నిన్న చంద్రబాబు పై రాళ్ల దా-డి , తదనంతర పరిణామాలు, చంద్రబాబు ధర్నా, ఎప్సీ ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్ళటం, ఈ రోజు టిడిపి నేతలు గవర్నర్ ను కలవటం, అలాగే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటం, ఇవన్నీ జరుగుతున్న నేపధ్యంలో, తిరుపతి పోలీసులు పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వారు స్వయంగా రంగంలోకి దిగి, చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు ఈ రోజు ఉదయమే వచ్చారు. నిన్న జరిగిన సంఘటన పై చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, ఆయన వ్యక్తిగత సిబ్బంది నుంచి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు దా-డి ఎలా జరిగింది, ఏమి జరిగింది అనే విషయాల పై ఆరా తీసుకున్నారు. ఇక మరో పక్క, టిడిపి ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యానం తరువాత, కేంద్ర ఎన్నికల కమిషన్ తో భేటీ కానున్నారు. కేంద్ర ఎన్నికల కమీషనర్ గా సుషీల్ చంద్ర, ఈ రోజే బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సునీల్ అరోరా, నిన్నటితో పదవీ విరమణ చేసారు. కొత్త సిఈసిగా సుషీల్ చంద్ర బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ ఉండటంతో, ఇంకా ఆయన అప్పాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదని, టిడిపి వర్గాలు అంటున్నాయి. మధ్యానం రెండు గంటల తరువాత, అప్పాయింట్మెంట్ ఇచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది.

attack 13042021 2

ఇప్పటికే చెన్నై నుంచి బయలేదేరిన ఎంపీలు, మరి కొద్ది సేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల ఢిల్లీ కు వెళ్ళిన వారిలో ఉన్నారు. నిన్న జరిగిన ఘటన పై, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని, వారి పై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. డీజీపీ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మనిషికే రక్షణ లేకపోతే, ఇక ఎన్నికలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే అని టిడిపి నేతలు అంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘటనలు అన్నీ కూడా వీడియోల రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చూపించి, ఈ ఉప ఎన్నికలో కూడా అరాచకం చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే కేంద్ర బలగాలతో, ఇక్కడ ఎన్నిక జరిపించాలని కోరనున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ గమనించి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చూడాలని ఫిర్యాదు చేయబోతున్నారు.

తిరుపతి కృష్ణాపురం సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సభలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దా-డి చేశారు. ఈ దా-డి-లో ఇద్దరు కార్యకర్తలు గాయపడార్డు. ప్రచార రథం, మీడియా వాహనం కొద్ది పాటి దెబ్బతిన్నాయి. దీనిపై తెలుగుదేశం నాయకులు అర్బన్ పోలీస్ జిల్లా అదనపు ఎస్పీ సుప్రజాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇంతటితో ఈ విషయాన్ని ఆపటం లేదు. దీని పై ఉన్నత స్థాయిలో చర్చ చేసేందుకు టిడిపి సిద్ధం అయ్యింది. ముఖ్యంగా జెడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న చంద్రబాబు పై ఇలాంటి ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి, ఇక్కడ పోలీసులు, యంత్రాంగం మొత్తం, కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తూ ఉంటుంది. అయితే స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే, పోలీసులు కూడా ఏమి చేయలేక పోతున్నారని టిడిపి ఆరోపిస్తుంది. అందుకే ఈ విషయం పై టిడిపి కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి తిరుపతిలో ఉన్న టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్ర కుమార్ ని, ఢిల్లీ పంపించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో టిడిపి ఎంపీలు, నిన్న జరిగిన ఘటన పై ఫిర్యాదు చేయనున్నారు.

