కేంద్రప్రభుత్వ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం తనపార్టీ కార్యకర్తలు, నాయకులకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోందని, గతప్రభుత్వంలో ఉపాధిహామీపథకం కిందపనులు చేసినవారికి అందాల్సిన సొమ్ముని దారిమళ్లించి, తమపార్టీవారికి దోచిపెట్టే క్రతువుకు జగన్‌సర్కారు తెరలేపిందని టీడీపీనేత, ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. పంచాయతీభవనాలు, అంగన్‌వాడీభవనాలు, పాఠశాలలకు, సచివాలయాలు, చిట్టచివరకు చెత్తకుండీలు, శ్మశానాలకు పార్టీరంగులేసిన జగన్‌సర్కారుకి హైకోర్టు నిర్ణయం చెంపపెట్టువంటిదన్నారు. రాష్ట్రప్రభుత్వం రంగులేయడానికే రూ.1300కోట్లు ఖర్చు చేసిందన్నారు. వైసీపీ రంగులేయడానికి రూ.1300కోట్లుఖర్చయితే, కోర్టు ఆదేశాలతో అవితొలగించడానికి తిరిగి మరో రూ.1300కోట్లు ఖర్చవుతుందని, మొత్తం గా రూ.2,600కోట్ల ప్రజాధనాన్ని వైసీపీప్రభుత్వం దుర్వినియోగంచేసిందని వై.వీ.బీ పేర్కొన్నారు. మండలినిర్వహణకు రూ.60కోట్లు ఖర్చవుతుందని గగ్గోలుపెట్టిన జగన్‌, తనపార్టీ రంగులకోసం ఖర్చుచేసిన రూ.2,600కోట్లను తనసొంత నిధుల్లోంచి చెల్లిస్తారా అని టీడీపీనేత ప్రశ్నించారు. తాను అక్రమంగా సంపాదించిన సొమ్ములోంచి ఆమొత్తాన్ని మినహాయించాలన్నారు.

రాజ్యాంగవిరుద్ధంగా గ్రామపంచాయతీలు, మండలపరిషత్‌ భవనాలకు, పాఠశాలలకు రంగులు వేయడంజరిగిందన్నారు. గ్రామపంచాయతీ భవనాలు గ్రామంలో నివసించే ప్రజలందరివీ అని, వాటికి పార్టీ రంగులేయడానికి వైసీపీప్రభుత్వానికి ఏం అధికారముందన్నారు. ఏపార్టీ అధికారంలోఉంటే, ఆపార్టీ రంగులేస్తూపోతే, అలాంటిచర్యలకు అంతూపొంతూ ఉండదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు అత్యుత్సాహంతో రోడ్లవెంబడి ఉన్నచెట్లకు కూడా వైసీపీరంగులు వేశారన్నా రు. హైకోర్టుఆదేశాలతో రంగులు మార్చడానికి అవసరమయ్యే నిధుల్ని జగన్‌ జేబులో నుంచే తీసి ఖర్చుపెట్టాలని వై.వీ.బీ డిమాండ్‌చేశారు. టీడీపీ హాయాంలో ఉపాధిహామీపథకం కింద చేసిన అభివృద్ధిపనుల తాలుకా రూ.,2500 కోట్ల నిధులు ఇవ్వకుండా వైసీపీప్రభుత్వం ఇప్పటివరకు వేధించుకుతిందని, దానిపై కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. పాతబకాయిలు రూ.2,500కోట్లు ఇవ్వకుండా, కేంద్రం విడుదలచేసిన రూ.1700కోట్లను జగన్‌సర్కారు తనసొంతపథకా లకు వినియోగించుకుంటోందన్నారు.

