వైసీపీ శ్రేణులకు రఘురామకృష్ణం రాజు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులకు కంటిలో నలుసులా మారిన రఘురామరామ రాజు, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలి అంటూ, కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్రమఆస్తుల కేసులో 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న జగన్, 16 నెలలు జైల్లో ఉండి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ ని అడ్డు పెట్టుకుని, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, ఇప్పటికే అనకే మందికి పదవులు కూడా ఇచ్చారని, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి, విచారణ వేగవంతం చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు సిబిఐ కోర్టులో, పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటీషన్ ఫైల్ అవ్వకుండా, కొన్ని కుట్రలు జరిగాయి అంటూ రఘురామరాజు ఆరోపించారు కూడా. అయినా ఆయన పట్టు వీడకుండా, పిటీషన్ ఫైల్ చేసారు. అయితే ఈ పిటీషన్ అసలు విచారణకు కూడా రాదని, ఇది విచారణ అర్హత కూడా కాదు అంటూ, వైసీపీ శ్రేణులు వాదించాయి. అయితే రఘురామ రాజు మాత్రం, అనుకున్నది సాధించారు. కోర్టు ఈ పిటీషన్ విచారణకు తీసుకునేలా, కోర్టుని ఒప్పించగలిగారు. అంతా పక్కాగా, పిటీషన్ ఉండటంతో, సిబిఐ కోర్టు రఘురామరాజు వేసిన పిటీషన్ ని విచారణకు స్వీకరించింది.

rrr 27042021 2

దీని పై రఘురామ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ " మీ అందరికీ ఒక శుభవార్త. ఇప్పుడే సిబిఐ కోర్టు, జడ్జి గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఏదైతే మొన్న జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటీషన్ నేను వేయటం జరిగిందో, ఆ పిటీషన్ విచారణ అర్హత ఉందా లేదా అన్న దాని మీద, ఈ రోజు తీర్పు ఇస్తారాని మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆశించినట్టుగానే, నేను వేసిన పిటీషన్ కు విచారణ అర్హత ఉందని చెప్పి, ఈ రోజు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు. సిబిఐకి కూడా ఇస్తారు. వారిని కౌంటర్ ఫైల్ చేయమని అడుగుతారు. చూద్దాం. ముందు టెక్నికల్ గా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగితే, మడిచి పెట్టుకోమన్నారు. ఇప్పుడు తీరాందా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాస్కల్స్. మాట జారే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోటికి వచ్చినట్టు వాగకండి. ఏమైంది ఇప్పుడు ? ముందు ఉంది ముసళ్ళ పండుగ. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, మా పార్టీ కోసం, నేను ఈ పోరాటం చేపట్టాను." అని రఘురామరాజు అన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో, దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తమకు నచ్చని వారిని టార్గెట్ చేయటం కోసం, ఒక ఫేక్ బ్యాచ్ పని చేస్తూ ఉంటుంది. ఫేక్ చేయటం, బురద చల్లటం, ప్రత్యర్ధులను అల్లరి చేయటం, ఈ ఫేక్ బ్యాచ్ పని. అయితే ఈ ఫేక్ బ్యాచ్, తమకు నచ్చని రాజకీయ నాయకులనే కాదు, తమకు ఇష్టం లేని వ్యక్తుల ని కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టు లో ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ కూడా చేరారు. జస్టిస్ ఎన్వీ రమణకు ఎలాంటి ట్విట్టర్ ఎకౌంటు లేదు. అయితే ఆయన చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఆయన పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయ్యింది. చాలా మంది అది నిజమే అనుకుని ఫాలో అయ్యారు. అయితే తాజాగా అజిత్ దోవల్ ని పొగుడుతూ, ఆ ఖాతా నుంచి ఒక ట్వీట్ రావటం, అది వైరల్ అవ్వటంతో, విషయం జస్టిస్ ఎన్వీ రమణ ఆఫీస్ వరకు వెళ్ళింది. వెంటనే వారు ఈ ఫేక్ ఖాతా పై ఫిర్యాదు చేసారు. ముందుగా ట్విట్టర్ ఆ ఖాతాను తొలగించింది. అయితే ఈ ఫేక్ ఖాతా క్రియేట్ చేసింది ఎవరు అనే విషయం పై, ఎంక్వయిరీ కొనసాగుతుంది. మొత్తానికి, ఈ ఫేక్ బ్యాచ్, ఏకంగా ఈ దేశ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాని కూడా టార్గెట్ చేసారు అంటూ, ఎంత బరి తెగించారో అర్ధం చేసుకోవచ్చు.

క-రో-న సెకండ్ వేవ్ మన దేశంలో రోజు రోజుకీ ఉదృతం అవుతుంది. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. దగ్గర వారు కూడా క-రో-నా బారిన పడటం, ఇప్పుడు వింటున్నాం. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క, మందులు దొరక్క, ఇలా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు స్మశానాల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారటంతో, కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఇంట్లో ఉన్న వారు కూడా మాస్కు పెట్టుకోవాలని, ఇలా పెట్టుకోవటం ఉత్తమం అని కేంద్రం సూచించింది. వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో, ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని సూచనలు ఇచ్చింది. మాస్కులు ధరిస్తే కో-వి-డ్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని తెలిపింది. అలాగే ఇంటికి ఎవరినీ రానీయవద్దని, ఎంత తెలిసిన వారు అయినా దూరం పెట్టాలని సూచించింది. అనవసరంగా బయట తిరగటం కూడా మంచిది కాదని సూచించింది. ఇంట్లో ఎవరికైనా పోజిటివ్ వస్తే, మిగిలిన వారు కూడా మాస్కు ధరించాలని కేంద్రం ప్రకటన చేసింది.

తన పార్టీ సహచరుడి కోసం చంద్రబాబు ప్రత్యెక శ్రద్ద తీసుకున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి, క-రో-నా బారిన పడి హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి రెండు రోజుల నుంచి క్షీణించింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన, విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు తెలుసుకుని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రంగంలోకి దిగారు. సహచరుడి క్షేమ సమాచారం, వారి కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. పరిస్థితి విషమించిందని గమించిన చంద్రబాబు, అమెరికాలోని ప్రముఖ వైద్య బృందంతో, ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడించారు. విశాఖకు కంటే, హైదరాబాద్ నయం అని తలిచి, ఆయన కోసం ఒక ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అది అందుబాటులోకి వచ్చిన వెంటనే, సబ్బం హరిని హైదరాబాద్ తీసుకు రానున్నారు. మరో పక్క సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి పై ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా ఆరా తీసారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Advertisements

Latest Articles

Most Read