రాష్ట్ర సాగునీటి చరిత్రలో నవ శకానికి ప్రభుత్వం నాంది పలుకుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి- కృష్ణా అనుసంధానంతో పవిత్ర సంగమంతో రికార్డు సృష్టించిన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి గోదావరి- పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. నదుల అనుసంధానంతోనే కర వు నిర్మూలన సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతాంగానికి సాగునీరందించేందుకు గోదావరి- పెన్నా అనుసంధానం కీలకం కానుంది. తొలిదశలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరందించే ఈ పథకం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ఐదు దశల్లో గోదావరి- పెన్నా అనుసంధానం పనులు చేపడతారు. తొలిదశ లో పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి నుంచి ప్రస్తుతం ఉన్న పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణానదికి మళ్లించిన నీటిని గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం గ్రామం వద్ద అంటే నాగార్జునసాగర్ కుడికాలువ 80వ కిలోమీటర్ వద్ద ఎత్తిపోతల ఏర్పాటు కానుంది.

ఈ మహాయజ్ఞంలో భాగంగా తొలిదశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంచనా విలువ రూ. 83, 976 కోట్లు. తొలిదశ పనులు పూర్తయి తే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో 79 మం డలాల పరిధిలోని 9లక్షల 61వేల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటి కొరత శాశ్వతంగా తీరనుంది. గుం టూరు జిల్లాలో గుంటూరు, ప్రత్తిపాడు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, కొండేపి, ఒంగో లు, దర్శి, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గా ల్లో రైతాంగానికి తొలిదశ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుంది. పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పట్టిసీమ నుంచి 8500 క్యూసెక్కులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 6870 క్యూసెక్కులు కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి మళ్లించిన నీటిలో కృష్ణాడెల్టా వినియోగానికి 7వేల క్యూసెక్కులు, మిగిలిన 7వేల క్యూసెక్కులు గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం నుంచి 5 అంచెలుగా నకరికల్లు గ్రామం వద్ద నాగార్జునసాగర్ జవహర్ కాల్వలో కలుపుతారు. ఈ ఐదు అంచెల్లో 10.25 కిలోమీటర్ల దూరం ఎత్తిపోతల పథకం పైపుల ద్వారా, 56.35 కిలోమీటర్లు గ్రావిటీ కాల్వ ద్వారా 73 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జవహర్ కాల్వలోకి పంపుతారు.

తొలి ఎత్తిపోతల ద్వారా కృష్ణానది నుంచి ఒక కిలోమీటరు లీడింగ్ చానల్ తర్వాత ఒకటో కిలోమీటరు వద్ద హరిశ్చంద్రాపురం గ్రామ శివారులో 17 నుంచి 24 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 1.1 కిలోమీటరు వద్ద గ్రావిటీ కెనాల్‌లో వదులుతారు. అక్కడి నుండి 11.5 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. రెండవ ఎత్తిపోతల పథకం ద్వారా 11.5 కిలోమీటర్ల వద్ద లింగాపురం గ్రామ శివారులో లెవల్ 22.55 నుంచి 42 లెవల్ వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 13.55 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కెనాల్‌లో వదులుతారు. ఇక మూడవ ఎత్తిపోతల ద్వారా 35.25 కిలోమీటర్ల వద్ద ఉయ్యందన- తాళ్లూరు గ్రామ శివారులో లెవల్ 37.64 మీటర్ల నుంచి 65 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 37.75 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కెనాల్‌లో కలుపుతారు. నాలుగో ఎత్తిపోతల పథకం ద్వారా 47.25 కిలోమీటర్ల వద్ద గంగిరెడ్డిపాలెం (రాజుపాలెం) దగ్గర లెవల్ 62.53 మీటర్ల నుంచి 107.30 మీటర్ల వర కు 7వేల క్యూసెక్కుల నీటిని 51.75 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కా లువతో కలుపుతారు. ఐదో ఎత్తిపోతలలో 65.44 కిలోమీటర్ల వ ద్ద నకరికల్లు గ్రామ పరిధిలో లెవల్ 103.93 మీటర్ల నుంచి 140 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కులు నాగార్జున సాగర్ జవహర్ కా లువ 80వ కి.మీ వద్ద కలపటం ద్వారా తొలిదశ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ తొలిదశ పథకానికి భూ సేకరణతో కలిపి రూ. 6020.15 కోట్ల వ్యయం అవుతుంది. దీంతో పాటు సాగర్ కుడికాల్వ కింద ఉన్న శివారు ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. సాగునీటితో పాటు మంచినీటిని పుష్కలంగా అందించే వీలు కలుగుతుంది.

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, చంద్రబాబుని ప్రధాన ప్రత్యర్ధిగా, చంద్రబాబే ఎన్నికల ఎజెండాగా మార్చేసి, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ చేస్తున్న విమర్శల దాడి పై చంద్రబాబు స్పందించారు. కొందరు రాజకీయ నాయకులు తెదేపాను విమర్శిస్తూ ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అటువంటి పరిస్థితులను చూసే తెలంగాణలో తాము ప్రజాకూటమిలో చేరామన్నారు. కేసీఆర్‌కు తనను విమర్శించే హక్కులేదన్నారు. అనంతపురంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..

