వైసీపీ వాళ్ల ప్ర‌చార పిచ్చి చూస్తుంటే యావ‌గింపు క‌లుగుతోంది. గ‌తంలో కియా మోటార్స్ విష‌యంలోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తించి తాము బ‌క‌రాలు కావ‌డ‌మే కాదు, ఏకంగా త‌మ కోసం ప‌నిచేసే వైసీపీ పేటీఎం బృందాల‌నీ గొర్రెల‌ని చేసేశారు. కియా మోటార్స్‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి రాష్ట్రానికి చంద్ర‌బాబు తీసుకొచ్చారు. ఆ స‌మ‌యంలో క‌మీష‌న్ల కోసం బాబు తెచ్చార‌ని, అమ్ముడుపోని కార్ల కంపెనీ పెట్టించార‌ని వైకాపా పెద్ద‌లే ఆరోపించారు. తీరా కియా కార్ల ఉత్ప‌త్తి ప్రారంభ‌మై ఏపీ పేరు మారుమోగ‌డంతో ఆ క్రెడిట్ ఎలాగైనా కొట్టేయాల‌ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌తికి వున్న‌ప్పుడే కియా ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని ఆ యాజ‌మాన్యానికి లేఖ రాసిన‌ట్లు ఓ ఫేక్ లెట‌ర్ సృష్టించారు. అంటే జ‌గ‌న్ చేస్తేనే అభివృద్ధి. జ‌గ‌న్ వేస్తేనే శంకుస్థాప‌న అనే చందంగా త‌యార‌య్యారు వైసీపీ టీమ్. వైకాపా అధినేత జ‌గ‌న్ రెడ్డిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి సొంత పార్టీ నేత‌లే కాదు, అధికారులు కూడా గ‌తంలో టిడిపి ప్ర‌భుత్వం చేసిన శంకుస్థాప‌న‌లపై మ‌ళ్లీ శంకుస్థాప‌న‌లు చేయిస్తున్నారు. ఏ ముఖ్య‌మంత్రి అయినా ఆ రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వం వేసిన శంకుస్థాప‌న‌ల‌ని పూర్తి చేస్తారు. దీనికి భిన్నంగా ఆ ప్రాజెక్టుపై గ‌త ప్ర‌భుత్వ ముద్ర ఉండ‌కూడ‌ద‌నే కోణంలో ఏకంగా అదే ప్రాజెక్టుల‌కి మ‌ళ్లీ పేర్లు మార్చి మ‌రీ శంకుస్థాప‌న చేసుకుంటున్నారు. గ‌తంలో టిడిపి ప్ర‌భుత్వం ఉత్తుత్తి శంకుస్థాప‌న చేసింద‌ని, తామే చేస్తున్న‌దే గ‌ట్టి శంకుస్థాప‌న అని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టుకి 4 ఏళ్ల‌ క్రితమే అప్ప‌టి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పుడు కేసులు వేయించి నిర్మాణాలు ముందుకు సాగ‌కుండా అడ్డుకున్న‌ది వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డే. ఇప్పుడు అదే నోటితో భోగాపురం ఎయిర్ పోర్టు తాను క‌డుతున్నాన‌ని, అదే చేత్తో మ‌రోసారి శంకుస్థాప‌న చేశారు. ఐటీ హ‌బ్‌గా విశాఖ తీర్చిదిద్దేందుకు 2019 సంవ‌త్స‌రంలో ఫిబ్ర‌వ‌రి 14న అదానీ డేటా సెంట‌ర్ అండ్ టెక్నాల‌జీ పార్క్ ఏర్పాటుకి ఏపీ సీఎం చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేశారు. మ‌ళ్లీ అదే అదానీ డేటా పార్క్ కి ఇప్పుడు జ‌గ‌న్ శంకుస్థాప‌న చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం 2007 జూన్ 10న అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి భూమిపూజ చేశారు. వైఎస్ చ‌నిపోవ‌డంతో ఆ ఫ్యాక్ట‌రీ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చ‌లేదు. క‌డ‌ప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పూనుకుంటుంద‌ని ప్ర‌క‌టించిన‌ అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు 2018లో శంకుస్థాప‌న చేశారు. త‌న తండ్రి ఓసారి, చంద్ర‌బాబు మ‌రోసారి క‌డ‌ప ఉక్కుకి చేసిన శంకుస్థాప‌నల‌ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా 2019లో సీఎం అయిన‌ జ‌గ‌న్ రెడ్డి డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తాను టెంకాయ కొట్టాన‌ని ప్ర‌క‌టించుకున్నారు జ‌గ‌న్ రెడ్డి. చంద్ర‌బాబే కాదు, త‌న తండ్రి చేసిన శంకుస్థాప‌న‌ల‌ని కూడా ఓర్వ‌లేని జ‌గ‌న్ రెడ్డి పేరుమార్చి ప్ర‌తీ ప్రాజెక్టుకూ మ‌రోసారి శంకుస్థాప‌న చేయ‌డంపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

