రాష్ట్రం దివాళా తీస్తుంటే, జగన్ ఆయన అనుచరుల కంపెనీల మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయని టిడిపి నేత పట్టాభి అన్నారు. ఈ రోజు విలేఖరులతో మాట్లాడిన ఆయన, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే, "జగన్మోహన్ రెడ్డి కంపెనీలు, ఆయన అనుచరుల కంపెనీలే ఎందుకు కళకళలాడుతున్నాయోకూడా ఆలోచించాలి. వాటిలో ముందుగా రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని తీసుకుంటే, వైసీపీఎంపీ అయోధ్యరామిరెడ్డిది. రెండేళ్లలోనే ఆ కంపెనీ ఆస్తులు, రామిరెడ్డి ఆదాయం అమాంతం పెరగడంతో, ఐటీ వారి కన్ను కూడా పడింది. దాంతో ఐటీవారు సదరు కంపెనీపై దాడులు కూడా చేశారు. రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ షేర్ వ్యాల్యూ గత సంవత్సర కాలంలో ఎన్నడూలేని విథంగా కళ్లు తిరిగేరీతిలో 442 శాతం పెరిగింది. ఎన్ ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) డేటాలో ఈ సమాచారం ఉంది. అంత తక్కువ సమయంలో షేర్ వ్యాల్యూ అంతలా పెరగడం చాలా అరుదు. రెండు సంవత్సరాల కాలంలో రాంకీ ఆస్తులు అమాంతం పెరగడం వల్లే, షేర్ వ్యాల్యూ కూడా 442శాతం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయిన భారతి సిమెంట్స్ సంగతి కూడా చూద్దాం. భారతి సిమెంట్స్ లో ప్రధాన వాటా దారు వైక్యాట్ అనే ఫ్రెంచ్ కంపెనీ. వైక్యాట్ వారు మే6-2021న 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, తొలి త్రైమాసికం (మొదటిమూడునెలలు) కంపెనీ ఆదాయవి వరాలని వేదికను వారి కంపెనీ వెబ్ సైట్లో ఉంచారు. దానిలో ఏమని రాశారంటే, భారతదేశానికి సంబంధించి, తమకున్న ఏకైక కంపెనీ భారతి సిమెంట్స్ అని, కడప, కాల్ బుర్గికు చెందిన రెండు ప్లాంట్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికంలోని టర్నోవర్లో అనూహ్యంగా 42శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. భారతి సిమెంట్స్ కంపెనీ 42శాతం వృద్ధి నమోదు చేయడానికి కారణాన్ని కూడా చెప్పారు. ఇంప్రూవ్ మెంట్ ఇన్ సెల్లింగ్ ప్రైసెస్ (సిమెంట్ ధరలపెరుగుదల) అని చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసి, భారీగా ధరలు పెంచేలా చేశాడుకదా? దానికికారణమే భారతి సిమెంట్స్ టర్నోవర్ తొలిత్రైమాసికంలోనే 42శాతం పెరగడం. ఆ మొత్తం విలువ భారత కరెన్సీలో రూ.800కోట్లు. అదీ లాభమంటే. ఇలా ఉంటే రాష్ట్ర ఖజానా వెలవెలబోకుండాఎలా ఉంటుంది? ఏ1 ఆదాయం, ఆయన కంపెనీల ఆదాయం అలా పెరుగుతుంటే, ఇక ఏ2 విజయసాయి కంపెనీల సంగతేంటో చూద్దాం."

