గుడ్డలూడదీస్తాం... మడిచి ఎక్కడో పెట్టుకో... ఈ మాటలు అన్నది ఎవరో దారిన పోయే వారో లేక, సాదా సీదా గల్లీ రాజకీయ వేత్తో కాదు. ఒక శాసనసభకు స్పీకర్. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. ఒక సభలో, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక స్పీకర్ సంబోధించిన మాటలు ఇవి అంటే, ఆశ్చర్యం కలగక మానదు. ఈ మాటలు అన్నది, ఆంధ్రర్పదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం. మొన్నా మధ్య కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ్మినేని సీతారం, ఈ రోజు చంద్రబాబుని పేరు పెట్టి మరీ పిలిచి, ప్రజల ముందు గుడ్డలూడదీస్తాం, నీ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చెయ్యటం సంచలనంగా మారింది. సహజంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఎంతో హుందాగా, రాజకీయాలకు అతీతంగా ఉంటారు. అలాంటిది, ఇక్కడ ఒక ప్రతిపక్ష నేత పై, మనసులో ఇంట కక్ష, పగ పెట్టుకుని, స్పీకర్ స్థానంలో కూర్చుంటున్నారు.

speaker 07112019 2

ఈ రోజు అగ్రిగోల్ద్ బాధితులకు జగన్ ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తమ్మినేంటి, అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ పన్నాగం పన్నారని అన్నారు. చంద్రబాబు బండారం మొత్తం బయటపెడతామని అన్నారు. చంద్రబాబుని ప్రజలముందు గుడ్డలూడదీసి నుంచో పెడతాం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో అనుభవం ఉందని డబ్బా కొట్టే చంద్రబాబు, ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అందరకీ 10 వేలు ఇస్తానని చెప్పి, బాధితులు పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా వారికి చెల్లింపులు చెయ్యలేదని అన్నారు.

speaker 07112019 3

తాను ముందు ఎమ్మెల్యేని అంటి, తరువాతే స్పీకర్ ని అని, అన్ని విషాయల పై స్పందిస్తానని, చంద్రబాబు చేసిన మాయలు అన్నీ బయట పెడతానని, యనమల, సియం రమేష్ కి కూడా, ఈ కుట్రలో భాగం ఉందని అన్నారు. అయితే స్పీకర్ గా ఉంటూ రాజకీయ విమర్శలు చెయ్యకూడదు, అది నైతికం. అయితే తమ్మినేని రాజకీయ విమర్శల వరకు చెప్పి ఉంటే బాగానే ఉండేది కాని, ఇలా నోటికి వచ్చినట్టు, సామాన్య ప్రజలు రోడ్డు మీద మాట్లాడిన మాటలు మాట్లాడటం మాత్రం తప్పు. ఒక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్, ఇంత వల్గర్గ మాట్లాడడం చాలా బాధాకరం. పదవి కంటే ముఖ్యం సంస్కారం. భవిష్యత్తులో మహిళా సోదరీమణులు వార్తలు కూడా వినలే రేమో. ప్రజలు గమనిస్తున్నారు, కనీసం మాట్లాడే విధానం మార్చుకోండి. మీరు స్పీకర్ గా ఈ వ్యాఖ్యలు చెయ్యలేదు, ఎమ్మెల్యేగా ఈ వ్యాఖ్యలు చేసాను అంటున్నారు కాబట్టి, ఆ హోదాకు అయినా, గౌరవం ఇచ్చి, మాట్లాడాలని మనవి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, అత్యధిక కాంక్రీట్ ఒక్కరోజులో పోసి, ప్రపంచ రికార్డు నెలకొల్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గిన్నిస్ బుక్ లో ఎక్కించిన నవయుగ సంస్థని, కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నుంచి, అలాగే పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. నవయుగ పనులు అందుకున్న తరువాత, జెట్ స్పీడ్ తో దూసుకెళ్ళిన పనులు, 73 శాతానికి చేరుకున్నాయి. అయితే చంద్రబాబు, నవయుగ కంపెనీకి ఎక్కువ డబ్బులు ఇచ్చి, లంచాలు తీసుకున్నారని జగన్ ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, నవయుగని తప్పించి, రివర్స్ టెండర్ అని చెప్పి, మేఘా కంపెనీకి పనులు అప్పగించారు. అయితే, రివర్స్ టెండరింగ్ లో మేఘా ఒక్కటే పాల్గునటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది పక్కన పెడితే, తమను సరైన కారణం లేకుండా తప్పించారని, నవయుగ ఆరోపించింది.

