తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోదావరి వరదలో చిక్కుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలంలోని చించినాడ వద్ద, నిమ్మల రామానాయుడు వెళ్తున్న పడవ నిలిచిపోయింది. ఆ పడవలో నిమ్మల రామానాయుడుతో పాటుగా, మరో 8 మంది ఉన్నట్టు తెలుస్తుంది. బోటు ఆగిపోవటంతో, రామానాయుడు, అధికారులకు విషయం చేర వేసారు. ఆగిపోయిన పడవను ఒక చెట్టుకు లంగరు వేసినా, గోదావరి ఉగ్ర రూపానికి, కదిలిపోతుందని చెప్తున్నారు. గోదావారి వరదల్లో చిక్కుకున్న బాడవ గ్రామానికి నిమ్మల రామానాయుడు పరామర్శించటానికి వెళ్లారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్టటంతో బోటు ఆగిపోయింది. విషయం అధికారులను తెలియ చేసారు. అయితే అధికారులు ఒక చిన్న బోటు పంపించగా, ఆ బోటు కూడా వరదకు తట్టుకోలేక తిరిగి వచ్చేసింది. దీంతో మరో పెద్ద బోటు కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

చివరకు పర్యాటక బోటు పమించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక బోటు కోసం నిమ్మల ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చీకటి పడుతూ ఉండటంతో, ఎమ్మెల్యే వర్గంతో పాటుగా, అధికారులు కూడా కంగారు పడుతున్నారు. ముందుగానే పెద్ద బోటు పంపించి ఉంటే, ఈ టెన్షన్ ఉండేది కాదని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. మరో పక్క, గోదావరి వరదల్లో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిక్కుకోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. విషయం తెలుసుకుని, హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఫోన్ కాల్ చేసారు. ఎమ్మెల్యే రామానాయుడుతో సహా వరదల్లో చిక్కుకున్న గ్రామ ప్రజలను కాపాడాలని చంద్రబాబు కోరారు. తగిన ఏర్పాట్లు చేసి, వెంటనే ఆయనతో పాటు ఉన్న మిగతా వారిని కూడా సేఫ్ గా తీసుకు రావాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి, వైసీపీ పార్టీ వైపు వెళ్ళిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే మద్దాలి గిరితో పాటుగా, గుంటూరు అర్బన్ పోలీసులకు కూడా హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సామగ్రి అపహరణ కేసులో, అటు ఎమ్మెల్యే మద్దాలి గిరికి, ఇటు గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఇక కేసు విషయానికి వస్తే, గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్‌లో, డీబీ ఫ్యాషన్‌ అనే ఒక షాపు ఉంది. ఆ షాపు పై కొన్ని రోజులు క్రితం కొంత మంది వచ్చి దౌర్జన్యం చేసారు. షాపు మూసి ఉన్న సమయంలో, తాళం పగులుకొట్టి మరీ, కోటీ యాభై లక్షల విలువ కలిగిన సామగ్రిని షాపులో నుంచి అపహరించారు. దీంతో షాపు ఓనర్లు గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే పోలీసుల నుంచి సరైన సహకారం వారికి అందలేదు.

దీంతో ప్రతి వారం పెట్టే గ్రీవెన్స్‌కు వెళ్లి, తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు. అక్కడ కూడా సహకారం అందలేదని చెప్తున్నారు. అధికారులు ఎవరూ స్పందించకపోవటంతో, ఇక న్యాయ దేవతే దిక్కు అనుకుని, షాపు ఓనర్ కొప్పురావూరి శివ ప్రసాద్ హైకోర్టుకు మోర పెట్టుకుంటూ, పిటీషన్ దాఖలు చేసారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి చేస్తున్న ఒత్తిడితోనే, పోలీసులు తనకు సహకారం అందించలేదని, తన షాపులో దొంగతనం చేసిన వారికి మద్దలి గిరి మద్దకు ఉందని, కోర్టుకు తెలిపారు. తన షాపుని ఆక్రమించే ఎత్తుగడ వేసారని అన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఈ మొత్తం తాతంగం జరిగిందని ఆరోపించారు.. దీంతో పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం, ఎమ్మెల్యే మద్దాల గిరితో పాటుగా, పోలీసులు, రెవిన్యూ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసింది.

