వివేక కేసు గత రెండేళ్ళుగా తేలటం లేదు. సొంత కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ కుటుంబానికి న్యాయం జరగటం లేదు. ఆడ కూతురు ఢిల్లీ వీధుల్లో నాకు న్యాయం చేయండి అని, అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసు విషయంలో, గత వారం కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు , సిబిఐకి రాసిన లేఖ కలకం రేపింది. ఆయన తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సిబిఐకి లేఖ రాసారు. ఎన్ని సార్లు అడిగినా సిబిఐ స్పందించటం లేదని అన్నారు. అయితే ఏబి వ్యాఖ్యల పై ఏపి పోలీసులు ఫైర్ అయ్యారు. డీఐజి పాలరాజు మాట్లాడుతూ, ఏబి పై ఫైర్ అయ్యారు. ఆధారాలు ఉంటే తమకు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. అలాగే అనేక విమర్శలు చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఆయన మాట్లాడుతూ, జగన్ కుటుంబ సభ్యులను , ఏబి ఇరికించే ప్రయత్నం చేసారని, వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసారు అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒక పక్క వివేక కుమార్తే, అనేక మంది కుటుంబ సభ్యుల పై కూడా ఆరోపణలు చేస్తుంటే, అంత పెద్ద ఆఫీసర్, దర్యాప్తు పై ప్రభావం చూపేలా, జగన్ కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేసారు అనటం, వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టా ? ఇప్పటికే సిబిఐ విచారణ నత్తనడకన నడుస్తుందని ఆరోపణలు వస్తుంటే, పోలీసులు ఇలా ఎందుకు అంటున్నారో మరి.
news
పెన్షన్ దారులకు, పిడుగులాంటి వార్త వినిపించిన జగన్ సర్కారు...
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ దారులకు షాక్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ లబ్దిదారుల విషయంలో, జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తెసుకుంటూ, ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో లబ్దిదారులు కాని వారు కూడా, పెన్షన్ తీసుకుంటున్నారని, అలాంటి వారిని ఏరి పారేయటానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. బోగస్ పెన్షన్ దారులు ఎక్కువగా ఉన్నారని, తమకు వస్తున్న ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా కుల వృత్తుల పెన్షన్ లు, మెడికల్ కారణాలు చెప్పి పెన్షన్ తీసుకునే వారి విషయంలో, ఒంటరి మహిళల పెన్షన్ లో నిజమైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు ఇస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్ పొందాలి అంటే, కుల వృత్తి వారి జీవనాధారం అయి ఉండాలని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన పత్రాలు అన్నీ, ఎక్సైజ్, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వాలంటీర్ల సహాయంతో, ఈ దరఖాస్తులు పరిశీలించి, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ 21 రోజుల్లో తీసుకోవాలని నిర్ణయం చేసింది. అయితే ఈ నిర్ణయంతో, నిజమైన లబ్దిదారులు కూడా నష్టపోయే అవకాసం ఉందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రూ.2,100 కోట్ల ప్రజాధనం, దోపిడీకి రంగం సిద్ధం.. తీవ్ర ఆరోపణలు చేసిన టిడిపి...
పోలవరంలో జరుగుతున్న తాజా సమస్యల పై, శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "పట్టుదలకు,నిబద్ధతకు,చిత్తశుద్దికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం అద్దం పట్టింది ఆనాడు. కాంట్రాక్టర్లు కమిషనర్లపై శ్రద్ద ఈనాడు. అంచనాలు పెంచుకోవడం తప్ప ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి కాని పనులు చేస్తే రెండేళ్లల్లో కేవలం 0.89 శాతం, వ్యయం అంచనాలు మాత్రం అమాంతంగా రూ.3,222 కోట్లు పెంపు ఇది జాతీయ ప్రాజెక్టు పోలవరానికి పట్టిన గ్రహణం. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని మెఘాకు అప్పగించి మూడు నెలల్లోనే ఇసుక ధరల పేరుతో రూ.500 కోట్లు దోచిపెట్టారు. ఇప్పుడు మరో 1600 కోట్లు దోచిపెట్టేందుకు సిద్దపడ్డారు. మొత్తం మీద రూ.2,100 కోట్లు ప్రజాధనం దోపిడీకి కుట్ర పన్నారు. కాంట్రాక్టర్లు, కమీషన్లపై చూపుతున్న శ్రద్ధ రైతు ప్రయోజనాలపై చూపడం లేదు. జగన్ రెడ్డి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పోలవారన్ని తన ఆదాయానికి కల్పవృక్షంగా మార్చుకున్నారు గాని ప్రాజెక్టు పూర్తి మాత్రం గాలికివదిలేశారు. పోలవరాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలన్న ద్యాసలో కొంతైనా ప్రాజెక్టు పూర్తి మీద పెట్టి ఉంటే బాగుండేది."

"ఇప్పుడు కూడా కేవలం దోచుకునేందుకే అంచనాలు పెంచుకున్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పోలవరం అప్పుడు పూర్తి అవుతుంది, ఇప్పుడు పూర్తి అవుతుందని ఆరంభ సూరత్వం పలికిన జగన్ రెడ్డి 2022 జూన్ నాటికి కూడా కష్టమే అవుతుందని మరో సారి మాట మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఎటూ ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం పూర్తిగా అలవాటై పోయింది. తెలుగుదేశం హయాంలో పోలవరం అంచనాలు దోచుకునేందుకు పెంచుకున్నారని ఊదరగొట్టిన జగన్ అండ్ కో భజన గనం నేడు ఏం చెబుతారు? రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను నీరుగార్చారు. ఒక్క ప్రాజెక్టుకు రెండేళ్లల్లో తట్ట మట్టి ఎత్తలేదు, బొచ్చ కాంక్రీట్ వేయలేదు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిన జగన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. " అని అన్నారు.
గంటా భార్యని టార్గెట్ చేస్తూ, విజయసాయి రెడ్డి ట్వీట్.. ఇతను మారడా ?
ఒక్కొక్కరికీ ఒక్కో గుర్తింపు ఉంటుంది. అలాగే విజయసాయి రెడ్డికి కూడా, ఒక గుర్తింపు ఉంది. తన హోదాని మరిచి, ఆయన పెట్టి వెకిలి ట్వీట్లు చాలా చండాలంగా ఉంటాయి. ఒక్కోసారి, సభ్య సమాజంలో, ఇలాంటి వారు ఎందుకు ఉన్నారా అని అనుకునే వారు కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబు పుట్టిన రోజు నాడు పెట్టిన ట్వీట్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్ ని పావలా అంటూ, చిల్లరగా పెట్టిన ట్వీట్ కానీ, వెగుటు పుట్టిస్తుంది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి, ఆడవారిని కూడా టార్గెట్ చేసారు. టిడిపి ఎమ్మల్యే గంటా శ్రీనివాస్ భార్యని, చౌదరి మేడం అంటూ, జుబుక్సాకరంగా ట్వీట్ చేసారు. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో, గంటా భార్యని, ‘గంటా సతీమణి చౌదరి మేడం' అంటూ హేళనగా ట్వీట్ చేసారు. సింహాచలం దేవస్థానంలో ఉద్యోగులను గంటా భార్య నియమించారు అంటూ, ట్వీట్ చేసారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమెను "చౌదరి మేడం" అంటూ సంబోధించటం ఏమి సంప్రదాయమో మరి. విజయసాయి రెడ్డి, ఇలా రోజు రోజుకీ ఎందుకు దిగజారి ట్వీట్లు పెడుతున్నారో అర్ధం కావటం లేదు. ఆయన ఇంకా మారడా అని సామాన్య ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది.