అమరావతిలో ఒక పక్క మండలి రాద్దు అంశం పై, అసెంబ్లీలో చర్చ జరిగి, ఏమి జరుగుతుందో అని ఆసక్తి ఉన్న వేళ, విజయవాడలో కర్ణాటక రైతులని అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం 40వ రోజుకు చేరుకుంది. అయినా ఎక్కడా ప్రభుత్వం కనీసం వీరిని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం వారి సమస్య ఏమిటి అనేది కూడా పట్టించుకోలేదు. అయినా అమరావతి రైతులు, శాంతియుతంగా, ఎక్కడా లైన్ దాటకుండా, వారు 40 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, అమరావతి రైతులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అయితే, ఈ రోజు అమరావతి రైతులకు అనూహ్య మద్దతు వచ్చింది. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న నిరసనకు, కర్నాటక నుంచి వచ్చిన రైతులు, మద్దతు ప్రకటించారు. అయితే, ఇది ఇక్కడితో అయిపోలేదు. వారు అమరావతికి వస్తూ ఉండగా, వారిని పోలీసులు అడ్డుకోవటం, సంచలనంగా మారింది. మడ్డు ఇస్తే కూడా అడ్డుకుని, అరెస్ట్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు.

cbn 277012020 2

అది కూడా, వేరే రాష్ట్ర రైతులని, మన రాష్ట్రంలో అరెస్ట్ చెయ్యటం, సంచలనంగా మారింది. అయితే కర్ణాటక రైతుల అరెస్ట్ ను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు కర్ణాటక రైతులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్ళు ఏమి తప్పు చేసారని అరెస్ట్ చేసారని, చంద్రబాబు అడిగారు. వారిని వెంటనే విడుదల చేసి, వారిని అమరావతి రైతుల దగ్గరకు వెళ్ళకుండా చెయ్యాలని కోరారు. వారిని కనుక విడుదల చెయ్యకపోతే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటూ చంద్రబాబు హెచ్చరించారు. దీంతో, పోలీసులు మళ్ళీ చంద్రబాబు వస్తే, ఎలా ఉంటుందో అని, పోలీసులు వెంటనే వారిని విడుదల చేసారు. వారికి అండగా అక్కడ స్థానికి విజయవాడ టిడిపి నేతలు ఉన్నారు.

cbn 277012020 3

చంద్రబాబు మాట్లాడుతూ, "కర్ణాటక నుంచి వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం హేయం. రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు వస్తే తప్పా..? సాటి రైతులు కష్టంలో ఉన్నారని కర్ణాటక రైతులు వచ్చారు. తోటి రైతులకు సంఘీభావం చెప్పడమే వాళ్ల నేరమా..? ఒక రైతుకు, మరో రైతు మద్దతివ్వడంలో తప్పేంటి..? తక్షణమే కర్ణాటక రైతులను వదిలేయాలి. లేకుంటే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఏవిధంగా విడుదల చేయరో చూస్తాను " అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే కర్ణాటక రైతులు, వారికి ఎదురైన పరిస్థితి చూసి అవాక్కయ్యారు. మేము ఏమి చేసాం అని మమ్మల్ని అరెస్ట్ చేసారు, ఒక సాటి రైతుకు, మరో రైతు, ఈ దేశంలో మద్దతు తెలపటం కూడా తప్పా అంటూ, కర్ణాటక రైతులు వాపోయారు.

జగన్ మోహన్ రెడ్డి, మూడు ముక్కల రాజధాని నిర్ణయం తీసుకున్న సమయంలో, ఈ ప్రక్రియ అంతా, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. జగన్ ఈ నిర్ణయం తీసుకున్న తరువాత, అమరావతి రైతులు ఎంత ఆందోళన చేసినా, 30 మంది చనిపోయినా, జగన్ మాత్రం అదరలేదు బెదరలేదు. క్యాబినెట్ నిర్ణయం, అసెంబ్లీ నిర్ణయం తీసుకోవటంతో, ఇక మూడు ముక్కల రాజధాని తధ్యం అని అందరూ అనుకున్నారు. ఇక అమరావతి రైతులు రోడ్డున పడినట్టే అని అందరూ అనుకున్నారు. శాసనమండలిలో టిడిపికి మెజారిటీ ఉన్నా, ఇక్కడ బిల్లు రిజెక్ట్ చేసినా, మళ్ళీ అసెంబ్లీ ఆమోదిస్తే, ఇక మండలి గురించి పట్టించుకోనవసరం లేదని అనుకున్నారు. అయితే, ఇదే సమయంలో, చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవాన్ని చూపించారు. ఏ 40 ఏళ్ళ అనుభవం అంటూ, వైసీపీ ఎగతాళి చేసిందో, దాంతోనే చంద్రబాబు కొట్టారు. మండలి సమావేశాల మొదటి రోజు, బయటకు తెచ్చిన రూల్ 71 దెబ్బకు, గిలగిలా కొట్టుకున్న వైసీపీ, ఇక దీంట్లో నుంచి బయటకు రాలేక, ఏకంగా మండలినే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