ఇళ్లస్థలాల చదునుకు ఎకరాకు రూ.కోటి, ఒక్కోసచివాలయం నిర్మాణానికి రూ.50లక్షల చొప్పున కేటాయించారని టీడీపీనేత తెలిపారు. గతప్రభుత్వంలో పనులుచేసిన వారికి అందాల్సిన నిధుల్ని పందికొక్కుల్లా మింగేయడానికి వైసీపీకార్యకర్తలు, నేతలు ఇప్పటికే సిద్ధమైపోయారని రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.గ్రామ,మండల, నియోజకవర్గస్థాయిలో ఉండే వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా భవిష్యత్‌లో తమకు పట్టినగతే పడుతుందని, ఇప్పుడు వారు చేస్తున్నపనులకు నిధులు రాకుండా తాము కేంద్రానికి ఫిర్యాదుచేస్తామని వై.వీ.బీ. హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారనే అత్యుత్సాహంతో పనులు చేసేవారంతా ఈ విషయా న్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. మండలినిరద్దు చేసి, తమపదవులుపోగొట్టి, తమను ప్రజలపక్షాన నిలిపి, పదవుల్ని త్యాగంచేసే అవకాశం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వై.వీ.బీ అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో తనపార్టీవారితో కలిసి జగన్‌ గానా భజానా నిర్వహించాడని, మంత్రి ధర్మానప్రసాదరావు రాజకీయవేత్తగా కంటే, సినిమాదర్శకుడిగా బాగా పనికొస్తాడని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరి లోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనావికేంద్రీకరణ చేయాలన్న ఆలోచన ఆనాడు మంత్రులుగా ఉన్న బొత్స, ధర్మానలకు ఎందుకు రాలేదన్నారు. విభజనానంతర రాష్ట్రానికి రాజధాని అనేది అత్యంత కీలకమని, ఒకనగరం కొత్తగా నిర్మితమవడం వల్ల రాష్ట్రానికి వచ్చే అవకాశాలు, పరిశ్రమలు, తద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ధర్మాన, బొత్స, జగన్‌లకు నిజంగా వెనుకబడిన ప్రాంతా లను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధే ఉంటే, రాజధాని శ్రీకాకుళంలో పెట్టాలని జలీల్‌ ఖాన్‌ సూచించారు. బొత్స, ఆయన కుటుంసభ్యులు ఇదివరకే ఉత్తరాంధ్రలో ఎక్కడా కొండల్ని, వాగులు-వంకల్ని కూడా వదలకుండా తినేశారన్నారు. జగన్‌ను పొగిడినంత మాత్రాన బొత్స, ధర్మానలు ముఖ్యమంత్రులయిపోరన్నారు. రాష్ట్రవిభజనవేళ విభజన కు అంగీకారం తెలిపినబొత్స, నాడు ఏపీకి సీఎం కావాలని కుట్రలు పన్నాడన్నారు.

మంత్రులకు, జగన్‌ని ప్రశ్నించే ధైర్యంలేదని, అసెంబ్లీ చెప్పిందానికల్లా మండలి సభ్యులు తలాడించడంలేదనే పెద్దలసభను రద్దుచేశారన్నారు. జగన్‌తప్పులను ప్రశ్నించడమే మండలిసభ్యుల నేరమైపోయిందన్నారు. 8నెలలుపూర్తయినా ఇప్పటివరకు జగన్‌ సాధించింది ఏమీలేదన్నారు. చంద్రబాబు పాలనలో రాజధానికేంద్రంగా లెక్కకుమిక్కిలి పనులు జరిగాయని, అవన్నీచర్మం మందంగా ఉన్నవారికి కనిపించవ న్నారు. ఒక్కఛాన్స్‌ ఇవ్వండంటూ ఆనాడు బతిమాలిన జగన్‌, తన 8నెలలపాలనలో 40వేలకోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని అథోగతిపాలు చేశాడన్నారు. ఏదోగాలివాటంగా గెలిచినవాళ్లంతా తామంతా నాయకులని చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్‌లో ఉండి ఏమీ మిగలకుండా రాష్ట్రాన్ని నాకేసినవారంతా ఇప్పుడు జగన్‌పంచనచేరారని, వారికి ఎంతబలముందో స్థానికఎన్నికల్లో తేలుతుందన్నారు. జగన్‌ మగాడయితే, రాజధాని తరలింపు నిర్ణయాన్ని రిఫరెండంగా తీసుకొని రాష్ట్రంలో ఏదోఒకస్థానంలో ఎన్నిక నిర్వహించి, తనసత్తా ఏమిటో ప్రజలకు చూపించాలని జలీల్‌ఖాన్‌ సవాల్‌విసిరారు.

