క-రో-నా పేరుతో ప్రభుత్వాలు దోచుకుతింటున్నాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇక నిన్నటి సినీ ప్రముఖుల అమరావతి పర్యటన పై, నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా వారు కేవలం స్వార్ధం కోసమే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుస్తున్నారని ఆరోపించారు. కనీసం అమరావతి రైతులకు మద్దతు తెలపలేని వీరి గురించి ఏమి చెప్తాం అని అన్నారు. అమరావతి తరలింపు కోసం సినీనటులను జగన్ అడ్డంపెట్టుకుని, పావుగా వాడుతున్నారని నారాయణ అన్నారు. సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులను కలవటం పై, సినీ నటుడు బాలకృష్ణ చెప్పింది నిజమే అని, భూముల కోసమే కలుస్తున్నారని అన్నారు. అక్రమ భూముల క్రమబద్ధీకరణ కోసమే నిన్నటి అమరావతి పర్యటన జరిగింది అని అన్నారు. రానున్న ఎన్నికలు అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా పైనే జరుగుతాయని అన్నారు. రాజధాని రైతులు వెళ్తే సంఘీభావం ప్రకటించవచ్చుకదా, తప్పేముంది, అందులో మీకు ఏమి అవుతుంది అని అన్నారు.

వీళ్ళు ఎవరిని కలిసినా, భూములు కావలి, సబ్సిడీలు కావాలి, స్టూడియోలు కావాలి అనే డిమాండ్లతో, వాళ్ళ స్వార్ధం కోసమే కలుస్తున్నారని అన్నారు. నిజంగా ప్రజల పట్ల, సమాజం పట్ల వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటె, 200 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న వారిని, ఎందుకు కనీసం పరామర్శించలేదు అని నారాయణ అడిగారు. వీళ్ళ వాలకం చూస్తుంటే, బాలకృష్ణ చెప్పింది నిజమే అని అనిపిస్తుందని అన్నారు. జగన్‌ను చూసి భయపడుతున్న సినీనటులు పరిశ్రమకు ఏం చేస్తారు ? అమరాతి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే సినిమా గ్యాంగ్ అమరావతికి వచ్చిందని అన్నారు. రాజధాని వెళ్లకుండానే విశాఖలో అరాచకాలు జరుగుతున్నాయని, విశాఖకు రాజధాని వెళ్తే ఫ్యాక్షన్ సెంటర్ గా మారుతుందని నారాయణ ఆరోపించారు. రాజధానిని తరలిస్తే సహించేది లేదని, ఎవరితో ఎన్ని డ్రామాలు వేయించినా, చూస్తూ కూర్చోమని అన్నారు.

కరోనా లాక్ డౌన్లో 80 రోజులు నిర్మానుష్యంగా మారిన ఏడుకొండలు సోమవారం శ్రీవారి దర్శనాలు ఆరంభం కావడంతో మళ్లీ గోవిందనామం ప్రతిధ్వనించింది. తిరుమల తిరువతి దేవస్థానంలో వనిచేస్తున్న ఉద్యోగులు తొలిదర్శనం పొంది ఆనందం వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ, 300రూపాయలు ప్రత్యేక ప్రవేశదర్శనాల క్యూలైన్ల నుంచి ఆలయంలోనికి చేరుకున్నారు. శ్రీవారి దర్శన ప్రయో గాత్మక పరిశీలనలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి ఉద్యోగులను అనుమతించడంతో తొలి రెండు గంటల్లోనే 1200 మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. ఆలయంలోపల బంగారు వాకిలి నుంచి రెండు క్యూలైన్ విధానాలు అమలు చేసి, పరిమితం చేయడంతో ఒక్కో భక్తుడు సామాజిక దూరంలో 20-30 సెకండ్లు సమయం శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలిగింది. ఎక్కడా ఎవరినీ తాకకుండా ఆలయంలో కూడా భక్తులు ముందుకు కదిలారు. మంగళవారం కూడా టిటిడి ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దర్శనం కల్పించనున్నారు.

మూడవ రోజు బుధవారం తిరుమలలోని స్థానిక భక్తులకు వెంకన్న దర్శనాన్ని కల్పిస్తున్నారు. మూడు రోజుల ప్రయో గాత్మక దర్శనాలు ముగియగానే క్యూలైన్లలో ఏవేమి మార్పులు తీసుకోవాల్సి ఉన్నా తదనుగుణం గా చేపడతారు. ఆ తరువాత 11వ తేదీ గురువారం ఉదయం 7.30గంటల నుంచి సామాన్య భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లు, ఆన్లైన్ టిక్కెట్లు ద్వారా దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిరోజు ఉదయం 8గంటలకు మొదలైన దర్శ నాలు రాత్రి 7.30గంటల వరకు నిరంతరా యంగా సాగింది. ఇప్పటికి వున్న లాక్ డౌన్ వరి స్థితుల దృష్ట్యా 10ఏళ్ళలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ళ పైబడిన వృద్ధులను పూర్తిగా దర్శనాలకు దూరంగా ఉంచారు.

