నారా చంద్రబాబు నాయుడు అంటే, ఈ దేశంలోనే తెలియని వారు ఉండరు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళకు పైగా ప్రతిపక్ష నేతగా, దేశంలో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటులో కీలక వ్యక్తిగా, రాష్ట్రపతులను నియమించిన కీలక వ్యక్తిగా, ఇలా అనేక విధాలుగా చంద్రబాబు అంటే దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గతంలో నక్సల్స్ పై, అలాగే ఎర్ర చందనం మాఫియా పై, ఆయన చేసిన పోరాటానికి ఫలితంగా, ఆయన పై నక్సల్స్ దాడి జరగటం, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వటం, ఇవన్నీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి చంద్రబాబుకు జెడ్ ప్లస్ క్యాటగరీ బద్రత కలిపిస్తుంది కేంద్రం ప్రభుత్వం. కేంద్రంలో పార్టీలు మారినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, అయానతో రాజకీయ వైరం ఉన్నా సరే, ఈ బద్రత కొనసాగుతూనే ఉంది. మొన్నటి మొన్న బీజేపీతో అంత పోరాటం చేసినా, మొన్న చేసిన బద్రతా రివ్యూలో, చాలా మందికి జెడ్ ప్లస్ తీసారు కాని, చంద్రబాబుకు మాత్రం కేంద్రం జెడ్ ప్లస్ బద్రత తియ్యలేదు అంటూ, చంద్రబాబుకు బద్రత ఎంతటి కీలక విషయం అనేది ఇక్కడ అర్ధం అవుతుంది.

అయితే ఇంతటి కీలక విషయంలో, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ద పై, తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. వారం రోజుల క్రితం రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి నుంచి చంద్రబాబు పర్సనల్ సెక్రటరీకి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ ప్రకారం, చంద్రబాబు బద్రతను, 58కి తగ్గించినట్టు ఉంది. గతంలో చంద్రబాబుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా, 160 మంది సిబ్బంది బద్రతగా ఉండే వారు. అయితే, ఇప్పుడు తాజగా నిఘా ఐజి పంపించిన లేఖలో, 58కి తగ్గించినట్టు ఉంది. రాష్ట్రంలోని ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించామని, ఎల్లోబుక్‌ను అనుసరించి చంద్రబాబు రక్షణ సిబ్బంది సంఖ్యను 58కి పెట్టినట్టు ఆ లేఖలో రాసారు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ మండి పడింది.

అయితే గతంలో జగన్ ప్రభుత్వం రాగానే, ఇలాగే చెయ్యటంతో, చంద్రబాబు హైకోర్ట్ కు వెళ్లి, అదే బద్రత తెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ తగ్గించటం పై టిడిపి భగ్గు మంటుంది. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతొ, ప్రజల్లోకి వెళ్తున్నారని, ఇప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించింది. అయితే దీని పై, పెద్ద రచ్చ అవ్వటంతో, డీజీపీ కార్యాలయం స్పందించింది. చంద్రబాబుకి ఎలాంటి బద్రత తగ్గించలేదని, 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ 135 మంది, హైదరాబాద్ లో 48 మందితో బద్రత ఇస్తున్నట్టు చెప్పింది. అయితే టిడిపి మాత్రం, ఇది తప్పుడు సమాచారం అని, కేవలం 58 మంది అని వాళ్ళ ఇంటలిజెన్స్ లేఖ ఉంటే, డీజీపీ కార్యాలయం మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చింది అంటూ టిడిపి అంటుంది. ఏది ఎలా ఉన్నా, ఇలా ఒక ప్రముఖ వ్యక్తి బద్రత పై, ఇంటలిజెన్స్ ఒక మాట, డీజీపీ కార్యాలయం మరో మాట చెప్పటం పై, టిడిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.

రాష్ట్ర సచివాలయం నుంచి విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు సంబంధించి జీవో నంబరు 13ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై త్రిసభ్య ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. "ప్రభుత్వ ఉత్తర్వు అంటే దానిలో పూర్తి వివరాలు ఉండాలి. వేరే దానితో కలిపి చదవాల్సిన అవసరం ఉండకూడదు. విజిలెన్స్ కార్యాలయం తరలింపు జీవో రూపకల్పనలో మీరు ఆ విధమైన మార్గదర్శకాలు పాటించారు? నోట్ ఫైల్ నేరుగా ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు" అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అడ్వకేట్ జనరలను ప్రశ్నించింది. రాజధాని పరిధిలోని తాళ్ళాయపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి గిరిధర్ అనే రైతు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. జీవోలో అన్ని విషయాలు నేరుగా ప్రస్తావించాలని ఎంఎస్ గిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇంద్రనీల్ బాబు ధర్మాసనం ముందు ఉదాహరించారు. దానిపై ధర్మాసనం స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. తొలుత అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదిస్తూ విజిలెన్స్ కార్యాలయం సాధారణ పరిపాలనా విభాగంలో అంతర్భాగం కాదని, దానిని ప్రాంతానికి తరలించటం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలుగదని పేర్కొన్నారు. .