అన్నాక్యాంటీన్లు మూసేసి, వాటిని గ్రామసచివాలయాలుగా మార్చిన జగన్‌ నిర్ణయాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, వాలంటీర్లకు ఇచ్చే రూ.5వేలు చాలక వారు ప్రజల సొమ్ముని దోచేస్తున్నారన్నారు. అమరావతి రూపురేఖల్ని, రాజధానిలో జరిగిన పనుల్ని ఏనాడూ కన్నెత్తికూడా చూడని జగన్‌, అసలు అక్కడేమీ జరగలేదని ఎలా చెబుతాడన్నా రు. వైసీపీ చెంచాలకు భూమ్మీద కాళ్లు నిలవడంలేదని, ప్రభుత్వం ఉందికదా అని తోకజాడిస్తే చూస్తూ ఊరుకోబోమని జలీల్‌ఖాన్‌ హెచ్చరించారు. ఆంధ్రాపోలీసులు పనికిరారని చెప్పిన జగన్‌, ఇప్పుడు వారినే అడ్డుపెట్టుకొని బతుకుతున్నాడన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మూలకారకుడు జగన్మోహన్‌రెడ్డని, తనఎదుగుదలకోసం ఆనాడు సోనియాగాంధీతో ఆయన సంప్రదింపులు జరిపి, అవి విఫలంకావడంతోనే విడిగాపార్టీ పెట్టాడన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీ.ఏ.ఏకి వ్యతిరేకంగా కేరళ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌సహా, 12 రాష్ట్రాలు తీర్మానం చేశాయని, ముస్లింల ఓట్లతో గెలిచిన జగన్‌, ఆదిశగా అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని జలీల్‌ఖాన్‌ నిలదీశారు.

ఇప్పుడు జగన్‌కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బొత్స, గతంలో వై.ఎస్‌.విజయ మ్మను ఉద్దేశించి ''ఏయ్‌ విజయా.. నీకొడుకు దొంగ, నువ్వుచెప్పావని నీకొడుకుని ముఖ్యమంత్రిని చేయాలా..'? అని నోటికొచ్చినట్లు మాట్లాడాడని, ఆయన చెప్పిందంతా నాటి అసెంబ్లీలో రికార్డయిందని జలీల్‌ఖాన్‌ తెలిపారు. రాష్ట్రవిభజనను గుడ్డిగా సమర్థించిన వారిలో ఆనాడు బొత్సనే ముందున్నాడని చెప్పారు. రాజకీయాల్లో తప్పొప్పులు సహజమని, కానీ, కక్షసాధింపులు, వేధింపులకుపాల్పడటం రాష్ట్రంలో ఇప్పుడే చూస్తున్నామన్నారు. వైసీపీప్రభుత్వంలో అన్నివర్గాలప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వాహనమిత్ర పేరుతో ఆటోవాళ్లకు డబ్బులుఇచ్చినట్లే ఇచ్చి, కేసుల రాసి, అంతరకు రెట్టింపు వసూలు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నిధుల్ని అమ్మఒడికి తరలించడం ఎలాంటి పాలనో చెప్పాలన్నారు. దూరదృష్టి, ఆలోచ న, విశాలధృక్పథం ఉన్నవాడెవడూ దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోడని, అక్కడి జీవనవిధానం ఎలా ఉంటుందో జగన్‌కు తెలుసునా అని జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు. జగన్‌ను అడ్డుపెట్టుకొని వైజాగ్‌ను తిమింగలంలా మింగేయడానికి బొత్స ప్రయత్నిస్తున్నా డన్నారు. లోకేశ్‌ ఓటమిని గురించి మాట్లాడేవారంతా, విజయమ్మ ఓటమిపై ఏం సమాధానం చెబుతారని జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వి-వే-క, గత ఏడాది, హ-త్య కాబడిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. అప్పట్లో ఇది చంద్రబాబు చేపించాడు అంటూ, హోరెత్తించిన జగన్, సిబిఐ ఎంక్వయిరీ కావలి అంటూ హడావడి చేసారు. అయితే, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి, 8 నెలలు దాటి, 9 వ నెలలోకి వచ్చినా, ఇప్పటి వరకు, సిబిఐ ఎంక్వయిరీ కోరలేదు. మరో పక్క, కావాలని రాజకీయ ప్రత్యర్ధులను టార్గెట్ చెయ్యటంతో, వారు, ఈ కేసులో మాకు సిబిఐ ఎంక్వయిరీ కావాలి అంటూ, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి అంటూ, వి-వే-కా సతీమణి సౌభాగ్యమ్మ, తెలుగుదేశం నేత బీటెక్‌ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా హైకోర్ట్ లో పిటీషన్లు వేసారు. ఈ కేసుల పై, ఇప్పటికే వాదనలు జరగగా, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదు, అంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇప్పటికే మా ప్రభుత్వం సిట్ వేసిందని, వారు ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని చెప్పారు.

