జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు మూడేళ్ళ నుంచి సాగుతూనే ఉంది. మూడు సిట్ లు వేసిన తరువాత, ఈ కేసు హైకోర్టు జోక్యంతో పోయిన ఏడాది సిబిఐ వద్దకు వెళ్ళింది. అయితే సిబిఐ విచారణలో కూడా పెద్దగా మార్పు ఏమి లేదు. ఏదో కనుగున్నట్టే ఉంటారు, వెంటనే స్లో అయిపోతారు. అలాగే అసలు పెద్ద తలకాయల వద్దకు , ఇప్పటి వరకు సిబిఐ వెళ్ళలేదు అనే అభిప్రాయం ఉంది. అనేక ట్విస్ట్ లు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పుడు తాజాగా రఘురామరాజు బయట పెట్టిన ఒక విషయంతో, మళ్ళీ కలకలం రేగింది. అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ అలాగే వైసీపీ నేత శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేత శివశంకర్ రెడ్డిని ఎలాగైనా బయటకు తీసుకుని రావటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందు కోసం బెయిల్ పిటీషన్ కోసం వేసారు. అయితే అనూహ్యంగా ఈ బెయిల్ పిటీషన్ కోసం, ప్రభుత్వ లాయర్ చంద్ర ఓబుల్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తరుపున వాదనలు వినిపించారని, ఒక ప్రభుత్వ న్యాయవాది, పార్టీ నాయకుడి కేసులు ఎలా వాదిస్తారు అంటూ, రఘురామ రాజు లేవనెత్తటమే కాక, ఇదే విషయం పైన, చంద్ర ఓబుల్ రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మన్ కు కూడా రఘురామరాజు ఫిర్యాదు చేయటంతో, ప్రభుత్వ పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది. ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
news
షర్మిల వ్యాఖ్యలతో అవాక్కయిన వైసీపీ శ్రేణులు...
జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల, జగన్ మోహన్ రెడ్డి పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ శ్రేణులు షాక్ తిన్నాయి. అన్న వదిలిన బాణం అంటే, రెండేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేసిన షర్మిల, తరువాత జగన్ పొడిచిన వెన్నుపోటుతో, రోడ్డున పడి, కొత్త పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే షర్మిల తెలంగాణాకే పరిమితం అయినా, సమయం దొరికిన ప్రతి సారి, షాకులు ఇస్తూ వస్తున్నారు. తాజాగా జిల్లాల విభజన పై షర్మిల స్పందించిన తీరుతో వైసీపీ శ్రేణులు షాక్ తిన్నాయి. విలేఖరుల సమావేశంలో, షర్మిలను కొత్త జిల్లాల పై ప్రశ్నలు అడిగారు. మొదటగా ఆంధ్రప్రదేశ్ గురించి అయితే తనను ఏమి అడగవద్దు అని షర్మిల చెప్పారు. తరువాత మళ్ళీ తెలంగాణా, ఏపి కొత్త జిల్లాల గురించి విలేఖరులు అడగగా షర్మిల స్పందిస్తూ, జిల్లాల విభజన ఎవరు చేసినా, ఒక ఫోకస్ ఉండాలని, కేసీఆర్ ఇక్కడ 33 జిల్లాల చేసి ఏమి సాధించారు, కనీసం సిబ్బందిని కూడా ఆయన ఇక్కడ నియమించుకోలేదు. ఏదో వార్తల్లో ఉండటం కోసం, డైవర్షన్ కోసం తప్ప, ఇది ఎందుకు అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి జిల్లాల విభజన తెచ్చింది కేవలం డైవర్షన్ కోసం అంటూ, ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను, ఇప్పుడు షర్మిల కూడా చేయటంతో, వైసీపీ శ్రేణుల మొఖాన నెత్తురు చుక్క లేకుండా పోయింది.
మరోసారి సినీ ఇండస్ట్రీ పై, జగన్ అసంతృప్తి ?
ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి , సినిమా పరిశ్రమ పై తీసుకుంటున్న నిర్ణయాలు, తెలుగు సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, వాదనలు వినిపిస్తూ వచ్చాయి. సిని ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబు కులం వారని, ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలే అన్నారు. బలిసి కొట్టుకుంటున్నారని, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని కూడా సిని ఇండస్ట్రీ గుర్తించటం లేదని చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆ తరువాత వచ్చిన సినిమా టికెట్ల వివాదం, మరింత దూరం పెంచింది. చిరంజీవి ద్వారా ఏదో షో చేస్తున్నా పెద్దగా వర్క్ అవుట్ అవ్వటం లేదు. తాజాగా, మరోసారి జగన్ కు సినీ ఇండస్ట్రీ పై కోపం వచ్చిందని వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి చేస్తుంటే తెలుస్తుంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే, సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోలు ఎవరూ స్పందించక పోవటం, జగన్ ను పొగడక పోవటం పై, వైసీపీ అభ్యంతరం చెప్తుంది. ఇదే పని చంద్రబాబు చేస్తే, పొగడ్తలతో ముంచెత్తే వారు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బయో పిక్ పేరుతో రాం గోపాల్ వర్మని అడ్డు పెట్టుకుని, జగన్ చేసిన చెండాలం గురించి కూడా అప్పట్లో సినిమా ఇండస్ట్రీ స్పందించ లేదని, రాజకీయాలకు సినిమాలకు సంబంధం ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడు పొగడటం, ఇష్టం లేనప్పుడు సైలెంట్ గా ఉండటనికి, సినిమా ఇండస్ట్రీ ఏమి, వైసీపీకి అనుబంధ సంస్థ కాదు అని విషయం గుర్తించుకోవాలని అంటున్నారు.
చంద్రబాబు పై, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు...
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల పై స్పందించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పై రేణుకా చౌదరి మండి పడ్డారు. ఆడవాళ్ళు అంటే ఒక్కొక్కడికీ తేలికగా ఉందా అంటూ ఫైర్ అయ్యారు. వెధవులు కాకపోతే, పోలికలు గురించి ప్రస్తావిస్తరా అని ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన సంఘటన తాను చూసాను అని, నేనైతే చెంపలు వాయించే దాన్ని అని అన్నారు. చంద్రబాబు కూడా ఎమోషన్ అయ్యి, అలా ఏడ్చారు కానీ, ఆయన అలా కాకుండా, అక్కడ వాగిన వాడి చెంప పగలగొట్టి ఉండాల్సిందని అన్నారు. చంద్రబాబు అప్పుడే వాళ్ళను నాలుగు పీకితే సరిపోయేదని అన్నారు. అసలు ఆ స్పీకర్ ఏమిటి అంటూ, స్పీకర్ తీరుని తప్పు బట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు స్థాయి వ్యక్తి తన బాధను చెప్పుకోవాలి అనుకుంటే, కనీసం మైక్ కూడా ఇవ్వరా అని మండి పడ్డారు. స్పీకర్ చైర్ లో ఉన్న వ్యక్తి ఇంత బలహీనంగా ఎలా ఉంటాడని అన్నారు. చేతకాక పొతే ఇంటికి వెళ్లి అంట్లు తోముకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసారు.