ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత, అక్కడ డాక్టర్ల అనుమతి తీసుకుని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసారు. ఆయన డిశ్చార్జ్ చేసిన తరువాత అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ చేరుకున్నారు. త్వరలోనే పలువురు కేంద్ర పెద్దలను కలిసి తనపై జరుగిన మొత్తం కుట్ర గురించి వివారించే అవకాసం ఉంది. అయితే రఘురామరాజు హైదరాబాద్ లో కాకుండా, ఢిల్లీ వెళ్ళటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. గత పది రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాలు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆయన పై కక్ష సాధింపు ధోరణితో కేసులు మోపటం దగ్గర నుంచి, కస్టడీలో కొ-ట్ట-టం వరకు జరిగిన నేపధ్యంలో, సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడటం, అలాగే కేంద్ర పెద్దలకు కూడా ఈ విషయం చెప్పటం, ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర పెద్దలను కలవటం, ఇవ్వన్నీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే, ఒక ఎంపీగా తనకు ఇక్కడ జరిగిన అవమానం, అన్యాయం పై, నేరుగా ఢిల్లీ పెద్దలతోనే చెప్పి, వారి దృష్టికి ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ వివరించాలని, రఘురామరాజు నిర్ణయం తీసుకున్నారు.

rrr 26052021 1

ఇక రెండో అంశం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పుడు కేసులు పెట్టి , తనను ఇబ్బంది పెట్టే అవకాసం ఉందనే సమాచారంతో కూడా, ఢిల్లీలో అయితే సేఫ్ గా ఉండవచ్చని, ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేయటం లాంటివి కుదరదు కాబట్టి, మొత్తం రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి కాబట్టి, ఆయన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలు అన్నీ కూడా, సైలెంట్ గా జరిగిపోయాయి. ఇక మరో పక్క ఢిల్లీలో ఉంటే, తన తదుపరి అడుగులు పసిగట్టటం జగన్ ప్రభుత్వానికి వీలు పడదు కాబట్టి, వ్యూహాత్మికంగా ఢిల్లీ వెళ్ళారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ ఉంటే మళ్ళీ నిఘా ఎక్కువగా ఉండటం, రఘురామరాజు కదలికలు అన్నిటి పై నిఘా ఉండే అవకాసం ఉంది కాబట్టి, ఆయన ఇలా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఏది ఏమైనా తనకు జరిగిన అన్యాయం పై, ఇప్పుడు రఘురామరాజు తదుపరి అడుగులు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. తన పై పడిన లాఠీ దె-బ్బ-కు ఆయన ఎలాంటి బదులు తీర్చుకుంటారు అనేది చూడాల్సి ఉంది.

ఈ రోజు హైదరాబాద్ సిబిఐ ప్రత్యెక కోర్టులో, రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు సిబిఐతో పాటుగా, జగన్ మోహన్ రెడ్డి, ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ రోజు కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదు. గత మూడు విచారణల్లో కూడా, సిబిఐ కానీ, జగన్ మోహన్ రెడ్డి కానీ, కౌంటర్ దాఖలు చేయకుండా, సమయం అడిగారు. అయితే ఈ రోజు కూడా సమయం కావాలి అంటూ, అదే సమాధానం కోర్టుకి చెప్పారు. అయితే కౌంటర్ దాఖలకు మరింత సమయం కావాలని కోర్టుని కోరటంతో, కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. గతంలోనే మీకు మూడు సార్లు సమయం ఇచ్చామని, అయినా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయలేదని, ఇలా కౌంటర్ దాఖలకు సమయం తీసుకున్నట్టు అయితే, ఈ సారి కూడా మీరు కౌంటర్ దాఖలు చేయకపోతే, మీ కౌంటర్ లేకుండా, ఈ కేసులో విచారణ చేపడతాం అంటూ, కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే తాము కౌంటర్ దాఖలు చేయకపోవటానికి గల కారణాలను, సిబిఐ కోర్టుకు తెలియచేసారు, జగన్ తరుపు న్యాయవాది. ముఖ్యంగా తాము కౌంటర్ దాఖలు చేయలేక పోవటానికి కారణం, లాక్ డౌన్ అని చెప్పారు.

cbi 26052021 2

జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది, లాక్ డౌన్ కారణంగా, పలు కారణాల కారణంగా, కౌంటర్ దాఖలు చేయలేక పోయాం అని, తమకు మరి కొంత సమయం ఇస్తే, కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అయితే సిబిఐ తరుపు మాత్రం, కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అని కోరగా, సిబిఐ అధికారుల నుంచి తమకు మరింత సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారం వచ్చిన వెంటనే కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని సిబిఐ తరుపు న్యాయవాది కూడా కోర్ట్ ని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్ట్, చిట్టచివరి అవకాశంగా మీకు చెప్తున్నాం అని, జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే, తాము ఇక విచారణ మొదలు పెడతామని చెప్పారు. అయితే జగన్ తరుపు న్యాయవాదులు సంగతి పక్కన పెడితే, అసలు సిబిఐ ఎందుకు లేట్ చేస్తుందో అని విషయం పై, రఘురామరాజు తరుపు వ్యక్తులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు అవకాసం ఇచ్చారని, సిబిఐ కూడా ఎందుకు ఇలా తాత్సారం చేస్తుందో అర్ధం కావటం లేదని అంటున్నారు. మరి జూన్ 1కి అయినా కౌంటర్ దాఖలు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

