తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు అయుదు రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్ధులను అభినందించారు. ముఖ్యంగా మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్‌లకు స్వయంగా ఫోన్ చేసి మరీ చంద్రబాబు, శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఉద్దేశించి ట్వీట్ కూడా చేసారు. అలాగే అస్సాం, పాండిచేరీలో గెలిచిన అభ్యర్ధులకు కూడా చంద్రబాబు అభినందనలు చెప్తూ త్వీట్ చేసారు. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో, 292 సీట్లకు గాను, టిఎంసి 182 గెలవగా, మరో 33 ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ, 54 గెలవగా, మరో 21 ఆధిక్యంలో ఉంది. ఇక తమిళనాడులో, 234 సీట్లకు గాను, డీఎంకే 93 గెలవగా, మరో 64  ఆధిక్యంలో ఉంది. అలాగే ఏడీఎంకే , 37 గెలవగా, మరో 40 ఆధిక్యంలో ఉంది. కేరళలో 140 సీట్లకు గాను, ఎల్డీఎఫ్ 03 ఆధిక్యంలో ఉండగా, 96 గెలిచారు. అలాగే యూడీఎఫ్ 41 గెలిచింది. వీరందరికీ చంద్రబాబు ఫోన్ చేసి, అభినంధనలు తెలిపారు.

గత 20 రోజులుగా రాష్ట్రంలో కరోనా భయం కంటే ఎక్కువగా, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై, టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో పరీక్షలు పెడితే, ఏమి అవుతుందో అని అందరూ కంగారు పడుతున్నారు. మరో పక్క లోకేష్ ఈ విషయం పై పోరాడుతున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో సెషన్స్ పెట్టి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. చివరకు న్యాయ పోరాటం కూడా చేసారు. హైకోర్టులో మొన్న గట్టి వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వాని, మరోసారి తమ నిర్ణయం సరి చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఒక అంచనాకు వచ్చింది, మనకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో కానీ, ఈ రోజు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు. నారా లోకేష్ గట్టిగా పోరాటం చేయకపోతే, కోర్టులో కేసు వేయకపోతే, ప్రభుత్వం దిగి వచ్చేది కాదని, లోకేష్ కు ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే ఈ పోరాటంలో సహకారం అందించిన రఘురామకృష్ణం రాజు గారికి, కేఏ పాల్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. మొత్తంగా ఏది అయితే ఏమి, ప్రజల పోరాటానికి, ప్రభుత్వం దిగి వచ్చింది. ఇంకా పట్టుదలకు పోకుండా, కనీసం ఒక రోజు ముందు అయినా వాయిదా వేయటం శుభ పరిణామం.

ఈ రోజు అయుదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితం కూడా వస్తుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికలో హోరా హోరీ నడుస్తుందని, ఎన్నిక జరిగే ముందు వరకు అందరూ భావించారు. అయితే ఎన్నిక జరిగిన తీరు, ఒక ఉత్సవంలా, ఒక మేళా లాగా ఉప ఎన్నిక జరిగిన తీరు చూసి, అన్ని వేల దొంగ ఓట్లు పడ్డ తరువాత వైసీపీ గెలుస్తుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇన్ని దొంగ ఓట్లు వేసి, వాలంటీర్లతో పధకాలు పీకుతాం అని బెదిరించి, పోలీసులను ఉపయోగించి, ఇవన్నీ చేసిన తీరు చూసి, 5 లక్షల మెజారిటీ దాటి పోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే, 2, 2.5 లక్షల వరుకే మెజారిటీ వచ్చే అవకాసం కనిపిస్తుంది. అంటే పోయిన సారి వచ్చిన మెజారిటీ కానీ, అంత కంటే తక్కువ కానీ మెజారిటీ వచ్చే అవకాసం కనిపిస్తుంది. అంటే, దొంగ ఓట్లు లెక్క తీసేస్తే, హోరా హోరీ పోరు జరిగిందనే అర్ధం అవుతుంది. ఇప్పటి వరకు, వైసీపీ కి 2,29,424(55.9 శాతం) ఓట్లు, టీడీపీకి 1,33,613(32.5 శాతం) ఓట్లు, బీజేపీ పార్టీకి 23,223(5.7 శాతం) ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 94 వేల మెజారిటీతో వైసీపీ ఉంది. ఇంకా సగం లెక్కింపు మిగిలి ఉంది. ఇక పొతే, ఉదయం మొదటి రౌండ్ ఫలితం చూసి, పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం ఉంచి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.

