వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, వైసీపీకి చెందిన కార్యకర్తలే, హైకోర్టులో కేసు వెయ్యటం సంచలనం అయ్యింది. అయితే ఈ కేసు పై ఈ రోజు వాయిదా ఉండటంతో, విచారణ జరిగింది. అయితే ఈ రోజు కేసు పై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు గతంలో, ఈ కేసు పై కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ రోజు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. తగినంత సమయం ఇచ్చినా, ఎందుకో కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. సరైన సమాచారం లేదా ? లేదా మరింత సమాచారం రావాల్సి ఉందా ? లేదా అక్కడ నిజంగానే ఏదైనా జరుగుతుందా, అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా ? అనే చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు విచారణలో, ప్రభుత్వ తరుపు లాయర్లు మాట్లడుతూ, కోర్టు దృష్టికి ఒక విషయం తీసుకుని వచ్చారు. ఈ పిటీషన్ వేసిన వారిలో, ఒక వ్యక్తి మైనింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, ఇప్పుడు ఆ అంశం పై ఇక్కడ విచారణ జరగటం లేదు కదా అని ప్రశ్నించింది.

దీంతో ప్రభుత్వ తరుపు లాయర్ కు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. అయితే హైకోర్టు కౌంటర్ ఎప్పుడు దాఖలు చేస్తారో చెప్పాలని, ప్రభుత్వాన్ని కోరింది. దీనికి స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, మరో వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, హైకోర్టుకు తెలిపారు. దీంతో, హైకోర్టు, ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని, రాజుపాలెం అనే మండంలో ఉన్న కొండమోడు దగ్గర, అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై గత నెల 26న విచారణ జరపగా, పూర్తి నివేదిక తమకు సమర్పించాలని, హైకోర్టు కేసుని ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే దీని పై విచారణ జరిపినా, ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ దాఖలు చేయలేదు. పూర్తి నివేదికతో, మరో వారం రోజుల్లో కౌంటర్ వేస్తామని కోర్టుకు చెప్పింది.

వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, అమరావతి పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను అభినందించారు. ప్రభుత్వం మనసులో ఉన్నది ఈయన చెప్పారని, అమరావతిని కనీసం శాసన రాజధానిగా కూడా ఉంచకూడదు అనే ప్రభుత్వ అంతరంగాన్ని, నాని చెప్పారని అన్నారు. రఘురామరాజు మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, విశాఖపట్నంకు తరలిస్తున్నారని, మనం గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ రోజు ఈ విషయంలో, మంత్రి కొడాలి నాని గారు, ఆ నిజాన్ని బహిర్గత పరిచారు. ఎందుకుంటే ఈ అంశం కోర్టులో ఉంది. రైతుల దగ్గర భూమి తీసుకున్నారు. తీసుకుని ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ రాసారు. సిఆర్డీఏ వాళ్ళు. అగ్రిమెంట్ లో ఏమన్నారు, మేము ఇక్కడ రాజధాని నిర్మిస్తాం, రాజధాని అంటే రాజభవన్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, హెచ్ఓడీలు ఉంటాయి అని ఒక మాస్టర్ ప్లాన్ చెప్పి, అగ్రిమెంట్ చేసారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చెయ్యరు అంట, డబ్బులు లేవు అంట, రాజభవన్, సెక్రటేరియట్ విశాఖలో కట్టుకుంటారు అంట, అవసరం అయితే ఒక సెషన్ అసెంబ్లీ కూడా విశాఖలో చెయ్యటానికి అసెంబ్లీ కూడా కట్టుకుంటారు అంట. రెండు సెషన్స్ అసెంబ్లీ అమరావతిలో పెడతారు అంట. రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చెయ్యకుండా, పేదలకు పంచుతారు అంట. "

"పేదలకు పంచుతూ, అందరం ఒప్పుకోవాలి అంట, అది కోర్టులో ప్రశ్నిస్తే, మీరు కోర్టులో వేసిన కేసులని విత్ డ్రా చేసుకోక పొతే, ఈ చిన్న రాజధానిని కూడా అమరావతిగా ఉంచం అని చెప్పి, మంత్రి గారు అంటున్నారు. మరి అది వార్నింగ్ అనాలో, లేక మరి ఇంకేమి అనుకోవాలో. ఒక పక్క కోర్టులో కేసు ఉండగానే, ఈ రకంగా బెదిరిస్తున్నారు అంటే, వీళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవాలి. నాని గారు ఏమి మాట్లాడినా కూడా, వారి ఎక్స్ప్రెషన్ లో ఉన్న మాధుర్యం, మా లాంటి వారి కంటే, జగన్, చంద్రబాబు గారి కంటే, నాని గారికి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. పితృ భాష ఎక్కువగా వాడతారు కాబట్టి, ఆ భాష నచ్చే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువగా ఆయన ప్రసంగాలు వింటారు. ఈ విషయంలో అయితే మా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నాని గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే మీ మనసులో దాగి ఉన్న నిజాన్ని ఈ రోజు, ప్రజలకు మీడియా సాక్షిగా తెలియచేసి నందుకు, ప్రభుత్వ అంతరంగాన్ని తెలియచేస్తూ, అమరావతిలో ఈ రాజధాని కూడా ఉంచం అని చెప్పినందుకు సంతోషం" అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒకప్పటి నెంబర్ 2, రాజ్యసభ సభ్యడు అయిన విజయసాయి రెడ్డికి, ఊరట లభించింది. ఆయన ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద లాభాదయాక పదవిలో ఉన్నారని, ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, మరో పదవిలో ఉండటం, రాజ్యాంగానికి విరుద్ధం అని, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని తొలగించి, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేత రామకోటయ్య, విజయసాయి రెడ్డి పై రాష్ట్రపతికి గతంలో ఫిర్యాదు చేసారు. పిటీషన్ ను పరిగణించి, వాస్తవాలు చూసి, విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యాలని కోరారు. విజయసాయి రెడ్డి ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, ఆయన్ను ఏపి ప్రభుత్వం మరో పదవిలో పెట్టిందని అన్నారు. ఆయనకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందని, ఆయనకు ఆ పదవి లాభదాయకమైన పదవి అంటూ, ఫిర్యాదు చేసారు. ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, మరో పదవి కలిగి ఉండటం పై రామకోటయ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆయన లాభదాయక పదవిలో కొనసాగుతున్నారు కాబట్టి అనర్ధత వెయ్యాలని రాష్ట్రపతిని కోరారు. అయితే ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం, దీని పై కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం చెప్పమని కోరింది.