"విజయసాయి అల్లుడి కంపెనీ అయిన అరబిందోకు రాష్ట్రంలో ని పోర్టులన్నింటినీ, ఈ ముఖ్యమంత్రి ఒకదాని తర్వాత ఒకటి ధారాదత్తం చేస్తున్నాడు. కాకినాడ ప్రాంతంలోని రెండు కీలకమైన పోర్టులతోపాటు, రామాయపట్నం పోర్టుని కూడా అరబిందో పరం చేశారు. 75కిలోమీటర్ల పరిధిలో రెండు పోర్టులు ఒకే కంపెనీ అధీనంలో ఉండకూడదనే నిబంధనను కూడా అరబిందోకోసం తుంగలోతొక్కి, కాకినాడ వద్ద ఉన్న రెండుపోర్టులను అరబిందోకు అప్పగించారు. రాష్ట్రంలోని ప్రధానమైన పోర్టులను, విజయసాయి రెడ్డి తన అల్లుడికి కట్న కానుకల కింద సమర్పించాడు. రాంకీ, భారతి సిమెంట్స్, అరబిందోల పరిస్థితి అలా ఉంటే, ఇక హెటిరో డ్రగ్స్ విషయానికి వద్దాం. సీబీఐ, ఈడీ ఈ ముఖ్యమంత్రిపై గతంలో ఫైల్ చేసిన అనేక చార్జ్ షీట్లలో సహముద్దాయిగా ఉన్న పార్థసారథి రెడ్డిదే ఈహెటిరోసంస్థ. విశాఖపట్నం వద్ద ఉన్న రూ.225 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం పార్మా కంపెనీకి ధారాదత్తం చేసిందని పత్రికల్లో వార్తలుకూడా వచ్చాయి. విశాఖపట్నంలోని బేపార్క్ లోని వాటాలతో పాటు, అదే నగరంలోని కీలకమైన ఆస్తులను కూడా హెటిరో పరంచేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కానీ, ఆయన అనుచరుల కంపెనీలు కానీ ఈ రెండేళ్లలో ఎంతలా లాభాలార్జించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సాక్షి పత్రిక, ఛానెల్ లాభాలకు హద్దేలేదు. నిత్యం ప్రకటనల రూపంలో తన మీడియా సంస్థకు వందలకోట్లు దోచిపెడుతున్నాడు. అందుకే అన్నది జగన్ హావాలా దెబ్బకు రాష్ట్రం దివాలా అని. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్లకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, తనసొంతకంపెనీలను మాత్రం జాగ్రత్తగా లాభాల్లో ముంచితేలుస్తున్నాడు. "

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోందని, రాష్ట్ర ప్రభుత్వం సమీకరిస్తున్న రుణాలకు సంబంధించి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలియచేస్తూ, నేడు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఈశాన్య రాష్ట్రాలకంటే ఎక్కువగా వడ్డీలు చెల్లిస్తూ, దేశంలో మరే రాష్ట్రం లేని విధంగా అప్పులు తెస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "7.15శాతం వడ్డీతో రూ.1000 కోట్లు, 7.19 శాతంతో మరో రూ. 1000కోట్లు, వెరసి రూ.2వేలకోట్లు, దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు చెల్లించి మన రాష్ట్రం అప్పు తెచ్చింది. ఈ వడ్డీ శాతం ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ కంటే చాలా ఎక్కువ. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి మన రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం, రికవరీపై అప్పులిచ్చేవారికి నమ్మకం సన్నగిల్లడమే. సాధారణంగా ఏవిధంగా, ఎవరు అప్పుతీసుకున్నా, ఇచ్చేవారు అప్పుతీసుకున్నవాడు తిరిగి నమ్మకంగా ఇస్తాడా లేదా అని ఆలోచిస్తాడు. కచ్చితంగా సకాలంలో ఇచ్చేవారికి ఎంతో కొంత వడ్డీ కూడా తగ్గుతుంది. తిరిగి చెల్లించని వారికే షరతులు, వడ్డీలు ఎక్కువుంటాయి. బ్యాంకులిచ్చే రుణాల్లో కూడా క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండేవారికి వడ్డీఎక్కువ వేస్తారు. మ నరాష్ట్రం యొక్క క్రెడిట్ రేటింగ్ పడిపోబట్టే, రోజువారీ అవసరాలకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకుంది. వీటన్నింటికీ మూలమైన ప్రధానకారణాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చు. జగన్ హవాలా – రాష్ట్రం దివాలా అంటే సరిపోతుంది. తీసుకొస్తున్న అప్పులన్నీ కూడా తన అవినీతి కార్యకలాపాల ద్వారా దిగమింగి, వాటిని హావాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ముఖ్యమంత్రి, ఇక్కడ ఏమాత్రం సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. అప్పులుతెచ్చిన సొమ్ములో పైసా కూడా ఆదాయ మొచ్చే మార్గాలకు వినియోగించడం లేదు. అందువల్లే రాష్ట్రం దివాలా తీస్తోంది. రాష్ట్రం దివాలాతీసినా, అంతిమంగా ప్రజలంతా చంకనాకిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీలు, ఆయన అనుచరుల కంపెనీలు, వారి ఖజానాలు మాత్రం నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎటొచ్చీ ఏపీ ఖజానానే కొడిగట్టిన దీపంలా వెలవెలబోతోంది. ఇదీ నేడు ఆంధ్రరాష్ట్రం యొక్కదుస్థితి...పరిస్థితి."

