిపోవటంతో, అవతల పార్టీ వాళ్ళు వైరల్ చేయటం, ఇవన్నీ సర్వ సాధారణం అయిపోయాయి. రెండు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని వీడియోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. ఆయన పొరపాటుగా మాట్లాడారో లేదో కానీ, ఆ వీడియో చూస్తుంటే మాత్రం, తమ్మినేని కాన్ఫిడెంట్ గా పాఠాలు చెప్తున్నట్టు ఉంది. ఆయన మాట్లాడుతూ, మన చుట్టూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని, దానికి ప్రధాన కారణం చెట్లు లేకపోవటం అని, చెట్లు బాగా ఉంటే ఆక్సిజన్ బాగా ఉంటుందని, చెట్లు లేక, ఆక్సిజన్ లేక, కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నయాని, అందులే చెట్లు పెంచాలని అన్నారు. అంతే కాదు చెట్లు ఎలా ఉపయోగపడతాయో చెప్తూ, చెట్లు పెంచుకుంటూ పొతే ఆక్సిజన్ పీల్చుకుని, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వడిచి పెట్టి, మేఘావృతం అయ్యి, మనకు వర్షం కురవటానికి ఉపయోగ పడుతుందని, అప్పుడే మనం పంటలు పనించుకోగలం అని, భూమి పులకరించాలి అంటే, తొలకరి జల్లు కురవాలని అన్నారు.

speaker 18072021 2

ఆ తొలకరి జల్లు రావాలి అంటే, చెట్లు వదిలే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి మేఘావృతం అయ్యి, వర్షం పడుతుందని అన్నారు. అయితే ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఇదే వీడియో ట్రోల్ అవుతూ ఉండటంతో, స్పీకర్ తమ్మినేని స్పందించారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను ఏదో పొరపాటుగా మాట్లాడితే, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం అవసరమా అంటూ ప్రశ్నించారు. తాను పొరపాటున మాట్లాడిన మాటలు వైరల్ చేసే వాళ్ళు, మొక్కలు నాటి, ఏ ప్రచారం చేసుకున్నా సంతోషిస్తానని స్పీకర్ అన్నారు. ఇక అదే విధంగా వైసీపీ నాయకురాలు, లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ కు వైరల్ అయ్యింది. తెలుగు, సంస్కృతం భాషల గురించి వర్ణిస్తూ, తెలుగు సంస్కృతం భాషలు రెండు పేక ముక్కల్లా కలిసిపోయాయి అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు భాషని పేక ముక్కలతో పోల్చటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. మొత్తానికి, గతంలో టిడిపి నేతలు మాట్లాడితే హేళన చేసిన వైసిపీ నేతలకు, ఇప్పుడు వేడి తగులుతుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి హడావిడి చేస్తుంది. 137 కార్పొరేషన్లకు పదవులు ఇచ్చామని, ఇందులో సామాజిక న్యాయం చేసాం అని, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలకు 56శాతం పోస్టులు ఇచ్చామని, మహిళలకు 50 శాతం పోస్టులు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అసలు ఈ లెక్కలు చూస్తూ, ఈ పదవులు ఎందుకు ఇచ్చారో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేషన్లు అయిన ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్‌, మారిటైం బోర్డ్‌, సివిల్‌ సప్లైస్‌, పోలీస్‌ హౌసింగ్‌, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లు అన్నీ ఒకే సామజికవర్గం చేతిలోకి వెళ్ళాయి. ఈ పోస్టులు భర్తీ పై వైసీపీలో కూడా తీవ్ర అసంతృప్తి ప్రారంభం అయ్యింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కూడా వైసీపీ అసంతృప్తులు మొదలయ్యాయి. షేక్ కార్పొరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఈ పదవి మాకు అవసరం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఇక విజయవాడలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మెన్ పలానా వ్యక్తి వస్తుంది అంటూ లీకులు ఇచ్చారు. అతను ఫ్లెక్సీలు కూడా వేయించారు. అయితే ఆ పదవి వేరే వారికీ రావటంతో, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ విధంగా పోస్టులు ప్రకటించిన తరువాత, అనేక చోట్ల అసంతృప్తులు మొదలయ్యాయి.

