రాష్ట్ర ఎన్నికల కమీషనర్, తనకు కేంద్ర భద్రత కావాలి అంటూ నిన్న లేఖ రాసిన నేపధ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కార్యాలయానికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి భద్రత పెంచారు. ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. బందర్ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయానికి సీఆర్పీఎఫ్ పోలీసులు చేరుకున్న. ఎస్ఈసీ కార్యాలయం వద్ద 10 మంది సీఆర్పీఎఫ్ సీబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. గన్నవరం లోని 39బెటాలియన్ నుంచి వచ్చిన సీఆర్ పీఎఫ్ బలగాలు. 1ఎస్సై, 1 హెడ్ కానిస్టేబుల్ , 8మంది కానిస్టేబుళ్లతో ఎస్ఈసీ కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం నిఘా పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేరింది. మరో పక్క, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, సీఎస్‌ నీలం సాహ్ని భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంతీర్పు అనంతరం తదుపరి పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే రమేష్ కుమార్ రాసిన లేఖ పై కూడా అనుమానాలు ఉన్నాయి అంటూ, చెప్తూ ఉండటంతో, వాటి పై కూడా చర్చించారు. మరో పక్క ఇదే అంశం పై, స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి నిర్వహించాలని, రాజకీయ పక్షాల నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కోరారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దుచేసి రీనోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజకీయ పక్షాల నేతలు కలిశారు. స్థానిక ఎన్నికలు మళ్లీ మొదటినుంచి నిర్వహించాలని 10 పేజీల వినతిపత్రం అందజేశారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దు చేసి రీనోటిఫై చేయాలని కోరారు. ఎస్‌ఈసీ పేరిట వచ్చిన లేఖను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్​ భద్రత విషయం కూడా గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు విపక్ష నాయకులు తెలిపారు. రాష్ట్రంలో పరిణామాలన్నీ ఆయనకు వివరించినట్లు పేర్కొన్నారు.

అయితే వైసీపీ మాత్రం ఆ లేఖ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఎన్నికల కమిషనర్​ రమేష్ కుమార్ పేరిట ఉన్న ఓ జీ మెయిల్ ఖాతా నుంచి హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విధంగా ఉందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖకు లేఖ ఎవరు రాశారన్న అంశం తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి, కుట్ర వెనుక ఎవరున్నారనేది బయటపెడతామని అన్నారు. కొందరు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖలో రాసిన విషయాన్ని ఎన్నికల కమిషనరే బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. తెదేపాకు అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ హోం శాఖకు లేఖ రాశారో లేదో కూడా చెప్పలేని స్థితిలో ఎన్నికల కమిషనర్ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటలిజెన్స్ చీఫ్ మనీశ్ తో అత్యవసరంగా భేటీ అయ్యారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో, రాష్ట్రంలో పరిస్థితి పై చర్చించటానికి అని చెప్తున్నా, కరోనాకి పోలీసులుకు ఏమి సంబంధం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిన్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, కేంద్రానికి లేఖ రాస్తూ, తన ప్రాణాలకి ముప్పు ఉంది,భద్రత కల్పించండి అంటూ రాసిన లేఖ పై, జగన్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తుంది. కేంద్ర హోం శాఖకు ఈ లేఖ రాయటంతో, కేంద్ర హోం శాఖ నివేదిక కోరితే, ఏమి చెప్పాలి అనే దాని పై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే, డీజీపీ కూడా, కేంద్రానికి ఇవన్నీ తప్పు అని ఖండిస్తూ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే దాని పై కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాజకీయ వాతవరణం పై కూడా, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి, సమాచారం తెలుసుకున్నారని, తెలుస్తుంది. మరి దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరో పక్క, కరోనా వైరస్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడంతో తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే కేంద్ర పోలీస్ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికలకమిషనర్ రమేష్ కమార్ రాసినట్లు చెబుతున్న లేఖ బుధవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా వర్గాల్లో చక్కర్లు కొట్టిన లేఖలో సారాంశం ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుంచి అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తుందని దీనికి కొంతమంది అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన స్థానిక అధికార యంత్రాంగంతో చేయిదాటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురుండకూడదని ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రులకు పదవీ గండం, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్ల గండం ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం ఆ విధంగా వ్యవహరించడంతో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని, ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలకు చెందిన అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులు
పెట్టారన్నారు.

