అమరావతి ప్రజాదర్బార్‌ హాల్‌లో పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. నీతిఆయోగ్‌ సమావేశం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని టీడీపీ నిర్ణయించింది. ఎంపీలతో, మంత్రులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయాల దగ్గర ఆందోళనలు, నీతి ఆయోగ్‌ సమావేశంలో విభజన అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. అలాగే ప్రధాని ప్రసంగం పూర్తయిన వెంటనే ఏపీ అంశాలను ప్రస్తావించి... సమావేశం నుంచి వాకౌట్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈనెల 17న ఉదయం చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.

cbn 15062018 2

ఇప్పటికే చంద్రబాబు పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక సీఎంలతో మాట్లాడారు. అలాగే పాండిచ్చేరి, పంజాబ్‌, ఢిల్లీ సీఎంలతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. నీతిఆయోగ్‌ సమావేశంలో మాట్లాడాక బాయ్‌కాట్‌ చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా సమాచారం. మరో పక్క బీజేపీ వైఖరి పై కూడా చర్చ జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో గనుల మాఫియా కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అనుచరులకు 9 సీట్లు ఇచ్చి.. అవినీతిపై బీజేపీ పోరాటం అంటే ఎవరైనా నమ్ముతారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి కేసులను ఏడాదిలోపు విచారణ పూర్తిచేయాలని కోర్టులు చెప్పాయని, జగన్‌ కేసులను నాలుగేళ్లుగా నాన్చడాన్ని ఏమనాలని నిలదీశారు. కేసులు బలహీనపర్చాలని చూడటం కుట్ర రాజకీయం కాదా అని సీఎం ప్రశ్నించారు.

 

cbn 15062018 3

ఒకవైపు కడప స్టీల్ ప్లాంట్ అసాధ్యమని కోర్టులో కేంద్రం అఫిడవిట్ వేస్తుందని, మరోవైపు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో లాలూచీ చేస్తారని ఆయన మండిపడ్డారు. మొన్న కేంద్రం స్టీల్ ప్లాంట్‌పై అఫిడవిట్ వేస్తే.. నిన్న బుగ్గన ఢిల్లీ వెళ్లి రాంమాధవ్‌ను కలవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. పొత్తుతో సాధించలేనిది పోరాటంతో సాధించాలని చంద్రబాబు నేతలకు పిలుపు ఇచ్చారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరుపాటుగా ఉండొద్దని సూచించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడాన్ని నిలదీయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసించాలని బాబు పేర్కొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన 18 అంశాలు, 6 హామీలు నెరవేర్చేదాకా పోరాడాలని అన్నారు.

‘ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి?’ అని వైసీపీ నేతలు తరచుగా వేసే ప్రశ్నకు సమాధానం దొరికిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ‘ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అనేది వైసీపీకి ఇష్టమైన ప్రశ్న. దీనికి సమాధానం దొరికింది. వైసీపీ ఎంపీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన సమాధానపు లేఖను ఇక్కడ జతపరుస్తున్నాను. ఇందులో ఉన్న లెక్కలు తప్పా? అందుకే, అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయవద్దని మిమ్మల్ని చంద్రబాబునాయుడు రిక్వెస్ట్ చేసేది. రాష్ట్ర ప్రభుత్వం ఒక బస్సును ఏర్పాటు చేసి, పరిశ్రమల శాఖా మంత్రి వ్యక్తిగతంగా తోడుండి, వైసీపీ నేతలను తీసుకెళ్లి, రాష్ట్రంలో ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేశారో, ఉద్యోగాలు ఎక్కడైతే కల్పించారో వాటిని చూపిస్తారు. ఇందుకు, వాళ్లు సిద్ధమేనా?’ అని తన ట్వీట్లో లోకేశ్ ప్రశ్నించారు.

lokesh 15062018 1

వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్ లో ఇలాంటి ప్రశ్నే వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనుకుని, వారే ఇబ్బంది పడ్డారు... ఈ 4 ఏళ్ళలోఏపీలో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, వాటివల్ల ఎంత పెట్టుబడి రాబోతుంది, ఉపాధి, ప్రస్తుతం పనిచేసేందుకు సిద్ధమైన కెంపెనీలు ఎన్ని, వైసిపీ ఎంపీ ప్రశ్న అడిగితే, దానికి కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్‌ చౌదరి సమాధానం ఇచ్చారు... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు.

lokesh 15062018 1

ప్రతి సంవత్సరం ఎన్ని పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు అనేవి వివరంగా చెప్పారు... చివరగా, ఈ ఒప్పందాల నుంచి, ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు... దీంతో ఇప్పటి వరకు, చంద్రబాబు ఎంత చెప్పినా నమ్మని వారు, కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంతో, నమ్మేలా చేసింది వైసిపీ.... ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వారు కూడా ప్రచారం చేసుకోలేని దానిని, వైసిపీ దేశం మొత్తం వినపడేలా చేసి, మన రాష్ట్ర సత్తా, మన ముఖ్యమంత్రి సత్తా ఈ దేశానికి చాటింది...

