ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్విడ్ ప్రోకో అనే పదం చాలా సుపరిచితం. సహజంగా ఇలాంటి పదాలు, న్యాయ వృత్తిలో ఉన్న వారికి, అలాగే రాజకీయాల్లో ఉన్న వారికి బాగా తెలుస్తాయి. అయితే ఇలనాటి క్లిష్టమైన పదం, దాని అర్ధం, అది ఎందుకు వాడతారు అనేది, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. దీనికి ప్రధాన కారణం, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు, బెయిల్, జైలు, కోర్టు వాయిదాలు, ఇలా అనేకం చూసిన ప్రజలకు, ఆ పదం ఏమిటో అర్ధమై పోయింది. క్విడ్ ప్రోకో అంటే, నీకు ఇది నాకు అది. అది కూడా ప్రభుత్వ సొమ్ముతో లబ్ది పొందటం. ఉదాహరణకు జగన్ మోహన్ రెడ్డి పై మోపిన ఆరోపణల్లో ఒకటి ఏమిటి అంటే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి ఆ పదవిని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వం నుంచి కొంత మంది పారిశ్రామిక వేత్తలకు మేలు చేసారని, భూములు ఇచ్చారని, దానికి ప్రతి ఫలంగా, జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో ఆ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని. పది రూపయల షేర్ లు, మూడు నాలుగు వందలకి కొనటం, ఇలా జరిగాయి. క్విడ్ ప్రోకో అంటే ఇదే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తరువాత, ఇలాంటి వాటి పై, ఇప్పటి వరకు పెద్దగా ఆధారాలు బయట పడలేదు. అయితే ఇప్పుడు మూడు రోజులు క్రిందట జరిగిన వ్యవహారంతో, మళ్ళీ క్విడ్ ప్రోకో బయటకు వచ్చింది.

jagan 280520021 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వాదించినందుకు, ఇద్దరు న్యాయవాదులుకు, రూ.1.34 కోట్లు చెల్లించారు. ఒక లాయర్ కోసం, అంత డబ్బు చెల్లించటంతో, అందరూ అవాక్కయ్యారు. అసలు ఈ విషయం ఏమిటో తేల్చే పని చేసింది సోషల్ మీడియాతో పాటుగా తెలుగుదేశం పార్టీ. అమరావతికి సంబందించిన కేసులో సుప్రీం కోర్ట్ లో వాదనలు వినిపించినమ్డుకు, నిరంజన్ రెడ్డి అనే న్యాయవాదికి 96 లక్షలు, అలాగే మోహన్ రెడ్డి అనే న్యాయవాదికి 38.50 లక్షలు చెల్లించారు. ఇంత పెద్ద మొత్తం చెల్లించటంతో, అసలు ఈ న్యాయవాదులు ఎవరు అని ఆరా తీయగా, వీళ్ళు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ తరుపున వాదిస్తున్న న్యాయవాదులుగా తేలింది. ఇప్పుడు ఈ అంశాన్ని క్విడ్ ప్రోకో అని టిడిపి ఆరోపిస్తుంది. తన వ్యక్తిగత కేసులు వాదించే లాయర్లకి, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఇస్తున్నారని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ లో, ఈ అంశం కూడా ఉపయోగ పడుతుంది అంటూ, టిడిపి ఆరోపిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు ప్రభుత్వం, ఎలాంటి సమాధానం చెప్పలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాక, పక్క రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు నెల్లూరు కృష్ణపట్నం ఆ-నం-ద-య్య మం-దు పై ఆలోచనలో పడ్డారు. ఒక పక్క క-రో-నా తో ప్రజలు అల్లాడి పోతూ ఉన్న సమయంలో, ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, ఇలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో, ఆనందయ్య మందు పై ప్రచారం మొదలు అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ మందు ఇస్తున్నా, నెల్లూరులో తప్ప, చుట్టు పక్కల గ్రామాలకు ఇది విస్తరించలేదు. అయితే గత 20 రోజుల క్రితం, ఈ మం-దు పై విపరీతమైన ప్రచారం జరిగింది. ఫలితాలు కూడా వస్తూ ఉండటం, ఎలాంటి హాని లేకుండా ఉండటంతో, ప్రజలు కూడా దీని పై ఆసక్తి చూపించారు. తరువాత ప్రభుత్వం ఎంటర్ అవ్వటం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం, మం-దు పంపిణీ ఆగిపోవటం, హైకోర్టుకు ఈ విషయ చేరటం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని పై పరిశోధనలు జరపటం, ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఆయన మం-దు కు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, దీని పై ఎప్పుడు నివేదికలు వస్తాయి, ఎప్పుడు దీనికి అనుమతులు వస్తాయి, ఇలా ప్రజలు దీని కోసం ఎదురు చూస్తూ ఉండటంతో, ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ లోనే కాక, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది.