అందుకే దీని పై, సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు అంటూ, జగన్ ప్రభుత్వం, హైకోర్ట్ ముందు వాదించింది. అయితే, ఈ రోజు ఈ కేసులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. తనకు కొంత మంది పై అనుమనాలు ఉన్నాయి అంటూ, వి-వే-క కూతురు సునీత, హైకోర్ట్ లో మరో పిటీషన్ వేసారు. ఒక పక్క జగన్ సిబిఐ వద్దు అంటుంటే, ఏకంగా తన కుటుంబ సభ్యులే, మరో కుటుంబ సభ్యుల పై అనుమానాలు ఉన్నాయి అంటూ, ఈ రోజు కోర్ట్ లో పిటీషన్ వేసారు. 3 సిట్ టీంలు ఇప్పటి వరకు వేసినా, ఏమి తేలలేదని, అందుకే సిబిఐ విచారణ కావాలని కోరారు. తనకు కొంత మంది పై అనుమానాలు ఉన్నాయి అంటూ, దాదపుగా 15 మంది పేర్లు కోర్ట్ కు ఇచ్చారు. అందులో అనూహ్యంగా, వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది. మిగతా పేర్లు, వాచ్ మెన్ రంగయ్య, ఎర్ర గంగి రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రెనివాస్ రెడ్డి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్సై రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్ర నాద్ రెడ్డి, మారెడ్డి రావేంద్ర నాద్ రెడ్డి, అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు ఉన్నారు.

ప్రతివాదులుగా ఏడుగురిని పిటిషన్ లో చేర్చిన సునీత. గతంలో సీబీఐ విచారణ జరిపించాలని తన సోదరుడు జగన్, తన తల్లి సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ వేసిన అంశాన్ని గుర్తుచేసిన వివేకానందరెడ్డి కుమార్తె. గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని పిటిషన్ లో పేర్కొన్న డాక్టర్ సునీత. తాజాగా ఈ కేసు దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని పిటిషన్ లో ఆరోపణ. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి..ఇప్పుడు సీఎంగా ఉన్న తన సోదరుడు జగన్ నేరుగా సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వం తరపున ఎందుకు కోరట్లేదని ప్రశ్నించిన పిటిషనర్ . ఏపీ పోలీసులపై నమ్మకంలేదని అప్పట్లో పేర్కొని.. ఇప్పుడు మరలా అదే పోలీసులతో దర్యాప్తు జరిపించటం ఏమిటని ప్రశ్న. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే పరమేశ్వరరెడ్డి బామ్మర్ధి శ్రీనివాస్ రెడ్డి ఆ-త్మ-హ-త్య పై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్ సునీత. పో-స్టు-మా-ర్టం నివేదికలో శ్రీనివాస్ రెడ్డికి గా-యా-లు-న్నా-య-ని, ఆయన వి-షం తీసుకొని చ-ని-పో-లే-ద-నే అనుమానాన్ని వ్యక్తం చేసిన పిటిషనర్. అయితే ఈ కేసు పై, హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసును సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించింది. అడ్వొకేట్‌ జనరల్‌ అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

