ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని అవినీతి ఉద్యోగులపై కేసుల నమోదుకు ఏపీ ఏసీబీ సిద్ధమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు లేదా లంచం అడిగినట్లు ఫిర్యాదులు అందితే వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసింది. విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ, ఏసీబీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.

ap police 23112018

 ప్రధానంగా సీబీఐకి సాధారణ సమ్మతి నిరాకరించిన అంశంపైనే చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేందుకు ఏసీబీకి ఉన్న అధికారాలు, తదుపరి దశలో విచారణకు అనుమతి తీసుకునేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశాలను పరిశీలించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టొచ్చని తేల్చారు. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశించేందుకు అవకాశం లేనందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైనా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ap police 23112018

ఇప్పటివరకు కేంద్ర ఉద్యోగులపై సీబీఐ మాత్రమే దాడులు నిర్వహించేది. అయితే... సీబీఐకి సాధారణ అనుమతి రద్దు నేపథ్యంలో ఏసీబీ చర్యలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే దాడులకు సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఉన్నతాధికారులు సమావేశమైనట్లు తెలుస్తుండగా ఈ సమావేశంలో న్యాయపరమైన ఇబ్బందులపైనా చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడటం, లంచాలు అడగటం చేస్తే, నిరభ్యంతరంగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తే, వాళ్ళ తాట తీస్తారు.

అనంతలో మరో జలాశయం అందుబాటులోకి వచ్చింది. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొల్లపల్లి జలాశయాన్ని కృష్ణమ్మతో నింపగా, తాజాగా ఆ జాబితాలో మారాల జలాశయం కూడా చేరింది. అతి కొద్ది రోజుల్లోనే చెర్లోపల్లి జలాశయంలో కూడా కృష్ణమ్మ సవ్వడులు కన్పించనున్నాయి. తాజాగా మారాల జలాశయ పరిధిలో 18 వేల ఎకరాల ఆయకట్టుకి భరోసా లభించింది. ఈ జలాశయంలో కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో పలు అవాంతరాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ కృష్ణమ్మను వీలైనంతగా ముందుకు తీసుకెళ్లడంలో తెదేపా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి మొదలయ్యే హంద్రీనీవా, అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయం వరకు మొదటి దశగా పేర్కొంటారు. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది.

ఈ రెండో దశలో పెండింగ్‌ పనులు పూర్తిచేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2016 చివర్లో మడకశిర బ్రాంచి కాల్వపై ఉన్న గొల్లపల్లి జలాశయానికి కృష్ణమ్మను తీసుకెళ్లి నింపారు. ఇక గత ఏడాది లేపాక్షి వరకు నీటిని తరలించారు. ఈ ఏడాది మడకశిర వరకు నీటిని తీసుకెళ్లేలా చూస్తున్నారు. అలాగే హంద్రీనీవా ప్రధాన కాల్వల ద్వారా గత ఏడాది పుట్టపర్తి వరకు నీటిని తీసుకెళ్లారు. వాస్తవానికి గత ఏడాదే కృష్ణా జలాలను మారాల జలాశయనికి తీసుకెళ్లాలని భావించారు. అయితే బుక్కపట్నం మండల పరిధిలోని 9వ ప్యాకేజీలో భాగంగా 358 కి.మీ నుంచి 360 కి.మీ. వరకు 2 కి.మీ. మేర తవ్విన సొరంగం పనులు పూర్తికాకపోవడం అవరోధంగా మారింది. ఇందులో సొరంగం తవ్వుతుంటే ఎగువ నుంచి మట్టి పడిపోతుండటంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఎంతో ఇబ్బందిగా మారిన ఈ పనులను ఎట్టకేలకు ఇటీవలే పూర్తిచేసి, నీటిని ముందుకు తీసుకెళ్లగలిగారు. అలాగే ప్యాకేజీ 11లో కూడా పెండింగ్‌ పనులను పూర్తిచేయించారు.