తన తండ్రి అక్రమ అరెస్ట్, అదే విధంగా సిఐడి కస్టడీలో తన తండ్రి పై సిఐడి పోలీసులు కొ-ట్ట-టం, ఈ మొత్తం వ్యవహారం పై, ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలి అంటూ, ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటీషన్ పై , ఈ రోజు కొద్ది సేపటి క్రితం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి వినీతి శరన్ బెంచ్ ముందుకు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. అయితే విచారణ అంత తొందరగా ఇప్పటికిప్పుడు జరపవలసిన అవసరం లేదని, ముందుగా ఈ పిటీషన్ లో ని ప్రతివాదుల వివరణ కూడా తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఇది వెకేషన్ బెంచ్ కాబట్టి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి, రెగ్యులర్ బెంచ్ వచ్చినప్పుడు దీని పై విచారణ జరుపుతామని, న్యాయమూర్తి వినీత్ శరన్ స్పష్టం చేసారు. అయితే సరిగ్గా ఇక్కడే రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది వేసిన పాచిక అద్భుతంగా పని చేసింది. రఘురామకృష్ణం రాజు తనయుడు భరత్ తరుపున హాజరు అయిన న్యాయవాది ముకుల్ జోక్యం చేసుకుని, మీరు ఎప్పుడు విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే తొందరగా వింటే బాగుటుందని అభ్యర్ధిస్తూ, మరో విజ్ఞప్తి కూడా చేసారు. ప్రస్తుతం ఉన్న ప్రతివాదుల నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఏపి ప్రభుత్వం, సిఐడి అధికారులను తొలగించాలని కోరారు.

sc 25052021 2

కేవలం యూనియన్ అఫ్ ఇండియా, సిబిఐ ని మాత్రమే పార్టీ చేయాలని అభ్యర్ధించారు. దానికి, సుప్రీం కోర్టు అంగీకరించింది. కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐకి మాత్రమే నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఈ పిటీషన్ పై తమ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆరు వారాల తరువాత దీని పై విచారణ జరుపుతాం అంటూ, ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరు అయిన, న్యాయవాది దవే, తమ ప్రభుత్వ వాదనలు వినకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐ వాదనలు విని, చివరకు సిబిఐకి అప్పచేప్పితే, తమ వాదన వినే వారు ఎవరు, ఎందుకు తమ వాదన వినరు అని అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే కోర్టు స్పందిస్తూ, మీరు ఇంప్లీడ్ అవ్వండి, దాన్ని పరిశీలిస్తాం కానీ, మిమ్మల్ని ప్రతి వాదులుగా చేర్చం అంటూ, తేల్చి చెప్పారు. అయితే రఘురామ రాజు న్యాయవాదులు చేసిన పనితో, ఇప్పుడు కేవలం కేంద్రం, సిబిఐ మాత్రమే జరిగిన దాన్ని కోర్టుకు చెప్పి, తమ అభిప్రాయం చెప్తాయని, సిబిఐ విచారణకు కేంద్రం కూడా అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

సిబిఐ చీఫ్ ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తిన పాయింట్ తో, కేంద్రం వెనకడుగు వేయాల్సి వచ్చింది. మొత్తంగా, ఈ పరిణామంతో సీబీఐ చీఫ్‍గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఢిల్లీలో టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు కానీ, రేపు కానీ వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మహరాష్ట్ర మాజీ డీజీపీగా పని చేసిన సుబోధ్ కుమార్ జైస్వాల్ , తదుపరి సిబిఐ చీఫ్ గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో, హైపవర్ సెలక్షన్ ప్యానెల్ సమావేశం జరిగింది. సుమారుగా 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని మోడీ, అలాగే ప్రతిపక్ష నేత ఈ సమావేశంలో పాల్గున్నారు. ఈ ముగ్గురూ పాల్గున్న ఈ సమావేశంలో దాదాపుగా మూడు పేర్లు ఈ సమావేశంలో ఖరారు చేసారు. అందులో నుంచి ఒక్కరికి అవకాసం లభించనుంది. మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్, రెండో పేరుగా డైరెక్టర్ జనరల్ సీమా బల్ కేఆర్ చంద్ర, అలాగే మూడు పేరుగా కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ వీఎస్కే కౌముదిని ప్రతిపాదించారు.

ramana 25052021 2

అయితే మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్ వైపే ప్రధాని మోడీ మొగ్గు చూపే అవకాసం కనిపిస్తుంది. మొత్తంగా తదుపరి సిబిఐచీఫ్ కోసం,109 మంది అధికారుల పేర్లు పరిశీలించారు. వీరిని వడపోయిగా, మొత్తం 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ తరువాత నిన్న సమావేశం మొదలు అయ్యే సమయానికి, ఆరుగురుకి కుదించారు. అయితే ఈ ఆరుగురిలో, బీఎస్ఎప్ చీఫ్ రాకేశ్ ఆస్థానా, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ చీఫ్ గా ఉన్న వైసీ మోదీ పేర్లు కూడా పరిశీలినలో ఉన్నాయి. వీరిలో రాకేశ్ అస్తానా వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపుతారని అందరూ అనుకున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముందు పెట్టారు. ఆరు నెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని, సిఐడి చీఫ్ గా నియమించవద్దు అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుని ఆ సమావేశం ముందు పెట్టారు. దీంతో, రాకేశ్ ఆస్థానా, వైసీ మోదీ పేర్లను, కేంద్రం పక్కన పెట్టాల్సి వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read