కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. అందరూ కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని.. ప్రతి ఒక్కరూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ప్రజల్ని కోరారు. శాస్త్రవేత్తలు కూడా ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని.. ఏకాంతంగా ఉండటం వల్లే ఈ వైరస్​ను కట్టడి చేయొచ్చని అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడాలని.. సూచించారు ప్రధాని. ‘‘ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడిప్పుడే ఊరట లభించే అవకాశం లేదు. రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రతిఒక్కరూ జాగరూకతతో ఉండటం అవసరం ఉంది. అందరం చేయిచేయీ కలిపి ఈ విపత్తును ఎదుర్కోవాలి. కొద్ది వారాలు మీ అందరి సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. జనం కోసం జనం ద్వారా కర్ఫ్యూ.. మన ఇళ్లల్లో 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయరాదు. జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నా."

"ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దాం. ఇది జనం కోసం జనం ద్వారా జనమే చేసుకునే కర్ఫ్యూ. ఆదివారం సంయమనంతో మనకు మనంగా విధించుకున్న కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధం. జనతా కర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని కోరుతున్నా. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూ సాధనంగా ఉపయోగపడుతుంది. జనతా కర్ఫ్యూ సందేశం, ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని కోరుతున్నా. ఈ సమయంలో మనకు కావాల్సింది సంయమనం. అవసరం లేకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టవద్దు. ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలి. ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం ముఖ్యం."

"నిర్లక్ష్యంగా ఉండటం.. మనకు ఏమవుతుందనే ధోరణి విడనాడాలి. అవకాశం ఉన్నంత మేరకు వ్యాపారులు, ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలి. వైద్య ఆరోగ్య రంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రంగంలో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనందరం చేయిచేయి కలిపి ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలి. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదు. వచ్చే కొద్ది వారాలపాటు మీ సమయాన్ని నాకు ఇమ్మని కోరుతున్నా. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. కరోనా మహమ్మారి విస్ఫోటనంలా విరుచుకుపడుతోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రపంచ మహమ్మారి నుంచి ఊరట లభించే అవకాశం ఇప్పుడిప్పుడే లేదు. ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండటం అత్యంత అవసరం."

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లు.. కరోనా ప్రభావం స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంరంభం ప్రారంభమైన దగ్గర నుంచి పోలింగ్ కు సమయం తక్కువగా ఉండటంతో గతంతో పోలిస్తే తక్కువ ఖర్చులో బయట పడొచ్చని చాలా మంది అభ్యర్థులు భావిం చారు. మార్చి 1 వతేది ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు 8న కార్పొరేషన్లు, మున్సిపాలి టీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, అల్లకల్లోలం సృష్టించింది వైసీపీ. అన్ని వీడియోలు టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చాయి. దోర్జన్యాలతో, జగన్ చెప్పినట్టు, 90 శాతం సీట్లు మావే అని వైసీపీ విర్రవీగుతున్న సమయంలో, తొమ్మిదో రోజు మార్చి 15న మాత్రం ఊహించని పిడుగు లా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కరోనా ప్రభావమంటూ ఆరు వారాలు వాయిదా వేయడంతో చాలా మంది అభ్యర్థులు డీలా పడిపోయారు. ఏకగ్రీవాలు అయిన వారు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నా.. భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందేమోనన్న అనుమానాలు ఏదోమూలవారిని కూడా వెంటాడుతున్నాయి.

ఎంతో కష్టపడి, మ్యానేజ్ చేసి, ఏకాగ్రీవాలు చేస్తే, ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో, రద్దు చేసి, మళ్ళీ మొదలు పెట్టాలో అనే భయం వారిని భయపెడుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు మార్చి 21న, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లు, నగర పంచాయితీలతో పాటు గ్రామ స్థాయి పంచాయతీలకు కూడా ఈ నెల 27న పోలింగ్ పూర్తవ్వాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఎంపీటీసీ అత్యధికంగా రూ.2 లక్షల వరకు, జెడ్పీటీసీ అత్యధికంగా రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే విధంగా కార్పొరేషన్ల పరిధిలోని వార్డు సభ్యులు రూ.2 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సభ్యులు రూ.1.50 లక్షలు, నగర పంచాయితీ పరిధిలోని వార్డు సభ్యులు ఒక లక్ష రూపాయిల వరకు గరిషంగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. ప్రస్తుత వాయిదా నేపధ్యంలో మరలా పోలింగ్ జరిగే వరకు ఓటర్లతో పాటు కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

