ఓటుకు నోటు, ఓటుకు నోటు అంటూ చంద్రబాబు పై గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఒక పక్క లక్ష కోట్ల దొంగలు దర్జాగా తిరుగుతుంటే, 50 లక్షల ఆరోపణల పై చంద్రబాబు ఓటు కోసం నోటు ఇచ్చారు అంటూ ఆరోపణలు చేసారు. అసలు మనాకు ఓటుకు నోటు అంటే ఏంటో తెలియనట్టు, అసలు అవి ఎప్పుడూ చేయనట్టు, కొంత మంది బిల్డ్ అప్ ఇస్తూ వచ్చారు. అయినా అక్కడ చంద్రబాబు వాయిస్ నిజమో కాదో ఇప్పటికీ తెలియదు. ఒక వేళ నిజం అయినా, అక్కడ చంద్రబాబు డబ్బు ప్రస్తావన ఏమి చేయలేదు. అదీ కాక అక్కడ వేరే పార్టీ ఎమ్మెల్సీతో కాదు మాట్లాడింది. అక్కడ ఉన్నది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ. ఎవరైనా వారితో మాట్లాడవచ్చు. మాకు ఓటు వేయమని అడగవచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు అసలు ఆ మాటలు అన్నారో లేదో పక్కద పెడితే, ఇదేదో పెద్ద నేరం అయినట్టు, ఇన్నాళ్ళు వైసీపీ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తున్న బ్లూ బ్యాచ్ కి షాక్ ఇచ్చింది ఈడీ, ఏసిబి. అసలు ఈ కేసులో చంద్రబాబు పాత్ర పై ఎక్కడా ఒక్క ముక్క కూడా రాయలేదు ఏసిబి. ఏసిబి చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ఎక్కడ లేదు. ఈడీ కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ వేసింది. అందులో కూడా ఎక్కడా చంద్రబాబు పేరు లేదు.

cbn 27052021 2

అయితే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు తమ చార్జ్ షీట్ లో ఈడీ పెట్టింది. అయితే మనీ లాండరింగ్ విషయంలో, రేవంత్ రెడ్డికి ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అనే దాని పై, ఈడీ రేవంత్ రెడ్డిని చేర్చింది. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అనే విషయంలో రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసారు. అయితే ఇక్కడ ఏసిబి, ఈడీ చార్జ్ షీట్ లు , రెండిటిలో ఎక్కడా చంద్రబాబు పేరు అయితే లేదు. ఆయన పై ఆధారాలు కోసం ఎంతగా ప్రయత్నం చేసినా, చంద్రబాబు పై ఎలాంటి ఆధారాలు దొరక్క పోవటంతో, చంద్రబాబు పై ఇన్నాళ్ళు విషం చిమ్మిన బ్లూ బ్యాచ్ కు నిరాస అనే చెప్పాలి. గత 40 ఏళ్ళుగా చంద్రబాబు పై దాదాపుగా 40 కేసులు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి వరకు, అనేక మంది అయన పై ఎన్నో ఆరోపణలు, కేసులు పెట్టి ఇరికిద్దాం అని చూసినా, ప్రతి కేసులో కూడా ఆయన పై ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా ఎవరూ చూపించలేక పోయారు. దీంతో, అన్ని ఆరోపణలు లాగే ఇది కూడా కేవలం రాజకీయ ఆరోపణలు లాగే అయిపోయాయి.

ఈ రోజు కరోనా నివారణ కోసం, నెల్లూరు జిల్లా కృ-ష్ణ-ప-ట్నం-లో, ఆ-నం-ద-య్య ఇస్తున్న మం-దు పై, హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు మం-దు కావాలని కోరుకుంటున్నారని, అటువంటి అప్పుడు మందు వీలైనంత త్వరగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటుగా, వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్ లు కూడా తెప్పించాలని హైకోర్టు ఆదేశించింది. టెక్నికాలిటీస్ చెప్పొద్దని, టెక్నికాలిటీస్ చెప్తే మాత్రం ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా లేట్ అవుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడకు వెళ్తే వ్యాధి తగ్గుతుందని, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడినప్పుడు, ఆ నమ్మకాన్ని సడలించకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పటంతో పాటు, ఈ మం-దు వేసుకోవటం వలన ఏమైనా హాని జరుగుతుందా లేదా అనేది మాత్రమే గుర్తించండి, దానికి సంబంధించి మాత్రమే మీ రిపోర్ట్స్ ని పరిశీలించండని హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటుగా, ఆ-నం-ద-య్య, ఆ-యు-ర్వే-ద కౌన్సిల్‍లో, ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ మందు పై రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, తిరుపతిలో ఆ-యు-ర్వే-ది-క్ మెడికల్ కళాశాల వైద్యుల నుంచి, పరీక్షలు జరుపుతున్నాం అని చెప్పి ప్రభుత్వం పేర్కొంది.