గడపకీ గడపకీ మన ప్రభుత్వం అని వైకాపా నేతలు వెళ్తుంటే, సమస్యలపై జనం నిలదీస్తున్నారు. దీంతో చాలా మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే కార్య‌క్ర‌మానికి దూరం అవుతూ వ‌చ్చారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కీ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు వైకాపా నేత‌ల్ని నిర్బంధించ‌కుండా, నిల‌దీయ‌కుండా పోలీసుల సాయంతో త‌ప్పించుకునేవారు. ఇది నిన్నా మొన్న‌టివ‌ర‌కూ వైసీపీ నేత‌ల్ని ప్రజలే త‌రిమికొట్టే సంఘ‌ట‌న‌లు ఏపీలో క‌నిపించేవి. ఇటీవ‌ల వైసీపీ కార్యకర్తలే, వైసీపీ ఎమ్మెల్యేలని త‌ర‌ముతున్న వ‌ర‌స సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణని వైసీపీ నేత‌లే చెప్పుల‌తో త‌రిమి త‌రిమి కొట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వ‌హిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణను అడ్డుకున్న వైకాపా కేడ‌ర్‌, చెప్పుల‌తో కొట్టి నిర‌స‌న తెల‌ప‌డంతో అక్క‌డ్నించి పోలీసుల సాయంతో జారుకున్నారు. సోమందేపల్లి మండలం ఈదలబలాపురం పరిధి రేణుకానగర్‌లో ప‌ర్య‌టించిన‌ శంకరనారాయణను వైకాపా నేత‌లు అడ్డుకుని నిర‌స‌న తెలిపారు. అభివృద్ధి లేదంటూ నిల‌దీశారు. ఎమ్మెల్యే శంకరనారాయణ పోలీసుల సాయంతో గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించ‌డంతో వైకాపా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చెప్పులు విసిరి శంకరనారాయణని వెళ్ల‌గొట్టారు.  పోలీసుల సాయంతో అక్క‌డి నుంచి ప‌రారైన మాజీ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌, దీని వెనుక‌ వైసీపీకే చెందిన  నాగభూషణ్ రెడ్డి ఉన్నారని అనుమానిస్తున్నారు. వైసీపీ నాయకుడు నాగభూష‌ణం రెడ్డిని ఆయ‌న అనుచ‌రుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

చేతిలో అధికారం ఉంది. కేంద్రస‌ర్కారు ఆశీస్సులు ఉన్నాయి. ఏపీలో ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసినా, రాజ్యాంగాన్ని ఖూనీ చేసినా ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఇంత‌టి అరాచ‌క వైకాపాలోనూ అభ‌ద్ర‌తాభావం ఉంద‌ని తేలిపోయింది. విప‌క్షాల‌పైనా, అవినీతిని నిల‌దీసే మీడియాపైనా, ప్ర‌శ్నించే ప్ర‌జ‌ల‌పైనా ఇప్ప‌టివ‌ర‌కూ దాడులు చేస్తూ వ‌చ్చిన వైకాపా...ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎటాక్స్ మొద‌లు పెట్టేసింది. వైకాపా పాల‌న‌ని, నేత‌ల‌ని ఏమ‌న‌క‌పోయినా..చంద్ర‌బాబుని ప్ర‌శంసించార‌నే ఏకైక కార‌ణంతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పై ఒంటికాలుమీద లేస్తున్నారు వైకాపా బూతుకేయులు. ర‌జ‌నీకాంత్ ఏపీలో విధ్వంస పాల‌న ఊసెత్త‌లేదు. రాష్ట్రం అప్పులు గురించి ప్ర‌స్తావించ‌లేదు. ప్ర‌జ‌లు క‌ష్టాల ప‌డుతున్నార‌ని ప్ర‌భుత్వాన్ని ఎత్తి చూప‌లేదు. త‌న మిత్రుడైన చంద్ర‌బాబు ఒక రాజ‌కీయ నేత‌గా చేసిన కృషిని ప్ర‌శంసించారు. దీనిపై వైకాపా ఎందుకు