"ఇది వరకు ప్రభుత్వాలు అడిగిన వెంటనే బ్యాంకులు రుణాలి చ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ గ్యారంటీతో సరిపెట్టుకోకుండా, ఆస్తులు తనఖా పెడితే తప్ప, రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. విశాఖపట్నంలోని కలెక్టర్ బిల్డింగ్ సహా, ఇతర ఆస్తులను తనఖా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైన సంగతిని అందరూ గమనించాలి. ఏ ప్రభుత్వమున్నాకూడా గతంలో బ్యాంకులు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు విధించలేదు. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల పేరుతో కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వం అప్పుల సాధనకు సిద్ధమైంది. 2014లో రూ.16వేలకోట్ల ఆర్థిక లోటు ఉన్నాకూడా రాష్ట్రం ఆర్థికంగా ఇంతలా దిగజారలేదు. రాష్ట్రానికి సంపద సృష్టించకపోగా, జగన్ రెడ్డి తన సొంత ఖజానా పెంచుకుంటున్నాడు. తన కంపెనీలకు, తన అనుచరుల కంపెనీలకు ఎన్నిఆస్తులు, ఎన్ని వందల ఎకరాలు దోచిపెడుతున్నాడో కూడా ప్రజలంతా గమనించాలి. కేంద్రం షరతులతో 2021-22 సంవత్సరానికి కేవలం రూ.27,668 కోట్లు మాత్రమే అప్పు తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెస్తున్న అప్పులు, వడ్డీరేట్ల పెరుగుదల, తిరిగి చెల్లింపులు చూశాక రాష్ట్రానికి ఎవరూ రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రాని దుస్థితి. ఆవిధంగా ఈ ముఖ్యమంత్రి హోల్ సేల్ గా రాష్ట్రాన్ని దివాలా తీయించాడని, తన కంపెనీలు, తన అనుచరుల కంపెనీల ఖజానాలను కళకళలాడిస్తూ, రాష్ట్ర ఖజానా మాత్రం వెలవెలబోయేలా చేశాడనే పచ్చినిజాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం."

డీజీపీ సవాంగ్ గారికి, ఇతర పోలీస్ అధికారులకు పోలీస్ శాఖలోని ఖాళీల భర్తీకి సంబంధించి, కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానని, తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉందని, తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిగానే తాను తన సందేహాలను పోలీస్ శాఖ ముందుంచుతున్నాను తప్ప, పోలీస్ శాఖనుంచి రిటైరైన ఉద్యోగిగా కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా కంటే, ఒక రాజకీయ నాయకుడిగా,మంత్రిగా, లేక ప్రభుత్వ సలహాదారు మాట్లాడినట్టుగా సవాంగ్ నిన్న మాట్లాడారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం బ్రహ్మండంగా పనిచేసిందని, సీఎంకు కీర్తి కిరీటం డీజీపీగా ఉన్న వ్యక్తి ఇవ్వవచ్చా? పోలీస్ మాన్యువల్ ప్రకారం, నిష్పాక్షికంగా పనిచేయాల్సిన వ్యక్తి, డీజీ స్థానంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ తప్పటడుగులు వేస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం, ఈ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఉత్తమ పని తీరు కనబరిచిందని డీజీపీగా ఉన్న వ్యక్తి చెప్పడమేంటి? లక్షా84వేల264 రెగ్యులర్ ఉద్యోగాలు, 19,701 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ద్వారా 3లక్షల99వేల791ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యో గాలు కలిపి, మొత్తం 6లక్షల05వేల949 ఉద్యోగాలు ఇచ్చారని సవాంగ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. అదలా ఉంటే రికార్డులను పరిశీలిస్తే, గతప్రభుత్వం 5సంవత్సరాల్లో కేవలం 34,563 ఖాళీలను మాత్రమే భర్తీచేసిందని చెప్పడానికి డీజీపీ ఎవరు? ఆయన పెత్తనం ఇదేనా? అదేనా ఆయన విధినిర్వహణ? సవాంగ్ డీజీపీనా...లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డా...లేక అజయ్ కల్లం రెడ్డా...? లేక అంబటి రాంబాబా? అసలు ఈ మాటలన్నీ డీజీపీ కెందుకు? భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచీ, ఏ డీజీపీ కూడా, ఇలా గత ప్రభుత్వాన్ని తప్పు పడుతూ మాట్లాడిన దాఖాలాలు లేవు. సంబంధం లేకుండా మాట్లాడి, సీనియర్ పోలీస్ అధికారి, డీజీపీగా ఉన్న వ్యక్తి తన హోదాను తానే కించపరుచుకున్నాడు. ప్రభుత్వాన్ని అభినందించే పని డీజీపీకి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా? రేపు ప్రభుత్వం తప్పుచేస్తే, ఈ డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోరుగా? ఎందు కంటే ఆయన ఈప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మారిపోయారు.

