తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం టికెట్‌ కావాలంటే, దగ్గరలోని టీటీడీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. మొబైల్‌ ఫోన్‌ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ సౌకర్యాలు పొందేలా, టీసీఎస్‌ సౌజన్యంతో, టీటీడీ మొబైల్‌ యాప్‌ రూపొందించింది. టీటీడీ–గోవిందా మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. మీకు నచ్చిన సమయంలో దర్శనం వివరాలు తెలుసుకోవచ్చు. ఖాళీ ఉంటే వెంటనే ఫోన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. అదెలాగంటే..

టీటీడీ యాప్‌ను ‘https://play.google.com/store/apps/details?id=com.ttdapp’ ఈ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ చేసుకున్నాక మీ మొబైల్‌కు యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. యాప్‌ను ఓపెన్‌ చేశాక రిజిస్ట్రేషన్‌కు తగిన వివరాలు అందించాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ–మెయిల్, ఫోన్‌ నంబరు, ఉంటున్న ప్రదేశం, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి.

దర్శనం టికెట్లు బుక్ చెయ్యాలి అంటే..
దర్శన్‌ ఆప్షన్‌లో మీరు ఎంచుకున్న తేదీ, సమయం, భక్తుల సమాచారం అందించాలి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అయిన వ్యక్తితో పాటు మరో 9 మంది వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అయితే, ప్రతి భక్తుడి ఆధార్‌ నంబరు, మరేదైనా గుర్తింపుకార్డు నంబరు అందించాల్సి ఉంటుంది. దర్శనానికి సంబంధించిన వివిధ సమయాలు, ఆ సమయంలో భక్తుల రద్దీ డిస్‌ప్లే అవుతుంది. రద్దీని బట్టీ వారి సమయాన్ని కేటాయించుకోవచ్చు. దర్శనంతోపాటు ప్రత్యేక పూజల వివరాలు కూడా ఉంటాయి. ఆ సమాచారం యాప్‌ ద్వారా తెలుసుకుని దర్శనంతో పాటు పూజలు కూడా నిర్వహించవచ్చు. దర్శనం/పూజ అనంతరం ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల చొప్పున యాప్‌ ద్వారానే బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి లడ్డూకు రూ.25 అదనంగా చెల్లించాలి.

చెల్లింపుల విధానం: ఆన్‌లైన్‌/యాప్‌ ద్వారా దర్శనం టికెట్‌ రూ.300 ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలి. దీనికి సంబంధించి దేశంలోని 44 అంతర్జాతీయ, జాతీయ, కార్పొరేషన్‌ బ్యాంకులతో టీటీడీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి

యాప్‌ వినియోగంలో సమస్యలు వస్తే టీడీటీ 1800245333333, 18002454141 నంబర్లలో లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read