రాజధాని తరలింపు వల్ల ఇప్పటికే అమరావతికేంద్రంగా అభివృద్ధికోసం వెచ్చించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సొమ్మంతా వృథా అవుతోందని, రాజధానికోసం పోరాడుతున్న వారిపై నక్సలైట్లు, టెర్రరిస్టులపై పెట్టిన కేసులు పెట్టారని, రాజధాని తరలింపు పేరుతో రాష్ట్రంలో అధికారపార్టీ సాగిస్తున్న అరాచకాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని టీడీపీ లోక్‌సభసభ్యులు గల్లా జయదేవ్‌ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన తోటిఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మిలతో కలిసి, మంగళగి రిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులకు ఏం న్యాయంచేస్తారో, ఎలా చేస్తారో, గతప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాలకు ఎలా న్యాయం చేస్తారో జగన్‌సర్కారు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు రాజధానిని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్‌రెడ్డి, గతంలో రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని, అందుకు 30వేల ఎకరాలైనా కావాలని ఎందుకు చెప్పాడని గల్లా ప్రశ్నించారు. 2014లో విభజనబిల్లుపై చర్చజరిగేటప్పుడు, అసెంబ్లీలో జగన్‌ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు నన్నారు. ఎన్నికలప్రచారంలోకానీ, మేనిఫెస్టోలోగానీ జగన్‌, ఆయనపార్టీసభ్యులు రాజధానిని మారుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

రివర్స్‌టెండర్లు, అవినీతి పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ ఆపేశారని, తద్వారా రాష్ట్రపురోగతి నిలిచిపోయిందన్నా రు. జీ.ఎన్‌.రావు, బీసీజీ కమిటీల రిపోర్టులు రాకముందే జగన్‌, తన నిర్ణయాన్ని వెల్లడించాడని, అలాంటప్పుడు ఆ కమిటీలకు విశ్వసనీయత ఎలా ఉంటుందని జయదే వ్‌ ప్రశ్నించారు. న్యాయస్థానాలుకూడా ఆయా కమిటీల నివేదికల్ని తప్పుపట్టాయని, చెన్నైఐఐటీ వారు అమరావతి ముంపుకు సంబంధించి ఏదో నివేదిక ఇచ్చారనికూడా దుష్ప్రచారం చేశారన్నారు. తాను రాళ్లేశానని తనపై కేసుపెట్టారని, నేనుకానీ, నాతో వచ్చినవారుకానీ రాళ్లేయలేదని, సివిల్‌దుస్తుల్లో ఉన్న పోలీసులే ఆపనిచేశారని గల్లా స్పష్టంచేశారు. పోలీసువారే ఒకకుట్రప్రకారం రాళ్లేసి, దాన్నిసాకుగాచూపి, కొట్టారని, పోలీసులు కొడతారన్న అనుమానంతో మహిళలంతా తనచుట్టూచేరి రక్షణగా నిలిచారని జయదేవ్‌ పేర్కొన్నారు. ఎస్పీగా ఉన్నవ్యక్తి ఒకవైపు దండంపెడుతూనే , మరోవైపు చేయాల్సింది చేస్తూనే ఉన్నారని, గిచ్చడం, రక్కడం చేసి చివరకు లాక్కెళ్లారని ఆయన వాపోయారు. ఎంపీ విషయంలోనే ఇంతదారుణంగా ప్రవర్తించిన పోలీసులు , ఇకసామాన్యప్రజల్ని ఎంతలా వేధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. తనకు జరిగిన దానికన్నా, సాటిరైతులు, మహిళలు, ఇతరులపై పోలీసులుప్రవర్తించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాజ్యాంగంపట్ల నమ్మకం, గౌరవం, సదభిప్రాయం లేని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డని, ఆయనకు ప్రజలమీద గౌరవం, మర్యాద లేవని, టీడీపీనేత, రాజ్యసభసభ్యులు కనకమేడ ల రవీంద్రకుమార్‌ స్పష్టంచేశారు. తనను బాధించిందనే జగన్‌ మండలిని రద్దుచేశాడని, ఆయన గత 7నెలలనుంచీ ప్రజల్ని ఎంతగా బాధించి, వేధించాడో ఎందుకు ఆలోచించ లేకపోతున్నాడన్నారు. 30-05-2019నుంచి మండలి 32 బిల్లులవరకు ఆమోదించిం దని, రెండుబిల్లుల్ని సెలెక్ట్‌కమిటీకి పంపితే ఆ నిర్ణయాన్ని జగన్‌ తప్పుపట్టడం దారుణమ న్నారు. మండలిలో చర్చించిన అంశాలను అసెంబ్లీలో చర్చించడానికి వీల్లేదని, ముఖ్యమంత్రి ఆదేశాలతో స్పీకర్‌ తమ్మినేని విచక్షణ, సభ్యత కోల్పోయి ప్రవర్తించాడన్నారు మండలిని రద్దుచేయడానికి జగన్‌కు ఏం అధికారాలున్నాయని, రద్దుచేయడానికి అదేమైనా ఆయన కుటుంబసమస్యా అని కనకమేడల ప్రశ్నించారు. రాజకీయపరమైన కుట్రతోనే, బీసీలు అధికంగా ఉన్న మండలిని జగన్‌ రద్దుచేశాడని, తద్వారా ఆయన తాను బీసీల వ్యతిరేకినని చెప్పకనే చెప్పాడన్నారు.

