జీఎస్టీ. గూడ్స్ అండ్ స‌ర్వీస్ టాక్స్‌. దేశ‌మంతా వ‌స్తుసేవ‌ల ప‌న్నురూపంలో ఒకే దేశం-ఒకే ప‌న్ను విధానం అమ‌లు అవుతోంది. ఒక్క ఏపీలో జీఎస్టీతోపాటు జేఎస్టీ కూడా చెల్లించాల‌ట‌. జేఎస్టీ అంటే జ‌గ‌న్ సెల్ఫ్ ట్యాక్స్. ఇదీ ఏపీలో జ‌గ‌న్ రెడ్డి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నుంచీ బ‌ల‌వంతంగా వ‌సూలు చేస్తున్న ట్యాక్స్‌. దీనిపై తెలుగుదేశం జె ట్యాక్స్ పేరు పెట్టింది. జ‌గ‌న్ రెడ్డికి ఒక‌ప్పుడు అత్యంత స‌న్నిహితుడు అయిన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఆదినారాయ‌ణ రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఈ జ‌గ‌న్ సెల్ఫ్ ట్యాక్స్ గురించి వివ‌రించాడు. టిడిపి ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లనూ జెఎస్టీ కోసం వేధించార‌ని, అవి క‌ట్ట‌లేక చాలా ప‌రిశ్ర‌మ‌లు విస్త‌ర‌ణ నిలిపేశార‌ని చెప్పుకొచ్చారు. వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికి గ‌త ఎన్నిక‌ల్లో వారి కోసం ప‌నిచేసిన మైసూరారెడ్డికి చెందిన తేజా సిమెంట్స్ జ‌గ‌న్ సెల్ఫ్ ట్యాక్స్ క‌ట్ట‌లేక ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌లేద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పారు. కేంద్రం విధించే జీఎస్‌టీ కంటే ఏపీలో జేఎస్టీ చాలా పవర్‌ఫుల్ అని, ‘జగన్‌ సెల్ఫ్‌ ట్యాక్స్‌’ను పారిశ్రామిక‌వేత్త‌లు తట్టుకోలేకపోతున్నార‌ని ఆరోపించారు. జగన్‌కు ఆస్తులు ఎన్నిచోట్ల ఉన్నాయో ఆయనకే తెలియద‌ని చెప్పుకొచ్చారు. కేర‌ళ‌లో అనంత పద్మనాభస్వామికి నేలమాళిగలు ఉన్నట్లే ఎన్ని నేలమాళిగలు ఉన్నాయో లెక్కేలేద‌ని, ఆయన అనంత పద్మనాభస్వామి అయితే.. ఈయన అనంత జగన్నాథస్వామి అంటూ జ‌గ‌న్ అవినీతిని బ‌య‌ట‌పెట్టారు.

ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిని వైసీపీ స‌ర్కారు  ఒక ఇంచు కూడా క‌ద‌ల్చ‌లేదా? అమ‌రావ‌తి అంతానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా  ఫ‌లించ‌క‌పోవ‌డంతో చివ‌రికి సుప్రీంకోర్టులో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్న వైసీపీ స‌ర్కారుకి చుక్కెదురు కాక త‌ప్ప‌ద‌ని న్యాయ‌నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌తో అమ‌రావ‌తిని నాశ‌నం చేయాల‌నుకుంటే, రాజ్యాంగ‌మే ప్ర‌జారాజ‌ధానికి ర‌క్ష క‌ల్పిస్తోంద‌ని అంటున్నారు. కేఎం జోసెఫ్ వ్యాఖ్యలతో ట్విస్ట్.అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఫాస్ట్ ట్రాక్ లో నిర్వహించాలని ఏపీ స‌ర్కారు లాయ‌ర్లు చేసిన‌ విజ్ఞప్తిని న్యాయమూర్తి కేఎం జోసెఫ్ తోసిపుచ్చారు. ఈ వ్యవహారం రాజ్యాంగ పరమైన అంశాలతో ముడిపడి ఉందని చెప్ప‌డంతో కేసు విష‌యంలో స‌ర్కారుకి స్ప‌ష్ట‌త వ‌స్తోంద‌ని అర్థం అవుతోంది. అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేందుకు రాజ్యాంగపరమైన ఆంశాల్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. దీన్ని సాధారణ బెంచ్ కంటే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్న అమ‌రావ‌తి రైతుల‌కు న్యాయ‌మూర్తి కేఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా క‌లిసి వ‌స్తున్నాయి. వీలైనంత తొంద‌ర‌గా సుప్రీంకోర్టు విచార‌ణ ముగిస్తే, విశాఖ‌కి రాజ‌ధాని షిఫ్ట్ చేసేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. కోర్టులో ఉన్న అంశం అని కూడా చూడ‌కుండా ప‌దేప‌దే తానిక్క‌డ‌కే వ‌చ్చేస్తున్నాన‌ని, ఇదే రాజ‌ధాని అని ప్ర‌క‌టిస్తున్నారు. అయితే విచార‌ణ త్వ‌రిత‌గ‌తిన  పూర్తి చేయాల‌నే డిమాండ్‌ని ధ‌ర్మాస‌నం తోసిపుచ్చ‌డంతోపాటు ఓ రాష్ట్ర భవిష్యత్తు, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన ఈ పిటిషన్ల విచార‌ణ‌ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నంకి అప్ప‌గించేలా జ‌డ్జి వ్యాఖ్య‌లున్నాయి.రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పే అంతిమ‌తీర్పు కానుంద‌ని, దీనిపై ఏ అప్పీల్ కి వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వైసీపీ ఈ అవ‌కాశాన్ని సుప్రీంకోర్టు-కేంద్రం మ‌ధ్య వివాదానికి వాడుకుని ల‌బ్ధి పొందే ఎత్తుగ‌డ‌ల‌కు తెర‌తీస్తోంద‌ని వార్త‌లు వస్తున్నాయి.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే మొద‌టి నుంచీ బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ కిష‌న్ రెడ్డికి అవ్యాజ‌మైన ప్రేమ‌. హిందుత్వమే అజెండాగా న‌డిచే బీజేపీలో కీల‌క‌నేత అయిన కిష‌న్ రెడ్డి, క్రిస్టియ‌న్ అయినా జ‌గ‌న్ రెడ్డితో అనుబంధం కొనసాగించ‌డంలో ఎటువంటి మొహ‌మాటం ప‌డ‌రు. సుప్రీంకోర్టులో ఉన్న రాజ‌ధాని అంశంపైనా జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోసం కేంద్ర‌మంత్రి అయి ఉండి విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు కిష‌న్ రెడ్డి.దీంతో తీవ్ర దుమారం రేగ‌టంతో మ‌ళ్లీ మాట మార్చారు కిషన్‌ రెడ్డి. ఏపీ రాజధాని అమరావతి అని దిద్దుబాటు ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్టణం రాజధాని అని తాను అన్న మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదని కిష‌న్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని బీజేపీ ఇదివరకే ప్ర‌క‌ట‌న ఇచ్చింద‌ని, దీనికే తామంతా క‌ట్టుబ‌డి వున్నామ‌ని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.ఏపీలో బీజేపీ నేత‌ల‌కు, కిష‌న్ రెడ్డికి ఇష్టంలేక‌పోయినా అమ‌రావ‌తే రాజ‌ధాని అని కేంద్ర పెద్ద‌లు సంకేతాలు ఇవ్వ‌డంతో అయిష్టంగానే వారు స్పందిస్తున్నారు. జ‌గ‌న్ రెడ్డి కోసం ఏకంగా కోర్టులో ఉన్న అంశంపైనే కిష‌న్ రెడ్డి మాట్లాడారంటే, ఎంత‌గా ఆ ప్రేమ ఉందో తేట‌తెల్లం అవుతుంది.

