జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి టైం అసలు కలిసి రావటం లేదు. అటు కేంద్రం కాని, ఇటు కోర్ట్ లు కాని, ఏవి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించటం లేదు. కేవలం చంద్రబాబుని ఇరికిద్దాం అంటూ జగన్ వేస్తున్న అడుగులు, ప్రతి సారి రివెర్స్ అవుతున్నాయి. చంద్రబాబు పై అవినీతి మరకలు వెయ్యటం ఏమో కాని, రాష్ట్ర పరువు అటు కేంద్రం దగ్గర, ఇటు కోర్ట్ ల్లో కూడా పోతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, చంద్రబాబు విద్యుత్ కొనుగోల్లలో పెద్ద ఎత్తున అవినీతి చేసారని, ఆ అవినీతి అంతా బయటకు తీస్తాం అంటూ కొన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చేస్తున్నాం అంటూ ఒక కమిటీ వేసారు. అంతే కాదు, రెట్లు అన్నీ సమీక్ష చేస్తున్నాం అంటూ ఒక జీవో కూడా విడుదల చేసారు. దీని పై అటు పెట్టుబడి పెట్టిన కంపెనీలు కాని, ఇటు కేంద్ర ప్రభుత్వం కాని తీవ్ర అభ్యంతరం చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం అయితే, ఒకింత గట్టిగానే సమాధానం ఇచ్చింది.

court 24092019 2

మీ ఇష్టం వచ్చినట్టు సమీక్ష చెయ్యటం కుదరదు, అన్నీ సక్రమంగానే జరిగాయి, అసలు రేట్లు నిర్ణయించేది రాష్ట్రం కాదు అంటూ గట్టిగా చెప్పింది. మొన్న కేంద్ర మంత్రి కూడా, జగన్ అన్నీ అసత్యాలు చెప్తున్నారు అంటూ, ఏకంగా ప్రెస్ ముందే చెప్పారంటే, ఈ విషయంలో కేంద్ర వైఖరి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అయితే కేంద్రం ఎంత హెచ్చరిస్తున్నా, బిజినెస్ అనలిస్ట్ లు ఎంత హెచ్చరించినా, జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. దీంతో దాదాపుగా 42 విద్యత్ కంపెనీలు హైకోర్ట్ తలుపు తట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల పై కోర్ట్ కు నివేదించాయి. ఈ విషయం పై, ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్ట్, ఫైనల్ తీర్పు కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది.

court 24092019 3

విద్యుత్ ఒప్పందాల పై పీపీఏల పునఃసమీక్ష పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అలాగే గత నాలుగు నెలలుగా విద్యుత్‌ సంస్థలకు చెల్లింపులు చెయ్యటం లేదని తెలియటంతో, వారికి చెల్లింపులు కూడా చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారి నుంచి ప్రభుత్వం విద్యుత్ తీసుకోవటం లేదని తెలిసి, అది తక్షణమే విద్యుత్ కూడా తీసుకోవలాని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పీపీఏల టారిఫ్‌ వ్యవహారాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని ఈఆర్‌సీని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదాన్ని ఇక కోర్ట్ లో కాకుండా ట్రిబ్యునల్ లో పరిష్కరించుకోవాలని కోరింది. మొత్తానికి, విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్ట్ తప్పుబట్టింది.

మొన్నటి దాకా జగన్ అక్రమాస్తుల కేసులో అందరికీ ఊరటలు లభిస్తూ వచ్చాయి. దీని పై రాజకీయ పార్టీలు అనుమానాలు కూడా వ్యక్తం చేసాయి. బీజేపీకి, జగన్ దగ్గర అవ్వటంతోనే, ఇలా జరుగుతూ వస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ, ఈడీ కూడా అంత సీరియస్ గా పట్టించుకోవటం లేదని, కోర్ట్ ల్లో సమర్ధవంతంగా వాదించటం కాని, పై కోర్ట్ ల్లో అపీల్ కూడా చెయ్యటం లేదని, ఆరోపణలు వస్తూ వచ్చాయి. ఇక జగన్ కేసులు, నెమ్మదిగా నీరుగారి పోతాయని అందరూ అనుకుంటున్న టైంలో, సిబిఐ మళ్ళీ ఆక్టివేట్ అయ్యింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆదిత్య నాద్ దాస్ ను జగన్ కేసుల నుంచి తప్పిస్తూ, ఇచ్చిన తీర్పు పై, సిబిఐ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. దీంతో సుప్రీం కోర్ట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కేసు నుంచి ఆదిత్యనాద్ ను తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

