ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్మో హన్ రెడ్డికి ఆత్రం చాలా ఎక్కువని విమర్శించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందిన రోజే, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారని నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు మండలి రద్దు విషయంలో కూడా ఆత్రం ఎక్కువైపోయిందని విమర్శించారు. 4 నెలలు ఆగితే మండలిలో వైకాపా బలం పెరిగేదని గుర్తు చేశారు. బలం ఉంది కదా అని తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో, 3 రాజధానుల బిల్లును మండలి అడ్డుకోవడంతోనే ఏకంగా రద్దు చేసారని అన్నారు. నిజానికి సెలెక్ట్ కమిటీ పెండింగ్ లో ఉండగా రద్దు చేయడం సాధ్యపడుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకమేనని నారాయణ వ్యాఖ్యానించా రు. అసలు మండలి రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు.

narayana 28012020 2

జగన్ వైఖరి వల్ల రాజకీయ పార్టీలకంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ప్రభుత్వాలు సైతం ఐదేళ్ల తర్వాత అడ్రస్ లేకుండా పోయాయని, అధిక బలం ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. శాసన మండలి లేదా విధానమండలి ఉండాలా, వద్దా అన్న విషయంలో సీపీఐ వైఖరి మేమే అయినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దు నిర్ణయం స్వార్ధ ప్రయోజనాల కోసం జరిగింది కాబట్టి ఖండిస్తున్నామని నారాయణ వ్యాఖ్యానించారు. మండలి ఉండాలి అని సీపీఐ ఎప్పుడూ కోరలేదని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో జగన్ నిర్ణయాలతో వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించా రు. అమరావతి అభివృద్ధి జరిగితే తనకు పేరు రాదని, తన మార్కు ఉండదన్న ఉద్దేశంతోనే రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

narayana 28012020 3

మొత్తానికి అమరావతిలో పరిస్థితి దారుణంగా తయారయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలి కానీ మూడుముక్కలాట తగదని నారాయ ణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అని జనాన్ని నమ్మిస్తూ పాలనను వికేంద్రీకరించడం సరికాదని హితవు పలికారు. విశాఖపట్నం నగరాన్ని కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, ఉన్నదాన్ని పాడుచేయకుండా ఉంటే చాలని నారాయణ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ముఖ్య మంతైన జగన్‌ను తాను తొలుత అభినందిస్తూ సమర్థ వంతంగా పనిచేస్తారని భావించానని, కానీ పరిస్థితి చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం వెనుక భారతీయ జనతా పార్టీ మద్దతు ముఖ్యంగా అమిత్ షా భరోసా ఉందన్న అనుమానం నారాయణ వ్యక్తం చేశారు.. బీజేపీ పెద్దల మద్దతు లేకుండా ఇలాంటి నిర్ణయాలు జగన్ తీసుకుంటారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యా నించారు. ఎందుకంటే రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ తీర్మానాలు చేస్తే సరిపోదని, తదుపరి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు చేతుల్లోనే ఉంటుందని గుర్తు చేశారు. అందుకే , వారి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని నారాయణ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. దేశం మొత్తం, మన వైపు తిప్పుకునేలా చేస్తాను అంటున్న జగన్, నిజంగానే, దేశం మొత్తం మన గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు. విద్యుత పీపీఏల విషయం దగ్గర నుంచి, చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు దాకా, అన్నీ అయోమయ ప్రకటనలే. వీటి పై, జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ను తుగ్లక్ అంటూ సంబోధిస్తూ, ఆర్టికల్స్ వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం, ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎవరి మాటలు పట్టించుకోవటం లేదు. ఎవరు ఏది చెప్పినా, వాళ్ళు చంద్రబాబుకి అనుకూలం అనే ముద్ర వేసి, తాను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా, ప్రజలను నమ్మించే పనిలో ఉన్నారు. ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా, జగన్ మాటకు భజన చేసే పరిస్థితి. దీంతో, తాను తీసుకున్న నిర్ణయం రైట్ అనే విధంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాజగా మండలి రద్దు విషయంలో కూడా అదే జరిగింది.