మారాల జలశాయం... కృష్ణమ్మ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఎట్టకేలకు ఈ జలాశయం జలకళను సంతరించుకుంది. ఇది ప్రధాన కాల్వపై 371.040 కి.మీ. వద్ద నుంచి సమీపంలోని ఆఫ్‌లైన్‌లో ఉంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.483 శతకోటి ఘనపుటడుగులు (టీఎంసీలు) కాగా, తొలిసారిగా ఈ జలాశయాన్ని నీటితో నింపుతుండటంతో.. 0.2 టీఎంసీల మేర నీటిని నిలపాలని భావిస్తున్నారు. ఈ జలాశయ పరిధిలోని 18 వేల ఎకరాల ఆయకట్టుకి ఇక సాగు కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే జలాశయంలో నీరు రావడం మొదలవడంతో సమీప గ్రామాల రైతుల పొలాల్లోని బోర్లు రీఛార్జి అవుతున్నాయి. వెరసి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఏటా వర్షాల కోసం చూడటం, వెంటనే బెంగళూరుకు పనుల కోసం వలస పోవడం అలవాటైంది. ఇక వలసపోయే అవసరమే లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలాశయంలో 0.2 టీఎంసీల మేర నీరు నిలిచిన తర్వాత, ప్రధాన కాల్వపై ముందుకు తీసుకెళ్లి, పుంగనూరు బ్రాంచి కాల్వకు మళ్లించి, దానిపై ఉన్న చెర్లోపల్లి జలాశయానికి

అగ్రిగోల్డ్‌ బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయి అని ఎంతో ఆశ పెట్టుకుంది, ‘హాయ్‌ల్యాండ్‌’ భూములు ఉన్నాయని. అవి వేలం వేస్తే తమ డబ్బులు తమకు వస్తాయని అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటికప్పు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అయితే ఈ ప్రక్రియ అవ్వకుండా, బీజేపీ, వైసీపీ నేతలు చెయ్యని ప్రయత్నం లేదు. ఇందులో భగంగా, హాయ్‌ల్యాండ్‌ మాది కాదు అంటూ యాజమాన్యం వాదనను తమకు అనుకూలంగా మలుచుకుని, దాన్ని చంద్రబాబు, లోకేష్ పైకి నెట్టి, హాయ్‌ల్యాండ్‌ భూములు చంద్రబాబు నొక్కేస్తున్నాడు అంటూ, కొత్త వాదన మొదలు పెట్టారు. అయితే ఈ కుట్రను వారం రోజుల్లో పోలీసులు చేధించారు.

hailand 23112018

హాయ్‌ల్యాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అల్లూరి వెంకటేశ్వరరావుతో ‘దొంగ’ అఫిడవిట్‌ దాఖలు చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అల్లూరి సీఐడీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. హాయ్‌ల్యాండ్‌పై పితలాటకానికి తెరలేపిన నేపథ్యంలో ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హైకోర్టు ఆదేశాల మేరకు హాయ్‌ల్యాండ్‌ను వేలంలో విక్రయిస్తే తక్కువ డబ్బులే వస్తాయని, అసలు అది ‘అగ్రిగోల్డ్‌’ ఆస్తికాదని చెబితే పూర్తిగా మిగిలిపోతుందని చైర్మన్‌ అవ్వారు వెంకట రామారావు ఆలోచించారు. ఏలూరు జైలులో ఉన్న ఆయన వద్దకు అల్లూరి వెంకటేశ్వరరావును సంస్థ టెక్నికల్‌ అడ్వైజర్‌ రవికాంత్‌ తీసుకెళ్లారు. ములాఖత్‌లో భాగంగా వీరు కలిశారు. ‘‘హాయ్‌ల్యాండ్‌ ఎంతో ఖరీదైన ఆస్తి! వేలంలో తక్కువ ధరకే పోతుంది. అందుకే... హాయ్‌ల్యాండ్‌ మాది కాదని మేం చెబుతాం. అది మీదేనని కోర్టులో పిటిషన్‌ దాఖలు చెయ్‌’’ అని వెంకటరామారావు సూచించారు.

