పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా 4 మూల స్థంభాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. శాసన మండలి రద్దుకు బిల్లు, నిజాయితీగా పనిచేసే అధికారులకు వేధింపులు, న్యాయవ్యవస్థపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, ఎన్నికల సంఘంపై దాడి, ఈసిని కులం పేరుతో దూషించడం, జీవో 2430ద్వారా మీడియాపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం, కోర్టు తీర్పులను కూడా అమలు చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల విచ్చిన్నమే అజెండాగా పెట్టుకున్నారు. ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం. పంచాయితీ ఎన్నికలపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపి ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి. నిష్పక్షపాతంగా, సజావుగా పంచాయితీ ఎన్నికలు జరపాలి. మార్చిలో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
news
సుప్రీం తీర్పు రాగానే, రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ఎలక్షన్ కమీషనర్...
సుప్రీం కోర్టు ఎన్నికలు జరిపించాలని చెప్పగానే, నిమ్మగడ్డ దూకుడు పెంచారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా, కరోనా వ్యాక్సిన్ వచ్చే దాకా, ఎన్నికాల్ విధుల్లో పాల్గునబోము అని చెప్తున్నాయని, అందుకే ఈ నేపధ్యాలోనే, కేంద్ర ఎన్నికల సిబ్బందిని, ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి కొద్ది సేపటి క్రితం లేఖ రాసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉంది, కరోనా ఉంది, ఈ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అని ప్రకటించటంతో పాటుగా, నేరుగా ప్రకటనలు చేయటంతో పాటుగా లేఖలు రాస్తున్నాయి. అందుకే కేంద్ర సిబ్బందిని ఈ ఎన్నికల నిర్వహాణ కోసం, పంపించాలని చెప్పి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. ఇక ఈ రోజు సుప్రీం కోర్టులో ఉద్యోగులకు కూడా ఘాటుగా వాతలు పడ్డాయి. ఉద్యోగులు సంఘం న్యాయవాదులు, సుప్రీం కోర్టు వాదనల్లో పాల్గునగా, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇందులో మీకేమి సంబంధం ? రాజ్యాంగ సంస్థలు, తమ పని తాను చేసుకుంటున్నప్పుడు, మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, మీరు ప్రభుత్వానికి అనుకూలంగా వాదిస్తున్నారా అని నిలదీసింది. దీంతో పాటుగా, మీరు ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని కూడా వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఉద్యోగులు సంఘం తరుపున న్యాయవాది, మరింత సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి కాకుండా, తమ వాదనలు ఆపేశారు. ఈ నేపధ్యంలోనే ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఉద్యోగ సంఘాలు సహకరించక పొతే మాత్రం, కేంద్రం సిబ్బందిని ఇస్తే, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రానికి లేఖ రాసింది. ఇక మరో పక్క ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు రీషెడ్యుల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా ఎలక్షన్ కమిషన్ మార్చింది. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నిలను ఒకటి, రెండు, మూడు విడతలగా ఎలక్షన్ కమిషన్ మార్చింది. ఇక ఎన్నికల కమిషన్ దూకుడు, సుప్రీం కోర్టు చీవాట్లతో, ఉద్యోగుల సంఘం మాట మార్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని మేం చెప్పలేదని, ఆరోగ్యం బాగాలేనివారు తప్ప మిగతావారితో నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ట్యూన్ మార్చారు.
కోర్టుకు ఎన్నికల విధుల్లో ఉన్నాం అని సమాచారం.. డీజీపీని పై హైకోర్టు ఆగ్రహం, 27న హాజరుకావాలని ఆదేశం
ఈ రోజు మరోసారి డీజీపీ గౌతం సవాంగ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికీ ఆయన నాలుగు అయుదు సార్లు హైకోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించగా, మూడు సార్లు హైకోర్టు ముందుకు వచ్చారు. ఈ రోజు మరోసారి డీజీపీని హైకోర్టు ముందుకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు దిక్కరణ పిటీషన్ పైన విచారణ చేసిన ధర్మాసనం, ఈ నెల 27న డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు, హోం సెక్రటరీ కూడా, తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, రామారావు అనే పోలీసు అధికారి ప్రమోషన్ విషయంలో, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అధికారులు పాటించలేదని, దాని పై కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ పైన గతంలో విచారణ జరిగిన సమయంలో డీజీపీ హాజరు కావాలని, ఈ రోజు హాజారు కావాలని గతంలోనే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు డీజీపీ తరుపున అఫిడవిట్ దాఖలు చేసారు. అందులో, ఎన్నికల విధుల్లో హాజరుకాలేక పోతున్నాం అని, అఫిడవిట్ దాఖలు చేయగా, దాని పై ధర్మాసనం ప్రశ్నించింది. ఒక పక్క ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆదేశాలు వచ్చే వరకు, ఎన్నికలు వద్దు అంటుంటే, మీరు ఇలా అఫిడవిట్ ఎలా దాఖలు చేసారు అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 27న మాత్రం కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చేసాయి. స్థానిక ఎన్నికలు జరపాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పై, హైకోర్టు స్పందిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం వేసిన పిటీషన్ తో పాటుగా, ఉద్యోగులు వేసిన పిటీషన్ ని కూడా సుప్రీం కోర్టు ఈ రోజు విచారణకు తీసుకుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ ను కొట్టేస్తూ, సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమీషనర్ నిర్ణయంలో, తాము జోక్యం చేసుకోమని కోర్టు చెప్పింది. ఈ సందర్భంగా ఉద్యోగులు సంఘం నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీపైన ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్ ను చూస్తుంటే, ఎన్నికల కమిషన్ పై మీ వైఖరి ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు పిటీషన్ పైన కూడా ఆగహ్రం వ్యక్తం చేసింది. మీ ఉద్దేశాలు అర్ధం అవుతున్నాయని, మీకు ఇందులో సంబంధం ఏమిటి, అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక స్థానిక సంస్థల ఎన్నికల పై గత పది రోజులుగా హైడ్రామా నడుస్తుంది. ముందుగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులు, ఎన్నికల కమీషనర్ ని కలవటం, అదే రోజు ఆయన [ప్రొసీడింగ్స్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. అయితే ప్రభుత్వం వెంటనే హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావటంతో, ఈ పిటీషన్ ని సింగల్ బెంచ్ విచారణ చేసి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ముందు ఈ పిటీషన్ ను విచారణ చేసింది. ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ 30 పేజీల తీర్పు ఇచ్చింది. దీని పై ప్రభుత్వం సుప్రీం కోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేయగా, సుప్రీం కోర్టు రెగ్యులర్ పిటీషన్ గానే తీసుకుంది. ఈ మధ్యలోనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం, ఉద్యోగులు, హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని కూడా లెక్క చేయటం లేదు. ఈ రోజు నుంచి నామినేషన్ లు తీసుకోవాల్సి ఉండగా, అది కూడా మొదలు కాలేదు. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పటంతో, ఇప్పటికైనా ప్రభుత్వం, ఉద్యోగులు స్పందిస్తారో లేక రాజ్యాంగ సంక్షోభం వైపు రాష్ట్రం వెళ్తుందో చూడాలి.