panabaka 02052021 2

ఆ వార్తలను పనబాక లక్ష్మి ఖండించారు. తానూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నాయని అన్నారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదని తెలిసినా, తన వంతు బాధ్యతగా కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని అన్నారు. దొంగ ఓట్ల తమాషా చూడటానికి ఇక్కడే కూర్చున్నా అంటూ, వ్యంగ్యంగా స్పందించారు. జరగాల్సింది అంతా ముందే ప్లాన్ ప్రకారం జరిగిపోయిన విషయం అందరికీ తెలుసు అని, వీళ్ళ తమాషా ఏంటో చూద్దామని కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని, ఇక్కడ నుంచి వెళ్ళిపోయానని వస్తున్న వార్తలు అన్నీ అబద్ధం అని అన్నారు. ఇక మరో పక్క 5 లక్షల మెజారిటీ అని, 5 లక్షల మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తానని, ఇలా అనేకం చెప్పిన వైసీపీ మంత్రులు ఇప్పటి వరకు స్పందించ లేదు. గెలుస్తున్నాం కదా, ఇది మా ప్రజా విజయం ఇది అదీ అంటూ రొటీన్ గా వాడే డైలాగ్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు సగం ఓటింగ్ కౌంటింగ్ పూర్తి అవ్వగా, ఇంకా సగం మిగిలి ఉంది. గతంలో వచ్చిన మెజారిటీ వస్తుందా, అంత కంటే ఎక్కువ ఎంత వస్తుంది అనే దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది.

ప్రస్తుతం రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ పేరు మారు మొగి పోతుంది. ఈ రోజు ప్రకటించిన అయుదు రాష్ట్రాల ఎన్నికల్లో, రెండు రాష్ట్రాలలో ఆయన రాజకీయ సలహదారుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత పార్టీకి, తమిళనాడులో స్టాలిన్ పార్టీకి ఆయన రాజకీయ సలహదారుగా ఉన్నారు. రెండు చోట్లా ఆయన భారీ విజయం అందించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మూడు అంకెల స్కోర్ దాటదు అని చెప్పి ముందే చాలెంజ్ చేసారు. దాటితో, నేను సలహదారు పదవి నుంచి వెళ్ళిపోతా అని చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ రెండు అంకెల స్కోర్ దాటక పోయినా, ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారు పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఇక ఏ రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉండను అని, ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేస్తాన్నా అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇప్యాక్ ని ఇక నుంచి తన సహ ఉద్యోగులు నడుపుతారని చెప్పారు. తాను మాత్రం రాజకీయ వ్యూహకర్తగా ఉండను అని, వేరే ఇంకా ఏదో తాను జీవితంలో చేయాలనీ అనుకుంటున్నా అని అన్నారు. ఏమి చేయాలని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయితే ఈ రోజు దేశం మొత్తం ప్రశాంత్ కిషోర్ పేరు కలవరిస్తున్న సమయంలో, ఆయన తాను తప్పుకుంటున్నా అని చెప్పటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.

pk 02052021 2

అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బీహార్ నుంచి గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అదే విధంగా మమత కూడా, రాజ్యసభ టికెట్ ఇస్తారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక వైపు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, సమాజాన్ని విడదీసి, చిచ్చు పెట్టి, ఓట్లు వేసుకుంటారు అనే అభియోగాలు ఉన్నా, రాజకీయం అనే వార్ లో, ఏది తప్పు కాదు అని సమర్ధించే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగిన పరిణామాలు ప్రశాంత్ కిషోర్ పట్ల తీవ్ర వ్యతిరేకత తీసుకుని వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, కుల పరంగా చిచ్చు పెట్టి, ఒక కులం పై ద్వేషం పెంచేలా చేసి, సక్సెస్ అయ్యారు. అయితే తరువాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, అభివృద్ధి అనే మాట మర్చిపోయి, అప్పులు చేసి సంక్షేమం చేస్తూ, రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుని వేల్లిపోయారని, ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్రఅధికం అని చెప్పే వారు ఉన్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read