ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీడియాకు సంకెళ్ళు వేస్తూ, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, దేశ వ్యాప్తంగా మీడియా వర్గాల్లో చర్చ రేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే, కేసులు పెడతాం అంటూ ఇచ్చిన జీవో పై విమర్శలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గటం లేదు. గతంలో ఇదే జీవో ఇచ్చిన వైఎస్ఆర్, విమర్శలు రాగానే, దాన్ని వెనక్కు తీసుకుని, ఈ జీవోని రద్దు చేస్తున్నాం, పొరపాటున వచ్చింది అని చెప్పారు. అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్, మళ్ళీ ఆ జీవోని తీసుకు వచ్చారు. ఈ జీవో వచ్చిన వెంటనే, రాష్ట్రంలోని జర్నలిస్ట్ లు అందరూ, నిరసన తెలియ చేస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించే, విధులకు హాజరు అవుతున్నారు. చివరక్కు నిన్న జగన్, గవర్నర్ పాల్గున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా, నల్ల బ్యాడ్జీలు ధరించే, విధులు నిర్వహించారు. రాష్ట్రంలో జర్నలిస్ట్ లు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం, అసలు స్పందించటం లేదు.

అయితే దీని పై అనూహ్యంగా, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఎంటర్ అవుతూ, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కాలానికి సంకెళ్లు వేస్తూ జగన్ ప్రభుత్వం చేసిన పై పట్ల, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా పై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో నం. 2430 పై, ప్రెస్ కౌన్సిల్ సుమోటోగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తప్పుడు వార్తలు, నిరాధార వార్తలు, పరువునష్టం వార్తలు రాసే వారి పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా మీడియా పై కేసులు పెట్టేలా ఆయా శాఖల విభాగాల కార్యదర్శులకు అనుమతి ఇచ్చేలా అక్టోబర్ 30న జారీ చేసిన జీవో పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా తీవ్ర ఆందోళనను వెలిబుచ్చింది. ఇది దారుణమైన చర్య అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

పత్రికలను న్యాయస్థానాలకు ఈడుస్తామని హెచ్చరికలు జారీ చేయడం మొత్తం పాత్రికేయ ప్రపంచం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ఇది పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతంగా మారుతుందని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్న అంశాలన్నింటినీ ప్రెస్ కౌన్సిల్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ కమిషనర్ ద్వారా సమాధానాన్ని పంపాలని ఆదేశించారు. అయితే ఈ నోటీస్ పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సాక్షి మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు, అందరి పై విషం చిమ్మే, వైసిపీ అధినేత, ఇప్పుడు ఇలా చెప్పటం సిగ్గు చేటు అని మీడియా మిత్రులు అంటున్నారు.