డీజీపీ తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. గతప్రభుత్వంలో ఎన్ని రిక్రూట్ మెంట్స్ జరిగాయో.. ఈప్రభుత్వం వచ్చాక ఎన్ని రిక్రూట్ మెంట్స్ జరిగాయో బహిరంగంగా చర్చించడానికి డీజీపీ వస్తారా. ఆయనతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. 15వేలమంది మహిళా పోలీసులు కొత్తగా పోలీస్ శాఖలో చేరారని, ఈ విషయం అందరూ గుర్తించాలని కూడా డీజీపీ చెప్పారు. 15 వేల మంది మహిళలను ఏ ప్రాతిపదిక ప్రకారం పోలీస్ శాఖలోకి చేర్చుకున్నారో డీజీపీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అనేది ఉంది...దానికొక అడిషనల్ డైరెక్టర్ జనరల్ అధికారి బాధ్యులుగా ఉన్నారు. ఆ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మహిళా పోలీసులను నియమించిందా? కొత్తగా పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లను నియమించాలన్న బోర్డు నిబంధనల ప్రకారమే జరగాలి. 15వేలమంది మహిళా పోలీసులు పోలీస్ శాఖలో చేరారని డీజీపీచెప్పారు. వారిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమించిందా...లేక వైఎస్సార్ పార్టీ నియమించిందా? ఏ అర్హతలప్రకారం వారిని నియమించారు? డీజీపీ సవాంగ్ తనవ్యాఖ్యలువెనక్కు తీసుకోకుంటే, చట్టప్రకారం కోర్టులను ఆశ్రయించే ఆయనపై చర్యలకు ఉపక్రమిస్తాం. అక్కడే తేల్చుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నాం. డీజీపీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తప్పయిందని చెబితే ఓకే, లేకపోతే, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు, న్యాయ స్థానాలను ఆశ్రయించడం తథ్యం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు, అధికారులు రూల్ అఫ్ లా పాటించకుండా చేస్తున్న పనులకు, న్యాయస్థానాల్లో శిక్షలు పడుతున్నాయి. అయినా కొంత మంది మారటం లేదు. ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక అయుదు ఆరు సార్లు అయినా హైకోర్టు ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా అనేక సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా తీవ్ర పదజాలంతో, ఆధికారులు చేస్తున్న తప్పులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా మార్పు మాత్రం రావటం లేదు. ఈ నేపధ్యంలోనే మళ్ళీ హైకోర్టులో , ఏపి అధికారులకు షాక్ తగిలింది. ఈ సారి ఏకంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు హైకోర్టు శిక్ష వేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం అనే చెప్పాలి. వారం క్రితం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు తొమ్మిది రోజులు శిక్షతో పాటుగా, వెయ్యి రూపాయాల జరిమానా విధించింది. అయితే తమ పై మానవత్వం చూపాలని, ఇన్నాళ్ళు తాము చేసిన సర్వీస్ ను పరిగణలోకి తీసుకోవాలని వీరు కోరటంతో, హైకోర్టు స్పందిస్తూ, జైలు శిక్షను తీసి వేసి, కోర్టు పనిగంటలు ముగిసే వరకు కూడా కోర్టులోనే ఉండాలని, అదే విధంగా వెయ్యి రూపాయల జరిమానా కట్టాలని శిక్ష విధించింది. జరిమానా కట్టకపోతే మాత్రం, మూడు రోజులు జైలు శిక్ష వేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది.

hc 07072021 2

ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తో పాటుగా, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి ఈ శిక్ష విధించింది హైకోర్టు. విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి జనవరి 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రక్రియ మొత్తం మధ్యలో ఉండగా, నిబంధనలు మార్చేసారు. ఇలా ఎందుకు మార్చారో తెలియరు. అయితే దీని వల్ల ఇబ్బందులు పడ్డ 36 మంది హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణ చేసి, నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు సస్పెండ్ చేసి, ఈ 36 మందిని కూడా ఆ పోస్టుల్లో భర్తీ చేసే అవకాసం కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు అమలు కాకపోవటంతో, అభ్యర్ధులు మళ్ళీ కోర్టుకు వచ్చి కోర్టు దిక్కరణ పిటీషన్ వేసారు. దీంతో ఇది విచారణ జరిపిన కోర్టు, తాము ఆదేశాలు ఇచ్చినా, కావాలనే ఉత్తర్వులు అమలు చేయనట్టు అర్ధం అవుతుందని, అందుకే కోర్టు దిక్కరణ నేరంక్ కింద ఇద్దరు అధికారులకు శిక్ష విధించారు.

Advertisements

Latest Articles

Most Read