సర్వేపల్లి రాధాకృష్ణన్, శంకర్ దయాల్ శర్మ, రామ్ మనోహర్ లోహియా, ఉమేష్ గుప్తా వంటి ఉద్దండుల కూర్చున్న రాజ్యసభలో... ప్రశ్నించే విధంగా జీవితం గడుపుతున్న ఏ2 విజయసాయిరెడ్డి సభ్యునిగా ఉండటం రాష్ర్ట ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుడూ.. ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని దేశ ప్రజలందరికి తెలుసు. ఆయన తన కంట్లో దూలం ఉంచుకుని ఎదుటి వారి కల్లలో నలకను వెతకటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి జీవితమే అవినీతి మయం. లాంబ్రెక్టా స్కూటర్ మీద తిరిగే విజయసాయిరెడ్డి జగన్ పంచన చేరి ఏ2 గా రూపాంతరమెత్తాక కోట్లకు పడగలెత్తారు. 11 చార్జిసీట్లతో రూ. 43 వేల కోట్లు ఏ1,ఏ2 మీద సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసుల్లో విచారణ పూర్తయితే విజయసాయిరెడ్డి రాజస్యసభలో ఉంటారో, సెంట్రల్ జైళ్లో ఉంటారో ఆయనకే తెలియదు. అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు. చంద్రబాబు ఏం చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటి, రింగ్ రోడ్డు నిర్మించింది, సైబారాద్ నగరం నిర్మించి వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు కాదా?

బిల్ గేట్స్ ని హైదారాబాద్ కి తీసుకువచ్చి సామాన్య సర్పంచ్ పక్కన కూర్పచోపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు . తాను రాష్ర్టపతి అవ్వడానికి కారణం చంద్రబాబే అని అబ్దుల్ కలాం తన పుస్తకాల్లో రాశారు. దేశంలో ప్రతిపక్షాలన్నింటి ఏకం చేసింది చంద్రబాబు కాదా? చంద్రబాబు గురించి ప్రశ్నించే నైతిక జీవితమా విజయసాయిరెడ్డిది? విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్బంగా విశాఖలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలతో రాష్ర్టంలోని ఫించన్ లబ్డిదారులకు ఒక నెల పింఛన్ ఇవ్వొచ్చు. ఏం సేవ చేశారని విజయసాయిరెడ్డికి ప్లెక్సీలు కట్ట్టారో అర్దం కావటం లేదు. సూట్ కేసు కంపెనీలు సృష్టించినందుకు, విశాఖలో స్థలాలు కొట్టేసినందుకా ప్లెక్సీలు కట్టింది. విజయసాయిరెడ్డి విశాఖలో ఒక ప్రత్యేక అవినీతి చరిత్ర సృష్టించుకున్నారు. అంబులెన్స్ కుంభకోణంలో రూ. 307 కోట్లు కొట్టేశారు. దాని గురించి కనీసం ఇక్క ట్వీట్ కూడా విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు. ఎన్టీఆర్ కి భారతతర్న చంద్రబాబు ఎందుకు ఇప్పించలేకపోయారని విజయసాయిరెడ్డి అంటున్నారు.

కృష్ణా జిల్లాకి ఎన్టీ ఆర్ పేరు పెడతానని గతంలో జగన్ అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయి 14 నెలలు గడిచినా పేరెందుకు పెట్టలేదో విజయసాయిరెడ్డి చెప్పాలి? జగన్ కి తెలియకుండా బెంగులూరు లో విజయసాయిరెడ్డి కూడబెట్టిన ఆస్తుల చిట్టా పైల్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కి ఇఛ్చారు. దానికి భయపడి విజయసాయిరెడ్డి ఈ మద్య 25 రోజులు ఎవరకి కనపడకుండా దాక్కున్నారు. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారన్న భయంతో జగన్ , తన లెక్కచూపని జగన్ కొట్టేస్తారన్న భయంతో విజయసాయిరెడ్డి ఉన్నారు. విజయసాయిరెడ్డిన మించిన అబద్దాల కోరు. దొంగ ఆడిటర్, ఎవరూ లేరు. విజయసాయిరెడ్డికి చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటని వర్ల రామయ్య విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు.

