వైఎస్ జగన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ బయలు దేరుతున్నారు. మొన్ననే అసెంబ్లీ సమావేశాలను వదిలేసి మరీ ఢిల్లీ వెళ్లి వచ్చి తన తమ్ముడు వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన అవినాశ్ రెడ్డి అరెస్టుని ఆపగలిగాడు. అయితే దర్యాప్తు అధికారిని బదిలీ చేయించలేకపోయాడు. అలాగే సుప్రీంకోర్టు వివేకా కేసు దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇంక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని నిర్ణయించుకున్న సీఎం జగన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ బాటపట్టాడు. అవినాష్ రెడ్డి కూడా వివిధ కోర్టుల్లో రకరకాలుగా పిటిషన్లు వేస్తూ దర్యాప్తుని నీరుగార్చే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అరెస్టు తప్పదని నిర్ధారించుకున్నట్టున్నాడు. తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ పిటిషన్ వేయడంతో ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర నిర్ధారణ అయ్యిందని, అరెస్టు తప్పకపోవచ్చని, అందుకే యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశారని వైసీపీలోనే అంతర్గత చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ, ఆధారాలు చిక్కడంతో అరెస్టు చేయవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో బెయిల్ పిటిషన్ దాఖలుతో వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి సాక్షి కాదు నిందితుడేనని స్పష్టం అవుతోందని న్యాయవాదులు చెబుతున్నారు.
news
రామోజీపై ఏ1 ముద్ర వేసిన జగన్... రామోజీ రియాక్షన్ అదిరింది...
సీబీఐ ఈడీ నమోదు చేసిన 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ జగన్ రెడ్డి ఏ1. ఈ కేసుల ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ రెడ్డిని ఏ పత్రికైనా ఏ1గానే రాస్తుంది. చివరికి అదే అక్రమ సంపాదనతో పెట్టుకున్న సాక్షిలో కూడా సీబీఐ-ఈడీ క్విడ్ ప్రోకో కేసులు గురించి వార్త రాయాల్సి వస్తే ఏ1 జగన్ రెడ్డి అనే రాస్తాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి నైజం, బుద్ధి వేరు. తనని అరెస్ట్ చేశారు కాబట్టి, తన ప్రత్యర్థులందరూ అరెస్టు కావాలి. తాను దొంగతనం మానడు, దొంగ అంటే ఊరుకోడు ఇదీ జగన్ మెంటాలిటీ. తన పేరుని అక్రమాస్తుల కేసుల సందర్భంగా ఏ1 అని రాసిన ఈనాడుపై కక్ష కట్టారు. ఎవరూ ఫిర్యాదు ఇవ్వకుండానే తన అధికారయంత్రాంగాన్ని పంపి కేసులు నమోదు చేయించారు. ఫిర్యాదులేవు, అక్రమాలు లేవు. కేవలం జగన్ రెడ్డి తనని ఏ1 అన్న రామోజీరావు పేరు పక్కన ఏ1 అని పెట్టాలనే శాడిజం కోరికతోనే ఈ కేసులు నమోదయ్యాయని అధికారులే ఆఫ్ ది రికార్డుగా చెప్పేస్తున్నారు. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ ఏ1గా రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజను పేర్కొంది. ఈ కేసులో రామోజీరావు కోడలు శైలజకు , రామోజీరావుకు సైతం నోటీసులు పంపింది. ఈ నెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిన ఈ కేసుల్లో చాలా రోజులుగా సోదాలు చేస్తున్నారు. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజ, ఏ 3 గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీరావుకి ఊడిపోయేదీ ఏమీ ఉండదు. కానీ రామోజీరావుని ఏ1 చేశాననే పైశాచిక ఆనందం ఒక్కటే జగన్ రెడ్డికి మిగులుంది.
జగన్ సర్కారుకి సుప్రీం ఝలక్.. ప్రభుత్వ లాయర్ పై కోర్ట్ ఆగ్రహం..
అమరావతి నుంచి రాజధానిని పీకేసి విశాఖలో దుకాణం తెరవాలని ఏపీ సీఎం జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఎంత తొందర పడుతోందో, సుప్రీంకోర్టులో అంత ఆలస్యం అవుతోంది. రేపు విశాఖ రాజధాని తరలింపు, ఎల్లుండి తరలిస్తామంటూ ప్రకటనలు ఇస్తోన్న వైసీపీ పెద్దలకు అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణని జూలై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించడంతో ఏపీ సర్కారు షాక్ తగిలింది. త్వరగా అమరావతి రాజధాని కేసులను విచారించాలని సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు లేవనెత్తారు. కేసు విచారణ జులై 11న చేపడతామని , అంతకు ముందు సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని మరోసారి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరగా స్టే ఇచ్చేందుకు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం నిరాకరించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని, వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమతి కోరగా ధర్మాసనం అంగీకరించింది. పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్యంగా బ్రేక్ పడింది. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఏర్పాట్లు చేసుకున్న ప్రతీసారి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. తాజాగా త్వరితగతిన విచారణకి నో చెప్పిన ధర్మాసనం, హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరించడం జగన్ రెడ్డికి పెద్ద దెబ్బే.
వైసీపీలో ఏమి జరుగుతుంది ? నెల్లూరులో మరో వైసీపీ పెద్దారెడ్డి పక్కచూపులు ?
వైసీపీలో నెల్లూరు పెద్దారెడ్డి సునామీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ దూరం పెట్టగా వారు డైరెక్టుగా జగన్ రెడ్డిపైనే ఎదురుదా-డికి దిగుతున్నారు. ఇంతలోనే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ వీడుతారని వార్తలు వచ్చాయి. ఇవి ఆయన ఖండించారు. అయితే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కచూపులు చూస్తున్నారని సమాచారం. కావలి ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాపరెడ్డికి టికెట్ ఇవ్వరని వైసీపీలో బాగా టాక్ నడుస్తోంది. ఐప్యాక్ నివేదికల్లోనూ ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నాయట. దీంతోపాటు వందలకోట్లతో వైసీపీలో దిగిన బీద మస్తాన్ రావు తన వారసుడి కోసం కావలి టికెట్ అడుగుతున్నారు. ఇది తెలుసుకుని ఇక తనకి టికెట్ వచ్చే అవకాశంలేదని డిసైడైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టిడిపి నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం బయటకు పొక్కింది. అయితే కావలిలో మరో ఎంపీ వైసీపీకి ఆర్థిక అండదండలు అందించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య ప్రశాంతిరెడ్డికి టికెట్ అడుగుతున్నారని, ఆయనని కాదని ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వరని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఆర్థికంగా అనకొండల్లాంటి ఇద్దరు ఎంపీలు కావలి టికెట్టుపై దృష్టి పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కపార్టీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.