trs 28052021 2

ఈ నేపధ్యంలోనే ఆ-నం-ద-య్య మం-దు పై, పక్క రాష్ట్రం తెలంగాణాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా, ఈ విషయం పై స్పందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆ-నం-ద-య్య మం-దు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ-నం-ద-య్య మం-దు కళ్ళల్లో వేస్తున్నారని, కళ్ళల్లో వేస్తె ఆ మందుతో కళ్ళకు ప్రమాదం అని అన్నారు. ఆ మందు వేసుకుంటే, కళ్ళ మంట తప్ప, క-రో-నా పోదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వేళ అలా కాకుండా, ఆ మందు నిజం అని, దాని వల్ల క-రో-నా పోతుంది అంటే, పాదాభివందనం చేస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు మూఢనమ్మకాలకు పోకుండా, జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆ మం-దు పై వ్యాఖ్యానించారు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయం పై, ఎక్కడో తెలంగాణాలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు ఇలా నెగటివ్ గా స్పందించారు అనేది తెలియాల్సి ఉంది. ప్రజలు నమ్ముతున్నప్పుడు, దాని వాళ్ళ ఎలాంటి హా-ని లేనప్పుడు, ఎందుకు ఇలా స్పందించారో.

ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ తీరు పైన, ఆ తరువాత ఆయన పై కస్టడీలో చి-త్ర-హిం-స-లు పెట్టటం పైన, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయ్యింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ హౌస్ దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హోం సెక్రటరీకి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీలకు ఈ నోటీసులు జారీ చేసింది. దీని పై నాలుగు వారాల్లోగా తమకు నివేదికను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా, తమ సొంతగా కూడా అంతర్గత విచారణ జరపటానికి సిద్ధం అయ్యింది. జూన్ 7లోగా ఈ నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించింది. రఘురామకృష్ణం రాజుకి చెందిన మొత్తం ఎపిసోడ్ పై, ఆయన కుమారుడు భరత్ తో పాటుగా, పలువురు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. వాటిని పరిగణలోకి తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వాటిని సీరియస్ గా తీసుకుంది. ఎన్‌హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో, ఫిర్యాదు దారులు అనేక అంశాలు పేర్కొన్నారు. ఆయన పుట్టిన రోజున అరెస్ట్ చేసి, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసారని, రాజ్యాంగ ఉల్లంఘనకు కూడా పాల్పడ్డారని, తాము ఇచ్చిన పిటీషన్ లో, ఎన్‌హెచ్ఆర్సీ కి తెలిపారు.

nhrc 28052021 2

ఆయన సిట్టింగ్ ఎంపీ అని, అయినా పార్లమెంట్ స్పీకర్ అనుమతి కూడా లేకుండా, ఆయన్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకుని వెళ్ళారని, అలాగే కస్టడీకి తీసుకుని, ఆయన కా-ళ్ళ పై కొ-ట్ట-టం, మందులు సరిగ్గా ఇవ్వక పోవటం, రాత్రంతా కూడా ఆయన నిద్ర పోకుండా చేసి, మానసిక హిం-స-కు పాల్పడ్డారని, బౌతికంగా ఇబ్బంది పెట్టారని, ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసినా, కావాలని ఇబ్బంది పెట్టారని, ఆ పిటీషన్ లో అన్ని అంశాలు పేర్కొన్నారు. మజిస్త్రేట్ కోర్ట్ కూడా, ఆయన కాళ్ళకు ఉన్న గా-యా-ల పై రికార్డు చేసారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ జరిపించాలని, ఏపిలో మానవ హ-క్కు-ల ఉల్లంఘన జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఈ విషయం పై తమకు న్యాయం చేయాలి అంటూ, పిటీషనర్ లు, ఎన్‌హెచ్ఆర్సీ కి ఫిర్యాదు చేసారు. ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్ఆర్సీ, మొత్తం అంశం పై తమకు నివేదిక ఇవ్వాలి అంటూ, ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చింది.