supreme 23092019 2

సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల బెంచ్‌ శుక్రవారం దీనిపై విచారణ చేపట్టి, ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ విషయం పై ఆదిత్యనాద్ దాస్ కు నోటీసులిచ్చింది. ప్రస్తుతం, ఆదిత్యనాథ్‌ దాస్‌ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు, ఆదిత్యనాథ్‌ దాస్‌ దూకుడు పై కూడా కేంద్రం గుర్రుగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ లోపే ఇటు కోర్ట్ నుంచి కూడా ఆదిత్యనాథ్‌ దాస్‌ కు మళ్ళీ నోటీసులు రావటంతో, ఆయనకు మరింత ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇచ్చే సమాధానం బట్టి, సుప్రీం కోర్ట్ ఒక నిర్ణయం తీసుకోనుంది.

supreme 23092019 3

అభియోగాలివీ.. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా ఇండియా సిమెంట్స్‌కు అదనపు నీటిని కేటాయించారని, దీనికి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యులని ఆరోపించింది. దీనికి ప్రతి ఫలంగానే, ఇండియా సిమెంట్స్‌ జగన్‌ సంస్థల్లో 140 కోట్లు పెట్టుబడులు పెట్టిందని ఈడీ పేర్కొంది. ఆదిత్యనాథ్‌ దాస్‌ రూల్స్ కి వ్యతిరేకంగా పని చేసారని, ఒత్తిళ్ళకు లొంగి, నిబంధనలు పక్కన పెట్టి పని చేసారని, సిబిఐ కేసు ఫైల్ చేసింది. మరో పక్క, పోయిన వారం, పెన్నా సిమెంట్స్‌ కేసులో అదనపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సిబిఐ. అయితే సిబిఐ ఈ కేసులో మళ్ళీ ఆక్టివేట్ అవ్వటం పై, జగన్ కేసుల్లో ఉన్న వారికి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే ఆందోళన మొదలైంది.

ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానానికి, నిన్న అతి పెద్ద ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-467 విమానం, ప్రయాణం మధ్యలో ఉండగా, భారీ గాలి వాన, ఉరుములు భారీ స్థాయిలో మొదలయ్యాయి. ఈ తాకిడికి విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. ఈ పరిణామంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే భారీగా కుదుపులు రావటంతో, విమానంలోని, వస్తువులు, ఆహరం కోసం ప్రయాణికులకు వద్ద ఉన్న ప్లేట్స్, కాఫీ గ్లాసులు, అన్నీ విమానంలో చిందరవందరగా పడిపోయాయి. అలాగే కుదుపులు తీవ్రతకు విమానంలో ఉన్న వాష్ రూమ్ లోని కమోడ్ సీటు కూడా ఊడిపోయింది. ఈ పరిణామంతో, విమానంలోని కొంత మంది ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు మొదలు పెట్టారు. ఏమి జరుగుతుందో తెలియక, కొంత మంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

delhi 22092019 2

అయితే పైలట్ అప్రమత్తతతో అంతా సేఫ్ అయ్యారు. సిబ్బంది కూడా ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. అయితే ఈ కుదుపులతో, కొంత మంది విమాన సిబ్బందికి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. చివరకు విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన పై అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. అయితే ఎప్పుడూ వచ్చే బోయింగ్‌ కాకుండా కొత్త సర్వీసు వచ్చిందని గన్నవరం విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పాత ఫ్లైట్ కాకుండా, కొత్తది వచ్చి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఈ ఘటన పై ఎయిరిండియా మాత్రం, ఎలాంటి ప్రకటనా ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలుస్తుంది.