anandayya 27052021 1 2

ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి, ఈ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుని ప్రశ్నించింది. ఈ రిపోర్ట్స్ 29న వస్తాయని ప్రభుత్వం చెప్పింది. అయితే మం-దు పంపిణీ చేయవద్దు అని చెప్పి లోకాయుక్తా ఎలా ఆదేశాలు ఇస్తుందని చెప్పి, పిటీషనర్ తరుపు న్యాయవాది క్రిష్నయ్య ప్రశ్నించారు. దీంతో పాటుగా అనంతపురం జిల్లాకు చెందిన మరో పిటీషనర్ తరుపు న్యాయావది యలమంచలి బాలాజీ మాట్లాడుతూ, చేప మం-దు కోసం, దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు అనేక మంది వస్తున్నారని, అదే కోవలో ఈ మం-దు-ను పరిగణించాలని, ఎందుకు దీనికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఆపివేసిందని నిలదీశారు. ప్రజల్లో విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసానికి అనుగుణంగా, ప్రభుత్వాలు పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ-నం-ద-య్య తరుపున అశ్వినీ కుమార్ వాదనలు వనిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది. ఈ లోపు అన్ని రిపోర్ట్ లు తెప్పించుకుని, దీని పై ఒక నిర్ణయం తీసుకోవోలని హైకోర్టు ఆదేశించింది.

బిసి జనార్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు పై ఈ రోజు టిడిపి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, కొంత మంది పోలీసులు తీరు పై నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లోనే "ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్నోళ్ళు అందరూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, జైలుకు పోయి వచ్చారు, మళ్ళీ పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా దానికి సిద్ధంగా ఉంటే మీరు చేయండి. తమాషా ఆటలు ఆడొద్దు అండి రాజకీయాల్లో. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మీరు చేసే పనులు శాశ్వతం. రికార్డులో ఉంటాయి. మీరు తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చేసినటువంటి దౌ-ర్జ-న్యా-ల-కు వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు వస్తుంది. గుర్తు పెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థను కూడా హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దు అండి మీరు. రెండేళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంకో మూడేళ్ళు అవుతుంది. ఆ రోజు మీకు ఎవరు వస్తారో చూస్తాను. ఏదో తెలుగు దేశం పార్టీ పైన దా-డు-లు చేస్తే, హిం-స చేస్తే, కార్యకర్తలు చల్లా చెదురు అయిపోతారు అనుకుంటున్నారు కాని, మీ వల్ల కాదు ఇది. తమాషా అనుకోవద్దు అండి. ప్రతి ఒక్క దానికి రెట్టింపు కసితో పని చేస్తాం. ఈ రాష్ట్రం కోసం పని చేస్తాం. ఈ ఉ-న్మా-దు-ల నుంచి కాపాడటానికి పని చేస్తాం. అంతే కాని, మీ ఇష్ట ప్రకారం మీరు చేయాలి అనుకుంటే మాత్రం, మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను స్ట్రెయిట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఎప్పుడు వీరిని అరెస్ట్ చేసారు ?ఎక్కడ ఉన్నారు వీళ్ళు ? పోలీసులు అరెస్టు చేసిన వారిని 24 గంటల లోపు ఎందుకు జుడీషియల్ ముందు ప్రవేశ పెట్టలేదు ? అడిగే వారు లేరనా ? "