cbn 27012020 2

ఇంకో ఏడాది ఎలాగోలా తట్టుకుంటే, జగన్ కే మండలిలో మెజారిటీ వచ్చేస్తుంది. ఏడాది కూడా సహనంగా ఉండలేక, చంద్రబాబు వేసిన పాచికలో జగన్ చిక్కుకుని, ఏకంగా మండలినే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు జగన్, వైఖరి ఏమిటో, ప్రజలు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న తుగ్లక్ అనే ఆరోపణ నిజం చేస్తూ, వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు వేసిన పాచికకు జగన్ చిక్కారు. ఇది ఇక్కడితో అయిపో లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు, వైసీపీ, బీజేపీ మధ్య వైరం ఉంది అంటూ, నమ్మించే ప్రయత్నం చేస్తున్నా, ఆచరణలో మాత్రం, కేంద్రం ఎక్కడా జగన్ ని కట్టడి చెయ్యటం లేదు.

cbn 27012020 3

చివరకు ఒక రాజధానిని మూడు ముక్కలు చేస్తాం, 29 వేల మంది రైతుల త్యాగం వృధా చేస్తాం అంటున్నా, కేంద్రం స్పందించలేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ మాత్రం, మాటలు కోటలు దాటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ దాగుడు మూతలకు చెక్ పెడుతూ, చంద్రబాబు వేసిన పాచికతో, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా తెలిసిపోతుంది. ఒక వేళ, కేంద్రం కనుక మండలి రద్దు నిర్ణయం వెంటనే, అంటే, రేపు ఫిబ్రవరి నుంచి మొదలు అయ్యే పార్లమెంట్ సమావేశంలో ఇది పెడితే, జగన్ కు, బీజేపీకి ఉన్న సంబంధం బయట పడుతుంది. లేదు, ఇప్పటికే ఉన్న రెండు రాష్ట్రాల శాసనమండలి రద్దు తీర్మానాల లాగా, ఏపి తీర్మానం కూడా పెండింగ్ లో పెట్టి, ఏడాది, రెండేళ్ళ తరువాత రద్దు పార్లమెంట్ లో పెడితే, అప్పుడు బీజేపీకి, జగన్ కు ఎలాంటి సంబంధాలు లేవు అని ప్రజలకు అర్ధం అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ అన్ని విషయాలు లాగా తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ వైఖరితో, బీజేపీ ఎటు వైపు అనేది ఏపి ప్రజలకు అర్ధమై పోతుంది.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఒక కన్ను వేసింది. ముఖ్యంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి జరుగుతున్న అంశాలను తెలుసు కునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని కేంద్రం పెద్దలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ జరుగుతున్న తీరు, మండలి రద్దు తదితర అంశాలను నిశి తంగా కేంద్రం పరిశీలిస్తోంది. శాసనమండలిలో మంత్రులే పోడియంను చుట్టుముట్టడం, సభాపతి టేబుల్ పై ఉన్న పేపర్లను చింపివేయడం తదితర పరిణామాలకు సంబం ధించిన వీడియో ఫుటేజ్ ఇప్పటికే కేంద్రానికి చేరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించినట్లుగా చెబుతున్నారు. గవర్నర్ నుంచి నివేదిక కోరినట్లుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యం లోనే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో, మండలి చైర్మన్ ఎం.ఎ.షరీ తో విడివిడిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

governor 27012020 2

శనివారం సాయంత్రం స్పీకర్ తమ్మినేనితో భేటీ అయిన గవర్నర్ ఆదివారం మధ్యాహ్నం మండలి చైర్మన్ షరీఫ్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ పరిణా మాలపై స్పీకర్‌ తమ్మినేనితో గవర్నర్ ఏకాంతంగా చర్చించారు. సభ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం వ్యవహరిస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు సైతం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలియ వచ్చింది. మూడు రాజధానులు, సీఆర్డీయే ఉప సంహరణ బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన పరిణామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ స్పీకర్‌ను అడిగి క్షుణ్ణంగా తెలుసుకు న్నారు. మరోవైపు ఈ రెండు బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా సెలక్ట్ కమిటీకి పంపడం పై మండలి చైర్మన్ గవర్నరు వివరణ ఇచ్చారు.