ఉలికిప‌డిందో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌మిళ‌నాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ర‌జ‌నీకాంత్ ని ద్వేషించే వాళ్లుండ‌రు. ఆయ‌న కూడా ఎప్పుడూ ఏ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌రు. ఇప్పుడు కూడా ఆయ‌న త‌న మిత్రుడైన చంద్ర‌బాబు ప‌నితీరుని కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో చెప్పారు. ఇందులో వైకాపాకి జ‌రిగిన ఘోర‌మేంటో తెలియ‌దు, న‌ష్టం ఏమిటో అర్థంకాలేదు. గుట్కాలు న‌ములుతూ నానా చెత్త వాగిపోయాడు గుడివాడ నాని. ఇంకా రోజా, నోరు కూడా తిర‌గ‌ని దేవినేని అవినాష్, మ‌హాసాధ్వి ల‌క్ష్మీపార్వ‌తి కూడా ర‌జ‌నీకాంత్‌ని తిడుతూ మీడియాకెక్కారు. వీరికితోడు వైకాపా పేటీఎం కార్మికులు ఫేక్ పోస్టులతో చెల‌రేగిపోతున్నారు. బ‌స్ కండ‌క్ట‌ర్‌గా ర‌జ‌ని ఉన్న‌ప్పుడు ప్ర‌యాణికుల చిల్ల‌ర నొక్కేశాడ‌ని, సిల్క్ స్మిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న కేసులో చంద్ర‌బాబు కాపాడార‌ని..అందుకే ఇలా చంద్ర‌బాబుని ప్ర‌శంసిస్తున్నార‌ని విషం చిమ్ముతున్నారు. ఇదంతా చూసిన రాజ‌కీయ ప‌రిశీల‌కులు ర‌జ‌నీకాంత్ ఏపీ గురించి ఒక్క మాట మాట్లాడ‌క‌పోయినా, వైకాపా ఊసెత్త‌క‌పోయినా..ఇంత‌లా విరుచుకుప‌డుతున్నారంటే..ఏ స్థాయిలో పార్టీలో అభ‌ద్ర‌తాభావం పెరిగిపోయిందో అర్థం అవుతోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇదంతా ఓట‌మి భ‌యం, జైలు భ‌యం అని విడ‌మ‌రిచి మ‌రీ చెబుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం పూర్తిగా పాల‌న గాలికొదిలేసింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మండువేస‌విలో అకాల‌వ‌ర్షాల‌తో రైతాంగం అత‌లాకుత‌ల‌మైపోయింది. ప‌రామ‌ర్శించేందుకు మ‌న‌సు రాని ప్ర‌భుత్వం తీరుపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పంట‌లు నేల‌కొరిగి అన్న‌దాత‌లు ల‌బోదిబోమంటుంటే స‌ర్కారు ఆదుకుంటామ‌నే కంటితుడుపు ప్ర‌క‌ట‌న కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై జ‌నం మండిప‌డుతున్నారు. ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. చెప్పిన‌ట్టే రాష్ట్ర‌మంతా భారీ నుంచి అతి భారీవ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల ముప్పు ఉంద‌ని ప్ర‌జ‌ల్ని, రైతుల్ని హెచ్చ‌రించాల్సిన ప్ర‌భుత్వ యంత్రాంగం చేష్ట‌లుడిగి  చూస్తోంది. పంట‌లు పోయి రైత‌న్న‌లు ల‌బోదిబోమంటుంటే, ఏపీ మంత్రులు ర‌జ‌నీకాంత్‌ని తిట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వానికి హాజ‌రైన ర‌జ‌నీకాంత్ చంద్ర‌బాబు పాల‌నాద‌క్ష‌త‌ని ప్ర‌శంసించ‌డ‌మే ఆయ‌న చేసిన నేరం అన్న‌ట్టు వైసీపీలో మంత్రులు, స‌ల‌హాదారులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చిన బూతుల‌తో ర‌జ‌నీకాంత్‌ని తిడుతూ కాలం గ‌డుపుతున్నారు. ఇదే స‌మ‌యంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా అకాల వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ ప్రకటించినా ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌లేదు. భారీవ‌ర్షాల‌కు పంట‌లు పోయినా క‌నీసం ఎంత న‌ష్టం జ‌రిగిందో ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేయ‌ని ప్ర‌భుత్వం తీరుపై అన్న‌దాత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read