స్థానిక ఎన్నికల వాయిదా పై ఇటు ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య మొదలైన యుద్ధాని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెర దించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరువారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయు పై రాష్ట్ర ప్రభుత్వం ముప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఈ రోజు విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఒకవైపు ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, మరోవైపు ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడు నిర్వహించాలనే అంశం కూడా ఈనీ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకొనవలసిందేనని పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తే కోడ్ ను తొలగించాలన్న ప్రభుత్వ వాదనను మాత్రమే సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కేసులో తదువరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం పేర్కొంది. అయితే ఇదేదో తమ విజయం అన్నట్టు, వైసీపీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల కోడను ఎత్తివేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడం శుభపరిణామమని అధికా రపక్షనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా, ఎక్కడా సంక్షేమ పధకాలు ఆగావు. కొత్త పధకాలు మాత్రమే చెయ్యటం కుదరదు. ఇప్పుడు కూడా సుప్రీం అదే చెప్పింది. అదీ కాక సుప్రీం కోర్ట్ చెప్పింది, అభివృద్ధి కార్యక్రమాలు అని, ఎక్కడా కొత్త సంక్షేమ పధకాలు అని చెప్పలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, పాత పధకాలు అయినా పెన్షన్లు, రైతు బంధు లాంటి పధకాలు ఆగిన చరిత్ర ఎప్పుడూ లేదు.

ఇందులో వైసీపీ ఎందుకు హంగామా చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళింది, ఎన్నికల వాయిదా వద్దు, ఇప్పుడే ఎన్నికలు జరపాలి అని. ఆ విషయం పక్కన పెట్టి, ఎన్నికల కోడ్ ఎత్తేసింది, ఈసీ కోర్ట్ తిట్టింది అంటూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయం పై చంద్రబాబు కూడా స్పందించారు. "ఎన్నికలపై ఎందుకు సుప్రీంకు వెళ్లారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి. సుప్రీంకు వెళ్లి ఏం సాధించారు..? ఈసిని ఇష్టానుసారం దూషిస్తారు. ఈ రోజు కూడా ఒక వైసిపి ఎమ్మెల్యే ఈసిని పట్టుకుని వెధవ అంటాడు. కేంద్రం నుంచి రూ5వేల కోట్లు రావని పదేపదే అంటారు. అబద్దాలు చెప్పడానికి సిగ్గుపడాలి. ఈ రోజుకూడా సుప్రీంకోర్టును వక్రీకరిస్తారు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఈసిని తప్పు పట్టిందని ఎక్కడ ఉంది..? సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించడానికి వీళ్లకు బుద్ది జ్ఞానం ఉందా.? ఇంత ఉన్మాదమా..? చేసిన తప్పును కప్పిపెట్టుకోడానికి మళ్లీ ఎదురు దా-డి చేస్తారా..? " అంటూ చంద్రబాబు స్పందించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్​ఈసీ)పై వైసీపీ నేతల మాటల దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం, కేంద్ర బలగాలను పంపించాలని, ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో, పలు విషయాలు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ఎన్నికల కమీషనర్ పై అధికార వైసీపీ పార్టీ నేతల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తిట్టటం, కుల ప్రస్తావన తేవటం వంటి విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు పంపాలని ఆయన కేంద్ర హోంమంత్రికి లేఖలో రాసారు. రాష్ట్ర పోలీసుల సాయంతోనే వైసీపీ నేతలు నామినేషన్ల సందర్భంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇలా రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని జగన్ , మంత్రులు తీవ్రంగా విమర్శించారని, అసభ్య పదజాలంతో దూషించారని లేఖలో రాసారు.

ఎలక్షన్ కమీషనర్ కు అత్యున్నతస్థాయిలో కేంద్ర భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నని కన్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, రాష్ట్ర పోలీసు వ్యవస్థ కీలు బొమ్మగా మారిందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై హర్షణీయమని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా నేతలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్​లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, వైకాపా నాయకులు రాజ్యాంగ వ్యవస్థల మీద మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్​ కుమార్​కు కుల ముద్ర వేసిన నేతలు... సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏ ముద్ర వేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి కూడా పరిమితులుంటాయని జగన్​ తెలుసుకోవాలని తులసిరెడ్డి సూచించారు. అలాగే మహమ్మారి కరోనా వ్యాప్తి అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంలోనే కాదు, మన దేశంలో కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అన్ని విద్యాసంస్థలు ముసేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం, మన ప్రభుత్వం కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కరోనా పెద్ద రోగం కాదని, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటూ, సింపుల్ గా చెప్పేసారు. పారాసిటమాల్ వేసుకుంటే చాలు అని చెప్పారు. అలాగె బ్లీచింగ్ కొట్టుకుంటే చాలు అని చెప్పారు. అయితే ఇదంతా ఎన్నికల కోసం పడుతున్న పాట్లు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నాం ని చెప్పటంతో, కరోనాని తక్కువ చేసి చూపించాలి అనే చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో, గత రెండు మూడు రోజులుగా, అన్ని రాష్ట్రాలు, జాగ్రత్తలు తీసుకుంటుంటే, మనం మాత్రం, కరోనా పెద్దగా లేదు అని చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో అసలు ఇక్కడ ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే పరిస్థితి అయిపొయింది. అయితే, ఇప్పుడు ఈ రోజు సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.

కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు వెళ్లకపోవటం మంచిదే అంటూ, ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో, ఇక కరోనా పై జాగ్రత్తలు తీసుకోక పొతే, అసలుకే మోసం వస్తుందని, ఇప్పటికి మన ప్రభుత్వం కదిలింది. కరోనా భయపెడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. రేపట్నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మరో 276 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ. ఒక్క ఇరాన్​లోనే దాదాపు 255 మంది భారతీయులకు ఈ మహమ్మారు సోకినట్లు తాజాగా ధ్రువీకరించింది. వీరితో పాటు యూఏఈలో 12 మంది, ఇటలీలో అయిదుగురు, శ్రీలంక, రువాండా, కువైట్​, హాంగ్​కాంగ్​లో ఒక్కో భారతీయుడు కరోనా బారిన పడ్డట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​ ప్రకటించారు. చైనాకు లక్ష సాధారణ మాస్కులు, మరో లక్ష వైద్య చికిత్స మాస్కులు, 4000 ఎన్​-95 మాస్కులతో పాటు ఐదు లక్షల జతల చేతి తొడుగులను ఎగుమతి చేసినట్లు మురళీధరన్​ తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 ప్రత్యేక విమానం ద్వారా వీటన్నింటినీ వుహాన్​కు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి గుర్తుగానే వీటిని చైనాకు అందించామన్నారు మురళీధరన్​.

మరో సంచలనానికి తెర లేపారు, ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్. కరోనా మహమ్మారి, విరుచుకు పడుతూ ఉండటంతో, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదేదొ ఘోరం అయినట్టు, తప్పు అయినట్టు, వైసీపీ ఆయన పై విరుచుకు పడింది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి, ఆయన పై కుల ముద్ర వేసి, చంద్రబాబు కులం అంటూ, దిగజారి జుబుక్సాకరంగా వ్యాఖ్యలు చేసారు. అయితే, ఇదే విషయం పై సుప్రీం కోర్ట్ కు వెళ్తున్నాం అంటూ, ప్రకటన చేసారు. అయితే ఈ రోజు సుప్రీం కోర్ట్ లో ప్రభుత్వ పిటీషన్ కొట్టేసి, కరోనా ఉంది కాబట్టి, ఆరు వారాల పాటు, ఎన్నికల వాయిదా వెయ్యటం కరెక్ట్ అంటూ, ఎన్నికల కమీషనర్ ను సమర్ధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ సమయంలో, జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ గా, రమేష్ కుమార్ ను టార్గెట్ చెయ్యటం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన్ను బూతులు తిడుతూ రేచ్చిపోతూ ఉండటంతో, రమేష్ కుమార్, కేంద్ర హోం శాఖకు లేఖ రాసి, సంచలనం సృష్టించారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అయుదు పేజీల లేఖ రాసారు రమేష్ కుమార్. స్థానిక ఎన్నికల షడ్యుల్ విడుదల నుంచి నేటి వరకు జరిగిన పరిణామాల పై లేఖ రాస్తూ, అన్నీ వివారించారు. జిల్లాల్లోని పరిస్థితిని కేంద్ర హోం శాఖకు వివరించారు. నా ప్రాణానికి హా-ని ఉంది అంటి, ఏపిలో ర-క్ష-ణ లేదని, హైదరాబాద్ లో ఉండటానికి పర్మిషన్ కావాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికలు కేంద్ర బలగాలతో, జరిపించాలని అన్నారు. ఇక పెద్ద ఎత్తున ఎకగ్రీవాలు అవ్వటం, బెదిరింపుల వీడియోలు గురించి కూడా వివరించారు. పెద్ద ఎత్తున హిం-స చెలరేగింది అంటూ, వివరించారు. నా భద్రత, నా కుటుంబ సభ్యుల భద్రత కోసం కేంద్ర బలగాల ర-క్ష-ణ కావలని కోరారు. నా పై భౌ-తి-క దా-డి జరిగే అవకాసం ఉంది అంటూ లేఖ రాసారు.

l have been advised by well-wishers and colleagues who are well versed in security matters that the State mechanism is not equal to the threat perceptions I am facing. There are real apprehensions of physical threats, attacks directed against me and family members. Looking at the intolerant face of the top leadership of the present dispensation and their faction ridden background and known vindictive nature, I have come to the painful conclusion that my safety and my family's safety is in great peril. Under the circumstances, I have no other recourse other than appealing to the Government of lndia and the Home Ministry to come to my rescue and provide a security cover through appropriate Central Police Force commensurate with the current risk perceptlons. This would be necessary for extended duration this Government which is inimically disposed to me is in power and at the helm of the State with the vast of reach of resources and criminal gangs ready to their bidding. Their antecedents bear testimony to reach this conclusion painful as it is. I beseech you to act swiftly and provide me with security cover so that the balance phase of elections at least will be held with a modicum of fair play. I am determined to do full justice with no let up to the Constitutional office of State Election Commissioner and to my call of duty and wish to adhere to rule of law and strengthen my hands in a timely manner. I implore earnestly for early and favourable action to instill confidence and discharge my bounden duty with redoubtable energy and commitment.

Advertisements

Latest Articles

Most Read