nominated 18072021 2

అయితే ఇక మరో పక్క ఈ 137 పోస్టుల్లో, గిరిజనులకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవటంతో, గిరిజన సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటంతో, నిన్న సాయంత్రానికి గిరిజనులకు మరో రెండు పోస్టులు సృష్టించి, ముందుగా ప్రకటించిన 135 కాకుండా, దాన్ని 137 పోస్టులకు మార్చారు. ఇక వివిధ అకాడమీలు, సంగీత, సాహిత్య, నృత్య, జానపద అకాడమీ అనే దాన్ని, అయుదు విభాగాలుగా మార్చి పదవులు ఇచ్చారు. అసలు ఎక్కడ ఉందో తెలియని హిస్టరీ అకాడమీ అనే దాన్ని సృష్టించారు. సోషల్ జస్టిస్ అనే ఒక కొత్త కార్పోరేషన్ ను సృష్టించారు. అలానే స్మార్ట్ సిటీ కాని రాజమండ్రిని, రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ అని పదవి సృష్టించారు. ఏలేశ్వరం అనే నగర పంచాయతీకి డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే స్మార్ట్ సిటీ చైర్మెన్లుగా అధికార యంత్రాంగం ఉంటుందని కేంద్రం చట్టంలో చెప్పింది, దాన్ని కూడా తుంగలోకి తొక్కారు. ఈ విధంగా అసలు ఎందుకు ఇవి ప్రకటించారో, దేని కోసం ప్రకటించారో, వీరికి ఆఫీస్ లు, నిధులు అయినా ఇస్తారో లేదో అనే చర్చ జరుగుతుంది. మొత్తానికి, ఇది కూడా వైసీపీ చేస్తున్నట్టే, హడావిడి తప్ప విషయం లేదు.

కేంద్ర జలశక్తి విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ (గెజిట్) పరిశీలిస్తే, 05-12-2015వ తేదీన ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఉమ్మడి ఒప్పందం, 27-05-2016న జరిగిన డ్రాఫ్ట్ నోటి ఫికేషన్ ఏదైతే ఉందో, వాటిని అతిక్రమించేలా సదరు నోటిఫికే షన్ ఉందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. శనివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం...! "గతంలో నీటి వాటాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఉమ్మడి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి, తాజాగా నీటి కేటాయింపులు జరపాలని కేసీఆర్ 2016లో కేంద్రాన్ని కోరారు. ఆనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్న ఉమాభారతిగారు విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రైన చంద్రబాబునాయుడి గారి దృష్టికి తీసు కొచ్చారు. ఆనాడే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లేఖను తీవ్రంగా తప్పు పట్టారు. ఆనాటి నుంచీ పెద్దగా వివాదాలు లేకుండానే కేసీఆర్, చంద్రబాబులు వ్యవహరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, తనకు నచ్చినట్లుగా నీటిని వాడుకోవడం మొదలెట్టాడు. ఇరురాష్ట్రాల నీటి కేటాయింపులు, వాడకం వివరాలు, ఇతరత్రా అంశాలు, నదీ బోర్డుల పరిధిలోనూ, కేంద్రం పరిధిలోనూ ఉంటాయి. ఆ ప్రకారంగా నడుచుకోకుండా గోదావరి జిల్లాల రైతాంగం ప్రయోజనాలను, రాయలసీమ రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కేలా పొరుగు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. సాగునీటి రంగ నిపుణులు కూడా కేసీఆర్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రెచ్చిపోవడానికి ఏపీ ముఖ్యమంత్రి అసమర్థతే కారణం. ఈ ముఖ్యమంత్రికి ఉన్న అవగాహన లోపమే ఏపీ రైతాంగానికి శాపంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్మో హన్ రెడ్డి తన స్వార్థంకోసం, తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఏపీ నీటి కేటాయింపులను కూడా కేసీఆర్ పరం చేయడానికి సిద్ధమయ్యాడు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టుపెట్టేలా ఈముఖ్యమంత్రి ప్రవర్తించడం నిజంగా చాలా బాధాకరం. నిన్నకేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏపీకి సంబంధించిన ఎలాంటి వివాదాలు లేని ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు.

