వైసీపీ బిజెపి తెరాస ఒక్కటే అని ఇప్పటికే చెప్తుంటే నమ్మని వారు, ఈ వార్తా చూసైనా నమ్ముతారేమో. ఇప్పటికే జగన్, పవన్, మేము తెలంగాణాలో పోటీ చెయ్యటం లేదు అంటూ చేతులు ఎత్తేసారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాగూ, అక్కడ ఉన్న జగన్, పవన్ వర్గం, ఓట్లు వేసేది తెరాస పార్టీకే. అందుకే అనవసరంగా ఓట్లు చీల్చటం ఎందుకని, వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, వీళ్ళు, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ గెలిస్తే, మనకు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి అనుకూలం అని చెప్తున్నారు.

ktr 25112018

శనివారం అందరం కలిసి కేటీఆర్ కు మద్దతు తెలుపుదాం అంటూ హైదరాబాద్ లో వైసీపీ కార్యకర్తలకు వాట్స్ అప్ మెసేజ్ వెళ్ళింది. దీని ప్రకారం, కేటీఆర్ సమక్షంలో అందరూ కలిసి సమావేశం అయ్యారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ సింగిల్‌గా వస్తున్నారని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫొటోలను బ్యానర్లపై ముద్రించడాన్ని కూడా వారు తప్పుబట్టారు.

ktr 25112018

p style="text-align: justify;">వైఎస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైఎస్ అవినీతిపరుడని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, రాహుల్ ప్రచారానికి వస్తామంటున్నారని.. ముందు వైఎస్‌పై వాళ్లిద్దరూ అభిప్రాయం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్ట్రను వెనక్కునెట్టి మన రాష్ట్రం ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పంటల వాటాయే మూడింట రెండొంతులుగా ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు సూక్ష్మ సేద్య సాగు పెరుగుతుండటం కూడా ఉత్పత్తి పెంపుదలకు దోహదపడుతోంది.

ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్‌, దానిమ్మ, తైవాన్‌ జామ, పుచ్చ, కర్బూజనే కాకుండా.. విశాఖపట్నంలో యాపిల్‌, రాయలసీమలో ఖర్జూర సాగుపైనా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే పండ్లలో రాష్ట్ర వాటా అయిదేళ్ల కిందట 10.54 శాతం మాత్రమే ఉండేది. గడచిన రెండేళ్లలో ఇది 15 శాతానికి చేరుకోవడం గమనార్హం. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చాలని ఆ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. దీనితో పాటు కోస్తా జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగు విస్తరిస్తోంది. 2016-17లో ఉద్యాన పంటల సాగు 39.81 లక్షల ఎకరాల్లో ఉంటే.. 2017-18 నాటికి 41.61 లక్షల ఎకరాలకు చేరింది.

అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ సాగు చేసే పండ్ల తోటల్లో అరటి, మామిడి ఎక్కువగా ఉన్నాయి. మామిడికి చిత్తూరు, అరటికి అనంతపురం కీలకంగా మారాయి. ఇక్కడ సాగు క్రమంగా పెరుగుతుండటంతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అధిక ఉత్పత్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి మామిడి నేరుగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన వైపు ఔత్సాహిక రైతులు కూడా దృష్టి సారిస్తున్నారు. అనంతపురం నుంచి 3,613 టన్నుల అరటి ఎగుమతి చేసినట్లు ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి తెలిపారు. నింజా కార్ట్‌ ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. మహారాష్ట్రకు చెందిన దేశాయ్‌ ఫ్రూట్స్‌ సంస్థ కూడా ఏటా 30 వేల టన్నుల అరటి ఎగుమతికి ముందుకొచ్చిందని వివరించారు.

