తెలంగాణ ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా ఏపీలో వైసీపీ సర్కారుని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తోంది. వాస్తవానికి వైసీపీతో టీఆర్ఎస్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే తమని తాము ప్రమోట్ చేసుకునే క్రమంలో ఏపీని చిన్నచూపు చూసినా వైసీపీ పాలకులు ఏమీ అనలేరనే ధీమాతోనే తరచూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఏపీలో పరిస్థితులపై ధ్వజమెత్తుతూనే ఉంటారు. తెలంగాణ పాలకులు తమకి బోర్డర్‌లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర జోలికి మాత్రం వెళ్లరు. ఈ రాష్ట్రాల వారి జోలికెలితే వారు ఒక రేంజులో కౌంటరిస్తారు. ఏపీలో అయితే తిట్టినా, కొట్టినా పడి ఉంటారనే ధీమాతోనే తెలంగాణ పాలకులు తమని తాము గొప్పగా చూపించుకునేందుకు ఏపీని అన్ని విషయాల్లో తక్కువ చేసి చూపుతుంటారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడు, ట్రబుల్ షూటర్ అయిన తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై అసక్తి కరమైన కామెంట్స్ చేసారు. ఆంధ్ర ,తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా, ఏ రాష్ట్రంలో పాలన బాగుందో మీరే ఆలోచించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో రహదారులు ఎలా ఉన్నాయో ,అభివృద్ధి ఎలా ఉందో చూడండి...అంటూ ఏపీలో రోడ్ల దయనీయస్థితిని ఎత్తి చూపారు. కార్మికులు ఆంధ్రలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు పొందితే..మీ బతుకులు బాగుంటాయంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ నుంచి ఏ ఒక్క మంత్రీ స్పందించకపోవడం విచిత్రం.
news
టిడిపి మహిళా నేత అంత నేరం ఏం చేసిందో?
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణిని ఎంత దౌర్జన్యకరంగా అరెస్టు చేశారో రాష్ట్రప్రజలంతా చూశారు. అయితే ఆమె చేసిన నేరమేంటో తెలుసా? గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ గూండా మూకలు దాడులు చేస్తుంటే, అడ్డుకోని పోలీసులని నిలదీసింది. బాధితురాలి స్థానంలో న్యాయం చేయాలని ఆక్రోశించింది. అదే రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉన్న మన రాష్ట్రంలో ఘోరమైన నేరం. దళిత డ్రైవర్ ని చంపి ఇంటి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీలకు ఘనస్వాగతాలు పలికే అరాచకస్వామ్యంలో ఒక మహిళని ఎంత అగౌరవంగా, దుర్మార్గంగా అరెస్టు చేశారో ప్రజలంతా విస్తుపోయి చూశారు. బెడ్రూంలోకి చొరబడి, కనీసం దుస్తులు మార్చుకునే టైం ఇవ్వకుండా అత్యంత ఘోరంగా వ్యవహరించిన పోలీసులు మూల్పూరి కళ్యాణఙ భర్త సహా మరో ఇద్దరిపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లిన గన్నవరం పోలీసు సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దుర్భాషలాడి.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారంటూ గన్నవరం ఎస్సై రమేష్ ఇచ్చిన ఫిర్యాదుపై హనుమాన్ జంక్షన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 353, 341, 509ల కింద కేసు నమోదు చేశారు. A1గా భర్త మూల్పూరి సురేంద్ర కుమార్, A2గా అరుణ్ కుమార్, A3గా మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నిస్తే కేసు. తమపై దాడులు జరుగుతుంటే అడ్డుకుంటే కేసు. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన తీరు.
బెదిరింపులు కేసీఆర్ కేనా ? జగన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా మోడీజీ ?
ప్రధాన మంత్రి మోదీ వైఖరి చూస్తుంటే జగన్ రెడ్డి ఏమి చేసినా రైట్, కేసీఆర్ ఏ తప్పు చేయకున్నా రాంగ్ అన్నట్టుంది పరిస్థితి. శనివారం సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని.. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారన్నారు. తెలంగాణలో తండ్రి, కొడుకు, కుమార్తె ఇలా అందరూ అధికారంలో ఉన్నారని.. కుటుంబ పాలక కారణంగానే అవినీతి పెరిగిపోయిందన్నారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. 42 వేల కోట్ల అవినీతిలో ఆల్రెడీ 30 కేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ మాట్లాడరు. పరిమితికి మించి అప్పులు చేసినా, ఇంకా అప్పులు జగన్ రెడ్డికి ఇస్తూనే ఉన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాములో 100 కోట్లు చేతులు మారాయని కేసీఆర్ కుమార్తెని టార్గెట్ చేసిన బీజేపీ పెద్దలు..అదే స్కాముతో సంబంధం ఉన్న వైసీపీ నేతల జోలికి రావడంలేదు. ఏపీలో ప్రజల ప్రాణాలు తీస్తోన్న మద్యం ద్వారా వేలకోట్లు జగన్ సిండికేట్ కొల్లగొడుతోందని ఆరోపణలున్నా ఇటువైపే దృష్టి పెట్టడంలేదు. అంటే జగన్ రెడ్డికి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టున్నారు.
జగన్ కి స్నేహహస్తం అందిస్తూనే స్నేక్‌లా కాటేస్తున్న కేసీఆర్
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వేలకోట్లు ఖర్చు చేశారు. వ్యవస్థలని మేనేజ్ చేశారు. దీనికి ప్రతిఫలంగా తెలంగాణ సీఎం ఏం కోరుకుంటే ఏపీ సీఎం అది చేసి పెడుతూ వచ్చారు. ఇద్దరి మధ్యా విడదీయరాని ఆర్థిక, సంబంధాలు పెనవేసుకుపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలో ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో ఎవరికి వారే తమని తాము కాపాడుకుని అధికారం నిలబెట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కి ఏపీలో అడుగు పెట్టేందుకు ఒక ఊతం కావాలి. అదే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం. అటు బీజేపీని ఎదిరించేలా, ఇటు ఏపీలో తమ పార్టీని విస్తరించే ప్రణాళికలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రకటించారు. విశాఖలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ బహిరంగ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారు తోట చంద్రశేఖర్ వెల్లడించారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా పక్కరాష్ట్రమైన తెలంగాణ ఏకంగా కేంద్రంతో ఢీకొట్టడానికి రెడీ అవుతుంటే...ఏపీ సర్కారు మాత్రం చేష్టలుడిగి చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ మిత్రుడైన కేసీఆర్ తన మనుగడ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో తమని ఇరకాటంలో పెట్టేస్తున్నారని వైసీపీ నేతలు లబోదిబోమంటున్నారు.