navayuga 07112019 2

పోలవరం హెడ్ వర్క్స్ విషయంలో, ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ సబ్ కాంట్రాక్టు తీసుకుంది కాబట్టి, ఆ వర్క్ విషయంలో ట్రాన్స్ ట్రాయ్ మాత్రమే కోర్ట్ కు వెళ్ళగలదు, కాని వారు వెళ్ళలేదు. అయితే పోలవరం హైడల్ పవర్ ప్లాంట్ విషయంలో మాత్రం, నవయుగ కంపెనీ డైరెక్ట్ గా తీసుకుంది కాబట్టి, ఆ విషయంలో కోర్ట్ కు వెళ్ళింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ లో కేసు వేసింది. ఏపి జెన్కో ఆగష్టు 14న ఒప్పందాన్ని రద్దు చేయటంతో, నవయుగ కోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్టు సింగిల్‌ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వుల పై స్టే ఇచ్చారు. అయితే ఆ ఉత్తర్వులు ఎత్తేయాలని, ప్రభుత్వం మరో పిటీషన్ వేయగా, గత 31న సింగిల్‌ జడ్జి స్టే ఎత్తేస్తూ, కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.

navayuga 07112019 3

అయితే సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల పై, నవయుగ ధర్మాసనం ముందు అప్పీల్‌ కు వెళ్ళింది. ప్రభుత్వం మమ్మల్ని అకారణంగా తొలగించిందని, సరైన కారణాలు చెప్పలేదని, ప్రభుత్వాన్ని వదిలే పని లేదు అంటూ, హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందుకు వెళ్ళింది. తమకు తగిన కారణం చెప్పకుండా, ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసారని, జెన్కో ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సరిగ్గా పరిశీలించకుండా ఆదేశాలు ఇచ్చారని, నవయుగ పెర్కుంది. ఒప్పందంలో ఉన్న వాటికి విరుద్ధంగా ఈ తొలగింపు జరిగిందనే విషయాన్ని సింగిల్‌ జడ్జి గ్రహించలేదని పేర్కొన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు సరిగ్గా జరగలేదన్న వంకతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణ కాంట్రాక్టును రద్దు చేసారని, రెండూ వేరు వేరు ఒప్పందాలని, రెండు పనులకు తేడా ఉందని, నవయుగ పేర్కొంది. పూర్తి ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం మధ్యవర్తిత్వ నిబంధన కారణంతో గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడం సరికాదు అని అప్పీల్‌లో పేర్కొన్నారు.

చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను రెండు రోజుల క్రితం ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఎల్వీ సుబ్రమణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం ఈ రోజు, ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరి బాధ్యతలను ఎల్వీ సుబ్రమణ్యం, తాత్కాలిక చీఫ్ సెక్రటరీకి నీరబ్‌కుమార్‌కు ఈ రోజు అప్పగించారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఎల్వీ మాత్రం బాపట్లలో హెచ్‌ఆర్‌డీ డీజీగా బాధ్యతలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ఆయన సెలవు పై వెళ్ళిపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెల 6వ తేదీ వరకు సెలవు పెట్టారు. అయితే ఎల్వీ ఇలా సెలవు పై వెళ్ళటం పై, రకరకాల వాదనలు వనిపిస్తున్నాయి. తనను అవమానకరంగా తప్పించారని, ఎల్వీ సుబ్రమణ్యం తన సన్నిహితులు వద్ద బాధపడుతున్నారని సమాచారం.

lvs 0611209 2

అయితే ఆయాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం పై ట్రిబ్యునల్ కు వెళ్లి, ఏపి ప్రభుత్వం నిర్ణయం పై చాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరో పక్క, ఎల్వీ కేంద్రాని సర్వీస్ లకు కూడా వెళ్ళే అవకాసం ఉందని, దాని పై కూడా ఆయన కేంద్రంతో మాట్లాడుతున్నారని సమాచారం. చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసిన తరువాత, ఉన్నట్టు ఉండి ఇలా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే అంశం పై, కేంద్రం కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఇంటలిజెన్స్ ద్వారా, పూర్తీ వివరాలు సేకరించిందని, కేంద్రం కూడా ఏపి ప్రభుత్వ నిర్ణయం పై, చీఫ్ సెక్రటరీని ఇలా సాగనంపటం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఆయన్ను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

lvs 0611209 3

ముఖ్యంగా 5 నెలలు పైగా ఆయనకు సర్వీస్ ఉండగా, ఆయన్ను చీఫ్ సెక్రటరీ స్థానం నుంచి బదిలీ చెయ్యటం పై, కేంద్రం ఆగ్రహంగా ఉందని సమాచారం. ఎన్నికల సమయంలో, కేంద్రం అప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీని మార్చి, ఎల్వీ సుబ్రహ్మణ్యం ను పెట్టింది. అంటే, ఆయన కేంద్రానికి దగ్గరగా ఉన్నారని అక్కడే తెలుస్తుంది. మొదట్లో జగన్ కు, ఎల్వీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అన్నా అన్నా అంటూ, జగన్ మోహన్ రెడ్డి, ఎల్వీని ఆకాశానికి ఎత్తే వారు. అయితే, ఏమైందో ఏమో కాని, జగన్ తన ప్రినిసిపాల్ సెక్రటరీ ద్వారా, ఎల్వీకి పొమ్మనలేక పొగ పెట్టారు. దానికి రియాక్ట్ అయిన ఎల్వీ, పరిధులు దాటటంతో, ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన మరుసటి రోజే బదిలీ అయిపోయారు. ఇప్పుడు సెలవు పై వెళ్ళిపోయారు.