రాజధాని అమరావతిలో తొలి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పాటుకానుంది. సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇన్‌వెకాస్‌ సంస్థ అమరావతిలో సెమీకండక్టర్ల తయారీ పార్కును ఏర్పాటుచే సేందుకు ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ సెమీ కండక్టర్ పార్కు కార్యకలాపాలు ప్రారంభమైతే 5000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు వల్ల ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబుతో దీనికి శంకుస్థాపన చేయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గ్లోబల్‌ ఫౌండేషన్‌ తో కలిసి పనిచేస్తున్న ఇన్వికాస్‌ కంపెనీకి ఆ రోజు శంకుస్థాపన చేస్తారు. ఈ కంపెనీతో పాటు మరో 10 సెమీకండక్టర్‌ డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ కంపెనీలు రానున్నాయి. ఈ కంపెనీలన్నింటితో కలిపి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పడుతుంది.

semicounductors 15062018 2

అమరావతిలోని నీరుకొండ గ్రామ ప్రాంతంలో ఇది ఏర్పాటుకానుంది. దీనికి 50 ఎకరాలు కావాలని సదరు కంపెనీలు అడుగుతున్నాయి. అయితే ప్రభుత్వం 37-40 ఎకరాల మధ్యలో కేటాయించనుందని సమాచారం. అమరావతిలో ఐటీ అభివృద్ధికి ఈ సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు మరింత ఊతమిస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ అమరావతికి సమీపంలోని మంగళగిరి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పలు బీపీవో కంపెనీలు, ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీలు వచ్చాయి. అయితే వేగంగా అభివృద్ధి చెందేందుకు, ఐటీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రిసెర్చ్‌ సంస్థలు అవసరం. ఆ దిశగా తొలి అడుగు పడనుంది. నూతన రాజధాని అమరావతి పరిధిలోనే ఇది రానుంది.

semicounductors 15062018 3

మరోవైపు రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌కు ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. రూ.400 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. ఐదు ఎకరాల్లో... 33 అంతస్థులు.. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఒక ఐకానిక్‌ భవనంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ దీనికి నిధులు సమకూరుస్తుంది. ఈ భవనంలో ఐటీ కంపెనీలు, వివిధ సంస్థల కార్యాలయాలు కూడా ఏర్పాటవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐకానిక్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనంలోని 120 ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలకు విక్రయిస్తారు. వారు వీటిలో నివాసం ఉండొచ్చు.. లేకుంటే ఏవైనా ఐటీ కంపెనీలకు అద్దెకు ఇచ్చుకోవచ్చు.

సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త మహితోక్తులు సదా స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే రంజాన్ మాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’ అని ముస్లింలు విశ్వసిస్తారని చెప్పారు.ఉపవాసాలు, దీక్షలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ..ఇవన్నీ ఖురాన్ బోధనల్లో ముఖ్యమైనవని చంద్రబాబు గుర్తు చేశారు. ముస్లింలు నెలరోజుల కఠోర ఉపవాస దీక్షలు ఆచరించారని ఆయన అభినందించారు.

ముస్లింలలో ప్రతి పేద కుటుంబం కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలన్నది తమ అభిమతమని, తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏటా చంద్రన్న రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిరాష్ట్రంలోని 13 జిల్లాలలో 12 లక్షల పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా అందజేశామన్నారు. ముస్లిం కుటుంబాల్లో అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులకు సామాజిక భద్రతా పెన్షన్లిస్తామని చెప్పారు. ఈ ఏడాది (2018-19) రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి 1101.90 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇమామ్స్‌కు, మౌజన్లకు వరుసగా నెలకు రూ.5000, రూ. 3000 గౌరవ పారితోషికం ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు 2016-17లో రూ. 32 కోట్లు కేటాయించగా, 2018-19 బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది నుంచి ‘చంద్రన్న పెళ్లికానుక’లో చేర్చిన ‘దుల్హన్ పథకం’ కింద ముస్లిం నవ వధువులకు రూ 50 వేల వంతున అందిస్తున్నామని, 2018-19లో ఈ పథకానికి రూ.80 కోట్లు కేటాయించాం. 16,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read