vs reddy 07092020 2

ఆ ఫిర్యాదుని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫార్వడ్ చేసింది, రాష్ట్రపతి కార్యాలయం. అయితే దీని పై విచారణ చేసిన ఎన్నికల కమిషన్, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడితో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యెక ప్రతినిధిగా ఢిల్లీలో, క్యాబినెట్ ర్యాంక్ తో ఉన్నారని, అయితే ఈ పదవి లాభదాయక పదవి కాదని, ఆయన ఈ పదవి కోసం ఎలాంటి జీతం తీసుకోవటం లేదని, ఇది ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కిందకు రాదని, ఎలక్షన్ కమిషన్ తేల్చింది. ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ అనేది, ఈ పిటీషన్ కు వర్తించదని, రాష్ట్రపతికి విన్నవించింది. దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, విజయసాయి రెడ్డి అనర్హత పిటీషన్ ను, రాష్ట్రపతి కొట్టేసారు. దీంతో విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. అయితే ఆయనను ముందుగా ప్రత్యెక ప్రతినిధిగా నియమించినప్పుడు, ఈ పదవి లాభదాయక పదవిలోనే ఉంది. ప్రతిపక్షాలు గొడవ చేయటంతో, వెంటనే ఆ నియామకం రద్దు చేసి, ప్రత్యెక ప్రతినిధి పదవిని, లాభదాయక పదవి నుంచి మినహాయింపు ఇచ్చి, మళ్ళీ విజయసాయి రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉ-ద్రి-క్త పరిస్థితి నెలకొంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం దగ్ధం ఘటనకు నిరసనగా, ఈ రోజు హిందూ సంఘాలు ఆందోళనకు సిద్ధపడటం, పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో కాలిపోయిన రధాన్ని పరిశీలించేందుకు ఈ రోజు ఆలయానికి వచ్చిన ముగ్గురు మంత్రుల తీరు పై, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ పరిసరాల్లో ని-ర-స-న-ల-తో హోరెత్తించారు. ఈ క్రమంలోనే, కొందరు ని-ర-స-న-కా-రా-లు మంత్రుల కాన్వాయ్ పైకి రాళ్ళు రు-వ్వా-రు. దీంతో అప్రమ్మతమైన పోలీసులు, ముగ్గురు మంత్రులైన వెల్లంపల్లి, విశ్వరూప్, వేణుని సురక్షితంగా గుడి లోపలకు తీసుకు వెళ్ళారు. ఈ సమయంలోనే కొందరు ఆలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసారు. మంత్రులను లోపలకు పంపిన తరువాత ఆలయ ద్వారాన్ని మూసేసినా, అక్కడ ఉన్న వారు శాంతించలేదు. బారికేడ్ లను విరగొట్టి మరీ, కల్యాణోత్సవం షెడ్డు వైపుకు దూసుకువెళ్ళారు. వీళ్ళను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా, భారీగా తరలివచ్చిన వారిని నిలువరించలేక పోయారు. వైసిపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

antarvedi 080920202 1

ఒకేసారి ఎక్కువ మంది రావటంతో, ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కనిపించింది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, కానీ ప్రతి సారీ ఎదో ఒకటి జరుగుతూనే ఉందని అన్నారు. పోలీసుల విచారణ తీరు పైనా, అనుమానం వ్యక్తం చేసారు. నిస్పాక్షికంగా పోలీసులు విచరణ చేసి ఎంతటి వారు ఉన్నా, వదిలి పెట్ట కూడదని అన్నారు. అయితే 15 వ తేదీ లోపు, జరిగిన ఘటన పై పూర్తి నివేదిక తెచ్చుకుని, బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు టైం ఇవ్వాలి అని చెప్పటంతో, హిందూ సంఘాలు శాంతించాయి. అప్పటి వరకు ఆగి చూస్తాం అని, ప్రభుత్వం ఏమి చేస్తుందో చూస్తాం అని అన్నారు. దీని పై స్పందించిన వెల్లంపల్లి, ఎవరు బాధ్యలు ఉన్న వదిలి పెట్టం అని, ఇప్పటికే అధికారుల పై చర్యలు తీసుకున్నాం అని, విచారణ జరిగిన తరువాత, ఎవరు బాధ్యులు అయితే వారి పై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read