governor 27012020 3

బిల్లులు తిరస్కరించడం జరగలేదని కేవలం ప్రజాభిప్రాయ సేకరణకే పంపడం జరిగినట్లుగా చైర్మన్ షరీఫ్ గవర్నర్‌కు వివరించారు. ఇదే సందర్భంగా అధికార, విపక్ష ఎమ్మెల్సీలు, మంత్రు లు మధ్య జరిగిన వాగ్వాదం, ప్రత్యక్ష ప్రసారాల నిలుపుదల, ఇతర అంశాల గురించి గవర్నర్ నిశితంగా సమాచారం. సేకరించారు. త్వరలో కేంద్రానికి నివేదిక.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజా పరిణామాలతో పాటు మూడు రాజధానుల ప్రకటన నాటి నుంచి జరుగుతున్న విషయాలను కేంద్రం దృష్టికి ఆయన తీసుకు వెళ్ళనున్నారు. శాసనమండలిలో మంత్రులు బల్లలు ఎక్కటం, చైర్మెన్ ని బెదిరించటం, టిడిపి సభ్యుల పైకి దూసుకురావటం తదితర వీడియోలు చంద్రబాబు, గవర్నర్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే.

అంతా అనుకున్నట్టే జరిగింది. తన మాట వినని, శాసనమండలిని రద్దు చేస్తూ, జగన్ అధ్యక్షతన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు భేటీ అయిన క్యాబినెట్, శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసింది. మరో కొద్ది సేపట్లో, ఈ బిల్ శాసనసభలో ప్రవేశపెట్టి, బిల్ ఆమోదించి, కేంద్రానికి పంపనున్నారు. నేడు ఏపీ అసెంబ్లీలో ఏమి జరగబో తుంది..? అనే అంశంపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజలు ఆసక్తి ప్రదర్శించారు. అయితే జగన్ మాత్రం అనుకున్నదే చేసారు. గత వారం మండలిలో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఇప్పుడు జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో మండలి రద్దుకు తీర్మానం తీసుకుంటే, మరోవైపు మండలి చైర్మన్‌ షరీఫ్ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకుసన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం, అలాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. కాగా మండలిరద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేసిన నేపథ్యంలో తెదేపా కూడా ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది.

jagan 27012020 2

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఉభయ పక్షాల నేతలు ఆదివారం సమావేశమై తమ సభ్యులతో చర్చించారు. తేదీ శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశానికి వెళ్ళకూడదనిటీడీఎల్సీలోనిర్ణయించారు. బుధవారం మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై తెదేపా గురువారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. శాసనమండలిలో జరిగిన చర్చను శాసనసభలో చర్చించడాన్ని వారంతా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని వారంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా శాసనసభలో చర్చలు జరుగు తున్న నేపథ్యంలో వాటికి దూరంగా ఉండాలని తెదేపా నేతలు నిర్ణయం తీసుకున్నామని చెబుతు న్నారు.

jagan 27012020 3

ఇదిలావుండగా మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో పెద్దల సభను రద్దు చేయాలని జగన్ భావించారు. కాగా సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్సార శాసనమండలిని తీుకువచ్చారని, దానిని రద్దు చేసేందుకు ప్రయత్నించకండి అని కొందరు నేతలు సూచించినట్లు సమాచారం. అలాగే శాసనమండలిలో ఏదో విధంగా మెజార్టీ సంపాదించుకోండని, ఒకవేళ మెజార్టీ తాత్కాలికంగా లేకున్నా, మరో రెండేళ్ళ తర్వాత మన పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. అప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా తట్టుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలి రద్దుకు ప్రయత్నించకండి అని కొంతమంది శ్రేయోభిలాషులకు జగన్ కు నచ్చజెప్పినట్లు తెలిసింది.అయినా జగన్ వినలేదు, తను అనుకున్నదే చేసారు.

Advertisements

Latest Articles

Most Read