hailand 23112018

నిజానికి... వెంకటేశ్వరరావు హాయ్‌ల్యాండ్‌లో ఒక ఉద్యోగి మాత్రమే. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆయన ఎండీ హోదాలో నెలకు రూ.70వేల జీతం తీసుకుంటున్నారు. హాయ్‌ల్యాండ్‌ వ్యవహారంపై ఏపీ సీఐడీ చీఫ్‌ అమిత్‌ గార్గ్‌ సమక్షంలో వెంకటేశ్వరావును ప్రశ్నించారు. తనకేమీ తెలీదంటూనే అది తనది కాదని, అగ్రిగోల్డ్‌ యాజమాన్యానిదేనని చెప్పేశారు. నెలకు రూ.లక్ష జీతం కూడా లేని తనకు వందలకోట్ల విలువైన ఆస్తులు ఎలా వస్తాయని అన్నారు. మరి, కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ సంగతేమిటని నిలదీయగా... ‘‘రవికాంత్‌ నన్ను ఏలూరు జైలులో ఉన్న చైర్మన్‌ వద్దకు తీసుకెళ్లారు. హాయ్‌ల్యాండ్‌కు అగ్రిగోల్డ్‌తో సంబంధం లేదనేలా అఫిడవిట్‌ వేయాలని చెప్పారు. లీగల్‌ అడ్వైజర్‌ ఉదయ్‌ దినకర్‌ మొత్తం వివరాలు చెప్పి నాతో అఫిడవిట్‌పై సంతకం చేయించారు’’ అని వివరించినట్లు తెలిసింది. ఈ వివరాలతో శుక్రవారం హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. అయితే ఈ డ్రామా అంతా బయట పడటంతో, బీజేపీ, వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం, ఈ ప్రక్రియ పట్ల బీజేపీ హస్తం ఉందని, ఆ కుట్ర బయట పెడతాం అని చెప్తున్న నేపధ్యంలో, ఈ కుట్ర బయట పడింది.

పవన్ అన్నయ్యా......నీ సభల్లో ఆవేశంగా నువ్వు ఏదేదో మాట్లాడడం చూసి నేను కూడా ఏదో ఆవేశంలో ఇలానే ఇంకా ఏదేదో రాసేశా....... తరువాత అనిపించింది అనవసరంగా ఆవేశంలో ఏదో మాట్లాడాను, కాస్త ఆలోచించి మాట్లాడాల్సింది అని..... కానీ ఆలోచించిన తరువాత అనిపిస్తుంది.....నువ్వు ఆంధ్రకి అస్సలు కరెక్ట్ కాదు అనిపిస్తుంది......అసలు నీ సభలు సమావేశాలు చూస్తే ఏముంది కొత్తగా చెప్పడానికి ? అదేమంటే పంచెలూడదీస్తా అంటావ్.......ఎవరి పంచెలు వాళ్ళు ఊడదీసుకోలేరా? అందరి పంచెలు నువ్వేవచ్చి ఊడదీయాలా? నీ ప్యాంటుజిప్పు పెట్టుకోడమే నీకు సరిగారాదు......ఏ సినిమాలో చూసినా ప్యాంటు మీద ప్యాంటు వేసుకొని జిప్పు పెట్టుకోకుండా అదే ఫ్యాషన్ అంటావ్.......అవంటే సినిమాలు కాబట్టి సరిపోయింది.....కానీ ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు.....