ఈగలు వచ్చినా, దోమలు వచ్చినా చంద్రబాబే.. తన కారే వెళ్లి లారీని ఢీ కొట్టినా చంద్రబాబే.. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిదానికి చంద్రబాబు పనేనని చెప్పడంలో ఎందుకు తాపత్రయపడుతున్నారు? సర్వం చంద్రబాబే అనే భావన తేవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ ఇద్దరు ఎలాగైనా చంద్రబాబును చెడు చేయాలని మంచి చేస్తున్నారా? తెలంగాణ ప్రచారంలో సెంటర్ పాయింట్ ఎవరు? ఏపీలో జగన్ సభకు ఆవును పంపింది ఎవరు? పవన్ కాన్వాయ్ కారు లారీని ఢీ కొ్ట్టడానికి కారణం ఎవరు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయమిది.

cbn 25112018 2

తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం టీఆర్ఎస్ ఎలా ఉపయోగించుకుంటుందో.. అంత కంటే ఎక్కువగా జగన్, పవన్‌లు చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు. బాబుపై ఆరోపణలు చేయడానికి వారు చిన్నదా.. పెద్దదా.. అని చూడ్డంలేదు. ఏదైనా తమకు ఇబ్బంది కలిగింది అంటే దానికి కారణం చంద్రబాబే అంటున్నారు. పోరాట యాత్రను పవన్ శ్రీకాకుళం జిల్లా ప్రారంభించారు. అప్పటికే బాబు, లేకేష్‌లను ఆయన వ్యక్తిగత శత్రువులుగా భావించారు. పలాస పోరాటయాత్రకు వెళ్లి ఓ కళ్యాణ మండపంలో బస చేశారు.

cbn 25112018 3

అప్పుడు కరెంట్ పోయింది. ఆ తర్వాత కవాతు చేస్తున్నప్పుడు కొన్ని గెదెలు పోరాట యాత్రకు ఎదురొచ్చాయి. ఆ కవాతు చూసి గెదెలు బెదిరాయి. కరెంట్ పోవడానికి, గెదెలు రావడానికి చంద్రబాబు కుట్రే కారణమని పవన్ విమర్శించారు. అదే తరహాలో జగన్ కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన విజయనగరం శివారులో పాదయాత్ర చేసి మాట్లాడుతున్న సమయంలో ఓ ఆవు వచ్చింది. ఇరుకు రోడ్డులో సభ జరుగుతున్న ప్రాంతంలో ఆవు ఇరుక్కుపోయింది. దాన్ని పక్కకు పంచించి.. దాన్ని చంద్రబాబే పంపారని జగన్ ఆరోపించారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని ఆరోపించడంలో వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదిరినట్లుగా ఉంది. Source:andhrajyothy

సేవ్ కంట్రీ-సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సీఎం చంద్రబాబు దేశాన్ని ఏకం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్నిదించాలనే లక్ష్యంగా ఆయన కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలిశారు. చంద్రబాబు పిలుపుతో బీజేపేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఈ పక్రియలో భాగంగా చంద్రబాబు దూకుడు పెంచారు. బీజేపేతర పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు వ్యూహానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేకపక్షాలతో దేశవ్యాప్తంగా భారీ సభలు, ర్యాలీల నిర్వహణకు సీఎం కసరత్తు చేస్తున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలతో జరుపుతున్న చర్చల్లో సీఎం ఈ ప్రతిపాదనలు తీసుకువస్తున్నారు.

cbn mahakutami 25112018 2

డిసెంబరు 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్లమెంట్‌ వేదికగా మహాకూటమి ఏర్పాటుకు నాంది పడనుంది. మహాకూటమికి రోజురోజుకూ స్పందన పెరుగుతోందని, కూటమిలో చేరే పార్టీల సంఖ్య పెరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. ఒడిసాలో బీజేడీ కూడా మహాకూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని, ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే బాబుతో చర్చించినట్లు తెలుస్తోందన్నారు. జనవరిలో మమతా నిర్వహిస్తున్న ర్యాలీకి హాజరయ్యేందుకు బీజేడీ అంగీకరిం చిందన్నారు.

cbn mahakutami 25112018 3

కశ్మీరులో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రెండూ కూటమిలో చేరేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. జేడీయూ కూడా ఎన్డీయేకు గుడ్‌ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో ప్రస్తుతం కాంగ్రెస్‌, తెలుగుదేశం,ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం, జార్ఖండ్‌ వికాస్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ దళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read