విశాఖ‌లో రెండు రోజుల గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ ముగిసింది. వైసీపీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక నాలుగేళ్ల‌కి నిర్వ‌హించిన స‌మ్మిట్ కావ‌డంతో ప‌బ్లిసిటీ బాగానే చేసుకున్నారు. అయితే ఇన్వెస్ట‌ర్లు బ‌దులు వైసీపీ కార్య‌క‌ర్త‌లు, వైసీపీ సోష‌ల్మీడియా టీము, ఐప్యాక్ ఆర్టిస్టులు స‌మ్మిట్లో హ‌ల్చ‌ల్ చేశారు. వీరి చేతిలో ఒప్పంద ప‌త్రాలు పెట్టి ఎంవోయూలు చేసుకున్నామ‌ని బాగానే క‌ల‌రిచ్చారు. అయితే కోతికి కొబ్బ‌రి ముక్క దొరికిన‌ట్టు, వీరికి సూటూ బూటూ వేసినా వారి క‌క్కుర్తిని నివారించ‌లేక‌పోయారు. భోజ‌నాల ద‌గ్గ‌ర‌, గిఫ్టుల ద‌గ్గ‌ర కాట్ల కుక్క‌ల్లాగ ఎగ‌బ‌డి కొట్టుకుని స్టాళ్లు విర‌గ్గొట్టేశారు. దీనిపై కేసు పెట్టార‌ని మీడియాకి లీకులిచ్చారు. ఇది విప‌క్షాల కుట్ర ఖాతాలో వేద్దామ‌నుకున్నారు. కానీ స‌మ్మిట్‌కి వ‌చ్చిన వాళ్లంతా వైసీపీ వాళ్లే. ఎవ‌రిపై కేసు పెడ‌తారు? ఎవ‌రిని బుక్ చేయ‌గ‌ల‌రు?  దీంతో మౌనం వ‌హించారు. స‌మ్మిట్‌కి డెలిగేట్లుగా వెళ్లిన బీచ్ రోడ్డులో ఐస్ క్రీములు అమ్మేవాళ్లు, వైసీపీ ఆఫీసు బోయ్స్ కూడా వీవీఐపీ పాసులు, సూటుబూటుల‌తో దిగిన ఫోటోల‌ను గొప్ప‌గా సోష‌ల్మీడియా పోస్టు చేశారు. వీటిని ప‌ట్టుకుని గూగుల్ చేసి వీడు డెలిగేట్ కాదు కేటుగాడంటూ టిడిపి ఆటాడుకుంటోంది. ఐప్యాక్ వాళ్ల పుట్టుపూర్వోత్త‌రాలు లాగేసి ఇన్వెస్ట‌ర్లు కాదు, ఐప్యాక్ ఆర్టిస్టుల‌ని నిరూపించారు. అలాగే ఫిల్మోజీ చాన‌ల్ వాడు ఓ ఒప్పందం, ర‌వి ట్రావెల‌ర్ అనే యూట్యూబ‌ర్‌తో మ‌రో ఎంవోయూ, వైజాగ్ డెస్టినీ అనే పేజీ న‌డిపించే వైసీపీ సోష‌ల్మీడియా వాడితో ఇంకో ఎంవోయూ కుదుర్చుకున్నార‌ని వరి సోష‌ల్మీడియా పోస్టుల ద్వారా వెల్ల‌డైంది. మొత్తానికి 13 ల‌క్ష‌ల కోట్లలో ఎన్ని పెట్టుబ‌డులు వ‌స్తాయో తెలీదు కానీ..వైసీపీ, ఐ ప్యాక్ వాళ్ల‌ని ఇన్వెస్ట‌ర్లుగా క‌ల‌ర్ ఇవ్వడానికి కొన్న కోట్లు మాత్రం మిగిలాయి.

Advertisements

Latest Articles

Most Read