kcr 24112018 2

‘‘కేసీఆర్‌ ప్రతి రోజూ మనల్నే తిడతారు. ఎందుకు తిడతారో నాకైతే అర్థంకాలేదు. హైటెక్ ‌సిటీ కట్టించినందుకా? హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలిపిందుకా? ఓ గొప్ప హైదరాబాద్‌ నగరాన్ని తెలుగు జాతి కోసం ఇస్తే సరిగా పాలించకుండా నన్ను విమర్శించే హక్కు మీకెక్కడిది. కేసీఆర్‌ తెదేపాను విమర్శిస్తూ.. మోదీతో లాలూచీ పడ్డారు. అది చూసిన తర్వాతే ప్రజాకూటమికి ఒప్పుకున్నాం. నిన్న యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు తెలంగాణ ఇచ్చామని, ఎక్కువ ఆదాయం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు’’ అని చంద్రబాబు అన్నారు.

kcr 24112018 3

టీ.టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణలో కూటమి పనితీరుపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీ టీడీపీ.. మహాకూటమిగా ఎన్నికల బరిలో నిలిచింది. మహాకూటమిలో భాగంగా తెలంగాణలో పరిమిత స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా ప్రచారం నిర్వహించనున్నారు.

ఓ పవన్ కళ్యాణ్, ఓ కేఏ పాల్ లాంటి కామెడీ ఆక్టర్లు, ప్రతి ఎన్నికలు ముందు వచ్చి హడావిడి చెయ్యటం చూస్తూ ఉంటున్నాం. అయితే వీళ్ళ మాటలని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఈ కోవలనే, పవన్ కళ్యాణ్ ని చూస్తూ వస్తున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా, చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎప్పుడూ లైన్ దాటలేదు. మొన్నటి దాక పవన్ కు ఎంతో గౌరవం ఇచ్చారు. పవన్ విమర్శలు చెయ్యటం మొదలు పెట్టిన తరువాత, పవన్ పై సుతి మెత్తగా విమర్శలు చేస్తున్నారే కాని, ఎక్కడా తీవ్ర విమర్శలు చెయ్యలేదు. అయితే పవన్ కళ్యాణ్ రోజు రోజుకీ రెచ్చిపోతున్నాడు.

cbn 24112018 2

వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, చంద్రబాబు ముసలోడు, లోకేష్ బాడీ పై విమర్శలు చెయ్యటం, ఇలా రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు. అయితే, ఈ రోజు చంద్రబాబు, పవన్ పై చేసిన విమర్శలు చూస్తుంటే, ఇక పవన్ కళ్యాణ్ ని ఏమాత్రం ఉపేక్షించ కూడదని, అనుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు అనంతపురంలో పవన్ కల్యాణ్‌ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న చిరంజీవి పార్టీని అమ్ముకుని పోతే.. అదే చేసేందుకన్నట్టుగా పవన్ వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ పవన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

cbn 24112018 3

నాడు తన సిధ్ధాంతాలు రైటని, నేడు తననే మొసగాడంటున్నాడని.. పవన్ ఓ ఊసరవెళ్ళి అంటూ జనసేనానిపై మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి, టోపీలు వేయడానికి అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు వచ్చాయని.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. జగన్ కోడి కత్తి.. అంతా ఓ డ్రామా అన్నారు. పీఎం మోదీని ఎదిరించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నానని.. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎదుర్కోవడానికి తాను సిధ్ధమన్నారు. మరోవైపు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర విభజన అనంతరం పుట్టెడు అప్పులు నెత్తిన పెట్టుకుని ఆర్థిక లోటుతో వుండే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబి నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే..మిగులు బడ్జెట్ తో విభజించబడిన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో దిగిపోతోందని సాక్షాత్తు ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై అప్పు 22.2 శాతం పెరిగిందనీ... 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది 12.7 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు: ఆదాయ వ్యయాలపై అధ్యయనం’ పేరుతో... దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదిక వెలువరించింది.

ap 24112018 1

రుణమాఫీలతో పాటు ప్రయివేటు పెట్టుబడుల ప్రయోజనాలను దెబ్బతీసే మితిమీరిన అప్పుల కారణంగా పలు రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయని కేంద్రీయ బ్యాంకు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్బీఐ లెక్కప్రకారం జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి పెరగడమంటే ఆర్థిక నిర్వహణ అసమర్థంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ దారుణంగా ఉందంటూ తెలంగాణపై కాగ్ వెలువరించిన వార్షిక నివేదికను సైతం ఆర్బీఐ సమర్థించింది. తెలంగాణలో కేవలం ఒక్క ఏడాదిలోనే అభివృద్ధియేతర వ్యయం (పరిపాలనా పరమైన ఖర్చులు) ఇంతలా ఎలా పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో విస్మయం వ్యక్తం చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధియేతర వ్యయం 3.4 శాతంగా ఉండగా... ఈ సారి ఇది ఏకంగా 35.2 శాతానికి ఎగబాకడం గమనార్హం.

ap 24112018 1

మరోవైపు రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు 9.1 శాతం తగ్గాయని ఆర్బీఐ పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీపై 36.4 శాతం అప్పులుండగా... గత ఆర్థిక సంవత్సరంలో ఇది 27.3 శాతానికి దిగిరావడం విశేషం. కాగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఇటీవల తెలంగాణ అప్పులపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రూ.2.2 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆయన విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ... ‘‘కె. చంద్రశేఖర్‌రావు అప్పులు చేసి విపరీతంగా ఖర్చుపెట్టారు. ప్రస్తుతం ఆయన రూ. 2.20 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా మిగిల్చి వెళ్తున్నారు. అలాంటి అప్పుల్లో గనుక ఓ కంపెనీ ఉంటే అది దివాళతీయడం ఖాయం..’’ అని పేర్కొన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read