టీడీపీ హయాంలో నరేగా పథకాన్ని సద్వినియోగంచేసుకొని, ఏరాష్ట్రం చేయనివిధంగా రోడ్లు, భవనాలు, చెత్తనుంచి సంపదతయారీ కేంద్రాలవంటి పనులు చేయడం జరిగిం దని, ఆపనులు చేసినవారికి ఇప్పటికీ నిధులు ఇవ్వకుండా వైసీపీసర్కారు వేధిస్తోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈవ్యవహారంపై కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కి ఫిర్యాదు చేశామని, ఆయనచెప్పినా వినకుండా, ఆఖరికి హైకోర్టుచెప్పినా ఖాతరుచేయకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌ లో ప్రస్తావించి, రాష్ట్రసర్కారు వైఖరిని ఎండగడతామని రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశా రు. భవనాలు కట్టినవారికి బిల్లులు చెల్లించకుండా, అదేభవనాలకు తమపార్టీ రంగులు వేసుకున్నారని, తద్వారా వందలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలసొమ్ముతో, వారంవారం కోర్టులచుట్టూ తిరుగుతు న్నారని, అదే ఆయన ప్రజలకు ఇచ్చిన గొప్పబహుమానమని కింజారపు వ్యాఖ్యానించా రు. నరేగా నిధులు ఇవ్వమన్నా, రంగులు ఎందుకువేశారన్నా, క్రమంతప్పకుండా కోర్టుకు హాజరవ్వాలని చెప్పినా వినిపించుకోకుండా జగన్‌ ప్రవర్తిస్తున్నాడన్నారు. వైసీపీ వైఫల్యాలను చూసినతర్వాత రాష్ట్రప్రజలంతా తిరిగి చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటున్నారని రామ్మోహన్‌నాయడు తెలిపారు. జగన్‌ ఎన్ని ఇబ్బందులుపెట్టినా, టీడీపీ ఎల్లప్పుడూ రాష్ట్రప్రజల భవిష్యత్‌కోసం, వారిపక్షానే నిలిచిపోరాటం చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

Advertisements

Latest Articles

Most Read