kesavarao 28012020 2

తన నిర్ణయాన్ని సమర్ధించని, మండలి అవసరం లేదు అంటూ, జగన్ నిర్ణయం తీసుకుని, ఏకంగా మండలినే రద్దు చెయ్యటం సంచలనంగా మారింది. అయితే మండలి రద్దు పై, ఖర్చు అంశాన్ని జగన్ తెర మీదకు తీసుకు వచ్చారు. మండలి సమావేశాలకు, ఏడాదికి 60 కోట్లు అవుతాయని, మనకు ఇది అవసరమా అనే చర్చ పెట్టరు. అయితే దీని పై విపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు ప్రతి వారం కోర్ట్ కు వెళ్ళటానికి, 60 లక్షలు అవుతాయి అన్నారు, అంటే 5 ఏళ్ళకు 150 కోట్లు అవుతాయి, మీరు సియంగా అవసరమా అంటూ కౌంటర్ ఇచ్చాయి. అయితే, ఇదే అంశం పై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జగన్ శాసనమండలి రద్దు, దానికి ఖర్చు సాకుగా చెప్పటం పై, తెలంగాణా వైపు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

kesavarao 28012020 3

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అయిన కె.కేశవరావు, జగన్ మండలి పై తీసుకున్న నిర్ణయం పై స్పందించారు. మండలి ఖర్చు వృధా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ, "అబ్సల్యూట్ నాన్సెన్స్" అంటూ ఘాటుగా స్పందిన్కాహారు. పెద్దల సభ రాష్ట్రాలకు అవసరం అని కేశవరావు అన్నారు. గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేస్తే, తాము అందరం పోరాడామని గుర్తు చేసారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కూడా, ఏపిలో జరుగుతున్న మూడు రాజధానులు, మండలి రద్దు పై విలేఖరులు స్పందన కోరగా, ఆ పంచాయతీ గురించి మనకెందుకు అంటూ, వ్యాఖ్యానించారు. మొత్తానికి, జగన్ తీసుకున్న నిర్ణయం పై, తనకు సన్నిహితంగా ఉండే పార్టీలే, విమర్శలు గుప్పిస్తున్నాయి.

భావితరాల భవిష్యత్‌ తలచుకొని, రాష్ట్రపౌరుడిగా తీవ్రమైన ఆందోళనకు లోనవుతు న్నానని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధకలుగుతోందని, మున్ముం దు ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు ఉంటాయా అన్న అనుమానం తనను కలచివేస్తోందని టీడీపీ శాసనసభాపక్షనేత, మాజీమంత్రి, కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 151స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తాడని భావించానని, కానీ రాష్ట్రాన్ని భూస్థాపితం చేయాలన్నవిధంగా, 8మాసాలనుం చి ఏపీని గొడ్డలితో నరికినట్లుగా వ్యవహరిస్తున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. భవిష్యత్‌లో ఎవరువచ్చినా బాగుచేయలేని విధంగా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముక్కలు చేశాడన్నారు. రాష్ట్ర శాసనసభ జరిగిన తీరుచూస్తుంటే వైసీపీ కార్యాలయాన్ని తలపిస్తోం దని, బీ.ఏ.సీ సమావేశం నిర్వహించకుండా సభను నిర్వహించారన్నారు. తొలుత బీ.ఏ.సీ సమావేశంలో మూడురోజులు నిర్వహిస్తామని చెప్పినప్పుడు, సభలో చర్చించేది అతిముఖ్యమైన బిల్లుల గురించి కాబట్టి, సమయం సరిపోదని టీడీపీ పక్షాన చెప్పడం జరిగిందన్నారు.

అవేమీ లెక్కచేయకుండా ఒకగంటలోనే మూడురాజధానుల బిల్లుని ఆమోదించి, మండలికి పంపారన్నారు. మొట్టమొదటిసారి మండలిలో జరిగిన నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించారని, చరిత్రలో ఎన్నడూలేనివిధంగా మండలిరద్దుపై అజెండా ఇవ్వడం జరిగిం దన్నారు. నేడు శాసనసభ ఆరంభమయ్యేముందు బీ.ఏ.సీ సమావేశం ఉంది రావాలంటూ తనకు ఫోన్‌చేశారని, ఒకహెలికాఫ్టర్‌ పంపితే మీరుకోరి నట్లుగా వెంటనే హాజరవు తానని తాను చెప్పడం జరిగిందని మాజీమంత్రి తెలిపారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకం గా మండలిరద్దుకు పూనుకున్న ప్రభుత్వం, ఆఘమేఘాలపై అసెంబ్లీని నిర్వహించింద న్నారు. సర్వాధికారాలున్నాయన్న అహంకారంతో మండలిపై వైసీపీ ప్రభుత్వం మూకు మ్మడి దాడికి పాల్పడిందన్నారు. శాసనమండలి ఈ 8నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి న ఎలాంటి ప్రజోపయోగ నిర్ణయాలను అడ్డుకుందోచెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలులు ఉన్నాయంటున్న జగన్‌, దేశంలో ఎన్ని రాష్ట్రాలకు మూడు రాజధానులున్నాయో చెప్పాలన్నారు. 7 మాసాల్లో 32బిల్లులు మండలికి వస్తే దేన్ని తిరస్కరించలేదని, కేవలం మూడురాజధానులపేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్న ప్రభుత్వఏకపక్ష చర్యనే పెద్దలసభ అడ్డుకుందన్నారు.

