విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పరిశ్రమల కోసం, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంతో కష్టపడి, ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న కంపెనీలను మన వైపు తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. అలాగే ఒకే ప్రాంతానికి కాకుండా, రాష్ట్రమంతా పరిశ్రమలు వచ్చేలా చూసారు. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురంలో వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే చంద్రబాబు ఓడిపోవటం, జగన్ మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో, గెలవటంతో, రాజకీయ వాతావరణం మారిపోయింది. అయితే జగన్ కు భారీ మెజారిటీ ఉండటంతో, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి, అధిక పెట్టుబడులు వస్తాయని అందరూ భావించారు

కాని అనూహ్యంగా, ఒక్క పరిశ్రమ రాకపోగా, వస్తాం అని ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. సింగపూర్ ప్రాభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, రిలయన్స్ జియో విలిపోయింది అని వార్తలు వచ్చాయి. ఆదానీ డేటా సెంటర్ కుదించుకుంది అని వార్తలు వచ్చాయి. మరో పక్క లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో లూలు గ్రూప్, ఈ చర్యతో, తీవ్ర అవమానంగా భావించింది. ప్రపంచ స్థాయిలో తమ పేరు ప్రఖ్యాతలకు ఇబ్బంది వస్తుందని గ్రహించి, తమకు భూకేటాయింపులు రద్దు చెయ్యటం పై, ఏపి ప్రభుత్వం పై ఘాటుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. లూలూ గ్రూపు, ఇండియా డైరెక్టర్ అనంత్‌రామ్‌ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసారు.

ఇప్పుడున్న పరిస్థితిలో, ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టటం అంటూ తెలిపారు. అయితే భారత దేశంలో మా పెట్టుబడులు కొనసాగుతాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తమ పెట్టుబడులను యథావిధిగా షెడ్యూలు ప్రకారం పెడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో, 13 ఎకరాల్లో ప్రపంచస్థాయి కన్వెన్షన్‌ సెంటర్, షాపింగ్‌మాల్‌, ఫైవ్ స్టార్ హోటల్‌ నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం, రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టి, ఏడువేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొని భూమిని లీజుకు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కన్సల్టెంట్లను నియమించుకుని, ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో డిజైన్లు తయారుచేయించుకోవడానికి భారీఎత్తున ఖర్చుచేశామని అనంత్‌రామ్‌ తెలిపారు. అయినా లూలూ సంస్థకు కేటాయించిన భూములను రద్దుచేస్తూ ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

పార్టీ లైన్ దాటవద్దు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా, ఆయన సలహాలు తీసుకోకుండా, ఢిల్లీలో, ప్రధాని కాని, ఇతర మంత్రుల్ని కలవద్దు. పార్టీ లైన్ ధిక్కరిస్తే, ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి, పక్కన పెడతాం. ఇది శనివారం, 23 మంది వైసిపీ ఎంపీలకు జగన్ ఇచ్చిన వార్నింగ్. అయితే రెండు రోజులు కూడా కాక ముందే, 23 మంది ఎంపీలలో, 7-8 మంది ఎంపీలు, ఈ రోజు కీలక సమావేశానికి డుమ్మా కొట్టటం, వచ్చిన వారిలో కొందరు ధిక్కార స్వరం వినిపించటంతో, ఒక్కసారిగా వైసిపీ అధిష్టానం, షాక్ కు గురైంది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అనే విషయం పై, ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ పార్లమెంటేరీ పార్టీ నేత హోదాలో, ఎంపీలు అందరినీ తన ఇంట్లో, సమావేశానికి ఆహ్వానించారు. అయితే 23 ఎంపీలకు గాను, 7-8 మంది ఎంపీలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఏకంగా విజయసాయి రెడ్డి పిలిచిన మీటింగ్ కే, ఎంపీలు రాకపోవటంతో, ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతంది. ఇలా ఎందుకు జరిగింది అని ఆరా తీస్తున్నారు.

mp 19112019 2

ఇక వచ్చిన ఎంపీలు, తమ అసహనాన్ని విజయసాయి రెడ్డి దగ్గర వెళ్లగక్కారు. ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అన్ని పనులు ఎమ్మెల్యేలే చేస్తున్నారని, తమను లెక్క చెయ్యటం లేదని, అధినేత కూడా, ఎమ్మేల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎంపీలు విజయసాయి రెడ్డి దగ్గర వాపోయినట్టు సమాచారం. అలాగే తమకు పార్టీ తరుపున ఎదురు అవుతున్న వివిధ సమస్యలను విజయసాయి రెడ్డికి చెప్పుకున్నారు. ముఖ్యంగా తమకు ఏమి చేయలన్నా, ఎమ్మెల్యేల అనుమతి తీసుకుని చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని, తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఎంపీల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే, తమకు సరైన ప్రొటోకాల్‌ కూడా ఇవ్వటం లేదని, ఏకరవు పెట్టరు. ఇలా అయితే ఇక మేము ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేసారు.

