అమరావతి పై మొదటి నుంచి అయిష్టంగా ఉన్న జగన మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అదే నైజంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, అమరావతి పై హేళన చేస్తూ, భ్రమరావతి అంటూ, గ్రాఫిక్స్ అంటూ హేళన చేసి, ఇప్పుడు అదే అమరావతిలో ఉన్న సచివాలయం నుంచి పరిపాలిస్తూ, అదే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో చెప్తారని, జగన్ మోహన్ రెడ్డి అమరావతిని కొనసాగిస్తారాని అందరూ అనుకున్నారు. అమరావతికి రూపాయి పెట్టాల్సిన పని లేదు, లోన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అది సిద్ధం అవ్వగానే, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి, అమరావతిని ఆపే ప్రయత్నం జగన్ చెయ్యరు అని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. జగన్ అమరావతి పై ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు.

amaravati 28092019 2

అమరావతికి లోన్ ఇచ్చే ప్రపంచ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది. ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది. అమరావతి నిర్మాణం మొత్తం ఆగిపోయింది. ఎక్కడ పనులు అక్కడ నిలిచి పోయాయి. బొత్సా లాంటి వారు, ఇక్కడ రాజధానిగా ఉండటం కరెక్ట్ కాదని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. అమరావతిలో కాకుండా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.కడప జిల్లా సచివాలయంలో ఇతర మంత్రులతో సమీక్ష జరిపి, విలేకరులతో మాట్లాడుతూ సీమలో హై కోర్ట్ పెట్టె ఆలోచన ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు.

amaravati 28092019 3

అయితే కేవలం ఆఫీస్ లు మారిస్తే, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందా ? అనే ప్రశ్న వస్తుంది. దేశంలో ఎక్కడైనా, సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ అనేవి, రాజధానిలో ఉంటాయి. అంటే ఇప్పుడు రాజధాని మార్పు విషమై, మంత్రి బుగ్గన సంకేతాలు ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. సీమలో హైకోర్ట్ కావలని, అమరావతిలోనే ఉంచాలని లాయర్లు ఆందోళన చేస్తున్నారు. మరో పక్క, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు, ఈ అంశం పై ఒక్క ముక్క కూడా మాట్లాడక పోవటంతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ భూముల పై, రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వటం లేదని, ఇప్పుడు హైకోర్ట్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని చెప్తున్నారని, ఇక అమరావతి రాజధానిగా ఉండదు అనే అభిప్రాయం కలుగుతుందని, ఆవేదన చెందుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చెయ్యాలని కోరుతున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో కొద్దిగా స్లో అయ్యింది అనుకున్న సిబిఐ, గత రెండ వారాలుగా, కొంచెం దూకుడు పెంచింది. జగన్ కేసుల్లో ఒకటైన, పెన్నా సిమెంట్స్ కేసులో, కొత్త విషయాలు ఉన్నాయి అంటూ, సిబిఐ ప్రత్యెక కోర్ట్ కి, అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసారు. పెన్నా సిమెంట్‌ లో, పెట్టుబడులకు సంబంధించిన కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగుచూశాయని సీబీఐ, కోర్ట్ కు తెలిపింది. ఈ కొత్త అంశాల ఆధారంగానే అదనపు చార్జిషీటు దాఖలు చేశామని సీబీఐ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీపీ సురేందర్‌రావు, ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ అదనపు చార్జిషీటును స్వీకరించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోను సిబిఐ శుక్రవారం విచారించింది. గతంలో సిబిఐ, పెన్నా సిమెంట్‌ కేసులో పెట్టుబడుల వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన చార్జిషీటు చేసినా, తరువాత మరి కొన్ని కొత్త అంశాలు రావటంతో, ఈ అదనపు చార్జ్ షీట్ వేశామని కోర్ట్ కి తెలిపారు.

cbi 28092019 2

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, పలువురు ప్రభుత్వ అధికారులు, అప్పటి ప్రభుత్వంలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేందర్‌రావు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు మెమో దాఖలుచేసినప్పటికీ, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఎప్పుడైనా అనుబంధ చార్జిషీటు వేసే అధికారం సీబీఐకి ఉందన్నారు. ఈ అనుబంధ చార్జ్ షీట్ పై, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌ శామ్యూల్‌, గనులశాఖ మాజీ అధికారి వీడీ రాజగోపాల్‌, డీఆర్‌వో సుదర్శన్‌రెడ్డి, తహశీల్దారు ఎల్లమ్మల పై నిన్న విచారణ చేసారు. అయితే ఈ అదనపు చార్జ్ షీట్ పై, నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని చెప్పి, మళ్ళీ ఇదేంటి అంటూ, వారు అభ్యంతరం చెప్పారు.