ఖర్చు ఎంతవుతుందో తెలియదు, ఎన్నికల కోడ్ కూడా తీసివేయమని సుప్రీం కోర్టు సూచించిన నేపధ్యంలో.. మరో 40 రోజులు ప్రచారంలో గడపాలా వద్దా, ఒక వేళ గడపాల్సివస్తే అంత ఖర్చును భరాయిస్తూ ఎలా అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులను వేధిస్తున్న ప్రధాన సమస్య. నిబంధనలు మీరితే ప్రత్యర్థులతో పాటు సొంతపార్టీలోని అస్మదీయుల కన్ను కూడా తమపై ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పోటీకి దిగిన ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా ప్రభావంతో అకస్మాత్తుగా ఆరు వారాలు అంటే సుమారు 42 రోజులు వాయిదా పడటంతో అభ్యర్థులు బెంబేలెత్తు తున్నారు. 5 నుంచి 12 రోజులకు సరిపడా నగదును సిద్ధంచేసుకుని రంగంలోకి దిగిన వారికి ఇప్పుడు మరో ఆరు వారాలు అదనంగా ప్రచారం చేయడం, మ్యానేజ్ చెయ్యటం ఆర్థికంగా పెను భారం కానున్నది. వాయిదా ప్రకటన రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అన్నింటినీ సిద్ధం చేసుకున్న కొందరు ఇప్పుడు సంబంధిత పార్టీలలో ఇతర పోటీదారులతో పాటు స్థానికుల ఒత్తిడిని కూడా తట్టుకోలేక పోతున్నారు. అన్నిటికీ మించి, నోటిఫికేషన్ రద్దు అయితే, ఇంత కష్టపడి, అందరినీ మ్యానేజ్ చేసి, చేసిన ఏకగ్రీవాలు, వాటి కోసం పెట్టిన ఖర్చు ఎలా అనేది, అధికార పార్టీ నేతలకు అర్ధం కావటం లేదు.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మ-ర-ణం వెనుక రిలయన్స్ పాత్ర ఉందని ప్రచారం చేసి,, గతంలో ఆయా సంస్థల ఆస్తుల వి-ధ్వం-సా-ని-కి కారణమైన జగన్మోహన్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రయ్యాక ఆనాడు ఆస్తుల ధ్వం-సా-ని-కి పాల్పడిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేయడం సిగ్గుచేటని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఇష్టంలేనివారిపై కేసులు పెట్టడం, తనకు నచ్చినవారిపై కేసులు ఎత్తివేయడం ముఖ్యమంత్రికి ఫ్యాషన్ గా మారిందన్న బుద్దా, వి-ధ్వం-స-కా-రు-లపై ఉన్న కేసులు ఎత్తివేయడానికి వారేమన్నా స్వాతంత్ర్య సమరయోధులా అని నిలదీశారు. జగన్ చట్టానికి, న్యాయానికి విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నాడన్నారు. దాదాపు 95రోజులనుంచి రాజధాని అమరావతికోసం ఆందోళనలు చేస్తున్న మహిళలు, రైతులపై తప్పుడుకేసులు పెట్టించిన ముఖ్యమంత్రికి, ఆ కేసులు ఎత్తివేయాలన్న ఆలోచన రాకపోవడం దుర్మార్గమన్నారు. అమాయకులైన రైతులు, మహిళలు, యువతపై అరాచక చర్యలకు పాల్పడటం జగన్ కే చెల్లిందన్నారు. తాను సీఎం అవ్వగానే, తన స్వప్రయోజనాలకోసం రిలయన్స్ వారికి సన్మానంచేయడంతో పాటు, ఆసంస్థల ఆస్తులు ధ్వంసం చేసినవారిపై కేసుల ఎత్తివేయడం ద్వారా జగన్ తన వైఖరిని ప్రజలకుతెలియచేశాడన్నారు.

అమాయకులను లోపలవేయించడం, నేరస్తుల ను, రౌ-డీ-ల-ను బయటకు తీసుకురావడం వంటి అజెండాతోనే ఆయన పాలన సాగిస్తున్నాడన్నారు. ఆనాడు జరిగిన ఆస్తుల ధ్వం-సం-లో జగన్ మామ గంగిరెడ్డికి చెందిన పెట్రోల్ బంక్ పై దా-డి జరగలేదన్నారు. జీవో నెం-314 ద్వారా, రిలయన్స్ సంస్థలపై దా-డు-ల-కు పాల్పడిన వారిని బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్, మాజీ ముఖ్యమంత్ర చంద్రబాబునాయుడిపై అలిపిరివద్ద జరిగిన హ-త్యా-య-త్నం కేసులో ప్రధాన ముద్దాయి అయిన గంగిరెడ్డిపై ఉన్నకేసులను ఎత్తివేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బుద్దా స్పష్టంచేశారు. వైసీపీకి రహస్య సలహాదారుగా కూడా గంగిరెడ్డి వ్యవహరిస్తున్నాడని, ఆయనపై ఉన్న కేసులు జగన్ ఎత్తివేయబోతున్నాడన్నారు. సొంతబాబాయి వై.ఎస్.వి-వే-కా-నం-ద-రె-డ్డి-ని దారుణంగా చం-పిం-చి, ఆయన హ-త్య కేసులో చంద్రబాబు పాత్ర ఉందని, దుష్ప్రచారం చేసిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఆకేసు విచారణను సీబీఐకి అప్పగించకుండా తప్పుకున్నాడన్నారు.

ప్రభుత్వ అరాచకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన తొలుత స్పందించలేదని, అటువంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించి, చంద్రబాబే ఆయనతో చెప్పి, ఎన్నికలు వాయిదా వేయించాడని నీచమైన ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. శాసనమండలిలో కూడా ఛైర్మన్ పై దా-డి జరిగినప్పుడు వైసీపీ నేతలు ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తించారో ప్రజలంతా చూశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఘో-రా-లు, దా-రు-ణా-లు చూడటంతోపాటు, కరోనా వ్యాప్తి ఉధృతమవతున్న వేళ, విధిలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదావేస్తే, ఆయనపై కులముద్ర వేసి నీచంగా మాట్లాడిన నీచజాతి వైసీపీవారని బుద్దా మండిపడ్డారు. తానొక స్పీకర్ నని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నాననే ఇంగితం కూడా లేకుండా తమ్మినేని సీతారాం, ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి కమ్మ వైరస్ అని వ్యాఖ్యానించడం ఎంతటి దిక్కుమాలిన తనమో స్పీకరే సమాధానం చెప్పాలన్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనను కలిసేవరకు జగన్ కు వి-ధ్వం-స-కా-రు-ల భావోద్వేగాలు గుర్తురాలేదా అని వెంకన్న నిలదీశారు. జగన్ తక్షణమే తాను ఇచ్చిన జీవో-314ని రద్దుచేయాలని, ఒకవేళ అలా చేయకపోతే, అమరావతి ఆందోళనకారులపై పెట్టిన తప్పుడుకేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేయగానే, ఆదరాబాదరగా మీడియాముందు కు వచ్చిన జగన్, తన అక్కసునంతా వెళ్లగక్కి, కరోనా రాష్ట్రంలో ఎక్కడుందంటూ విపరీత ధోరణితో మాట్లాడాడని, ఆయన తన వింతచేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా డని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరస్థాయిలో ఉందంటే రాష్ట్రప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రిగానీ పట్టించుకోలేదన్నారు. ప్రజలను రక్షించాలన్న ఆలోచన చేయకుండా, ఎన్నికల కోసం, ఎన్నికల కమిషనర్ పై ముఖ్యమంత్రి నిందలేశాడన్నారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందనే వివరాలను ఇంతవరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు, ఇతర ప్రభుత్వపెద్దలు గానీ వెల్లడించలేదన్నారు. మనుషుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ప్రపంచ దేశాధినేతలందరూ మీడియా ముందుకు వచ్చి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, కరోనా జాగ్రత్తలు వారికి వివరించడం, తమ తమదేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, తనదారిలో తాను వింతపోకడతో ముందుకు సాగుతున్నాడ న్నారు. కరోనా ప్రభావం అంత సీరియస్ గా ఉంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా దాని గురించి మాట్లాడలేదన్నారు. ఎన్నికల్లో ఎలా దౌ-ర్జ-న్యాలు- చేసి, తనపార్టీని గెలిపించుకోవాలన్న తాపత్రయం తప్ప, ముఖ్యమంత్రిలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు లేవన్నారు.

సీఎం ఇంట్లో కూర్చొని, ఎవరు ఏ లేఖరాశారు.. ఎవరు చెబితే రాశారు.... తెలుగుదేశం ఏం చేస్తోందన్న ఆరాలు తీస్తున్నాడు గానీ, కరోనా ప్రభావంపై నామమాత్రం కూడా దృష్టి పెట్టడంలేదన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, తద్వారా ప్రభుత్వానికి చీవాట్లు మిగిలాయన్నారు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు అధికారపార్టీకే ఏకగ్రీవమయ్యాయని, అధికారులు, పోలీస్ వ్యవస్థ సహాయసహాకారాలతో కొన్నిప్రాంతాల్లో 75శాతం పైగా స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యమవుతుందని యనమల ప్రశ్నించారు. ఈ ఏకగ్రీవాలు చూస్తుంటేనే వైసీపీ ఏ స్థాయిలో దౌ-ర్జ-న్యా-లు చేసిందో అర్థమవుతోందన్నారు. ఏకగ్రీవాలపై ప్రతిపక్షంనుంచి వచ్చిన ఎన్నికలఫిర్యాదులపై ఏవిధమైన చర్యలు తీసుకోలే దని, చాలాస్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ను వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్ కే ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు. ఎన్నికలు వాయిదావేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారనే భయంలో వైసీపీ ఉందన్నారు. అలా జరిగితే వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన లేఖలో కేంద్ర బలగాల ప్రస్తావనతో పాటు, తన భద్రతగురించి కూడా చెప్పడం జరిగిందన్నారు.

ఏకగ్రీవమైన స్థానాలను అడ్డుపెట్టుకొని, ఏదోరకంగా ఎన్నికలు నిర్వహింపచేసుకోవాలన్న దురుద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో, ఒక్క వైసీపీమినహా, అన్ని పార్టీలవారు నేడు గవర్నర్ ని కలవబోతున్నా రని, వారంతా కూడా తిరిగిఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ చేస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూశాక, తనకున్న విచక్షణాధికారంతో ఎన్నికలు వాయిదావేయాలని ఎన్నికల కమిషనర్ లేఖ రాస్తే, దానిపై వైసీపీ ఎందుకింతగా ఉలిక్కి పడుతుందని యనమ ల ప్రశ్నించారు. ఒకవేళ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తే, రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని, దాంతో తమఆటలుసాగవన్నభయంతోనే వైసీపీ బెంబేలెత్తిపోతుం దన్నారు. ఆభయంతోనే ఎన్నికల కమిషనర్ ని, ఎన్నికలసంఘాన్ని దుర్భాషలాడు తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన అ-రా-చ-కా-లు, దౌ-ర్జ-న్యా-లతో- పాటు, అనేకస్థానాలను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రభుత్వం చేసిన దురాగతాలను ఎన్నికల కమిషనర్ తనలేఖలో ప్రస్తావించాడని, తనకు, తనకుటుంబానికి ము-ప్పు ఉన్నందున భద్రత పెంచాలనికూడా ఆయన విజ్ఞప్తిచేశాడన్నారు. దానిలో తప్పేముందో... ఈసీ లేఖపై ప్రభుత్వం ఎందుకింతలా గింజుకుంటుందో తెలియడంలేదన్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే, ఎన్నికల కమిషనర్ ఢిల్లీ తలుపుతట్టాడని, ఈసీ రాసిన లేఖపై ప్రశ్నించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి ఎక్కడిదని యనమల నిలదీశారు. ప్రాధాన్యత పోస్టుల్లో 250మంది రెడ్లను పెట్టుకొని, ఎన్నికల నిర్వహణను కూడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలైన రెడ్లకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, కులాల పేరుతో గిట్టనివారిపై దాడిచేయడం ఎంతవరకు సమంజసమని రామకృష్ణుడు నిలదీశారు. కుల రాజకీయాల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేనేలేదన్నారు. రాజ్యాంగంలో ప్రభుత్వ పరిధేమిటో తెలుసుకోకుండా, ఫా-సి-స్టు మనస్తత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడన్నారు. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని అడ్డంపెట్టుకొని దోచేయడానికి, ప్రజలను నాశనం చేయడానికే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు తప్ప, ప్రజల గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా గురించి, ముఖ్యమంత్రిగానీ, ఆరోగ్యశాఖా మంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి గానీ ఎవరూ మాట్లాడటంలేదన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్నఅభివృద్ధి పనులను కొనసాగించవచ్చని, కొత్తగా వేటినీ ప్రారంభించడానికి అవకాశం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. వ్యక్తిగతలబ్ధి చేకూర్చే పథకాలు, కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగిందన్నారు. తాను స్పీకర్ ననే విషయం మర్చిపోయి, ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని, ఆయనపై పై పరువునష్టం దావా వేయవచ్చన్నారు. వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తే, రాజకీయ నాయకుడిలా మారిపోయి, స్పీకర్ ననే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే, ఆయన్ని ప్రశ్నించే అధికారం ప్రతిపౌరుడికి ఉంటుందన్నారు.

Advertisements

Latest Articles

Most Read