తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చంద్రబాబు నాయుడు, ఈ రోజు తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గున్నారు. అయితే చంద్రబాబు ప్రసంగం అడ్డుకోవటానికి అరాచక శక్తులు రెచ్చిపోయాయి. చంద్రబాబు ప్రచారం చేస్తూ ఉండగా, చంద్రబాబు లక్ష్యంగా ఆయన పై రాళ్ళ దా-డి చేసారు. అయితే ఆ రాళ్ళు చంద్రబాబుకి తగలకుండా, కింద ఉన్న ప్రజల పై పడ్డాయి. చంద్రబాబు ప్రసంగం చేస్తున్న పక్క బిల్డింగ్ లో పై నుంచి పెద్ద సైజు గులక రాళ్ళు వచ్చి పడ్డాయి. దీంతో కొంత మందికి గాయాలు అయ్యాయి. ఈ పరిణామంతో చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. మీ రౌడీయిజం చెల్లదు అంటూ చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. నాకే రక్షణ లేకపోతే, ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ, నిలదీశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న తనపైనే ఇలా దాడి చేస్తే ఇంకా ఎవరికీ చెప్పుకోవాలని అన్నారు. తన పై వేసిన రాళ్ళు తీసుకుని, ప్రజలకు చూపించారు. దాడి జరిగిన వారితో మాట్లాడించారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏకంగా రెండు మూడు రాళ్ళు విసరటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

cbn stones 12042021 2

పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేంద్ర పరిధిలో జరిగే ఎన్నికలు ఇవి అని, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే తోక కట్ చేస్తాం అని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు ప్రసంగిస్తూ, రెండేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం, అభివృద్ధి భావితరాలకు అందాలి , టీడీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించాం, తిరుపతిలోనే విద్యనభ్యసించా, తిరుపతి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది, సీఎం పదవి నాకు కొత్తకాదు, ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తిని, , టీడీపీ అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, 2029 నాటికి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలనుకున్నా, తిరుపతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్‍కే దక్కుతుంది, తిరుపతిని విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించా, టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ధి - రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేస్తోంది - ప్రత్యేక హోదాపై జగన్ అబద్ధపు మాటలు చెప్పాడు, ఏపీలో అభివృద్ధి ఆగింది, రౌ-డీ-యి-జం పెరిగింది అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

ఏప్రిల్ 17న యువజన శ్రామిక రైతు పార్టీ భవిష్యత్తు తేలిపోనుంది. అదే రోజు తిరుపతి ఉప ఎన్నిక ఓటింగ్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయేది, ఆ రోజు జరిగే ఎన్నికకు, దీనికి సంబంధం లేని విషయం. తిరుపతి ఉప ఎన్నికల టెన్షన్ లో ఉన్న వైసీపీ, ఏప్రిల్ 17న కోర్టు ఏమి తీర్పు ఇస్తుందా అనే టెన్షన్ కూడా పట్టుకుంది. అయితే ఇదే ఏదో ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, పార్టీకి సంబందించిన విషయమే. కడప జిల్లాకు చెందిన మహబూబ్ భాషా అనే వ్యక్తి, ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తమదని, మా పేరుని జగన్ పార్టీ వాడుకుంటుందని, చివరకు లెటర్ హెడ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాసుకుంటున్నారని, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం అని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు నెలల పాటు ఈ కేసు విచారణ ఢిల్లీ హైకోర్టులో సాగింది. ఇటు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ భాష, అలాగే జగన్ పార్టీ నుంచి కోర్టు ముందు వాదనలు వినిపించారు. రెండు విపుల నుంచి ఢిల్లీ హైకోర్టు వాదనలు వింది. ఇద్దరి వాదనలు విన్న తరువాత, వాదనలు ముగిసినట్టు ప్రకటించింది. దీని పై ఈ నెల 17న తీర్పు ఇస్తామని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.

ysrcp 12042021 2

దీంతో ఇప్పుడు ఏప్రిల్ 17న ఏమి అవుతుందా అనే టెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇప్పటికిప్పుడు ఏమి ఇబ్బందులు లేకపోయినా, ఢిల్లీ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, ఇది కొద్దిగా ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, ఇది కూడా రఘురామరాజు పుణ్యమా అని, బయట పడిన విషయమే. విజయసాయి రెడ్డి, రఘురామరాజు కి నోటీస్ ఇవ్వటం, ఆ నోటీస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, రఘురామరాజు అభ్యంతరం చెప్పారు. తనకు బీఫాం ఇచ్చింది యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి అయితే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటూ ప్రశ్నించటంతో, అసలు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యింది. ముందు మా పార్టీ రిజిస్టర్ అయ్యిందని, ఎన్నికల కమిషన్ కూడా మాకే ఆ పేరు ఇచ్చింది, కానీ యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రం, మా పార్టీ పేరు వాడుకుంటుందని, ఇది అన్యాయం అంటూ, కోర్టులో కేసు వేసారు. మరి దీని పై కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో, చూడాలి.

జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ సంభాషణలకు సంబంధించి, సుప్రీం కోర్టు, ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల్లో ఎక్కడా స్పష్టత లేకపోవటంతో, మళ్ళీ ఇది హైకోర్టుకు చేరింది అనే చెప్పాలి. గతంలో ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగగా, దీని పై విచారణ జరపాలి అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల పై, ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణ జరగగా, ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అటు పూర్తిగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని తప్పుబట్టలేదు, అలాగే తీర్పుని సమర్ధించను లేదు. అసలు ఈ కేసుకి సంబంధించి, హైకోర్టు ఆదేశించకుండా ఉండాల్సింది అంటూ, సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ పిల్ విషయంలోని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుని ఉంటే సరిపోయేదని వ్యాఖ్యానించింది. ఆ పిల్ మైన్టైన్ అవుతుందా లేదా అనే విషయంలో నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. అది చేయకుండా, ఆ పిల్ మైన్టైన్ అవుతుందా లేదా అనేది చూసి, ఆ తరువాత దర్యాప్తుకు ఆదేశించి ఉంటే బాగుండేదని సుప్రీం కోర్టు వ్యఖ్యానిచింది. దానికి ముందుగానే, పిల్ మైంటైన్ అవుతుందో లేదో చూడకుండా, విచారణకు ఆదేశించకుండా ఉండాల్సింది అంటూ, మాత్రమే సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది.

eswaraiah 12042021 2

అయితే పిల్ లో ఉన్న మెరిట్స్ పైన మాత్రం సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ పిల్ మైంటైన్ అవుతుందో లేదో, అలాగే పిల్ లో ఉన్న మెరిట్స్ ఏమిటి అనేది హైకోర్టు తేల్చాలని, మేము దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయ దలుచుకోలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుకు సంబంధించి, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ, జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులోనే జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. జడ్జి రామకృష్ణ ఈ కేసులో కపిల్ సిబాల్ న్యాయవాదిగా తమ వాదనలు వినిపించారు. అదే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య తరుపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు అన్నీ విని, తీర్పు ఇవ్వటానికి సుప్రీం కోర్టు రెడీగా ఉన్న సమయంలో, జడ్జి రామకృష్ణ మరో పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసులో ముఖ్యమైన ఆధారం అయిన తన ఫోన్ ని పోలీసులు సరండర్ చేసుకుని, ఆ తుర్వత సెల్ ఫోన్ పోయింది అంటూ, పోలీసులు చెప్పారని కోర్టుకు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది జరిగినా రచ్చ రచ్చ అవ్వాల్సిందే. అది ప్రభుత్వ నిర్ణయంలో తప్పో, లేక చూసే వాళ్ళది తప్పో కాని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు ఏకంగా అత్యున్నత స్థానంలో ఉన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, బాధితులు. సహజంగా అధికారంలో ఉన్న వారు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పటికే దీని పై, అనేక విమర్శలు వస్తూ ఉన్నా, ఎవరూ పట్టించుకోరు కూడా. అయితే ఇది శ్రుతిమించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించి, రాజకీయ నాయకులకు సేవ చేసే దాకా వెళ్తే, అది సమాజానికి ఇబ్బంది. ఈ ధరోని వల్ల, నిజాయితీగా ఉండే అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ తిన్నారు. ఇక పై వీరు జగన్ మోహన్ రెడ్డి గుప్పెట్లోకి వేల్లిపోయినట్టే. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సంబంధించిన వార్షిక నివేదిక ఆమోదించే అధికారం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దే. దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చాయి. గతంలో కేవలం చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ లాంటి పెద్ద స్థాయి అధికారుల వార్షిక రిపోర్ట్ మాత్రమే సియంలు ఆమోదించే వారు. వీరి సంఖ్య 150 వరకు ఉండేది.

jagan 12042021 2

అయితే ఇప్పుడు తాజాగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో, ఆ సంఖ్య 150 నుంచి 465కు చేరుకుంది. సీనియర్ అధికారుల నుంచి గ్రౌండ్ లో పని చేసే జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల వరకు, ఇలా అందరూ ఈ జాబితాలోకి వస్తారు. అయితే ఈ నిర్ణయం నిజాయతీగా పని చేసే వారికి ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దలు రాజకీయ అవసరాల కోసం, తీసుకునే నిర్ణయాలు, కొంత మంది అధికారులు ధిక్కరిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయంతో, వారు వెనక్కు తగ్గే అవకాసం ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారమే, అధికారులకు పదోన్నతులు, కేంద్ర సర్వీసులకు వెళ్ళే అవకాసం ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిని మంచి చేసుకునే క్రమంలో, వారు తల ఆడించక తప్పదు. ఎన్నో ఆశలతో అఖిల భారత సర్వీసుల్లోకి వచ్చే వారికి, ఇది పెద్ద దెబ్బ అనే చెప్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఒక అధికారి, కావాలని చేసారని, అధికార యంత్రాంగంలో కొంత మంది తన మాట వినని వారిని గుప్పెట్లో పెట్టుకోవటానికి, ఇలా చేసారని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read