గుంటూరులో అంబేద్కర్ జయంతి వేడుకలను, బాబా సాహెబ్ అంబేద్కర్ నీలి జెండాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీపై ఎగుర వేసేందుకు బహుజనులంతా ఐక్యంగా ముందుకు నడుస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ కల సాకారం కాబోతుందని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్ జై భీమ్ యాక్సెస్ జస్టిస్ కార్యాలయంలో అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని లక్షమందితో చారిత్రాత్మక బహిరంగ సభ "జైభీమ్ సమరభేరి” గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రజలకు రాజ్యాంగాన్ని రచించి హక్కులు ఇస్తే వాటిని నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశ యాలను ముందుకు తీసు కెళ్లేందుకు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఉద్యమిస్తుందని తెలిపారు.  అదేవిధంగా అంబేద్కర్ వాదులంతా 14న గుంటూరులో మార్కెట్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తమకు పర్మిషన్ ఇవ్వలేదని, ఒక వేళ అంబేద్కర్ జయంతి వేడుకలను అడ్డుకుంటే జాతి మొత్తం తిరగబడుతుంద ని,ప్రభుత్వాలకు ప్రజలు ఎదురు తిరిగితే వారికే ముప్పు అని ఆగ్రహం వ్యకం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఎపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ జై భీమ్ సమరభేరీని ప్రతీ సామాజిక కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ జయంతి రోజున ఆంద్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ప్రకటన కోసం జైభీమ్ " సమర భేరీ సభ జరుగుతుందన్నారు. ఏపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా ఉన్న బహుజ నులు అంతా రాజకీయంగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఈనెల 11 నుంచి 14 వరకు దేశంలో నిర్వహించ తలపెట్టిన కో-వి-డ్ వ్యాక్సిన్ ఉత్సవ్ కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు 25 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరం ఉందని లేఖలో తెలిపారు. ఇప్పటివరకు రెండు లక్షల డోసుల వ్యాక్సిన్‌ను వినియోగిస్తుండగా మరో 2 లక్షల డోసుల వ్యాక్సిన్ శుక్రవారం నాటికి రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చిందన్నారు. వ్యాక్సిన్ ఉత్సలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు..మొత్తం రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కో-వి-డ్ మహమ్మారిని అంతమొం దించేందుకు వీడియో కాన్ఫరెన్ల ద్వారా మీరందించే సలహాలు, సూచనలు, ఆదేశాలను రాష్ట్రంలో పాటిస్తున్నామని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సరిపోదనీ, మరో 25 లక్షల డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కో-వి-డ్ నివారణ కోసం ఏపీ అవసరాలనూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ పంపిణీకి చొరవ తీసుకోవాల్సిందిగా ఆయన ప్రధానమంత్రిని కోరారు.

యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కంటే, ఎక్కువగా వార్తల్లో ఉంటూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఎదుటి వాడికి కౌంటర్ ఇవ్వటానికి కూడా అలోచించాల్సిందే. ఆయన వేసే ఎత్తుగడలు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి వారం రాజధాని రచ్చబండ పేరుతో ప్రజల ముందుకు వచ్చి తన వాణి వినిపించే రఘురామరాజు ట్రెండ్ మార్చారు. తన పై అక్రమంగా సిబిఐ కేసులు పెడుతున్నారని గ్రహించి, ఎదురు దాడికి సిద్ధమయ్యారు. గత వారం, సిబిఐ కోర్టులో , జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటీషన్ దాఖలు చేసారు. ఏడాదిన్నరగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకపోయినా, ఆయన్ను ఎందుకు కోర్టు పట్టించుకోవటం లేదు అనే అనుమానం వ్యక్తం చేసారు. సిబిఐ కూడా ఎందుకు వదిలేస్తుంది అంటూ, ప్రశ్నిస్తూ, ఈ విషయం పై తేలే వరకు వదిలి పెట్టను అని, జగన్ బెయిల్ ను రద్దు చేయాలి అంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఈ పిటీషన్ దాఖలు చేసిన తరువాత, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ, రఘురామరాజు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అంతే కాదు, తనను లేపెయటానికి, జగన్ మోహన్ రెడ్డి, కడప నుంచి వచ్చిన కొంత మందితో సమావేశం అయ్యారు అంటూ, తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆరోపణలు మాత్రమే కాదు, ఇదే విషయం పై ప్రధాని మోడీకి కూడా లేఖ రాసారు. తన పై, తన ముఖ్యమంత్రి కక్ష కట్టారని, కడప నుంచి కొంత మందిని రంగంలోకి దించారని, ఆ లేఖలో తెలిపారు.

rrr 09042021 2

ఇప్పటికే తనకు వై క్యాటగిరీ సెక్యూరిటీ ఉందని, ఈ సెక్యూరిటీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని, ఢిల్లీలో కూడా తనకు ఈ సెక్యూరిటీ ఇవ్వాలి అంటూ, రఘురామ రాజు, ప్రధాని మోడీకి లేఖ రాసారు. లేఖ రాసిన వెంటనే, కేంద్రం రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో కూడా రఘురామరాజు కు సెక్యూరిటీ ఇస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రఘురామరాజు సంతోషం వ్యక్తం చేసారు. అంతే కాదు, తనకు ఢిల్లీ లెవెల్ లో ఉన్న పలుకుబడి ఏమిటో చూపించారు కూడా. అయితే సిబిఐ పిటీషన్ గురించి ఈ రోజు రఘురామరాజు మీడియాతో మాట్లాడారు. తాను వేసిన సిబిఐ పిటీషన్ రిజెక్ట్ అయ్యిందని మా వాళ్ళు సంతోష పడుతున్నారని, కానీ మరిన్ని డాక్యుమెంట్లు కోర్టు అడిగితే, ఈ రోజు అవన్నీ తీసుకుని కోర్టుకు వెళ్తే, జడ్జి గారు అందుబాటులో లేరని, సోమవారం సెలవు కాకపొతే, సోమవారం కానీ, లేకపోతే వరుస సెలవులు ఉన్నాయి కాబట్టి, మళ్ళీ గురువారం కానీ, ఈ కేసు సిబిఐ కోర్టులో ఫైల్ అవుతుందని, ఎవరూ కంగారు పడద్దు అంటూ, రఘురామరాజు వీడియో సందేశం ఇచ్చారు.

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈ నెల 18న సచివాలయంలో శాఖాపరమైన విచారణ జరగనున్నది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేతృత్వంలో అభియోగాలపై విచారణ జరపనున్నా రు. సాక్షులుగా మాజీ డీజీలు రాముడు, సాంబశివరావు, మాలకొం డయ్య, ఆర్పీ ఠాకూర్లు ఉన్నారు. సాక్షులుగా విచారణకు హాజరు కావాలని మాజీ డీజీలకు కమిషనర్ ఆఎంక్వైరీస్ మెమోలు పంపింది. ఏబీపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయా లని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజు వారీ విచారణను చేపట్టాలని విచారణాధికారికి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అయితే మొన్న 14 రోజులు పాటు విచారణ చేసి, విచారణ ముగిసిందని, ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు క్రితం ఆయన పెట్టిన ప్రెస్ మీట్ సంచలనం అయ్యింది. తనకు వ్యతిరేకంగా తప్పుడు పత్రాలు సృష్టించారని, ఆధారాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు, మళ్ళీ విచారణకు రావాలని ఆయనకు పిలుపు వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read