2014లో ఎంపీటీసీ ఎన్నికల్లో కేవలం 2 శాతం మాత్రమే ఏక్రగీవాలు ఉండగా ప్రస్తుతం 24 శాతం ఏకగ్రీవమయ్యాయని, అదే విధంగా 2014 జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 0.09 శాతం ఏకగ్రీవాలు ఉండగా ఈసారి రికార్డు స్థాయిలో 10 శాతం ఏక్రగీవాలయ్యాయన్నారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు ఇదే నిదర్శనమన్నారు. కడప జిల్లాలో ఎంపీటీసీలకు సంబంధించి 79 శాతం, జెడ్పీటీసీలకు సంబంధించి 76 శాతం ఏకగ్రీవమవ్వడం పరిస్థితికి అద్దం పడుతుందని ఎస్ఈసీ పేర్కొన్నారు. 35 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా 23 చోట్ల వేసిన నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని ఆరోపించారు. అదే విధంగా 55 చోట్ల ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు చేశారని లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విపత్తు కారణంగానే.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము ముందునుంచి చెబుతున్న జాగ్రత్తలను తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖకు పంపినట్లు ప్రచారంలో ఉన్న లేఖలో ఎఈసీ పేర్కొన్నారు. రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ సంచలనం సృష్టించిన ఎస్ఈసీలేఖకు సంబంధించి ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ను స్పష్టత కోరేందుకు ప్రయత్నించినా ఆయన నేను ఈ లేఖ రాసాను అని కాని, రాయలేదు అని కాని చెప్పకపోవటం చూస్తుంటే, ఈ లేఖ ఆయనే రాసినట్టు అర్ధం అవుతుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్​ఈసీ)పై వైసీపీ నేతల మాటల దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం, కేంద్ర బలగాలను పంపించాలని, ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో, పలు విషయాలు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ఎన్నికల కమీషనర్ పై అధికార వైసీపీ పార్టీ నేతల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తిట్టటం, కుల ప్రస్తావన తేవటం వంటి విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు పంపాలని ఆయన కేంద్ర హోంమంత్రికి లేఖలో రాసారు. రాష్ట్ర పోలీసుల సాయంతోనే వైసీపీ నేతలు నామినేషన్ల సందర్భంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇలా రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని జగన్ , మంత్రులు తీవ్రంగా విమర్శించారని, అసభ్య పదజాలంతో దూషించారని లేఖలో రాసారు.

ఎలక్షన్ కమీషనర్ కు అత్యున్నతస్థాయిలో కేంద్ర భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నని కన్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, రాష్ట్ర పోలీసు వ్యవస్థ కీలు బొమ్మగా మారిందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై హర్షణీయమని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా నేతలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్​లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, వైకాపా నాయకులు రాజ్యాంగ వ్యవస్థల మీద మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్​ కుమార్​కు కుల ముద్ర వేసిన నేతలు... సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏ ముద్ర వేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి కూడా పరిమితులుంటాయని జగన్​ తెలుసుకోవాలని తులసిరెడ్డి సూచించారు. అలాగే మహమ్మారి కరోనా వ్యాప్తి అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

స్థానిక ఎన్నికల వాయిదా పై ఇటు ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య మొదలైన యుద్ధాని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెర దించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరువారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయు పై రాష్ట్ర ప్రభుత్వం ముప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఈ రోజు విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఒకవైపు ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, మరోవైపు ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడు నిర్వహించాలనే అంశం కూడా ఈనీ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకొనవలసిందేనని పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తే కోడ్ ను తొలగించాలన్న ప్రభుత్వ వాదనను మాత్రమే సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కేసులో తదువరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం పేర్కొంది. అయితే ఇదేదో తమ విజయం అన్నట్టు, వైసీపీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల కోడను ఎత్తివేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడం శుభపరిణామమని అధికా రపక్షనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా, ఎక్కడా సంక్షేమ పధకాలు ఆగావు. కొత్త పధకాలు మాత్రమే చెయ్యటం కుదరదు. ఇప్పుడు కూడా సుప్రీం అదే చెప్పింది. అదీ కాక సుప్రీం కోర్ట్ చెప్పింది, అభివృద్ధి కార్యక్రమాలు అని, ఎక్కడా కొత్త సంక్షేమ పధకాలు అని చెప్పలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, పాత పధకాలు అయినా పెన్షన్లు, రైతు బంధు లాంటి పధకాలు ఆగిన చరిత్ర ఎప్పుడూ లేదు.

ఇందులో వైసీపీ ఎందుకు హంగామా చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళింది, ఎన్నికల వాయిదా వద్దు, ఇప్పుడే ఎన్నికలు జరపాలి అని. ఆ విషయం పక్కన పెట్టి, ఎన్నికల కోడ్ ఎత్తేసింది, ఈసీ కోర్ట్ తిట్టింది అంటూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయం పై చంద్రబాబు కూడా స్పందించారు. "ఎన్నికలపై ఎందుకు సుప్రీంకు వెళ్లారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి. సుప్రీంకు వెళ్లి ఏం సాధించారు..? ఈసిని ఇష్టానుసారం దూషిస్తారు. ఈ రోజు కూడా ఒక వైసిపి ఎమ్మెల్యే ఈసిని పట్టుకుని వెధవ అంటాడు. కేంద్రం నుంచి రూ5వేల కోట్లు రావని పదేపదే అంటారు. అబద్దాలు చెప్పడానికి సిగ్గుపడాలి. ఈ రోజుకూడా సుప్రీంకోర్టును వక్రీకరిస్తారు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఈసిని తప్పు పట్టిందని ఎక్కడ ఉంది..? సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించడానికి వీళ్లకు బుద్ది జ్ఞానం ఉందా.? ఇంత ఉన్మాదమా..? చేసిన తప్పును కప్పిపెట్టుకోడానికి మళ్లీ ఎదురు దా-డి చేస్తారా..? " అంటూ చంద్రబాబు స్పందించారు.

Advertisements

Latest Articles

Most Read