cbn 13042021 2

ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ విషయం చెప్పి, చంద్రబాబు భద్రతతో పాటుగా, ఎన్నికల్లో ఇలా అయితే స్వేచ్చగా ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉండదు అని, పారా మిలిటరీ బలగాలతో ఉప ఎన్నికలు జరగాలి తిరుపతి ఉప ఎన్నికలు సెంట్రల్ పారా మిలిటరీ బలగాల ఆధ్వర్యంలో జరగాలని చంద్రబాబునాయుడు మాటగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. స్థానిక పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల వైఫల్యం ప్రత్యక్ష్యంగా కనిపించిందన్నారు. నిన్న జరిగిన రాళ్ల దా-డిపై పోలీసుల సమాధానం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ ఫోర్స్ నిఘాలో ఎన్నికలు జరగాలని కోరనున్నారని నిన్న చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ కేంద్ర బలగాలు వస్తే, ఇక్కడ మంది బలంతో, బుల్ డోజ్ చేయాలని చూస్తున్న వైసీపీకి , ఇది అతి పెద్ద దెబ్బగానే చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు పై జరిగిన దా-డి పై కేంద్ర హోం శాఖకు కూడా ఈ విషయం తీసుకుని వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఈ రోజు రాళ్ళ దా-డి జరిగింది. తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచార్మలో ఉన్న చంద్రబాబు పై, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయబోయారు. అయితే అవి పక్కన ఉన్న వారి పై పడ్డాయి. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. దెబ్బతగిలిన యువకున్ని తన వాహనంపై తీసుకొచ్చిన చంద్రబాబు మాట్లాడించారు. దీంతో సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రచార వాహనం దిగి, రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. జడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న నాకు రక్షణ కల్పించకకపోతే సామాన్యులకు ఏమి కల్పిస్తారని ప్రశ్నించారు. కొద్ది సేపు ధర్నా చేసిన తరువాత, ఎస్పీ కార్యాలయం వరకు చంద్రబాబు ర్యాలీగా బయలు దేరారు. కృష్ణాపురం ఠాణా కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే విషయం తెలుకున్న ఎస్పీ, ఆమె స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబు పై, రాళ్ళ దా-డి నేపధ్యంలో, ఒక్కారిగా టిడిపి శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. తిరుపతి ప్రచార సభలో చంద్రబాబు పై రాళ్ల దా-డి, తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలు అవ్వటం, తరువాత చంద్రబాబు నిరసన వ్యక్తం చేయటం, ఈ సంఘటనలు అన్నిటి నేపధ్యంలో, టిడిపి అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నేతృత్వంలో, ఒక ప్రతినిధి బృందం, అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ అడిగింది. గవర్నర్ ను కలిసి, ఈ రోజు జరిగిన ఘటన నేపధ్యంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు, పోలీసులు వైఫల్యం తదితర అంశాల పై ఆయనకు వివరించాలని, టిడిపి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ కార్యాలయం ద్వారా, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు రాత్రికి అపాయింట్మెంట్ ఇస్తారా, లేదా రేపు ఉదయం గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా జెడ్ ప్లస్ లో ఉన్న చంద్రబాబుకే రక్షణ లేకపోతే, ప్రజల పరిస్థితి ఏమిటి అనే విషయం పై ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు ప్రచార సభలకు, ప్రచారానికి, ఇంటి ఇంటి ప్రచారానికి ముందే అనుమతి తీసుకున్నారు.

tirupati 12042021 2

అయినా పోలీసులు నుంచి భద్రత అంతఅంతమాత్రంగానే ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా,జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న చంద్రబాబు పై, ముందుగా పర్మిషన్ తెసుకున్న, పోలీసులు రక్షణ కల్పించకపోవటం కారణంగానే ఈ ఘటన జరిగిందని టిడిపి ఆరోపిస్తుంది. అసలు ఇది ఎవరు చేసారు, చేయించింది ఎవరు అనే అంశం పై కూడా దర్యాప్తు జరపాలని, గవర్నర్ ను కలిసి కోరాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు జరగబోయే ఎన్నికలు కూడా కేంద్ర బలగాల మధ్య జరిపించాలని కూడా గవర్నర్ ను కోరనున్నారు. దీనికి సంబంధించి, అటు కేంద్రానికి, రాష్ట్రానికి కూడా తగు ఆదేశాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని, టిడిపి నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇస్తే, ఈ రోజే ఆయన్ను కలిసి వివరించాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. అపాయింట్మెంట్ విషయం పై, గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు ఇంకా జరుగుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read