mp 19112019 3

ఈ సమస్యను జగన్ వద్దకు తీసుకువెళ్ళి పరిష్కారం చెయ్యాలని కోరారు. అలాగే, జాతీయ స్థాయిలో, తమ పాలన పై వస్తున్న కధనాలను ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో, ఏపి ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని, జాతీయ పత్రికల్లో వస్తున్న కధనాలతో, పరువు పోతుందని వాపోయారు. మనం చేసే మంచి పనులు, జాతీయ స్థాయిలో వచ్చేలా ప్రణాళికలు వెయ్యాలని, విజయసాయి రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు, జగన్ పై వ్యతిరేకంగా మాట్లాడితే, అడ్డుకోవాలని తమ ఎంపీలకు తెలిపారు. మరో పక్క సగం మంది ఎంపీలు మీటింగ్ కి దుమ్మా కొట్టటం పై, టిడిపి విమర్శలు దాడి మొదలు పెట్టింది. సగం మంది ఎంపీలు పక్క దారి చూస్తుంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు కొత్త సియం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకే మా పై బూతు పురాణం అందుకున్నారని, దేవినేని ఉమా విమర్శించారు.

14 ఏళ్ళ క్రితం, లక్ష్మీపార్వతి, ఏసీబీ కోర్ట్ లో, చంద్రబాబు పై అక్రమ ఆస్థులు అంటూ వేసిన కేసు పై, స్టే లేదని, విచారణ కొనసాగించాలంటూ, నిన్న ఏసీబీ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పట్లో చంద్రబాబు, ఇది రాజకీయ పరమైన కేసు అంటూ, హైకోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టే రెన్యువల్ చేసుకోవటంలో జాప్యం కావటంతో, స్టే తొలగింది. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కోర్ట్ కు వెళ్లి, స్టే పొడిగించుకునే అవకాసం ఉంది. అయితే, ఇలాంటి కేసులు చంద్రబాబు పై అనేకం వచ్చాయి. 2014లో కూడా వైఎస్ విజయమ్మ, 2 వేల పేజీల అఫిడవిట్ వేసి, సుప్రీం కోర్ట్ లో కేసు వెయ్యటంతో, సుప్రీం కోర్ట్, ఇదేమిటి అంటూ కొట్టేసింది. లక్ష్మీపార్వతి కేసు కూడా అలాంటిదే అయినా, ఏదో జరిగిపోతుంది అంటూ, చంద్రబాబు జైలుకు వెళ్ళిపోతారు అంటూ, వైసిపీ హడావిడి చేస్తుంది. నిజానికి అది ఒక చిన్న సాంకేతిక అంశం. అయినా, హడావిడి చేస్తూ ఉండటంతో, సోషల్ మీడియాలో హడావిడి నెలకొంది.

cbn 191112019 2

అయితే ఈ విషయం పై, ఈ రోజు చంద్రబాబు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు, అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో, విలేఖరులు ఈ ప్రశ్న అడిగారు. లక్ష్మీ పార్వతి గారు పెట్టిన కేసులు, ఏసీబీ కోర్ట్ లో స్టే లేకపోవటంతో, ఆ కేసులో విచారణ ప్రారంభం అయ్యింది, దీని పై మీ స్పందన ఏంటి అని విలేఖరులు అడగగా, చంద్రబాబు సింపుల్ గా తీసి పడేసారు. ఇదేమి పెద్ద కేసు కాదు, ఈ విషయం మా లాయర్లు చూసుకుంటారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, ఇలాంటివి నా మీద 29 కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించ లేకపోయారు, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, మా లాయర్లు చూసుకుంటారు అంటూ, ఒక్క ముక్కలో తీసి పడేసారు.