ఏవైనా వివాదాలున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తే, వాటిపై మాట్లాడొచ్చు. కానీ ఎలాంటి వివాదాలులేని, పొరుగు రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలిగించన ప్రాజెక్టులను కేంద్ర జలశక్తి విభాగం నోటిఫికేషన్లో ఎందుకు ప్రస్తావించిందో తెలియడం లేదు. సదరు నోటిఫికేషన్ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఎలా ఆమోదనీయమో వారే సమాధానం చెప్పాలి. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా కూడా కేంద్ర జలశక్తి విభాగం వారు నోటిఫికేషన్లో పొందు పరిచారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండప్రాజెక్ట్ లకు అనుమతులున్నా, వాటి ప్రస్తావన నోటిఫికేషన్లో ఎందుకుచేయలేదు? ఆ విధంగా చేయకపోవడం ముఖ్యమంత్రికి, వైసీపీ నేతలకు ఎలా సమ్మ తమైందో వారే చెప్పాలి. సదరు నోటిఫకేషన్ ను ముఖ్యమంత్రి, సజ్జల ఎలా స్వాగతిస్తున్నారో వారే చెప్పాలి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏపీలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను కూడా పొందుపరిచారు. వాటన్నింటినీ విభజన చట్టంలోని 11వషెడ్యూల్లో పొందుపరిచారు. ఆ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం నిర్మించుకోవచ్చని కూడా విభజన చట్టంలో చెప్పారు. అలాంటి ప్రాజెక్టులకు అనుమతులు లేవని చెప్పిన కేంద్ర నోటిఫికేషన్ ముఖ్యమంత్రికి ఎలా సమ్మతమైంది? సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేకపోయినా కూడా, ఆ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేక పోయినా దాన్ని గోదావరి బోర్డు పరిధిలోకి ఎలా చేర్చారో కూడా కేంద్ర జలశక్తి విభాగం వారు సమాధానం చెప్పాలి. తుంగభద్ర బోర్డు పరిధిలోని హెచ్ ఎల్సీ, ఎల్ ఎల్సీ కాలువలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొస్తే, వాటికెలా విలువ ఉంటుందో ప్రభుత్వపెద్దలే సమాధానం చెప్పాలి.

కృష్ణానదికి చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ, గోదావరి నదికి చివరన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలను కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడాన్ని ఈ ప్రభుత్వం ఎలా స్వాగతిస్తుందో తెలియడం లేదు. గోదావరి, కృష్ణా నదులకు చిట్టచివరన ఉన్న ఏపీ, రెండు నదుల ద్వారా వచ్చే వరద నీటిని కూడా వాడుకోవడానికి వీల్లేకుండా కేంద్ర ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్ ఈ ముఖ్యమంత్రికి ఎలా ఆమోదయోగ్యమైందో ఆయనే చెప్పాలి. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులై న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను వివాదాల జాబితాలో చేరిస్తే, ఒక అర్థం పర్థం ఉంటుందిగానీ, ఎలాంటి వివాదాలు లేని, వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చడం చాలా విచిత్రంగా ఉంది. ఈ విధంగా కేంద్రం తీసుకున్ననిర్ణయాలన్నీ ఏపీ జుట్టుని తన అధీనంలో కి తీసుకున్నట్లుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ, పాలకుల అసమర్థత, అనుభవరాహిత్యమే, రాష్ట్ర రైతాంగానికి ముప్పుగా పరిణమించింది. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన గడ్డకే తీవ్ర అన్యాయం చేస్తూ, రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నాడు. కేంద్ర గెజిట్ ను ఆమోదిస్తున్నామ ని, స్వాగతిస్తున్నామని, సమ్మతిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడమే .

Advertisements

Latest Articles

Most Read