delhi 22092019 3

ఇక మరో పక్క ఇదే సమయంలో, ఢిల్లీ నుంచి తిరువనంతపురం వస్తున్న, మరో ఎయిర్ ఇండియా విమానం కూడా, ఇలాగే గాలి వానలో చిక్కుకుని, పిడుగుల ధాటిగా కుదుపులకు గురైందని తెలుస్తుంది. అయితే ఈ ఫ్లైట్ కి, విజయవాడ ఫ్లైట్ కంటే ఎక్కువగా కుదుపులు వచ్చాయని, అదీ కాక ఈ ఫ్లైట్ లో 172 మంది ప్రయాణికులు ఉండటంతో, మరింతగా కంగారు పడ్డారు. అయితే ఈ ఘటనలో కూడా ఎవరికీ మేజర్ గాయాలు అవ్వలేదు, ఇక్కడ కూడా స్వల్ప గాయాలతో బయట పడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు ఘటనల పై అంతర్గత విచారణ కొనసాగుతుంది. రెండు ఫ్లైట్స్ కి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వైజాగ్.. ప్రశాంతతకు మారు పేరు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు అక్కడ జీవిస్తూ ఉంటారు. నవ్యాంధ్రకు ఆర్ధిక రాజధాని. మొన్నటి దాక అక్కడ నుంచి పెట్టుబడి సదస్సులు, బ్లాక్ చైన్ ఇన్వెస్ట్మెంట్స్, ఐటి పెట్టుబడులు లాంటి వార్తలు వినిపించేవి. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్న పులివెందుల ముఠా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవును ఇది నిజం. వైజాగ్ లో ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని, ఎవరూ అనుకోలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైజాగ్ లో ఒక ఖరీదైన భూమి పై, ఈ ముఠా కన్ను పడింది. దాన్ని తీసుకోవటానికి సిటిల్మెంట్ దందా మొదలు పెట్టారు. సింబియోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈఓ ఓరుగంటి నరేశ్‌కుమార్‌ కు సంబంధించి, ఒక భూ వివాదం ఉందని తెలుసుకుని, ఈ ముఠా రంగంలోకి దిగింది. నరేష్ కుమార్ చాలా ఏళ్ళ క్రితం, మర్రిపాలెంలో ఆరెకరాల యూఎల్‌సీ మిగులు భూమి కొన్నారు.

pulivendula 23092019 2

దీని విలువ 100 కోట్లు దాకా ఉంటుంది. ఆ భూమిని ఆనుకుని, ఒక 200 గజాల్లో భూవివాదం నెలకొంది. ఆ భూమిని నరేష్ కుమార్ కొంత పరిహారం ఇచ్చి తీసుకున్నారు. అయితే ఇది వివాదం కావటంతో కోర్ట్ వరకు వెళ్ళటంతో, అక్కడ నరేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే 2013లో హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ మోహన్‌ అనేవ్యక్తి అవతల పార్టీతో జీపీఏ రాయించుకొని మరో రిట్‌ పిటిషన్‌ వేశారు. అప్పటి నుంచి నానుతూ ఉన్న ఈ విషయం పై, గత ఆదివారం పులివెందుల నుంచి వచ్చిన కొంత మంది నరేష్ కుమార్ ఇంటికి వెళ్లారు. అయుదుగురు సభ్యులు వచ్చారు. ఈ భూమి తమకు అమ్మడానికి 16మంది ముందుకు వచ్చారంటూ డాక్యుమెంట్లు, జీవోలతో ఓ బౌండ్‌ బుక్‌ ఆయనకు చూపించారు. ఆ వివాదం గురించి మాట్లాడాల్సిన పనిలేదని ఇది అంతా సవ్యంగా ఉందని, కావలంటే కోర్ట్ కు వెళ్ళండి అంటూ నరేష్ కుమార్ చెప్పటంతో, అవతలి వ్యక్తులు బెదిరించారు.

pulivendula 23092019 3

ఇలా అయితే ఈ భూమి నీకు దక్కదు, ప్రభుత్వానికి వెళ్ళిపోయేలా చేస్తాం అని వారు బెదిరించారని నరేశ్‌కుమార్‌ చెప్పారు. పులివెందుల నుంచి వచ్చామని, ఒకరు ఎంపీపీ అని, మరొకరు సర్పంచ్‌(మాజీ) అని, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులమని పరిచయం చేసుకున్నారని తెలిపారు. మీరు సియం పేరు పెట్టి నన్ను బెదిరిస్తే, ఇదే విషయం, నేను ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా కు చెప్తానని నరేష్ కుమార్ చెప్పటంతో, వీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అమిత్ షా పేరు చెప్పగానే, వెళ్లిపోయారని నరేష్ కుమార్ చెప్పారు. అయితే దీని పై పులివెందుల నుంచి వచ్చిన, లింగాల రామలింగారెడ్డి కొన్ని పత్రికలతో మాట్లాడుతూ, మేము అక్కడకు వెళ్లామని, అయితే బాలకృష్ణ మోహన్‌ , తమ భూమికి సంబంధించి ఎదో ఇష్యూ ఉంది, మాట్లాడి రండి అంటే వెళ్ళాం, ఆయన మాకు స్నేహితుడు కాబట్టి వెళ్ళాం, అంతే కాని మేము ఎవరినీ బెదిరించి, పంచాయతీ చెయ్యలేదు అని లింగాల రామలింగారెడ్డి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read