cbi 28092019 3

దీని పై సిబిఐ లాయర్ స్పందిస్తూ, ఎప్పుడైనా అనుబంధ చార్జ్ షీట్ వేస్తామని, నిందితుల పాత్రను అనుబంధ ఛార్జిషీటులో స్పష్టంగా వివరించామని, ఐఏఎస్‌ చిరంజీవులు వాంగ్మూలాన్ని చేర్చినట్లు వెల్లడించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ అక్టోబరు 11కి వాయిదా వేసింది. ఇక జగన్, విజయ్ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నిందితులు కోర్టు అనుమతితో గైర్హాజరయ్యారు. ఇక అక్రమాస్తుల కేసులో ప్రతి వారం కోర్ట్ కి రాకుండా, తమకు మినహాయింపు ఇవ్వాలని జగన్‌ అభ్యర్థించగా, ఆ పిటిషన్‌పై అక్టోబరు 1న విచారణ జరగనుంది. అయితే ఉన్నట్టు ఉండి, సిబిఐ విచారణలో వేగం పెంచటంతో, రాజకీయంగా జగన్ కు ఇబ్బందులు పెట్టటానికి, బీజేపీ వైపు నుంచి, ఏమైనా వ్యూహం పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన సలహాదారుడుగా ఉన్న అజేయ కల్లాం రెడ్డి పై, ఈ రోజు చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రధాని మోడీ కార్యాలాయానికి తప్పుడు సమాచారం పంపించి, ఏదో జరిగిపోయింది అనే భ్రమ కలిపిస్తున్నారని, ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే, ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అధికారం ఉంది కదా, ఏమి చేసినా చెల్లిపోతుంది అని విర్రవీగితే, జగన్ కేసుల్లో కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ, చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డైరెక్ట్ గా అజయ్ కల్లం రెడ్డి పేరు ఎత్తక పోయినా, ఆయన ప్రధానికి లేఖ రాసిన విషయం చదివి వినిపిస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారం ప్రధాని కార్యాలయానికి పంపిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై, గుంటూరు పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు పాల్గున్నారు.

ajaykallam 27092019 2

విద్యత్ ఒప్పందాల విషయంలో, ప్రధాని కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చి, ప్రధానినే తప్పుదోవ పట్టించే పని చేసారని, ఇలాంటి అధికారుల పై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. జగన్ ఒత్తిడి తెస్తున్నారు కదా అని, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, శిక్ష అనుభవించక తప్పదని, అధికారులను హెచ్చరించారు. పీఏలపై ప్రధానికి జగన్‌ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ రంగంలోని నిపుణులు, కేంద్రం, కోర్ట్ లు చెప్తున్నా, వీరు వినటం లేదని, మీడియా సమావేశాలు పెట్టి అధికారులే, రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే చంద్రబాబు టార్గెట్ చేసినై అజయ్ కల్లం రెడ్డిని అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో ఎదో జరిగిపోయిందని, ఈయనే జగన్ కు చెప్తూ వస్తున్నారు.

ajaykallam 27092019 3

అజయ్ కల్లం రెడ్డి, రెండు నెలలు పాటు చంద్రబాబు హయంలో, చీఫ్ సెక్రటరీగా చేసారు. తరువాత జగన్ దగ్గర చేరి, రాజకీయలు మొదలు పెట్టారు. జగన్ అధికారంలోకి రాగనే, సలహాదారు అయిపోయారు. విద్యుత్ పీపీఏ ల విషయం, మొత్తం కర్మ, క్రియ అంతా ఆయనే. ఈ విషయం పై జగన్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షకు వేసిన కమిటీని కూడా ఆయనే లీడ్ చేస్తున్నారు. కేంద్రానికి ఇచ్చే సమాచారం అంతా అజయ్ కల్లం రెడ్డే తయారు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖల సమాచారం అంతా తప్పు అని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని, మొత్తం వివరంగా చెప్పారు. ఇప్పడు ఈ విషయం పై కేంద్రం ఎలా స్పందిస్తుంది. తప్పుడు సమాచారం పంపించిన అధికారుల పై చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలు, ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానంతో, వచ్చే ఆదాయం కూడా తగ్గిపోవటంతో, జీతాలకు, పెన్షన్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. కేంద్రాన్ని గట్టిగా అడిగే అవకాసం ఇక్కడ ప్రభుత్వానికి లేకపోవటంతో, విభజన హామీలు ఒక్కటి కూడా అమలు అయ్యే అవకాసం లేదు. ఇక తెలంగాణా విషయానికి వస్తే, రిచ్ స్టేట్ అనుకున్న తెలంగాణా కూడా, ఈ ఏడాడి చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఆర్ధిక మాంద్యం అని చెప్పి, బడ్జెట్ ని తగ్గించి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు, ఇప్పుడు కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం షాక్ కి గురి చేసేలా ఉంది. ఈ నిర్ణయం కనుక అమలు అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది.

modi 27092019 2

నిన్న కేంద్ర ప్రభుత్వం, 15వ ఆర్థిక సంఘానికి, ఒక మెమోరాండెం సమర్పించింది. రాష్ట్రానికి తిరిగి ఇచ్చే పన్నుల వాటాలు తగ్గించాలని, 15వ ఆర్థిక సంఘాన్ని కోరింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలు 42 శాతం ఉంది. అయితే దీన్ని తగ్గించి, 32 నుంచి 34 శాతానికి తేవాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అర్ధిక సంక్షోభం నుంచి, బయట పడటానికి, ఈ చర్య ఉపయోగ పడుతుందని, కేంద్రం భావిస్తుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కటానికి, రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాను తగ్గించాలని, కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే రాష్ట్రాల ఆదాయాలు తగ్గటం మొదలైన సందర్భంలో, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

modi 27092019 3

ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం విధానాలు, దక్షినాది రాష్ట్రాలకు ఇబ్బందిగా ఉన్నాయని, చంద్రబాబు ఉన్న సమయం నుంచి ఆందోళన తెలుపుతున్నారు. ఇప్పుడు కేంద్రం కనుక ఈ చర్య తీసుకుంటుంటే, మరిన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పధకాలు పెట్టారు, ఇవన్నీ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. పన్నుల వాటా తగ్గిస్తే, ఇక కేంద్రమే రంగంలోకి దిగి, ప్రజాకర్షన్ పధకాలు, తన ద్వారా చేపట్టే అవకాసం కూడా లేకపోలేదు. రాష్ట్రాలకు ఆర్ధిక స్వేచ్చ మరి కొంత తగ్గించి, ఇక కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే, రాజకీయంగా కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం. మరి ఈ పరిణామాలను, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read