ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వరుస పెట్టి ఎన్నికలు జరుపుతూ, ప్రతి కేసు కోర్టులో గెలుస్తూ, తమకు ఉన్న అధికారాలను ఉపయోగించి, వరుస పెట్టి ఎన్నికలు నిర్వహిస్తూ ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా పూర్తి చేసి ఇప్పుడే సక్సెస్ అయ్యారు. ఇక వీటి తరువాత, మునిసిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. మార్చి నెల పదవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటి తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సర్కులర్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. అందులో ఏకాగ్రీవలకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైనా సరే బలవంతపు ఏకాగ్రీవాలు జరిగితే, దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే, అలాంటి వాటి పై తగు చర్యలు తీసుకుంటామని, ఆధారాలతో సహా, ఎన్నికల కమిషన్ ను అపోర్చ్ అయితే సరైనా విధంగా, దాని పై చర్యలు తీసుకుంటాం అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక సర్కులర్ కూడా ఇచ్చింది. అయితే దీని పై ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఇప్పటికే ఏకగ్రీవాలు అయిన చోట, మళ్ళీ విచారణ వద్దు అంటూ ప్రభుత్వం కోర్టులో పిటీషన్ వేసింది. 

అయితే ఇందులో విచారణ జరిపిన తరువాత, కోర్టు కూడా వారితో ఏకీభవించింది. అయితే ఎక్కడైతే ఫారం-10 ఇచ్చేసి ఉన్నారో, అక్కడ మళ్ళీ నామినేషన్ వేయటం కుదరదు అని, కోర్టు కూడా తేల్చి చెప్పింది. అయితే ఇవి మధ్యంతర ఉత్తర్వులు అని కోర్టు చెప్పింది. తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు రోజులు క్రితం ప్రెస్ మీట్ పెట్టిన నిమ్మగడ్డ, పరిషత్ ఎన్నికల పై మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కోర్టు తీర్పుకు లోబడి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగిపోతేనే, వాటి పై ఆలోచన చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే, ఆయన ఇప్పుడు పరిషత్ ఎన్నికల నిర్వహణకు విముఖంగా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. వరుస పెట్టి కోర్టులతో పోరాడిన ఎన్నికల కమిషన్, ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. మరి రిటైర్డ్ అయ్యే లోపు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళ్తారా, న్యాయస్థానాల్లో ఏ అడ్దంకులు లేకుండా ముందుకు సాగుతారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read