ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరం రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా రెండు విషయాల్లో, ఈ వ్యవహారం నడుస్తుంది. మొదటిగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని, రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ఒక ఆర్డినెన్స్ తెచ్చి, తప్పించేలా చెయ్యటం పై, ఇప్పటికే కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి, మొన్న 29వ తారీఖునే తీర్పు వస్తుందని అందురూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తున్న విచారణలోకి, బయట వ్యక్తులు ప్రవేశించటం పై, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసు విచారణను, సోమవారానికి వాయిదా వేసారు. సోమవారానికి వాయిదా వెయ్యటమే కాకుండా, ఈ కేసు విచారణ, నేరుగా కోర్ట్ లోనే చేస్తాం అని చెప్పి, డీజీపీకి కూడా ఉత్తరం రాస్తాం అని చెప్పారు. దీంతో, సోమవారం పూర్తీ స్థాయిలో విచారణ జరిగి, ఈ విషయం పై, రేపు సోమవారం ఈ విషయంలో తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు.

అయితే నిమ్మగడ్డ విషయంలో, మరో విషయంలో కూడా ఒక వివాదం నడుస్తుంది. అదే నిమ్మగడ్డ, కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ. మరో రెండు రోజులల్లో, ఎన్నికల కమిషన్ నియామకం గురించి తీర్పు వస్తుంది అని తెలుస్తున్న సమయంలో, ఈ లేఖ పై హైదరాబాద్ వెళ్లి మరీ సిఐడీ విచారణ చేస్తుంది. ముఖ్యంగా, నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబమూర్తిని, ఈ విషయంలో విచారణ చెయ్యటానికి, సిఐడి హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని సిఐడి దృవీకరించకపోయినా, వార్తా ఛానెల్స్ లో ఈ విషయం పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన స్టేట్మెంట్ ను, సిఐడి రికార్డు చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, ఇప్పటికే అయ్యన్ను, ఒక మారు సిఐడి విచారణ చేసింది.

ఈ విచారణ రెండో సారి. అయితే ఆయాన విచారణలో ఏమి చెప్తున్నారు అనే విషయం పై తెలియాల్సి ఉంది. అయితే గత విచారణలో, అడిషనల్ పీఎస్ సాంబమూర్తి, పలు విషయాలు చెప్పారు అంటూ, మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, డ్రాఫ్ట్ చేసి, తనకు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి ఇచ్చారని, దాన్ని నేను నా డెస్క్ టాప్ లో పెట్టి, ఫార్మటు చేసి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇచ్చానని, ఆయన అక్కడ నుంచి కేంద్రానికి పంపించారని, తరువాత డెస్క్ టాప్ ఫార్మటు చేశాను అంటూ, ఆయన చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ లేఖ పై, వైసీపీ ఎందుకు గోల చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. నేనే లేఖ రాసాను, థర్డ్ పార్టీ వారికి ఎందుకు అంటూ నిమ్మగడ్డ ఇప్పటికే చెప్పారు. అలాగే కేంద్రం కూడా నిమ్మగడ్డ నుంచి లేఖ వచ్చిందని చెప్పండి. ఆ లేఖలో అంశాలు ఏమైనా తప్పు ఉంటే, వైసీపీ చెప్పాలి కాని, ఆ లేఖలో తమ పై చేసిన ఆరోపణలు గురించి సమాధానం చెప్పకుండా, లేఖ టిడిపి రాసింది అంటూ, చెప్పటం, దానికి సిఐడి ఎంక్వయిరీ చెయ్యటం పై, అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరో మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే, అనేక సార్లు, హైకోర్ట్ ముందల, ప్రభుత్వానికి అనేక మొట్టికాయలు పడ్డాయి. పీపీఏల దగ్గర నుంచి మొన్నటి రంగుల దాకా, మొత్తంగా 53 సార్లు కోర్ట్ లో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు తాజాగా మరోసారి హైకోర్ట్ లో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు వచ్చాయి. రాష్ట్రంలో గ్రానైట్‌ క్వారీల యజమానులకు, ఈ టైములో నోటీసులు ఇవ్వటం పై, హైకోర్ట్ లో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో, గ్రానైట్‌ క్వారీల వ్యాపారాలు, నిబంధనల ప్రకారం నడుచుకోలేదు అంటూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, సుమారుగా 2500 కోట్ల ఫైన్ వేసారు. దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చింది, గనుల శాఖ. అయితే దీని పై అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. ఇదంతా రాజకీయ పరమైన కక్ష అంటూ, అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ వ్యాపారంలో, ఎక్కువగా తెలుగుదేశం సానుభూతి పరులు ఉండటం, అలాగే కొంత మంది ప్రజా ప్రతినిధులు ఉండటంతో, వారిని లోబరుచుకోవటానికి, ఇలా చేసారు అంటూ, బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలు పక్కన పెడితే, గ్రానైట్‌ క్వారీల వ్యాపారాలు అందరూ, ఈ నోటీసుల పై అప్పట్లోనే కోర్ట్ కు వెళ్లారు. దీంతో హైకోర్ట్, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి, ఈ నోటీసులు చెల్లవంటు కొట్టేసింది. అయితే ఇప్పుడు కరోనా రావటం, లాక్ డౌన్ లో, అన్ని వ్యాపారాలు ఆగిపోయిన నేపధ్యంలో, గ్రానైట్‌ క్వారీలు కూడా ముతపడిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం, ఈ సమయంలో వారికి నోటీసులు ఇచ్చింది. అయితే, వీరిలో ఒకరు, ఇదేమి అన్యాయం అంటూ, హైకోర్ట్ కు వెళ్లారు.