తను తీసుకున్న నిర్ణయాలను మండలి వ్యతిరేకిస్తుందన్న అక్కసుతోనే జగన్‌ మండలి రద్దుకు పూనుకున్నాడని, తద్వారా ఆయన బడుగు, బలహీనవర్గాలవారి వేదిక లేకుండా చేశాడన్నారు. తొలిశాసనసభ సమావేశాల్లో దేశానికి ఆదర్శంగా ఉంటానని, ఏపీ శాసనసభ దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పిన జగన్‌, టీడీపీకి చెందిన సభ్యుల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి సిగ్గులేకుండా తనపార్టీలోకి తీసుకున్నాడని మాజీమంత్రి మండిపడ్డారు. ఓడిపోయినవారికి రాజకీయవేదికగా మండలి మారుతుందని చెబుతున్న స్పీకర్‌, ఇతరసభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి బడుగు, బలహీనవర్గాలవారు పనికిరారన్న జగన్మోహన్‌రెడ్డి, సలహాదారులు గా తనసామాజికవర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. మొత్తంసభ్యుల్లో 50శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల సభ్యులున్న మండలిని రద్దుచేయాలనుకుంటున్న జగన్‌, ఆయాసామాజి కవర్గాలను తన అధికారంతో తొక్కేశాడన్నారు.

పదవులు పోతాయని తెలిసినా లెక్కచేయకుండా, అధికారపార్టీ ప్రలోభాలకు లొంగకు ండా, ప్రజలపక్షాననిలిచి, రాష్ట్రంకోసం పోరాటం చేసిన తెలుగుదేశం, ఇతర అనుబంధ విభాగాల మండలిసభ్యులందరి కాళ్లకు నమస్కారం చేస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు రాష్ట్రాభివృద్ధిని, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. గడచిని 5ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం, జిల్లాలవారీగా అభివృద్ధి వికేంద్రీకరణను చేపట్టిందని, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సాగునీటిప్రాజెక్టులతోపాటు, పరిశ్రమల్ని తీసుకొచ్చిన విషయాన్ని వైసీపీ సభ్యులు, మంత్రులకు తెలియకపోవడం వారిఅజ్ఞానానికి చిహ్నమన్నారు. టీడీపీ హాయాంలో ప్రారంభమైన అనేకపనుల్ని, డబ్బుపిచ్చితో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నా రు. 7నెలల్లో వైసీపీ ప్రభుత్వంవచ్చాక పశ్చిమగోదావరి జిల్లాకు ఏంచేసిందో మంత్రి ఆళ్లనాని చెప్పాలని, టీడీపీసభ్యులను ఆయనే స్వయంగా తీసుకెళ్లి, తమప్రభుత్వం ఆ జిల్లాకు ఏంచేసిందో చూపి, దాన్ని నిరూపించగలిగితే, తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని అచ్చెన్నాయుడు సవాల్‌విసిరారు. టీడీపీపాలనలో పశ్చిమగోదావరిలో జరిగిన అభివృద్ధిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు సంబంధించి కౌంటర్ దాఖలకు హైకోర్టు ధర్మాసనం వారం రోజులు గడువిచ్చింది. గడువు లోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో, తామిక వాదన వినమని, విద్యాశాఖ ఉన్నతాధికారి స్వయంగా కోర్టుకు హాజరు కావలసి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. కౌంటర్ దాఖలు చేయటంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం అడ్వకేట్ జనరలను ప్రశ్నించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తర పున ప్రముఖ హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిస్టిక్స్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ ఎన్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం పిల్ పై సోమవారం విచారణ జరి పింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున దానిని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

highcourt 28012020 2

“ఈ విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ముందుకు వెళ్లవద్దని న్యాయస్థానం ఇంతకు ముందే ఆదేశించింది. ఒకవేళ ముందుకు వెళితే సీబీఐ విచారణకు ఆదేశిస్తాం. అందుకు బాధ్యలు ఎవరు? దానిపై ఎంత వ్యయం చేశారు? తదితర అంశాలన్నీ బయటకు లాగుతాం. బాధ్యులపై చర్యలు తీసుకోవటంతో పాటు ప్రతి రూపాయి వెనక్కి రప్పిస్తాం " అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగానే వున్నదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ ధర్మాసనం ముందు స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం ప్రకారం బోధనా మాధ్యమం మాతృ భాష లోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయని కృష్ణమోహన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

highcourt 28012020 3

దానిపై అడ్వకేట్ జనరలను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్వ ర్వులు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగానే వున్నాయని, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ధర్మ సనాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసును ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో 'ఇంప్లీడ్ ' అయ్యేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాదులు సైతం ఆసక్తి కనబరుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇక ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని పాఠశాల విద్యా కమిటీల ద్వారా ఈ మేరకు అభిప్రాయాలు సేకరించారు.

Advertisements

Latest Articles

Most Read