ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎన్నికల విషయంలో, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎన్నికలు జరపటానికి వీలు లేదు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కు వెళ్ళింది. వ్యాక్సిన్ వేయాలని, అందుకే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని కోరారు. అయితే దీని పై వెకేషన్ బెంచ్ కు వెళ్ళగా, హైకోర్టు సింగల్ బెంచ్ ముందు ప్రభుత్వం పిటీషన్ వేయగా, సింగల్ బెంచ్, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, ఎన్నికల షెడ్యుల్ నిలిపివేశారు. అయితే దీని పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ లో అపీల్ చేయగా, దీని పై కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ తో పాటు, మరో జస్టిస్ కలిసి ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ పిటీషన్ పై ఇరు వర్గాల వాదన రెండు రోజులు పాటు విన్నారు. తీర్పుని రిజర్వ్ లో పెట్టారు. ఈ రోజు దీని పై తీర్పు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ వేసిన రిట్ అప్పీల్‍ పిటిషన్‍ను అనుమతించిన హైకోర్టు, గతంలో ఇచ్చిన సింగల్ జడ్జి తీర్పుని కొట్టేసినట్టే భావించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించు కోవచ్చని హైకోర్టు తెలిపింది. ఎన్నికలతో పాటు, ప్రజారోగ్యం, రెండు ముఖ్యమే అని హైకోర్టు చెప్పింది. దీంతో ఇక ఎన్నికలకు అడ్డు లేదనే చెప్పాలి.

hc 2101021 2

అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాసం ఉంది. అయితే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో, ఎన్నికలు నిర్వహించాలి అంటూ, సుప్రీం కోర్టు తీర్పులు ఇస్తూ వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, అక్కడ ఉపసమనం లభించే అవకాసం లేదనే చెప్పాలి. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఈ పిటీషన్ లో ఇంప్లీడ్ అయ్యి తమ వాదన కూడా వినాలని, ఎన్నికలు జరపవద్దు అని వేయగా, ఆ పిటీషన్ ని హైకోర్టు మొదటి రోజే కొట్టేసింది. కాబట్టి, ఇక ఉద్యోగులు కూడా కోర్టు, ఎన్నికల కమిషన్ చెప్పినట్టే వినాలి. ప్రభుత్వం మాటలు విని, తమ ఇష్టం అంటే ఇక కుదిరే అవకాశం లేదు. ఇక ఈ పూర్తి తీర్పు, మరి కొద్ది సేపట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు పూర్తి వివరాలు తెలిసే అవకాసం ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు తాము ఎన్నికలు జరపం అనే విధంగా వ్యవహరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏమి చేస్తుందో చూడాలి. ఇప్పటికైనా వివాదాలకు పోకుండా, ఎన్నికలకు వెళ్తారని ఆశిద్దాం.

తెలుగుదేశం పార్టీ నేతల పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావుని, ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో, పోలీసులు అరెస్ట్ చేసారు. కళా వెంకట్రావ్ ని రాజాంలో, పోలీసులు ఆయన ఇంటి ఒకేసారి వచ్చి, అరెస్ట్ చేసారు. ఆయన్ను ఎందుకు తీసుకు వెళ్తున్నారో, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో పోలీసులు చెప్పలేదని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. నెల రోజులు క్రితం, చంద్రబాబు రామతీర్ధం పర్యటన సందర్భంలో, విజయసాయి రెడ్డి పై చెప్పులు విసిరిన ఘటనలో, చంద్రబాబు, కళా వెంకట్రావ్, అచ్చేన్నాయుడు పై కేసులు నమోదు చేసారు. హ-త్యా-య-త్నం కేసు నమోదు చేసారు. దీంతో ఈ కేసు విషయంలోనే కళా వెంకట్రావ్ ని పోలీసులు అరెస్ట్ చేసారని తెలుస్తుంది. అసలు చెప్పులు విసిరిన ఘటనలో, కళా వెంకట్రావ్ లాంటి సీనియర్ నేత, సౌమ్యుడు అయిన నేత, విజయసాయి రెడ్డి పై, రాళ్ళు విసరటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇలాంటి చిన్న కేసులో కూడా, ఇంత పెద్ద వయసు ఉన్న వ్యక్తని, మాజీ మంత్రి, సీనియర్ నేతను, ఇలా రాత్రి పూట వచ్చి, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నాయి.