ఒక పక్క లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు అంటూ, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పై, హైకోర్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసింది. గ్రానైట్‌ క్వారీ తరుపున న్యాయవాది, టా వాదనలు వినిపించారు. అయితే, దీని పై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. గతంలో ఇదే విషయంలో మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం, అయినా మీరు మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. అది కూడా ఈ కరోనా లోక్ డౌన్ టైంలో, ఒక పక్క పనులు జరగక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు జరిమానా విధంచటం ఏమిటి ? ఈ నోటీసుల పై, మీరు ఇప్పటికిప్పుడు స్పందించనవసరం లేదు అని గ్రానైట్‌ క్వారీల యజమానులకు చెప్పారు. లాక్ డౌన్ తరువాత, పరిశ్రమలు తెరుసుకున్న తరువాత, దీని పై విచారణ చేస్తాం అని హైకోర్ట్ చెప్పటంతో, జగన్ ప్రభుత్వం, గ్రానైట్‌ క్వారీల పై తీసుకున్న చర్యలు, రెండో సారి వాయిదా పడ్డాయి.

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఏకంగా ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చారు. పది రోజుల క్రితం, ఎమ్మెల్యే ఏదో కార్యక్రమంలో పాల్గునటంతో, లాక్ డౌన్ అమలులో ఉండగా, ఇలాంటి పనులు చెయ్యకూడదు అని తెలిసినా, ఇలా చేసినందుకు, అతని పై కేసు పెట్టారు. అయితే నా మీదే కేసు పెడతారా అంటూ, కోవూరు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు ఎమ్మెల్యే. అయితే తరువాత, ఎంక్వయిరీలో, ఆ కార్యక్రమంలో కొంత మంది అధికారులు కూడా పాల్గునటం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు కూడా లాక్ డౌన్ పాటించకపోతే ఎలా అంటూ, ఆ అధికారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. నిత్యావసరాల పంపిణీకి అధికారులను నేనే ఆహ్వానించాను, అధికారులకు నోటీసీలు ఇవ్వడం నేను ఒప్పుకోను. అధికారులపై చర్యలు తీసుకుంటే ఎంతకైనా తెగిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

నాడు సీఎం, వైసీపీ అధినాయకత్వం ఆదేశాలతో సైలెంట్‍గా ఉన్నా, కలెక్టర్, ఎస్పీలు తమ గౌరవాన్ని కాపాడుకోవాలి, ఒక్క అధికారిపై చర్యలు తీసుకున్నా నేనేంటో చూపిస్తా, కలెక్టర్, ఎస్పీలకు రాజకీయాలు కావాలంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరండి, మీ ఇద్దరికి దమ్ము, ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, జిల్లాలో వీరిద్దరూ ఏసీ గదులకే పరిమితమయ్యారు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు అంటూ, ఇష్టం వచ్చినట్టు, కలెక్టర్, ఎస్పీ పై చిందులు వేసారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే, ఆయన ఏకంగా కలెక్టర్, ఎస్పీలకు వార్నింగ్ ఇవ్వటం పై, ప్రతిపక్ష టిడిపి మండి పడింది. ఇలా ఇష్టం వచ్చినట్టు చేసే, రాష్ట్రంలో కేసులు 1500 దాటించారని మండి పడ్డారు.