108 అంబులెన్స్ ల కుంభకోణం గురించి, మొదటిగా బయట పెట్టింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన లేఖ రాస్తూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో, అంబులెన్స్ ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంది, అయినా ఆ ఒప్పందం ఇంకా అమలులో ఉండగానే, వాళ్ళని కాదని, ఇప్పుడు ఎక్కువ రేటుకు అరబిందో ఫౌండేషన్ కి, గతం కంటే, ఎక్కువ రేటుకి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. అరబిందో ఫౌండేషన్, విజయసాయి రెడ్డి అల్లుడిది కాబట్టి, దీని పై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆ లేఖ తరువాత, తెలుగుదేశం పార్టీ దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. టిడిపి నేత పట్టాభి మరిన్ని ఆధారాలు చూపించటంతో, 108 స్కాం బయట పడింది. అన్నిటికీ విరుచుకు పడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి వరకు దీని పై సమాధానం చెప్పలేక పోయింది. అయితే, ఈ స్కాంని బయట పెట్టిన బీజేపీ ఇప్పుడు మరో బాంబు పేల్చుతూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తుంది.

1088 అంబులెన్స్ ప్రారంభం చేసాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేసి, ఊరేగింపు చేసి, రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ ఆపేసి, చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడే 108 కనిపెట్టాం అనే విధంగా, వైసీపీ హడావిడి చేసింది. అయితే ఈ 1088 వాహనాలు కొత్తవి కాదనే వాదన కూడా ఉంది. పాట అంబులెన్స్ లకు కూడా కొత్త రంగులు వేసారని, కావాలంటే ఎక్కడైనా పాత రంగులలో అంబులెన్స్ లేవు అంటూ వాదించే వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ మరో విషయం చెప్తుంది. ఈ వాహనాల కొనుగోలుకు నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం 70 శాతం న్దిహులు ఇచ్చిందని, రాష్ట్ర వాట నామమాత్రం అని బీజేపీ నేతలు చెప్తున్నారు. కేంద్రం డబ్బులు ఇస్తే, అదేదో కుటుంబ వ్యవహారం అన్నట్టు, వైఎస్ఆర్ బొమ్మ కూడా వేసుకున్నారని, కేంద్ర ఇచ్చిన డబ్బులతో కొన్న అంబులెన్స్ ల పై, ప్రధాని బొమ్మ వెయ్యాలని, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయం సాక్షిగా జరిగిన ఒక భూమి,రెండు చెల్లింపులు కేసులో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. రూ.3.25 కోట్ల అదనపు చెల్లింపుల విషయంలో ఆర్డీవో కార్యాలయం వహించిన నిర్లక్ష్యం వెలుగులోకి తేవడంతో రెవిన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయకుండా నిందితులైన రామసుబ్రహ్మణ్యం, రాజారావులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి విడిచి పెట్టకపోవడం పై అతని బంధువు గంటశాల భాను ప్రకాష్ గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అవకతవకలపై ఎటువంటి నివేదికలు తయారు చేయకుండా కేవలం తమ బంధువులైన పచ్చిపులుసు శ్రీరామ్మూర్తి, పచ్చిపులుసు రవితేజ, సుతాపల్లి సత్యనారాయణ, సుతాపల్లి సాయి, కొమ్మిశెట్టి భీమశంకరంలను అయినవిల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి వేధిస్తున్నారని భానుప్రకాష్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