kala 202012021 2

అయితే కళా వెంకట్రావ్ అరెస్ట్ విషయం, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి సమాచారం వచ్చింది. ఈ విషయం పై తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. అసలు రామతీర్ధం ఘటనలో రాముడు తల ఎవరు పెకలించారో ఇప్పటి వరకు తెలియదు కానీ, ఘటన ఎందుకు జరిగింది అంటూ, అక్కడకు వెళ్లి నిరసన తెలిపిన వారిని, అరెస్ట్ చేయటం దారుణం అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అసలు చంద్రబాబు గారు వస్తాను అని చెప్పిన తరువాత, విజయసాయి రెడ్డిని ఎలా పోలీసులు అనుమతించారని, వాపోతున్నారు. లేని వివాదం సృష్టించింది విజయసాయి రెడ్డి అని, అలాంటిది, తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేయటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని లాంటి వాడు కొడతా, తంతా అంటూ ఇష్టం వచ్చినట్టు ఊరి మీద పడి వాగుతున్న వాడిని ఆర్రేస్ట్ చేయకుండా, కళా వెంకట్రావ్ లాంటి సౌమ్యుడుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో డీజీపీ చెప్పాలని వాపోతున్నారు. ఈ విషయం పై, కళా వెంకట్రావ్ తో పాటు, కేసు పెట్టిన చంద్రబాబు, అచ్చెన్నాయుడుని కూడా అరెస్ట్ చేస్తారా అని తెలుగుదేశం నేతలు వాపోతున్నారు.

నెల్లూరు జిల్లా ఎస్.పి భాస్కర్ భూషణ్ కు జనవరి 18, 2021 న వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన బహిరంగ బెదిరింపుల నేపధ్యంలో తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి డిజిపికి లేఖ రాసారు. ఒకవైపు రాష్ట్రంలో రోజురోజు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మరోవైపు అధికార పార్టీ వైకాపా నాయకులు పేట్రేగిపోతూ నేరాలు-ఘోరాలకు పాల్పడుతున్నారని, ఇంకోవైపు దళితులు, మైనారిటీలు, మహిళలు, దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతన్న అనేక సంఘటనలు డిజిపీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేయనందున జనవరి 18, 2021 న నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ ను బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ లో వైకాపా ఎమ్మల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బెదిరించారని పేర్కొన్నారు. వైకాపా నాయకులతో ఒక వర్గం పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై డిజిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని నల్లపరెడ్డి లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్తైర్యం నింపడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా మెరుగుపడుతాయి ప్రస్తావించారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో, సొంత రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా తల పట్టుకుంటున్నాయి. సహజంగా ప్రభుత్వాలు ఏ పని చేసినా, ప్రజలకు ఉపయోగపడేలా,అందరికీ సౌకర్యంగా ఉండేలా, నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం, ఒక ప్రాంతం మీద కక్షతోనో, ఒక కులం మీదో, ఒక వ్యక్తి మీద కక్షతోనే నిర్ణయాలు ఉంటాయని, అమరావతి రాజధాని విషయంలో తేలిపోయింది. రాష్ట్రానికి మధ్యలో, అందరికీ అందుబాటులో కాకుండా, ప్రభుత్వం వైజాగ్ లో పెట్టాలని నిర్ణయం తీసుకోవటం, అన్ని కార్యాలయాలు అక్కడికే తరలించాలనే పట్టుదలతో, సంబంధం లేని శాఖలు కూడా వైజాగ్ తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పటంతో, ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా అవాక్కవుతున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. అయితే విభజన చట్టం ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, ఇరు ప్రభుత్వాల సమ్మతితో, విజయవాడలో పెట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది పరివాహాక ప్రాంతంలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం తారుమారు అయ్యింది.

kcr 20012021 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుని విజయవాడలో కాకుండా, దాన్ని తీసుకుని వెళ్లి విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని పై సొంత రాష్ట్రంలో విమర్శలు వచ్చాయి. కృష్ణా నది ఉన్న చోట, కాకుండా ఎక్కడో వైజాగ్ లో ఏంటి, మీకు విజయవాడ ఇష్టం లేకపోతే, కనీసం రాయలసీమలో, కర్నూల్ లో అయిన పెట్టండి అంటూ, డిమాండ్ లు సొంత రాష్ట్రం నుంచి వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం పై కేసీఆర్ సర్కార్ కూడా ఆగ్రహం వ్యాక్తం చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే ఒప్పుకున్నాం అని, అసలు సంబంధం లేని వైజాగ్ లో, కృష్ణా నదికి 300 కిమీ అవతల ఎలా పెడతారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఘాటుగా లేఖ రాసారు. అయితే విజయవాడ అయితే ఒప్పుకుంటాం అని, లేకపోతే హైదరాబాద్ లోనే ఉంచేయండి అంటూ లేఖలో తెలిపారు. దీంతో ఇప్పుడు వైజాగ్ కాదు, విజయవాడ కాదు, అసలు రాష్ట్రానికి రాకుండా, బోర్డు కార్యాలయం హైదరాబాద్ లోనే ఉండి పోయే అవకాసం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వీడి, విజయవాడలో కానీ, కర్నూల్ లో కానీ పెట్టటానికి ఒప్పుకుంటే, సమస్య పరిష్కారం అయ్యే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read