సచివాలయంలో చాలినంత జాగా లేనందువల్లనే ఆ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు ? ఏ కారణాలతో వచ్చారు, ఆ ప్రాసెస్ అంతా ఇవ్వండి అని హైకోర్ట్ అడిగిన ప్రశ్నకు, ముఖ్యమంత్రికి కూడా జీవో పాస్ చేసే అధికారం ఉంటుంది చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే, జీవో ఇచ్చారు అని చెప్పటంతో, ఇది సరైన వాదన కాదని, తేలి పోయింది అనే అభిప్రాయం కలుగుతుంది. మరో పక్క, జీవోలో పాలనాపరమైన కారణాలు అని పేర్కొన్నారని, వాటిని ఎందుకు ప్రస్తావించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. నోట్ ఫైల్ పై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంతకం లేకపోవటం, ఎవరు ప్రతిపాదించినది ప్రస్తావన లేకపోవటం, జీవోలో కారణాల గురించి వివరించకపోవటం, డైరెక్ట్ గా సియం చెప్పారు అని చెప్పటం తదితర కారణాల వల్ల ప్రభుత్వ చర్య దురుద్దేశపూరితంగా ఉందన్న అనుమానానికి ఆస్కారం ఏర్పడుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ పేర్కొన్నారు.

విజిలెన్స్ కార్యాలయం తరలించటం వల్ల అత్యంత ప్రధానమైన సచివాలయ కార్యకలాపాలలో పారదర్శకత లోపించే ప్రమాదముందని ఆయనన్నారు. స్థలాభావంతో కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తున్నట్లు నోట్‌ఫైల్స్‌లో ప్రస్తావించలేదన్నారు. కర్నూలుకు కార్యాలయాల తరలింపు విషయంలో, ఆ శాఖ నుంచి ఏ ప్రతిపాదన లేకుండానే, ముఖ్యమంత్రి ఫైల్‌ను ముందుకు పంపినట్లు తెలుస్తుందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఎక్కడైనా స్థలం సరి పోక పొతే, దగ్గరలే వేరేది చూస్తాం కాని, ఎక్కడో కర్నూల్ కు వెళ్ళటం ఏమిటని కోర్ట్ ప్రశ్నించింది. మరో పక్క ఈ విషయాల పై ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం ముఖ్య పర్సన్‌.. కానీ మౌనంగా ఉంటోందని కోర్ట్ కేంద్రం పై వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసులో విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని వింత పరిస్థితి మన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వం మొండి వైఖరితో, రాజ్యాంగ సంక్షోభం దిశగా రాష్ట్రం వెళ్తుందా అని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? గవర్నర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి, నచ్చక పొతే, ఏమి చేస్తుంది, ఒక వేళా గవర్నర్ మాట కూడా ప్రభుత్వం వినక పోతే, కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, వంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వీటి అన్నిటికీ కారణం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మెన్, ఆంధ్రప్రదేశ్ గోవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అవ్వటం. శాసనమండలిలో నెల రోజుల క్రితం, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులు రావటం, అక్కడ ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం, సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లులు వెళ్ళటానికి వీలు లేదు అంటూ ఎదురు దాడి చేస్తుంది. అసలు సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

గట్టిగా మూడు నెలల్లో సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, అప్పుడు ఎలాగూ ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకోవచ్చు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. దీని కోసం ఏకంగా మండలినే రద్దు చేసి పడేసింది. అయితే, ఇక్కడ కేంద్రంలో ఈ బిల్ పాస్ అయితే కాని, మండలి రద్దు అయినట్టు కాదు. ఈ నేపధ్యంలో, ఇప్పటికే ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్ళటంతో, సెలెక్ట్ కమిటీ వెయ్యమని, మండలి కార్యదర్శికి, చైర్మెన్ ఆదేశాలు ఇవ్వటం, కార్యదర్శి, రెండు సార్లు ఆ ఫైల్ ని వెనక్కు పంపటం తెలిసిందే. దీంతో, ఎప్పుడూ లేని విధంగా, ఒక సభ చైర్మెన్ ఆదేశాలను, ధిక్కరించారు, మండలి సెక్రటరీ. దీని వెనుక ప్రభుత్వం ఒత్తిడి ఉందని, ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలోనే, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఈ రోజు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు.