ఒక పక్క అమరావతి విషయం పై, రాష్ట్ర బీజేపీలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర బీజేపీలో అమరావతి పై ఒక్క అభిప్రాయంతో లేరు. ఒకరేమో కేంద్రానికి సంబంధం లేదు అంటారు. మరొకరు ఏమో అమరావతి రాజధాని, కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది అంటారు. మరొకరు ఏమో అమరావతి రాజధానిగా ఉండాలి, కర్నూల్ లో హైకోర్టు రావాలి అంటారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, రాష్ట్ర బీజేపీలో మాట్లాడుతున్నారు. అసలు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు అని చెప్తారు. మరో పక్క కేంద్రం కూడా మొన్న హైకోర్టుకు అఫిడవిట్ లో, గత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మూడు రాజధానులు అంటూ, బిల్లు ఆమోదించింది అంటూ, కోర్టుకు తెలిపారు. మరో పక్క అమరావతికి 2500 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇలా ఇక్కడ రాష్ట్ర బీజేపీ కానీ, కేంద్రం కానీ, అమరావతి విషయంలో కన్ఫ్యూషన్ చేస్తూనే ఉన్నారు.

మొన్నటి దాకా అమరావతి రైతులకు కేంద్రం, జగన్ కు కట్టడి వేస్తుంది అనే నమ్మకం ఉండేది. బిల్లులు గవర్నర్ ఆమోదించటంతో, కేంద్రంలోని బీజేపీ కూడా గేం ఆడుతుంది అని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కన్ఫ్యూషన్ కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు కేంద్రంలో సర్వే అఫ్ ఇండియా శాఖ, తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కు లేఖ రాసింది. 2019 నవంబర్ 21న, గల్లా జయదేవ్ పార్లమెంట్ అమరావతి మ్యాప్ లో ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్న వేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి సర్వే అఫ్ ఇండియా లేఖ గల్లాకు లేఖ రాసింది. దెస పొలిటికల్ మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పెట్టమని, ఇంగ్లీష్ మ్యాప్ 9వ ఎడిషన్ లో, హిందీ యమప్ 6 వ ఎడిషన్ లో అమరావతిని రాజధానిగా గుర్తించినట్టు లేఖలో తెలిపారు. మొత్తంగా అమరావతి విషయం పై, కేంద్రం వైఖరిలో కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉంది.

సిఆర్డీఏ రద్దుతో పాటుగా, వికేంద్రీకరణ బిల్లులకు ప్రభుత్వం గజెట్ విడుదల చెయ్యటంతో, ఈ రెండు బిల్లుల పై రాజధాని ప్రాంత రైతులు, హైకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, హైకోర్టు ఈ నెల 27 వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇస్తూ, కౌంటర్లు దాఖలు చెయ్యాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు ప్రకారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరుపున లలిత హిడావో ఈ అఫిడవిట్ దాఖలు చేసారు. అఫిడవిట్ లో తమకు రాష్ట్రాలు రాజధానుల నిర్ణయం పై సంబంధం లేదని చెప్పారు. రాష్ట్ర రాజధానుల నిర్ణయం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అని అన్నారు. ఈ బిల్ ప్రవేశపెట్టె సమయంలో తమను రాష్ట్ర ప్రభుత్వం ఏమి సంప్రదించలేదని అన్నారు. అయితే ఇదే సందర్భంగా మాకు రాజధాని విషయంలో సంబంధం లేదు అంటూనే, ఈ అంశం పై చట్ట ప్రకారం, ఏది న్యాయమో ఆ నిర్ణయం తీసుకోవాలి అంటూ, హైకోర్టుని అభ్యర్ధించారు.

అయితే ఒక పక్క తమకు సంబంధం లేదు అంటూనే, చట్ట ప్రకారం ఏమి కరెక్ట్ అయితే ఆ నిర్ణయం తీసుకోమనటం కొస మెరపు. అమరావతి రాజధాని అనేది, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో "ఏ కాపిటల్" అని ఉంది కానీ, త్రీ క్యాపిటల్స్ అనేది లేదు. మరి ఇది కచ్చితంగా న్యాయ సమీక్షకు వస్తుంది కదా ? చట్ట పరిధిలో అంశమే కదా ? మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో పక్క ఇప్పటికే అమరావతిలో కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు మూడు రాజధానులు అంటే, అమరావతిలో కేవలం అసెంబ్లీ సమావేశాలు అంటే, ఆ 2500 కోట్లు బూడిదలో పోసినట్టే కదా ? దీనికి ఎవరు సమాధానం చెప్తారు ? మాకు సంబంధం లేదు అని తప్పించుకోలేరుగా ? ఇది కూడా కచ్చితంగా న్యాయ సమీక్షకు వస్తుంది. ఈ అంశాలు అన్నీ వస్తాయి కాబట్టే కేంద్రం తెలివిగా రాజధాని నిర్ణయం మాకు సంబంధం లేదని, కానీ చట్టపరంగా ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి అంటూ, తన అఫిడవిట్ లో చెప్పింది. మరి 27వ తేదీన కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read