balakrishna gowthami putra satakarni 08042016

తెలుగు సినీ ఇండస్ట్రీలో, అమరావతిని ఇప్పటిదాకా ప్రమోట్ చేసింది బాలయ్యే. నిన్న కాక మొన్న, డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ అమరావతిలో, బుద్ధిడి విగ్రహం ముందు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసి, శభాష్ అనిపించుకున్నారు బాలయ్య. అలాగే, రోహిత్ "రాజా చెయ్యి వేస్తే" ఆడియో ఫంక్షన్ కూడా బెజవాడలో బాలయ్య, చంద్రబాబు చేతులు మీదగా గ్రాండ్ గా జరిగింది. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు దూసుకుపోతున్న బాలయ్య, తన కెరీర్లో ఎంతో ప్రతిష్టత్కమైన 100వ సినిమా అమరావతిలో అనౌన్స్ చెయ్యటమే కాదు, తన సినిమా కధలో కుడా, అమరావతి చరిత్రాత్మక ఘట్టాలని తెరకిక్కేంచి, అటు తన అభిమానులను రంజిపచేస్తూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రను గర్వంగా సిల్వర్ స్క్రీన్ మీద చుపించబోతున్నాడు మన బాలయ్య.

నందమూరి బాలకృష్ణ ఉగాది కానుకగా ఆయన అభిమానులకి, తన 100వ సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" విశేషాలు చెప్పారు. ఫస్ట్‌ప్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందే ఈ చిత్రానికి, జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. హీరోయిన్‌ ఎవరూ అన్నది ఇంకా స్పష్టత కాలేదు. నయన తార నటించే అవకాశం ఉంది. బాలయ్య తల్లిగా బాలీవుడ్‌ నటి హేమామాలిని నటించే అవకాశం ఉంది. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ఈనెల 22 నుంచి మొరాకోలో ప్రారంభం కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, మొన్ననే జాతీయ అవార్డు కుడా అందుకున్నారు.

హిస్టారికల్ మూవీని క్రిష్ బాగా చూపిస్తాడు అనే నమ్మకం, బాలయ్య పౌరాణికాలు ఇరగదీస్తాడు అనే కాన్ఫిడెన్సుతో, బాలయ్య అభిమానులు "హిస్టరీ రిపీట్ అవ్వుద్ది" అంటున్నారు. అందులోను, మన బాక్స్ ఆఫీస్ బొనంజా, అమరావతి సబ్జెక్టు సినిమా ఎంచుకున్నాడు కాబట్టి, మన రాష్ట్రాన్ని కుడా ఎలివేట్ చేసినట్లు ఉంటుంది అని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇకపోతే, అసలు బాలయ్య, తన 100వ సినిమాకి ఈ కధ ఎందుకు ఎంచుకున్నాడు ?. ఒక మాస్ కధతో, భారి డైలాగ్ లతో, బోయపాటి లాంటి వాడికి ఇస్తే మరో లెజెండ్ తీసేవాడు, అని అందరు అనుకున్నారు. కాని బాలయ్య స్టైల్ వేరు, ఆయన ఆలోచన వేరు. ఇప్పుడున్న హీరోల్లో, సరిగ్గా పౌరాణికాలు, జానపదాలు చేసే వారు లేరు. కొంచెం వైవిధ్యంగా ఆలోచించిన బాలయ్య, "గౌతమీపుత్ర శాతకర్ణి" లాంటి పవర్-ఫుల్ స్టొరీ ఎన్నుకున్నారు.

ఎందుకు "గౌతమీపుత్ర శాతకర్ణి" పవర్-ఫుల్ స్టొరీ ? అసల ఎవరు ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ?

శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు, "గౌతమీపుత్ర శాతకర్ణి". గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజు అయ్యాడు. ఆయన తండ్రి హయంలో రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ, శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉంది. "గౌతమీపుత్ర శాతకర్ణి" శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. "గౌతమీపుత్ర శాతకర్ణి" భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. భారతీయ పంచాంగం(కాలండరు) "గౌతమీపుత్ర శాతకర్ణి" (శాలివాహనుని) పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది.

ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ద్వారా, "గౌతమీపుత్ర శాతకర్ణి" ఘనత తెలుసుకోవచ్చు. ఈ శాసనాలు బట్టి, "గౌతమీపుత్ర శాతకర్ణి" గొప్ప యుద్ధవీరుడు అని, అనేక క్షత్రియ రాజ వంసాలను జయించి " క్షత్రియ దర్పమాన్మర్ధన " అనే బిరుదు తెచ్చుకున్నాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాని జయించి, "త్రిసముద్రతోయ పీతవాహన" అనే బిరుదు తెచ్చుకున్నాడు.

అంతే కాదు "గౌతమీపుత్ర శాతకర్ణి" గొప్ప ప్రజా సేవకుడు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని, న్యాయబద్ధంగా పన్నులు విదిస్తూ, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేస్తూ, జనరంజక పాలన అందిచేవారు. ఆయనకు "ఏక బ్రాహ్మణుడు " అనే బిరుదు కుడా ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లిపట్ల ఎనలేని భక్తిని ప్రదర్శించి తన పేరులో తల్లి పేరును కలుపుకున్నాడు. ఈ అన్ని కారణాల వల్ల , "గౌతమీపుత్ర శాతకర్ణి" శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన తరువాత క్రీ.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి రాజ్యం చేపట్టాడు.

ఈ గౌతమీపుత్రడి గొప్పతనం ఇప్పటికి మన అమరావతిలో శాసనాలు ద్వారా, స్థూపాలు ద్వారా ప్రతిబంబిస్తూనే ఉంటుంది. మన అమరావతి వైభవం అంతా ఆ శాతవాహనులతోనే చరిత్రలో కలిసిపోయింది.

ఇప్పుడు మళ్ళి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన తర్వాత, ఆ వైభవం మనకి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది. టీవీలు ద్వారా, పుస్తకాలు ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనం మన గొప్ప చరిత్ర తెలుసుకుంటున్న తరుణంలో, మన బాలయ్య సిల్వర్ స్క్రీన్ మీద, చరిత్రలో మన గొప్పతనం ఏంటో మన కళ్ళకి కట్టినట్టు చుపించాబోతున్నారు. ఈ చరిత్ర, నేటి యువతకు స్పూర్తిగా ఉంటూ, మనది ఇంత గొప్ప చరిత్ర, మనం ఏదైనా చెయ్యగలం అనే కసితో, మన కలల రాజధాని నిర్మాణంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటానికి ఈ సినిమా దోహద పడుతుంది అనటంలో సందేహం లేదు.

థాంక్స్ అండ్ కంగ్రాక్ట్స్ బాలయ్య....

Advertisements

బాలయ్య 100వ సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" అంత పవర్-ఫుల్ స్టొరీ నా ? Last Updated: 08 April 2016