తన ఆదేశాలు పాటించకుండా, సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై బులెటెన్‌ విడుదల చేయకుండా, మండలి కార్యదర్శి చేస్తున్న వ్యవహారం పై గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. ఇదే విషయం పై గవర్నర్ ను కలిసిన తరువాత, షరీఫ్ మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీ విషయంలో సెక్రటరీ పై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. విశిష్ఠ అధికారంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని, ఒక కార్యదర్శి వ్యతిరేకించటం, ఇది వరకు, ఎక్కడా, ఎప్పుడు జరగలేదని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ చొరవ తీసుకుని, సెక్రటరీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అయితే ఇప్పుడు గవర్నర్ ఎలా వ్యవహరిస్తారు అనే దాని పై, అందరి దృష్టి ఉంది. ఒక వేళ, గవర్నర్ ఆదేశాలు కూడా ప్రభుత్వం పాటించక పొతే, తరువాత ఏమి జరుగుతుంది ? రాష్ట్రంలో రాజ్యంగ సంక్షోభం వస్తుందా ? అంత దూరం మొండిగా ప్రభుత్వం వెళ్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో, ఏదైనా తెలుగు పేపర్ లో, జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వానికి కాని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాని, ఏవైనా వ్యతిరేక కధనాలు వస్తే చాలు, ఆ పేపర్ ఎల్లో మీడియా అంటూ, ఒక ట్యాగ్ తగిలిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమైనా వ్యతిరేకంగా రాస్తే చాలు, చంద్రబాబు రాపించాడు, అవి చంద్రబాబు పేపర్లు అంటూ, విరుచుకు పడిపోతుంది వైసీపీ. ప్రమాణస్వీకారం రోజే, అదే మీటింగ్ లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అంటూ, జగన్ మోహన్ రెడ్డి, పేర్లు పెట్టి మరీ ఆ పేపర్లకు వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇలాంటి ఉడత ఊపులు ఎన్నో చూసిన వాళ్ళు ఎందుకు బెదరుతారు ? ఇక పొతే, ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా జగన్ మోహన్ రెడ్డి పాలన పై అనేక వ్యతిరేక కధనాలు వచ్చాయి. ఏకంగా ఎడిటోరియల్స్ రాసి, జగన్ పాలన పై విరుచుకు పడింది, నేషనల్ మీడియా. దీంతో నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబుకి అమ్ముడు పోయింది అని, అది కూడా ఎల్లో మీడియా అంటూ, ప్రచారం మొదలు పెట్టింది వైసీపీ.

wsj 19022020 2

ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటు చేసుకుని. కియా మోటార్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుంది అంటూ, రాయటర్స్ అనే అంతర్జాతీయ మీడియా, కధనం వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక, ఆ కంపెనీ తమిళనాడు వెళ్ళిపోతుందని, ఆ కధనం సారంశం. దీంతో, రాయటర్స్ అనే అంతర్జాతీయ మీడియాకి కూడా, ఎల్లో మీడియా అనే ట్యాగ్ కొత్తగా తగిలించారు. ఇది ఇలా ఉండగానే, నిన్న అమెరికాలో ప్రముఖ వార్త పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా, జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ, ఒక వార్త రాసింది. భారత దేశంలో, సోలార్ పవర్ మొన్నటి దాకా ఎంతో బాగుండేది అని, తాజాగా మారిన పరిస్తితుల్లో, ఇప్పుడు సోలార పవర్ లో, భారత దేశం వెనుక పడింది అంటూ, ఒక వార్త వేసింది వాల్ స్ట్రీట్ జనరల్.

భారత దేశంలో సోలార్ పవర్ ఎందుకు పడిపోతుందో చెప్తూ, ఆంధ్రప్రదేశ్ విధానాలు కూడా ఒక కారణంగా రాసింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఇండియాలో దక్షిణాదిన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మొన్నటి దాకా రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. ఇక్కడ అధికంగా, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి, వాడకం కూడా జరిగేది. అయితే, ఈ రంగంలో చేసుకున్న ఒప్పందాలు, మళ్ళీ సమీక్షిస్తాం , మాకు తక్కువ రేటు కు ఇవ్వాల్సిందే అని అక్కడ ప్రభుత్వం చెప్పటంతో, ఈ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది అంటూ, వాల్ స్ట్రీట్ జనరల్ మన రాష్ట్ర విధానాలు గురించి రాసింది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ప్రధాని మోడీకి కూడా ఫిర్యాదు చేసాయి. అలాగే దావోస్ లో కూడా ఇదే చర్చ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వద్ద జరిగింది. ఇప్పుడు భారత దేశంలో, సోలార్ పవర్ పడిపోవటంలో, ఏపి కూడా ఒక కారణం అని అమెరికాలో ప్రముఖ వార్త పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా చెప్తుంది. ఇది చంద్రబాబు బినామీ, ఎల్లో మీడియా అని విమర్శలు చెయ్యకుండా, ప్రభుత్వం జరుగుతున్న పొరపాటు సరిదిద్దితే, రాష్ట్రానికే కాదు, దేశానికీ కూడా మంచిది. లేకపోతే, మన విధానాల వల్ల, దేశం ఇమేజ్ కూడా ఇలా అంతర్జాతీయంగా పోతుంది.

Advertisements

Latest Articles

Most Read