వైకాపా నాయకుల దుశ్చర్యలకు జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందని టిడిపి నేత కూనా రవికుమార్ గుర్తు చేశారు. రాష్ట్రం కరోనా వ్యాప్తిలో వైకాపా నేతలు ముందు వరుసలో ఉన్నారని ఆరోపించారు. ఏ జిల్లాలో చూసుకున్నా వైకాపా నాయకుల నిర్వాకం వలన వైరస్ వ్యాప్తి చెందిన సంఘటనలే ఉంటాయన్నారు. ``గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది ఢిల్లీ వెళ్లి వచ్చి క్వారంటైన్ కు వెళ్లలేదు. కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేయాలని సూచించినప్పటికీ.. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రోద్బలంతో స్థానిక డాక్టర్ వైద్యం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్ రెడ్డి ట్రాక్టర్ ర్యాలీ తీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి శిక్షలు వేస్తే విజ‌య‌సాయి రెడ్డి స‌హా 150 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైల్లో ఉండేవారని స్పష్టం చేసారు. ఆదిమూల‌పు సురేష్ - హైద‌రాబాద్ వెళ్లి వచ్చినా ఎందుకు క్వారంటైన్ లో పెట్టలేదు?. కొత్త ఎస్.ఈ.సీగా నియామ‌కం అయిన క‌న‌గ‌రాజు ఏవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి వ‌చ్చారు? నెల్లూరులో లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని న‌ల్లపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద పోలీసులు కేసు పెడితే వంద‌ల మందితో స్టేష‌న్ ముందు ధ‌ర్నాకు దిగడం ఏమి సబబ’’ని కూనా రవికుమార్ నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో, పత్రికా స్వేఛ్చ పై, ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుందని అవేదన వ్యక్తం చేసారు. ఒక యుట్యూబ్ ఛానల్ అధినేత ఆచూకీ కోసం, వారి బంధువులను కిడ్నాప్ చేసారు అంటూ, చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. సొంత మీడియాలో ఎవరిమీదయినా ఎంతటి అసత్య ప్రచారమైనా చేసుకోవచ్చు, వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలతో కప్పిపుచ్చవచ్చు, కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్లయినా నిజాలు చెబితే వైసీపీ నాయకులు కుతకుతలాడిపోతారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ బండారం బయట పెట్టిన, మీడియా ప్రతినిధులపై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారు అంటూ, ప్రభుత్వం పై మండి పడ్డారు.

మైరా టీవీ ఛానల్ అధినేత ఆచూకీ కోసం వారి బంధువులను, మీడియాతో సంబంధం లేనివారిని పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అరాచకాన్ని టీడీపీ ఖండిస్తోందని, ప్రభుత్వం వెంటనే వారిని, వారి కుటుంబాలకు అప్పగించాలి డిమాండ్ చేసారు. దీని పై టీడీపీ న్యాయపోరాటం చేస్తుందని అన్నారు. అవసరం అయితే మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తాం అని అన్నారు. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకోం అని, మీడియా పై ఈ వైఖరి కరెక్ట్ కాదని అన్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఈ విషయం పై స్పందిస్తూ, జీఓ 2430ను ఉపయోగించి, తమను ప్రశ్నిస్తున్న వారి పై, ఒత్తిడి టెస్టు, పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.

మరో పక్క రెండు రోజుల క్రితం, తెలుగు వన్ అనే యుట్యూబ్ ఛానెల్, అలాగే థర్డ్ ఐ అనే ఛానల్ పై కూడా పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. థర్డ్ ఐ అనే ఛానల్ నిర్వాహకుడు, అంజి బాబుని, పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే హైదరాబాద్ లో ఉండే తెలుగు వన్ అనే ఆఫీస్ పై, ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు దాడి చేసి, వాళ్ళ సర్వర్లు, హార్డ్ డిస్క్ లు తీసుకు వెళ్లారు. ఇదే విషయం పై, గత రెండు రోజులుగా గోల జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మైరా మీడియా అనే ఛానల్ నిర్వాహకుడి ఆచూకీ కోసం, ఇలా చేసారు. అయితే, ఇది నిజమా కదా, మైరా మీడియా నిర్వాహకుడి కోసం, ఎందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు, కేసు ఏమిటి అనేదాని పై, క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు, ఈ విషయం పై పోలీసులు స్పందించ లేదు.

Advertisements

Latest Articles

Most Read