cbn 191112019 3

ఒక పక్క వైసిపీ ఏదో జరిగిపోతుంది అంటూ హడావిడి చేస్తుంటే, చంద్రబాబు మాత్రం, ఒక్క ముక్కలో, ఇదేమంత విషయం కాదు అంటూ, లాయర్లు చూసుకుంటారు అంటూ తీసి పడేసారు. అలాగే రాష్ట్రంలో జరుగతున్న సమస్యల పై స్పందిస్తూ, "పోలీసులు ఉన్నది.. కేసులు పెట్టాలని చెప్పడానికి కాదు, వచ్చిన కేసులను విచారణ చేసి న్యాయం చేయడం పోలీసుల విధి. వారానికి ముందుగా సమాచారం ఇస్తే అనుమతి ఎందుకు ఇవ్వరు. తణుకులో నా కాన్వాయ్‌కి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కావాలనే అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. నేను బహిరంగ సభకు రాలేదే.. సెక్యూరిటీ నెపంతో అనుమతి ఇవ్వకుండా ఆపారు. పోలీసు 30 యాక్టు పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. తణుకులో టీడీపీ కార్యకర్తలు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు" అంటూ చంద్రబాబు పోలీసుల పై విమర్శలు చేసారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు, తమ మాటవినని వారిపై అక్రమకేసులు, బహిరంగదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా ఇలాంటిపరిస్థితులు లేవని, ఆపార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళవారం గుంటూరులోని పార్టీరాష్ట్ర కార్యాల యంలో పల్నాడుప్రాంత వైసీపీ బాధితులకు టీడీపీ తరుపున నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆనందబాబు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఏనాడు వైసీపీ మాదిరిగా అరాచకాలకు పాల్పడలేదని, అలా చేసుంటే, వైసీపీఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు. అక్రమకేసులతో యరపతినేని,చింతమనేనిపై కూడా కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు బెదిరింపులు, దాడులతో ఎల్లకాలం పాలనసాగించలేరన్న విషయాన్ని వైసీపీప్రభుత్వం గుర్తించాలని, నేడు అధికారపార్టీచేసే దురాగతాలకు భవిష్యత్‌లో తప్పకు ండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆనందబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.

help 1112019 1

దాడులు, అక్రమకేసులతో ప్రత్యర్థులపై కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ తప్ప, ఎక్కడాకూడా మచ్చుకైనా అభివృద్ధి కనిపించడంలేదని గుంటూరుజిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ.ఆంజనేయులు మండిపడ్డారు. అధికారంలో ఉన్నామ నే అహంకారంతో తప్పుడుకేసులతో వేధిస్తునవారిని దెబ్బకుదెబ్బ తీస్తామని ఆయన హెచ్చ రించారు. తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలెవరూ అధైర్యపడకుండా స్థానికఎన్నికల్లో సత్తాచాటాలని జీవీ పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఆరిపోయేదీపమని, అధికారం కొత్తకాబట్టే ఆపార్టీనేతల్లో అహంకారం ఎక్కువైందని ఆయన ఎద్దేవాచేశారు. పోలీస్‌శాఖను అడ్డుపెట్టుకొని ఎన్నాళ్లో ప్రభుత్వాన్ని నడపలేరని, పాలకులు ఎప్పుడు జైలుకువెళతారో కూడా తెలియని పరిస్థితులున్నాయని యరపతినేని వ్యాఖ్యానించారు. పల్నాడుప్రాంత కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న వారందరి జాతకాలు తమదగ్గరున్నాయని, ఎవరినీ వదిలేదిలేదని ఆయన హెచ్చరించారు.

help 1112019 1

వైసీపీ ప్రభుత్వ దాడుల్లో సర్వంకోల్పోయిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నివిధాలా అండగా నిలుస్తూ, వారి కన్నీళ్లు తుడుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ తెలిపారు. పల్నాడులో వైసీపీ దాష్టీకాలకు బలైన, టీడీపీ కార్యకర్తలను ఆదుకునే క్రమంలో చంద్రబాబు పోరాటంచేశాకే రాష్ట్రప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. తెలుగుదే శం పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని గిరిధర్‌ స్పష్టంచేశారు. ఒక్క అవకాశం ఇవ్వడంటూ ప్రజల కాళ్లావేళ్లాపడి బతిమలాడిన వైసీపీ, అధికారంలోకి వస్తే, పరిస్థితి ఇంతదారుణంగా ఉంటుందని ప్రజలెవరూ ఊహించలేదని ఎమ్మెల్సీ అశోక్‌ బాబు తెలిపారు. ఒక్కసారి అని వేడుకున్నవారు, అధికారంలోకి వచ్చాక ఇన్ని అరాచకాలు సృష్టిస్తారని ఎవరూ అనుకోలేదని, టీడీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, అశోక్‌బాబు చెప్పారు. వైసీపీపాల నలో ఇబ్బందులకు గురైనబాధితులకు టీడీపీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుం దన్నారు. జగన్‌ నాయకత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనిస్థితికి రాష్ట్రంచేరుకుం దన్నారు. చుండూరు ఘటనతర్వాత, ఇన్నేళ్లకు వైసీపీప్రభుత్వ పుణ్యమాఅని మానవహక్కుల కమిషన్‌ రాష్ట్రంలో పర్యటనకు రావాల్సి వచ్చిందన్నారు. వైసీపీప్రభుత్వ దాష్టీకాలకు బలైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామస్తులైన ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 210 మంది టీడీపీ కార్యకర్తలకు నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు.

Advertisements

Latest Articles

Most Read