దీనిని రిట్ పిటిషన్ నెం 10888/2020 క్రింద కోర్టు పరిగణలోకి తీసుకుని శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన కౌంటర్‌ను హైకోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఈ నెల 24వ తేదీన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాలు సమయం ఇచ్చింది. ఇప్పటికే డీజీపీ మూడు సార్లు, హైకోర్టు ముందుకు వెళ్లారు. మొదటి సారి హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో, రెండో సారి చంద్రబాబుకి 151 నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకోవటం పై, మూడో సారి అక్రమ మద్యం రవాణా చేస్తున్న వాహనాలు విడుదల విషయంలో అనుసరిస్తున్న విధానం పై, ఇలా మూడు సార్లు డీజీపీ కోర్టు ముందు హాజరు అయ్యారు. ఇప్పుడు మరో సారి డీజీపీ హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, ఎప్పుడూ చెప్పే విధంగా, వాళ్ళ పార్టీ పై ప్రేమతో, తమ నాయకుడి పై గౌరవంతో, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనే తాపత్రయంతో, తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసారు. నిజానికి ఇది జగన్ మర్చిపోయిన విషయం. అలాగే ప్రతిపక్షం కూడా పట్టించుకోని విషయం. అయితే వాళ్ళు మర్చిపోయినా, నేను మర్చిపోను అంటూ, రఘురామకృష్ణం రాజు, లేఖ రాసి మరీ గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అవ్వా , తాతలకు మూడు వేలు పెన్షన్ ఇస్తాను అంటూ, వారిని నమ్మించి ఓట్లు వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత, అవ్వా తాతలకు ఏడాదికి రూ.250 పెంచుకుంటూ వెళ్తానని చెప్పి, మొదటి ఏడాది కేవలం రూ.2,250 ఇచ్చి ఉసూరుమానిపించారు. అయితే మొన్నే ఏడాది పాలన కూడా పూర్తయింది. ఇప్పుడు 14వ నెలలోకి అడుగు పెట్టారు. అయితే రెండో ఏడాది పెంచాల్సిన రూ.250 మాత్రం ఇంకా పెంచలేదు. మాట తప్పను, మడం తిప్పను అని జగన్ చెప్పే డైలాగ్ కి జరిగే విషయానికి తేడా ఉండటంతో, ఆయన మర్చిపోయిన విషయం గుర్తు చెయ్యటానికి, అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు, లేఖ రాసారు.

అవ్వా - తాతలకి మీరు పెంచుతాను అని చెప్పిన రూ.250 పెన్షన్ గురించి మీ దృష్టికి తెస్తున్నాను అంటూ, రఘురామరాజు లేఖ రాసారు. మీరు ఎన్నికల్లో అవ్వా తాతలకు పెన్షన్ రూ.3 వేలు చేస్తాను అని చెప్పారు, దీంతో అందరూ మీకు ఓట్లు వేసారు, తరువాత ప్రమాణ స్వీకారం రోజున రూ.250 పెంచి, ప్రతి ఏడాది రూ.250 పెంచుతాను అని చెప్పారు. వచ్చే జూలై 8న మన ప్రియతమ నాయకుడి జయంతి రోజునైనా, మీరు ఈ ఏడాదికి రూ.250 పెంపు ప్రకటన చేస్తారని ఆశిస్తున్నా అంటూ, రఘురామరాజు లేఖలో పేర్కొన్నారు. ఇక మరో విషయంగా, పెన్షన్ వయసు 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గించారు, మే 30, 2019నే ఆదేశాలు ఇస్తూ జీవో ఇచ్చారు, కానీ వారికి పెన్షన్లు మాత్రం ఫిబ్రవరి 2020 నుంచి ఇస్తున్నారు. దీని వల్ల వారికి, 7 నెలలకు రూ.15,750 నష్టం వాటిల్లింది. వారు నష్టపోయిన డబ్బులు కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని, అలాగే రూ.250 పెన్షన్ పెంచాలని, అలా చేస్తే మీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది అంటూ, రఘురామకృష్ణం రాజు, జగన్ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, లేఖ రాసారు.

Advertisements

Latest Articles

Most Read