తెలుగుదేశం పార్టీ సంస్థగాత నిర్మాణంపై మహానాడులో చర్చ సందర్భంగా.. జిల్లా స్థాయి కమిటీలు. శాఖలు, అనుబంధ సంఘాలకు బదులుగా.. పార్లమెంటు స్థాయి కమిటీలు, శాఖలు, అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా స్థాయి కమిటీల వలన ప్రజా క్షేత్రంలోకి వెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలోనే పార్లమెంటు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ "సమాజానికి మేలు చేయాలన్న పార్టీ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే పార్టీని అధికారంలో నిలబెట్టాలి. అందుకోసం ముందు పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలి. కార్యకర్తల నుండి నాయకుల వరకు అందరూ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అలుపెరుగక శ్రమించాలి. నాడు ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో గానీ.. ఇంతటి పటిష్టమైన కార్యకర్తల బలం గల పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎంతో మంది నాయకులు వ్యక్తిగత స్వార్ధంతో పార్టీని వీడినా.. పటిష్టమైన కార్యకర్తల కారణంగానే మన పార్టీ ధృఢంగా నిలబడుతోంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం.. కానీ ప్రజాసేవను వీడలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో కార్యకర్తలు స్థిరంగా ఉన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి దారి చూపించాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం కంటే మనం ముందుండేవాళ్లం. కానీ.. గత రెండేళ్లలో దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రానికి వచ్చిన మంచి పేరుతో నాశనం చేశారు. ఎన్నడూ లేనంతటి చెత్త పేరు తీసుకొచ్చారు. కార్యకర్తలు సహా రాష్ట్ర స్థాయి ప్రతి నాయకుడు పోరాడాలి. అలా చేసినపుడే పార్టీకి మనుగడ ఉంటుంది. గత మహానాడులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించాం.

achem 28052021 2

గతంలో జిల్లా కమిటీలతో ప్రజలకు చేరువవ్వడం కష్టమవుతోందని భావించి.. పార్లమెంటు కమిటీలు ఏర్పాటు చేయాలని భావించాం. అధ్యక్షులను కూడా నియమించుకున్నాం. క-రో-నా, వరుసగా జరిగిన ఎన్నికల కారణంగా పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసుకోలేకపోయాం. మహానాడు అయిన 10 రోజుల్లోనే పార్లమెంటు కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించాం. పార్టీ పటిష్టత కోసం పోరాటం చేసిన వారిని, కార్యకర్తలకు అండగా నిలిచిన వారికి ప్రాధాన్యమిస్తాం. అన్ని వర్గాల వారికీ అవకాశాలు కల్పిస్తాం. క-రో-నా కారణంగా సభ్యత్వ నమోదును కూడా క్షేత్రస్థాయిలో చేసుకోలేకపోతున్నాం. బూత్ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వంటి పటిష్టమైన వ్యవస్థ ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుందాం. మరో వైపు అనుబంధ సంఘాలను కూడా పూర్తి స్థాయిలో నియమిద్దాం. జగన్ రెడ్డి దుర్మార్గ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసు పెడుతున్నారు. రోడ్డెక్కి మాట్లాడితే ఆస్తులు ధ్వం-సం చేస్తున్నారు. అవి చూసి ప్రశ్నించేందుకు టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కేసులు పెట్టనివ్వండి, అరెస్టులు చేయనివ్వండి. పోరాటం చేసినపుడే మనకు గుర్తింపు వస్తుందని గుర్తుంచుకోండి. కార్యకర్త సహా.. రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నిలదీయండి. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలి. వచ్చే మూడేళ్లు చావో రేవో అన్నట్లు కార్యకర్తలు పోరాడాలి. కేసు పెడతారని బెదిరిస్తే.. భయపడేది లేదు. వారికి పార్టీ అండగా ఉంటుంది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని త్వరలో మరోసారి అరెస్టు చేస్తారని మెసేజ్ పెడుతున్నారు. నాకేం భయం లేదు. పంచె, టీ షర్ట్ తో ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను.

Advertisements

Latest Articles

Most Read