స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా సందిగ్ధత నెలకుంది. ఎన్నికల వాయిదా నిర్ణయం కొనసాగుతుందా. ,కోర్టు కొట్టివేస్తుందా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను యథాతథ స్థితిలో వాయదా వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఏపీ సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసీ నిర్ణయాన్ని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేసారు. గవర్నర్ ఆయనను రాజభవనకు పిలిపించి మాట్లాడారు. తరువాత ఈ విషయం పై సుప్రీం కోర్ట్ లో కేసు వేసారు. అయితే, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆరు వారల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్న తీసుకున్న నిర్ణయం తాము కలుగ చేసుకోలేం అంటూ, సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆరు వారల తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, కొత్త తేదీలు ప్రకటించాలని చెప్పింది. అయితే కొత్త పధకాలు ప్రకటించ కూడదు అని, కొత్త తేదీలు ప్రకటించిన తరువాత, నాలుగు వారాల ముందు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని చెప్పింది.

ఎన్నికల కమీషనర్ ఆరు వారాలు వాయిదా వెయ్యటంతో, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఇదే సందర్భంలో హైకోర్టులోను ప్రజా వాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరో పక్క రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి సిఎస్ నీలం సాహ్ని లేఖ రాసారు. ఎన్నికల నిర్వహణ వాయిదాను విరమించుకోమని ఆమె ఆయనకు విజృప్తి చేసారు. ఈ పరిణామాల నడుమ ఈ అంశంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి జగన్ కూడా ఆలోచన చేసారు. మాజీ ఎన్నికల కమీ షనర్ రమాకాంత్ రెడ్డితో ఆయన సమాలోచనలు చేసారు. మంత్రులు పెదిరెడ్డి రామచంద్రరెడ్డి,బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన రమాకాంత్ రెడ్డితో సమావేశమై పలు సూచనలు తీసుకున్నారు.

ఎన్నికల వాయిదాకు రమేష్ కుమార్ తన అధికారాలకు సంబంధించి చెబుతున్న సెక్షనులు ఏమీ రాష్ట్ర ఎన్నికల అధికారికి వర్తించవని ఈ సందర్భంగా రమాకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. నిజానికి అవన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోని సెక్షనులని స్పష్టం చేసారంటున్నారు. ఎన్నికల అధికారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించడమనే అంశాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా ఎన్నికల కమీషనర్ ఒక వివత్తు సందర్భంలో నిర్ణయం తీసుకునేటప్పుడు విధిగా గవర్నర్ అనుమతిని తీసుకోవడం, ప్రభుత్వానికి వివరించడం చేయాలని రమాకాంత్ రెడ్డి స్పష్టం చేసారంటున్నారు. ఒక వేళ రాష్ట్ర ఎన్నికల అధికారి ఏదైనాకోర్టు తీర్పు ను ఉదాహరించి తాను అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్ని కల అధికారి మాదిరిగా తనకు అధికారాలున్నాయని వాదించినా, తప్పని సరిగ్గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాలని రమాకాంత్ రెడ్డి వివరించారంటున్నారు. అయితే ఈ రోజు సుప్రీం మాత్రం, ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించడంతో భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టేలా కేసును జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ మేరకు బుధవారం నాటి కేసుల జాబితాలో ఈ కేసును చేర్చారు. ఇదే కేసులో ఇంప్లీడ్ అవుతూ వేసిన మరో రెండు పిటిషన్లను కూడా కలిపి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తద్వారా ఈ కేసు విచారణలో కౌంటర్లు దాఖలు చేయడానికి నోటీసులివ్వాల్సిన అవసరం లేకుండానే ప్రతివాది సంసిద్ధమైంది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికలకమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల నిర్వహణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్షక వాడా నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనాను ఒక సాకుగా వాడుకున్నారని, నిజానికి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమని, ఎన్నికలు జరిగితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలకు ఊతమిచ్చినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును సైతం సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది.

అయితే ఈ పిటిషన్‌ను మంగళవారం విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో చేర్చకపోవడంతో మంగళవారం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు కేసు ప్రాధాన్యతను వివరిస్తూ జాబితాలో చేర్చాల్సిందిగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం బుధవారం నాటి జాబితాలో చేర్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణ యాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ స్వాగతించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 6 వారాలు వాయిదా వేస్తే సరిపోదని, అసలు ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన సహా కమ్యూనిస్టు పార్టీలు కూడా కోరుతున్నాయి. నామినేషన్ల సందర్భంగా వైకాపా నేతలు ఇతర పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేశారని ఆయా పార్టీలు ఆరోపిస్తు న్నాయి. కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయని, ప్రత్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను బలవం తంగా లాక్కుపోయిన ఉదంతాలు కూడా ఉన్నా యని చెబుతున్నాయి. అతికష్టం మీద నామినేషను దాఖలు చేసిన చోట్ల అభ్యర్థులను బెదిరించి వాటిని ఉపసంహరించుకునేలా చేశారని కూడా కొందరు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఈ కేసులో చేరేందుకు తెలుగుదేశం, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్లో ప్రస్తావించిన అంశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల నిర్వహణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష కూడా నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనాను ఒక సాకుగా వాడుకున్నారని, నిజానికి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమని, ఎన్నికలు జరిగితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలకు ఊతమిచ్చినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును సైతం సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయాలని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అయితే, ప్రభుత్వ పిటీషన్ పై, రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కెవియట్ పిటిషన్​ను సుప్రీంలో దాఖలు చేసింది. తమ వాదన కూడా వినాలని.. తరువాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్​లో కోరింది.

ఇక మరో పక్క, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ ప్రకటించడంపై హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కరోనా వైరస్ ప్రభావం దేశమంతటా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరిపించాలని కోరుతూ తాండవ యోగేష్, జనార్దన్ అనే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పిటిషన్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

మరోవైపు కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కూడా తీసుకోలేదని, కనుక ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం వివరించింది. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మరో పక్క, స్థానిక సంస్థల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వలంటీర్లను ఉపయోగిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వివరించారు. అయితే వలంటీర్లు ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని పరిశీలించడం జరిగిందని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సమగ్ర సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయాదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖకు సమాధానం ఇస్తూ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ మూడు పేజీల లెటరులో ఎన్నికలను ఎందుకు వాయిదా వేయవలసి వచ్చిందో వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని నమీక్షించి, అవసరమను కుంటే ఆరువారాలకన్నా ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోను, రాజ్ భవన్లో పైనాన్స్ వ్యవహరాల నిర్వహణలో పనిచేసిన అనుభవం తన కుందన్నారు. గతంలో ఎన్ని కలు నిలిపివేసినా కేంద్రం నిధులు వచ్చిన సందర్భాలున్నాయన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్ప టికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేసారన్నారు. గోవాలోను స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసే విష యాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధుల విడుదల విషయంలో అవగాహన ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం ఉంటుందన్నారు.

నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపానన్నారు. వారి సూచనలు,హమీతో ఎన్ని కలు వాయిదా వేసామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నానన్నారు. అందరి కంటే ముందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శలు వచ్చాయన్నారు. కరోనా వైరస్ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే ఆరువారాల కంటే ముందే ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఆరువారాల తరువాత వరిస్థితులను సమీక్షి స్తామన్నారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడిపెట్టవద్దని సూచించారు. జరిగిన పరిస్థితులపై అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే సీఎస్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం వాయిదా వేసారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.కరోనా వైరసే సాకుతో ఎన్నికలువాయిదా వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహరంలో ఎంతవరకైనా వెళుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై ఆయన గవర్నర్‌ను కలుసుకుని ఎన్నికల కమీషనర్ పై ఫిర్యాదు చేసారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ నీలం సాహ్ని ఎన్నికల అధికారి రమేష్ కుమార్‌కు లేఖ రాసారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, నియంత్ర ణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ లేఖలో వివరించారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఉవసంహరించుకోవాలని విజృప్తి చేసారు. ముందుగా ప్రకటించిన తేది ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నీలం సాహ్ని రాసిన లేఖకు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖలో జాతీయ వివత్తుగా కరోనాను కేంద్రం ప్రకటించినందున ఆ దిశలోనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్టు స్పష్టం చేసారు.

Advertisements

Latest Articles

Most Read