cb n26205 2021 2

"ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అనేక టెక్నాలజీ మార్పులు తీసుకుని వచ్చి, బాడీకి వొర్న్ కెమెరాలు పెట్టాం. పోలీసులు ఎవరైనా మాట్లాడినా, పక్కన వాళ్ళు ఏమైనా మాట్లాడినా అన్నీ రికార్డు చేసి పారదర్శకత తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఎవరినీ లోనికి రానీకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అంటే, నేను ఒకటే చెప్తున్నా. మనం కూడా ధైర్యంగా ఉండాలి. మన ప్రాణం ఎంత ముఖ్యమో, వాళ్ళ ప్రాణం కూడా వారికి అంతే ముఖ్యం. 24 గంటలు పోలీసులని పెట్టుకుని తిరగలేరు. లేకపోతే ఇదే మాదిరిగా రెచ్చిపోతే, మనకు కూడా రోషం ఉంటుంది. పౌరుషం ఉంటుంది. రెండు పక్షాలను సమానంగా చూసినప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటుంది. ఏకపక్షంగా మీరు చేస్తే, ఎవరైతే దె-బ్బ తిన్నారో, వాళ్ళలో ఆ బాధ, తపన, ప్ర-తీ-కా-రం శాశ్వతంగా ఉంటుంది. జనార్ధన్ రెడ్డి అంశంలోను పార్టీ ప్రైవేటు కేసు వేస్తుంది. మొత్తం రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తాం. పోలీసులు చట్ట ప్రకారం పని చేయకపొతే మాత్రం, వారిని చట్ట ప్రకారం శిక్షించే వరకు వదిలి పెట్టం అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక, దేశం మొత్తం, ఇప్పుడు కృ-ష్ణ-ప-ట్నం వైపు చూస్తుంది. ఆ-నం-ద-య్య తయారు చేసిన మందు, క-రో-నా వైద్యానికి ఉపయోగపడుతుందనే వార్తలు రావటంతో, ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకోవటంతో, పరిశోధనలు చేయాలని చెప్పటంతో, మం-దు పంపిణీ ఆగిపోయింది. మే 20న సామాన్య ప్రజలకు ఆగిపోయిన ఆ-నం-ద-య్య మం-దు, ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మం-దు పంపిణీ ప్రక్రియతో పాటుగా, మం-దు తయారీ కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు వచ్చి, మం-దు తయారీ కూడా ఆపేసారని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై పరిశోధనలు చేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా, ఈ మం-దు పంపిణీ చేయకూడదు అంటూ ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కృ-ష్ణ-ప-ట్నం వస్తున్న అనేక మందిని కూడా పోలీసులు ఆపేస్తున్నారు. అయితే మరో పక్క ఆ-నం-ద-య్య కూడా ఇంటికి రావటంలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదనే ప్రచారం నేపధ్యంలో, తను బాగానే ఉన్నాని హోం క్వా-రం-టై-న్ లో ఉన్నాను అంటూ, ఆయన ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో పైన కూడా సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంచితే, ఆ-నం-ద-య్య ఏమి చేస్తున్నారు అనే వారికి, నిన్న మీడియాలో ఒక వీడియో బయటకు వచ్చింది.

anandayya 27052021 2

ఆ-నం-ద-య్య చేత కొంత మంది ప్రముఖులు, తమ అధికారాన్ని ఉపయోగించి, ఆయన చేత ఒక రహస్య ప్రాంతంలో, బలవంతంగా ఈ మం-దు-ని తయారు చేపిస్తున్నట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక్కడ రహస్యంగా తయారు చేస్తున్న మం-దు-ని, రాష్ట్రంలో కొంత మంది ప్రముఖలతో పాటుగా, పక్క రాష్ట్రాలకు కూడా దీన్ని తరలిస్తున్నారు అంటూ ఆ వార్త సారంశం. ఆ వీడియోలో ఆ-నం-ద-య్య మం-దు తయారిని పర్యవేక్షిస్తున్నట్టు కనిపించింది. అయితే సామాన్య ప్రజలకు మాత్రం, అనుమతి కావాలి అంటూ చెప్పి, ఇప్పుడు ఇలా రహస్యంగా ప్రముఖులకు మం-దు తయారీ చేపించటం పై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. దీని పై అనేక ప్రచారాలు జరుగుతున్నా, అవి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడుకోలేం. అయతే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు, అసలు ఎందుకు ఇలా ఆపేశారు అనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే, దీని పై ఒక నిర్ణయం తీసుకుని, సామాన్య ప్రజలకు కూడా ఈ మందు అందుబాటులోకి వచ్చేలా చేయాలని కోరుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read