మొదటి రోజు, సోమవారం 6 వేల మంది శ్రీవారని దర్శించుకోగా, 25.7 లక్షలు స్వామి వారికి హుండీ ఆదాయం వచ్చింది. సహజంగా రోజుకు 60 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ లాక్ డౌన్ కారణంగా, కేవలం 6 వేల మంది మాత్రమే దర్శించుకున్నారు. 11వతేదీ నుంచి విఐపిలకు ఉదయం గంట పాటు దర్శన భాగ్యం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు విఐపిలు స్వయంగా తిరుమలకు చేరుకుంటేనే శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. లేకుంటే సిఫార్సు లేఖలను ఈ నెలాఖరు వరకు స్వీకరించే అవకాశం కనిపించడంలేదు. రానున్న రెండు రోజుల తరువాత భక్తులకు ఇదే విధానంలో దర్శనం కల్పించేలా చూడనున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో 3వేల టిక్కెట్లు, తిరుపతి ఆర్టీసి బస్టాండు, అలిపిరి ప్రాంతాల్లోని కౌంటర్లలో మరో 3వేల టిక్కెట్లు కరెంట్ బుకింగ్ లో టైమ్ స్లాట్ కేటాయిస్తారు. భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే తిరుమలకు చేరుకుని నేరుగా క్యూలైన్లో ప్రవేశించేలా టిటిడి కార్యాచరణ సిద్ధం చేసింది.

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, అనంతరం చంద్రబాబు ప్రాజెక్ట్ పూర్తికి కృషి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 15 లక్షల మందికి తాగునీరు, ప్రకాశం జిల్లాలో 23 మండలాల్లో 3.36 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల 200 ఎకరాలు, నెల్లూరులో 84 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పనులు పరిగెత్తిస్తే, వందల కోట్ల అవినీతి జరిగిందంటూ.. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. టన్నెల్-1 పనులను అదే ఏజెన్సీ నిర్వహిస్తోందని, ఆరో పణలు చేసిన నాయకులు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. మొదటి టన్నెల్‌ పనులు చేసేవారికే రెండో టన్నెల్ పనులు ఎందుకు అప్పగించారో చెప్పాలని నిలదీశారు. టన్నెల్ బోరింగ్ యంత్రాలతో చేయాల్సిన పనులను టెండర్లు పిలవకుండా నామినేషన్ల కింద లంకారెడ్డితో టన్నెల పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

చెన్నైలో డిస్టిలరీల వద్ద రోజు కురూ. పది కోట్లు అనిల్ రెడ్డి అనే వ్యక్తి వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇది జేటాక్స్ కదా అని ప్రశ్నించారు. మైనింగ్ కుంభకోణాలన్నీ ద్వివేది ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయ న్నారు. వీటన్నింటిపైనా జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్ కు, మైనింగ్ లీజు 50 ఏళ్లకు దోచిపెట్టారని దేవినేని ఉమా అన్నారు. కృష్ణా నదిలో నీళ్ళు దోచిపెట్టే అధికారం, వీరికి ఎవరు ఇచ్చారు అంటూ, ఉమా ధవజమేత్తారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని, ఇప్పుడు తానే ముఖ్యమంత్రి కావటంతో, ఇష్టం వచ్చినట్టు దోచేస్తున్నారని అన్నారు. లోకేష్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, చాలెంజ్ అంటూ పార్థసారధి అంటున్నాడని, గడ్డి వాములో దొరికిన మద్యం పై పార్థసారధి చాలెంజ్ చెయ్యాలని దేవినేని ఉమా అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నియామకం విషయంలో, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరితో వివాదం కొనసాగుతూనే ఉంది. నిమ్మగడ్డను తొలగించిన విషయం పై, నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్ళగా, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసి, నిమ్మగడ్డ నియామకం పై ఆదేశాలు ఇచ్చింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసింది. దీని పై గత వారమే ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసినా, అందులో తప్పులు ఉండటంతో, పిటీషన్ వెనక్కు తీసుకుని, మళ్ళీ తప్పులు సరి చేసి, కొత్త పిటీషన్ దాఖలు చేసింది. దీని పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందే ఈ రోజు విచారణ జరిగింది. అయితే హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే కావలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం కోరగా, సుప్రీం కోర్టు మాత్రం, స్టే ఇవ్వటానికి మేము ఒప్పుకోం అంటూ, కేసును రెండు వారాలకు వాయిదా వేస్తూ, ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చింది.

కౌంటర్ దాఖలు చెయ్యాలని, రెండు వారాలు టైం ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఈ సందర్భంగా, సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యంగబద్ధ సంస్థలతో, ఆటలు ఆడుకోవద్దు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యంగ విరుద్ధంగా మీరు ప్రవర్తించారు, రమేష్ కుమార్ ని తీసెయ్యటానికే ఈ ఆర్డినెన్స్ తీసుకోవచ్చారు అంటూ, హైకోర్టు చేసిన వ్యాఖ్యల పై, సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంది. ఆర్డినెన్స్ జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు నమ్మదగినవిగా లేవని సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో స్టే ఇవ్వటానికి ఏమి లేదని, అయితే కేసు మాత్రం, వింటాం అని, నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా, రాజ్యాంగపదవుల్లో ఉన్నవారితో ఆటలొద్దన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read