తిరుపతి పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి సభా వేదిక వద్దకు బయల్దేరగా, స్వాగతం చెప్పేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి సమీపంలోని ఐతవోలు వద్ద పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘మేము యుద్ధానికి పోవడంలేదు, ప్రభుత్వంపై దాడికి రాలేదు. నాపై అభిమానంతో స్వాగతం చెప్పేందుకు వచ్చిన యువకుడి తల పగులకొడతారా..? ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా యువతరం వస్తే అక్కసుతో రభస చేస్తారా..? చినబయలుపల్లి యువకుడు పాకాల హేమంత్ ను తీవ్రంగా గాయపరుస్తారా..? నా పాలనలో పోలీసులకు, వైసిపి పాలనలో పోలీసులకు ఎంత తేడా ..? చాలామంది సీఎంలను, డిజిపిలను చూశాం. హద్దుమీరి ప్రవర్తిస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. నా పోరాటం పోలీసులపై కాదు, వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపైనే మా పోరాటం అంతా.." అంటూ చంద్రబాబు మండి పడ్డారు. అంతకు ముందు రోడ్డు పైనే, కొట్టిన పోలీసుల పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది మంచి పద్దతి కాదని పోలీసులను హెచ్చరించారు.

cbn 06112019 2

ఇక చంద్రబాబు చిత్తూరు జిల్లా టిడిపి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ వైఖరి పై మండి పడ్డారు. "జగన్మోహన్ రెడ్డి మొదట్లో ‘‘సుబ్రమణ్యం అన్నా నువ్వే సీఎస్, గౌతమ్ అన్నా నువ్వే డిజిపి, మీరే నడిపించాలి నన్ను’’ అన్నారు..5నెలల్లోనే సుబ్రమణ్యం అన్నను గంగలో కలిపేశారు. రేపు కూడా మీ పరిస్థితి అదే..ఆయన మనస్తత్వమే అంత.. మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ రాష్ట్రం కోసం ఢిల్లీలో రాజీలేని పోరాటం చేశారు. నాకు బాల్య స్నేహితుడు, కలిసి చదువుకున్నాం, నా పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాలకే గౌరవాన్ని పెంచారు. ఇన్నాళ్లు మనకు స్పూర్తి ఇచ్చారు, ఇప్పుడాయన స్ఫూర్తితో మనం పార్టీ కోసం పనిచేయాలి. టిడిపి కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. భౌతికదాడులు, ఆర్ధికదాడులు చేస్తున్నారు.బాధితులపైన నాన్ బెయిలబుల్ కేసులు, నిందితులపై బెయిలబుల్ కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. ఛలో ఆత్మకూరుకు వెళ్తుంటే నా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారు. ఈ తాళ్లే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లని అప్పుడే హెచ్చరించాను. " అని చంద్రబాబు అన్నారు.

cbn 06112019 3

"నేను అడిగాననే అక్కసుతోనే ప్రజావేదికను కూల్చేశారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ప్రతిచోటా పులివెందుల పంచాయితీలు చేస్తున్నారు.ఇలాగే చేస్తే పులివెందుల పంపడం మిమ్మల్ని ఖాయం.
తొలి 6నెలల్లనే మంచి సీఎం అనిపించుకుంటా అనిచెప్పి 5నెలల్లోనే ఇంతకంటే చెత్త సీఎం ఉండడనే పేరు తెచ్చుకున్నారు. గతంలో చేసిన సీఎంలకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వచ్చాయా..? ప్రజలకు సేవలు చేసే సీఎంలనే ఇప్పటిదాకా చూశాం. ప్రజలను బాధలు పెట్టే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ప్రత్యర్ధి పార్టీలను అంతం చేయాలనే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ‘‘తవ్వండి తవ్వండి’’ అని అధికారులను ఉసిగొల్పారు, సన్మానాలు చేస్తాం అన్నారు. ఏం తవ్వారు ఈ 5నెలలు..? కొండను తవ్వి ఏం పట్టారు..? వెంట్రుక కూడా పట్టుకోలేక పోయారు. నీతి నిజాయితీతో సేవాభావంతో పనిచేశాం. తండ్రి అధికారం అండతో రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు తానే సిఎం అయ్యాక మరింత రెచ్చిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా..? ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మారితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇప్పుడే చూశాం. 11మంది సీఎంల పాలనలో ఇన్ని ఇబ్బందులు ఎవరూ పడలేదు. జగన్ సీఎం అయ్యాకే అన్నివర్గాల ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read