pk 23112018 2

కాబట్టి అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకొచ్చావ్? నీ లక్ష్యాలేమిటి? రైతులకి నువ్వేం చేస్తావ్? పేద ప్రజలకి ఏం చేస్తావ్? రాజధాని కూడా లేని రాష్టానికి నువ్వేం చేయగలవు.....ఇలాంటి వాటి గురించి చెప్పకుండా బహిరంగ సభల్లో నీ ఎదవసోధి మాకెందుకు చెప్పు? లేదంటే తోలు తీస్తా..... తాట తీస్తా అంటావ్....నువ్వేదో మటన్ కొట్టు మస్తాన్ లాగ.......నువ్వు తోలు తీస్తే, ఎదుటి వాడు చూస్తూ కూర్చుంటాడా, వాళ్ళు తీయలేరా? నీకంటే చదువులేదు కాబట్టి తెలియదులే....ఏదో పరిపక్వతలేక ఆలా మాట్లాడావ్ అనుకుందాం.....కానీ నిన్ను చూసి నీ అభిమానులు కూడా అలానే మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రప్రజలు కూడా తెలంగాణాలో కేసీఆర్ , ఇక్కడ నువ్వు మాట్లాడే బూతులే మన అధికారభాష అనుకునే ప్రమాదం వుంది......కానీ ఇది తప్పు పవన్.......మనతో ఏవిధమైన రక్త సంభంధం అనేదిలేకుండా, ఏ కల్మషం లేకుండా మనల్ని నమ్ముతున్న అభిమానాన్ని డబ్బుకోసం అమ్ముకుంటున్నావ్ ......ఇది మోసం.....నమ్మక ద్రోహం అనిపించడం లేదా?

pk 23112018 3

వర్షాలు పడి కాల్వలకు నీళ్లు రాగానే పంటలకు సీజన్ మొదలయినట్లు ఎలక్షన్స్ కి ఒక సంవత్సరం ముందు నుంచి మీ అన్నదమ్ములకు వసూళ్ల సీజన్ మొదలవుతున్నట్లుంది....... అప్పట్లో మీ అన్న టిక్కెట్లు అమ్మి కోట్లు వసూలు చేసి, తరువాత వందలకోట్లకి పార్టీనికూడా అమ్మి మంత్రి పదవి ఒకటి ఆయనకి ఉంచుకున్నాడు.....మంత్రిగా మీ అన్న ప్రజా ప్రయోజనం కోసం చేసిన ఒక్క పని గుండెమీద చెయ్యేసుకొని చెప్పమను? ఇప్పుడు నీకు టైం వచ్చింది....నువ్వు వసూళ్ళు మొదలుపెట్టావ్......దీన్ని ఎవరూ అడ్డుకోకుంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మీ అన్నకొడుకులో ఎవరోఒకరు మీలాంటి నాటకాలు మొదలెడతారు.....మీకు ఇదో కుటుంబ వ్యాపారమయిపోయింది నలుగురిని మంచి బాట లో నడిపించాల్సిన నాయకుడే ఇలా ఉంటే ఇంకా ఆ పార్టీ ఎలా ఉంటుందో ఊహించొచ్చు.......నువ్వు మాట్లాడే మాటలు పేపర్లలో, టీవీల్లో చూస్తూనే వున్నాం.......రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి.....రాజధాని అభివృద్ధి చెందాలి......పరిశ్రమలు కావాలి.......కొత్త ఉద్యోగాలు రావాలి........సాఫ్ట్ వేర్ కంపెనీలు రావాలి....మన రాష్ట్ర యువత తనకాళ్లమీద తాను నిలబడాలి...... ఇవన్నీ నీలాంటి వ్యక్తికి కనీసం ఊహించడానికి కూడా కష్టతరమైన బాధ్యతలు.......ఎంతో ఓర్పు కావాలి.........నేర్పు కావాలి......చాణక్యత కనబరచాలి......చాతుర్యం ప్రదర్శించాలి .......ఎక్కడ నెగ్గాలో...ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి.......అసలు ఇవన్నీ తెలుసుకునేంత పరిణితికూడా నీకులేదు.......ఇవన్నీ నీకు ఉన్నాయని ఇన్నాళ్ళు భ్రమల్లో ఉంచని మాకు, తగిన బుద్ధి చెప్పావ్... కాబట్టి ప్రియమైన పవన్ అన్నయ్యా..... మమ్మల్ని ప్రతి సారి మీ ఫ్యామిలీ నుంచి ఎలక్షన్ కి ఒకడు వచ్చు, మార్చి మార్చి, బకరాలు చెయ్యకండి.. రాజకీయాల్లో నువ్వు ఇప్పటిదాకా సంపాదించుకున్నది చాలు....సైడయిపో......

Advertisements

Latest Articles

Most Read