ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వైసీపీ సర్కారు నోటీసులు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. జారీ చేసిన నోటీసుల్లో సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొనడంతో ఒక్కసారిగా సంఘ నేతలు ఉలిక్కిపడ్డారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని ఉద్యోగసంఘాలు ఆరోపించాయి. ఉద్యోగుల ఫిర్యాదుపై గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ అడగడంతో రచ్చ మొదలైంది. ఉద్యోగసంఘాలలో ఏపీ ఎన్జీవో, సచివాలయ ఉద్యోగులు సంఘం, రెవెన్యూ సర్వీసెస్ వైసీపీ సర్కారు చెప్పుచేతల్లో ఉన్నాయి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇలా గవర్నర్ దగ్గరకి వెళ్లి ఫిర్యాదు చేయడంపై సర్కారు గుర్రుగా ఉంది. ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం దేశంలోనే తొలిసారి. ఇప్పటికే అన్నిరంగాల్లో ఏపీ పరువు పోయిందని, ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కడంతో మరీ డ్యామేజీ అయ్యామని వైసీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్నే రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నారు.
news
పులివెందుల వచ్చి అవినాష్ రెడ్డి తండ్రి కోసం గాలించిన సిబిఐ... ఆచూకీ లేని వైఎస్ భాస్కర్ రెడ్డి..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణని సీబీఐ మళ్లీ మొదలు పెట్టింది. కడప నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీయడంతో ఒక్కసారిగా ఈ కేసులో నిందితులు, అనుమానితుల్లో గుబులు మొదలైంది. పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను కూడా సీబీఐ పరిశీలించడంతో కార్యాలయానికి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని వార్తలు రావడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆయన దేశరాజధానిలో పెద్దలు కలిసి వెళ్లొచ్చాక అవినాశ్ రెడ్డి అరెస్టు ఆగిపోవడం యాధృచ్చికమేనా అన్న అనుమానాలు వచ్చాయి. మళ్లీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కోసం సీబీఐ రావడం, అరెస్టు ఊహాగానాలు ఊపందుకోవడంతో వైఎస్ జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లక తప్పకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.
విజయమ్మ మాటలతో షాక్ తిన్న వైసీపీ...
నారా లోకేష్ యువగళం పాదయాత్రని అడ్డుకోవద్దని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వేడుకుంటోంది. ఇదేంటి కొడుకు పాదయాత్ర అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుంటే తల్లి లోకేష్ పాదయాత్ర అనుమతి కోసం ఇంతలా వేడుకుంటోందనే డౌట్ మీకు రావొచ్చు. విజయమ్మ పాదయాత్ర గురించి మాట్లాడిన అంశాలను టిడిపి సోషల్‌మీడియా వెలుగులోకి తెచ్చి వైసీపీని నిలదీస్తోంది. నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడానికి నానా యాతన పడుతోన్న వైసీపీ సర్కారుకి విజయమ్మ వీడియో షాక్‌లా తగిలింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సరిపడక తల్లితో సహా చెల్లి షర్మిల తెలంగాణలో సెటిలైంది. అక్కడే వైఎస్సార్టీపీ పెట్టుకుంది. ఆమె పాదయాత్రని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కారులో ఉండి నిరసన తెలిపితే, కారుతో లాక్కుపోయారు. తన కుమార్తెని పోలీసులు అలా అరెస్ట్ చేయడంపై విజయ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలని అడ్డుకున్నట్టు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాన్నీ తాను చూడలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలుగా గుర్తింపు పొందుతాయన్నారు. ఈ వీడియోని టైమ్లీగా బయటకు తెచ్చిన టిడిపి శ్రేణులు వైసీపీ పెద్దలను ఇరకాటంలో పెట్టారు.
సీఐడీ సునీల్ కుమార్ ని సడన్ గా తప్పించటం వెనుక ఇంత స్టొరీ ఉందా ?
ఏపీ సీఐడీని టిడిపిని వేధించే శాఖగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఏడీజీ సునీల్ కుమార్ ని సర్కారు సడెన్ సీఐడీని తప్పించడం కలకలం రేపుతోంది. అయితే ఇటీవలే డిజిపి ర్యాంకు ప్రమోషన్ ఇచ్చిన సర్కారు సునీల్ సేవలను మరింతగా వాడుకునేందుకు మరో కీలక పోస్టు కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏ నిర్ణయం తీసుకున్నా డీజీపీ పాత్ర కీలకం కాబట్టి, అదే దళితుడైన సునీల్ కుమార్ ని డిజిపిగా పెడితే...టిడిపి ఇరుకున పడుతుందనే వ్యూహంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతోంది. డిజిపి పోస్టులో సునీల్ కుమార్ ని పెట్టి పోలీసుల్ని తాను చెప్పినట్టు వాడుకోవచ్చని, విపక్షం ఆరోపిస్తే దళిత ఐపీఎస్ ని డిజిపిని చేస్తే టిడిపికి ఇష్టంలేదని కౌంటర్ వేయొచ్చని ప్లాన్ వేసి ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. మరో పక్క సిఐడిలో సునీల్ కుమార్ నిరంకుశ తీరుకి వ్యతిరేకంగా మొత్తం సీఐడీలో ఉన్నవాళ్లంతా ఏకమయ్యారని, అలాగే సిఐఐ వ్యవహరిస్తున్న తీరుతో, ఇప్పటికే కేంద్రానికి అనేక కంప్లైంట్ లు వెళ్ళటం, అలాగే కేంద్రం కూడా సీరియస్ అవ్వటంతో, సునీల్ ని తప్పించారా అనే ప్రచారం జరుగుతుంది.